పెళ్ళి సందడి (1959 సినిమా)

పెళ్ళి సందడి 1959 లో వచ్చిన కామెడీ చిత్రం. దీనిని రిపబ్లిక్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ [1] పై సీతారామ్ నిర్మించాడు. డి. యోగానంద్ దర్శకత్వం వహించాడు.[2] ఇందులో ఘంటసాల సంగీతం సమకూర్చాడు. అక్కినేని నాగేశ్వరరావు, అంజలి దేవి, బి. సరోజా దేవి [3] ముఖ్య పాత్రల్లో నటించారు.[4]

పెళ్ళి సందడి
(1959 తెలుగు సినిమా)
Pelli Sandadi (1959 film).jpg
దర్శకత్వం డి.యోగానంద్
నిర్మాణం సీతారామ్
కథ సముద్రాల జూ.
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు ,
అంజలీదేవి ,
చలం
సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు
సంభాషణలు సీతారామ్
ఛాయాగ్రహణం బి.ఎస్. జాగీర్దార్
కూర్పు డి. యోగానంద్
సీతారామ్
నిర్మాణ సంస్థ రిపబ్లిక్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

కథసవరించు

కెప్టెన్ కోటా (గుమ్మడి) రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, విమలాపురం గ్రామంలో నివసిస్తున్నాడు. అతను తన ఇద్దరు కుమార్తెలు అనురాధ (అంజలీ దేవి) & ప్రియంవద (బి. సరోజా దేవి), అతని తమ్ముడు జనార్థన్ / ధన్ (రమణారెడ్డి) లతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతూంటాడు. కానీ అతనికి బాధ కలిగించే విషయం,తాగుబోతు వీరయ్య (ఆర్. నాగేశ్వరరావు) ఎప్పుడూ డబ్బు కోసం అతన్ని బ్లాక్ మెయిల్ చేస్తూంటాడు. కోటా, ధన్ ఒకసారి ఆంగ్లా-పింగ్లా అనే మారు పేర్లతో నిధులను సేకరించడానికి పట్టణంలో వారి కుమార్తెల నృత్య ప్రదర్శనను ఏర్పాటు చేస్తారు. రావుబహదూర్ గంగాధరం (సిఎస్ఆర్) కుమారుడు గురునాథం (చలం) ఆ నృత్య కార్యక్రమాన్ని సందర్శించి చిన్న అమ్మాయి ప్రియంవదతో ప్రేమలో పడతాడు. వదిలించుకోవడానికి, వారు అతన్ని టీకి ఆహ్వానిస్తారు. ఆ సమయానికి, వారు తిరిగి వెళ్లిపోతారు. రావుబాహదూర్ మిత్రుడు రిటైర్డ్ సుబేదార్ అంజనేయులు (డాక్టర్ శివరామకృష్ణయ్య) కోట కుమార్తెల సంబంధాన్ని గురునాథం వద్దకు తీసుకువస్తాడు. వాస్తవికత తెలియని గురునాథం తన బదులుగా తన స్నేహితుడు వాసు (అక్కినేని నాగేశ్వరరావు) ను విమలాపురానికి పంపుతాడు. గ్రామానికి చేరుకున్న తరువాత వాసు అనురాధతో ప్రేమలో పడతాడు. దురదృష్టవశాత్తు, అతనక్కడ చాలారోజులు ఉండిపోవాల్సి వస్తుంది.ఇక్కడేమో గురునాథం చాలా ఇబ్బందులకు గురవుతున్నాడు. అంజనేయులు కుమార్తె ఉమ (సురభి బాలసరస్వతి) కు వాసు, గురునాథంల ప్రణాళిక గురించి తెలుస్తుంది. ఆమె వారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంది. కొంత సమయం తరువాత, కోట సంబమ్ంధాన్ని ఖాయం చేసుకోవడానికి రావుబాహదూర్‌ను పిలుస్తాడు. ఈ సంగతి ఎలుసుకున్న ఉమ, వాసుకు టెలిగ్రామ్ ఇస్తుంది. టెలిగ్రాం చూసి వాసు తిరిగి వచ్చేస్తాడని గురునాథానికి చెబుతుంది. కాబట్టి, అతను ఇంటికి తిరిగి వెళ్తాడు. వాసు తప్పించుకోవడానికి ప్రయత్నించినపుడు గాయపడతాడు. అనురాధ అది గమనించి అతన్ని గదిలో దాస్తుంది. రావుబహదూర్ వచ్చిన తరువాత తన కొడుకు అప్పటికే వెళ్లిపోయాడని తెలుసుకుని, అతను కూడా వెనక్కి వెళ్లి పోతాడు. వెంటనే వాసు ఇంట్లోకి ప్రవేశిస్తాడు.

ఇంటికి చేరుకున్న తరువాత, గురునాథం తిరిగి వచ్చాడని ధాన్ నుండి రావుబహదూర్ ఒక టెలిగ్రాం అందుకుంటాడు. గందరగోళానికి గురైన రావుబహదూర్ అసలు విషయమేంటో తెలుసుకోడానికి మళ్ళీ విమలా పురం వెళ్తాడు. ఈ విషయం తెలుసుకున్న గురునాథం విమలా పురం వెళతాడు, వాసు తెలివిగా తప్పించుకుంటాడు. రావుబాహదూర్, కోటా గురునాథం ఉన్నాడా లేడా అనే విషయమై వాదనకు దిగుతారు. రావుబాహదూర్ వెళ్ళిపోతాడు. మరొక వైపు, గురునాథం రహస్యంగా కోట బంగ్లాలోకి ప్రవేశిస్తాడు. వారు అతన్ని ఒక దొంగ అని అనుమానించి, ఒక గదిలో పెట్టి తాళం వేస్తారు. కాని అతను తనను తాను రావుబహదూర్ కొడుకునని చెప్పుకుంటాడు. ఇక్కడ కోటా, ధన్ ఇందులో ఏదో మతలబు ఉందని భావిస్తారు. కాబట్టి, నిజం తెలుసుకోవడానికి ధన్ నిశ్శబ్దంగా అంజనేయులు ఇంట్లో ప్రవేశించి, అక్కడ ఉమతో ప్రేమలో పడతాడు. చివరికి ప్రియ, వారి ఇంట్లో బందీగా ఉన్న గురునాథాన్ని ఇష్టపడటం ప్రారంభిస్తుంది. ఇంతలో, వీరయ్య కోటాను బ్లాక్ మెయిల్ చెయ్యడం ప్రియ గమనిస్తుంది. దాని వెనుక ఉన్న రహస్యం తెలుసుకోడానికి అతన్ని కవ్విస్తుంది. వాస్తవానికి, అనురాధ కోటా సోదరి కుమార్తె. కోటా సోదరి వీరయ్యను పెళ్ళి చేసుకుంది, అతనితో నానాకష్టాలు పడి, చనిపోయే ముందు తన బిడ్డను అన్నకు అప్పగించింది. ఆ తరువాత, అనురాధ గురునాథంతో ప్రియకు ఉన్న సాన్నిహిత్యాన్ని చూసి ఆమెను చెంపదెబ్బ కొడుతుంది. ఆ కోపంలో, అనురాధ తన జన్మ రహస్యాన్ని వెల్లడిస్తుంది. సమాంతరంగా, మరొక మలుపు, వాస్తవానికి, వాసు కాశీపట్నం జమీందార్ (రాజనాల) కుమారుడు. వారి కుటుంబ ఆచారం ప్రకారం ప్రస్తుతం 1 సంవత్సరం పాటు ప్రవాసంలో నివసిస్తున్నాడు. ఇప్పుడు జమీందారు, వాసును తిరిగి రమ్మని ఒక పేపర్ ప్రకటన ఇస్తాడు. అలాగే, రావుబహదూర్ కూడా గురునాథం గురించి పేపర్ ప్రకటన ఇస్తాడు. అదే సమయంలో, ధన్ వాసును పట్టుకుంటాడు. ఇద్దరూ విమలా పురానికి వెళతారు. దారిలో, ధన్ ఆ ప్రకటనలు చదువుతాడు, ఇద్దరికీ టెలిగ్రామ్స్ ఇస్తాడు. వారందరూ విమలా పురం చేరుకుంటారు. చివరికి, అన్ని అపార్థాలు గందరగోళాలు తొలగిపోతాయి. చివరగా, ఈ చిత్రం వాసు అనురాధ, గురునాథం ప్రియంవద, ధన్ ఉమల పెళ్ళిళ్ళతో ముగుస్తుంది.

తారాగణంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

పాటలుసవరించు

ఎస్. పాట పేరు గాయకులు పొడవు
1 "అప్పటికి ఇప్పటికి" పి. లీల 3:00
2 "బైటో బైటో పెల్లికోడకా" రాఘవులు, జిక్కి 2:22
3 "చమక్ చమక్" ఘంటసాల, పి. లీల 3:14
4 "హైలెలో నా రాజా" ఆర్.బాలసరస్వతి, జిక్కి 10:29
5 "జల్లే బొమాబాయి లే" ఘంటసాల, పి. లీల, జిక్కి 4:12
6 "నల్లని వాడే" పి. లీల, కె. రాణి 3:14
7 "రావే నా ప్రేమలత" ఘంటసాల, ఆర్.బాలసరస్వతి 4:38
8 "సమయమిది దయేరా సరసుడా" పి. లీల, జిక్కి 6.02

మూలాలుసవరించు

  1. "Pelli Sandadi (Banner)". Filmiclub.
  2. "Pelli Sandadi (Direction)". Know Your Films.
  3. "Pelli Sandadi (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2020-11-25. Retrieved 2020-08-26.
  4. "Pelli Sandadi (Review)". The Cine Bay.