పోలవరం (పామర్రు)

ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా, పామర్రు మండలం లోని గ్రామం
(పోలవరం(పామర్రు) నుండి దారిమార్పు చెందింది)

పోలవరం, పామర్రు, కృష్ణా జిల్లా, పామర్రు మండలానికి చెందిన గ్రామం.

  1. శ్రీ వీరాంజనేయస్వామి ఆలయo:- పోలవరం-ఉండ్రపూడి, అడ్డరోడ్డు వద్ద ఉన్న శ్రీ వీరాంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణం కోసం, 2013,డిసెంబరు-11, బుధవారం నాడు, భూమిపూజ చేసారు. జిల్లాలో మూడవ ఆంజనేయస్వామిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో, పుష్యమీ నక్షత్రయుక్త, వృషభ లగ్నమందు, నూతన ధ్వజ, శిఖర, ప్రతిష్ఠా మహోత్సవములను, (2014,ఏప్రిల్-9, చైత్ర దశమి, బుధవారంనాడు) అత్యంత వైభవంగా నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుండి భక్తులు ఉదయమే ఆలయానికి చేరుకోగా, దేవాదాయ ధర్మాదాయ శాఖవారి ఆధ్వర్యంలో, వేదపండితులు ఆంజనేయస్వామికి ప్రత్యేకపూజలు నిర్వహించి, వేదమంత్రాల నడుమ, ధ్వజ, శిఖర, బలిపీఠ, ఉష్ఠ్ర, గణపతి విగ్రహాల ప్రతిష్ఠ, అనంతరం, సీతారాముల శాంతికళ్యాణం నిర్వహించారు. యాగం నిర్వహించి, పూర్ణాహుతి నిర్వహించగా, భక్తులు ప్రదక్షణలు చేశారు. అనంతరం ప్రదర్శించిన కోలాట భజన భక్తులను అలరించింది. అనంతరం భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. [2] & [3]
  2. శ్రీ సీతారామాలయం:- ఈ ఆలయం శిథిలావస్థలోకి చేరుకోవడంతో, నూతన ఆలయ నిర్మాణానికి, 2014, ఆగస్టు-15, శుక్రవారం నాడు శంకుస్థాపన నిర్వహించారు. [4]
పోలవరం (పామర్రు)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పామర్రు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 371
 - పురుషులు 205
 - స్త్రీలు 222
 - గృహాల సంఖ్య 119
పిన్ కోడ్ 521390
ఎస్.టి.డి కోడ్

గణాంకాలుసవరించు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 427,[1] ఇందులో పురుషుల సంఖ్య 205, స్త్రీల సంఖ్య 222, గ్రామంలో నివాస గృహాలు 119 ఉన్నాయి.

మూలాలుసవరించు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-11.

[2] ఈనాడు కృష్ణా; 2013,డిసెంబరు-12. 6వ పేజీ. [3] ఈనాడు కృష్ణా; 2014; ఏప్రిల్-10; 6వ పేజీ. [4] ఈనాడు కృష్ణా; 2014, ఆగస్టు-16; 5వపేజీ.