పోతుల రామారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2][3]

పోతుల రామారావు

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1994 - 2004
ముందు మానుగుంట మహీధర్ రెడ్డి
తరువాత మానుగుంట మహీధర్ రెడ్డి
నియోజకవర్గం కందుకూరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1951
టంగుటూరు, టంగుటూరు మండలం,[1] ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు పోతుల చెంచయ్య, పేరమ్మ
జీవిత భాగస్వామి ప్రేమ కుమారి
బంధువులు నల్లమోతు చెంచు రామానాయుడు(మేనమామ)

రాజకీయ జీవితం

మార్చు

పోతుల రామారావు తండ్రి పోతుల చెంచయ్య గారు ప్రకాశం జిల్లా పరిషత్ మొదటి ఛైర్మన్ గా పనిచేశారు, మేనమామ నల్లమోతు చెంచు రామానాయుడు గారు మాజీ మంత్రి. వీరిద్దరి స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించి అంచెలంచెలుగా ఎదుగుతూ 1999లో కొండపి నియోజకవర్గం నుండి పోటీ చేసి మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు చేతిలో ఓటమి చెంది, 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ఆంజనేయులు పై 8872 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2009లో పోటీ చేయలేదు, 2011 లో జిల్లా స్థానిక సంస్థల నుంచి శాసనమండలి సభ్యుడిగా విజయం సాధించారు. రాష్ట్ర విభిజన తరువాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో కందుకూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి 2016లో టీడీపీలో చేరాడు.[4] పోతుల రామారావు 2019లో ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వై సి పి అభ్యర్థి మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి చేతిలో ఓడిపోయాడు.

సంవత్సరం గెలిచిన అభ్యర్థి పార్టీ పోలైన ఓట్లు ప్రత్యర్థి పార్టీ పోలైన ఓట్లు
1999 దామచర్ల ఆంజనేయులు టీడీపీ 61824 పోతుల రామారావు కాంగ్రెస్ పార్టీ 50872
2004 పోతుల రామారావు కాంగ్రెస్ పార్టీ 64074 దామచర్ల ఆంజనేయులు టీడీపీ 55202
2014 పోతుల రామారావు వైసీపీ 84538 దివి శివరాం టీడీపీ 80732
2019 మానుగుంట మహీధర్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 101275 పోతుల రామారావు టీడీపీ 86339

మూలాలు

మార్చు
  1. Sakshi (19 March 2019). "ఒక్క మండలం.. ఆరుగురు అభ్యర్థులు". Archived from the original on 8 December 2021. Retrieved 8 December 2021.
  2. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  3. Andhrajyothy (28 March 2019). "మూడు కుటుంబాలదే అధిపత్యం". Archived from the original on 8 December 2021. Retrieved 8 December 2021.
  4. THE HANS INDIA (3 June 2016). "Kandukur YSRCP legislator Rama Rao joins ruling party" (in ఇంగ్లీష్). Archived from the original on 8 December 2021. Retrieved 8 December 2021.