ఉండ్రపూడి

భారతదేశంలోని గ్రామం

" ఉండ్రపూడి" కృష్ణా జిల్లా పామర్రు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 157., ఎస్.టి.డి.కోడ్ = 08674.

ఉండ్రపూడి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం పామర్రు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 721
 - పురుషుల సంఖ్య 351
 - స్త్రీల సంఖ్య 370
 - గృహాల సంఖ్య 243
పిన్ కోడ్ 521157
ఎస్.టి.డి కోడ్ 08674

గ్రామ చరిత్రసవరించు

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

[1] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు

సమీప గ్రామాలుసవరించు

గుడివాడ, పెడన, మచిలీపట్నం, హనుమాన్ జంక్షన్.

సమీప మండలాలుసవరించు

పమిడిముక్కల, గూడూరు, మొవ్వ, గుడ్లవల్లేరు.

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

పామర్రు, కూచిపూడి నుండి రోడ్ద్దు రవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 50 కి.మీ.

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

మండల పరిషతు ప్రాథమిక పాఠశాల, ఉండ్రపూడి.

గ్రామములోని మౌలిక వసతులుసవరించు

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ మట్టా వెంకటేశ్వరరావు, సర్పంచిగా ఎన్నికైనారు. ఉప సర్పంచ్‌గా శ్రీ తోట చిననరసయ్య ఎన్నికైనారు. [4]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీరామాలయంసవరించు

గ్రామములోని పురాతనమైన ఈ ఆలయం శిథిలావస్థకు చేరడంతో గ్రామస్థులు, దాతల సహకారంతో, రు. 25 లక్షల అంచనా వ్యయంతో, నూతన ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టినారు. ఈ ఆలయ నిర్మాణానికి, గ్రామానికి చెందిన శ్రీ దుబ్బుల కోటేశ్వరరావు, శ్రీ మండపాక వెంకటేశ్వరరావు, 3 సెంట్ల స్థలాన్ని వితరణగా అందించారు. ఈ నేపథ్యంలో మొత్తం 6 సెంట్ల భూమిలో ఈ ఆలయం రూపుదిద్దుకుంటున్నది. ఆలయ నిర్మాణం, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలోని కొమరపాలెం గ్రామానికి చెందిన శిల్పులు, నిర్మించుచున్నారు. [5]

శ్రీ వీరాంజనేయస్వామి ఆలయంసవరించు

ఉండ్రపూడి - పోలవరం అడ్డరోడ్డు వద్ద ఉన్న శ్రీ వీరాంజనేయస్వామి ఆలయం పునర్నిర్మాణం కోసం 2013, డిసెంబరు 11, బుధవారం భూమిపూజ జరిగింది. జిల్లాలో మూడవ ఆంజనేయస్వామిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో, పుష్యమీ నక్షత్రయుక్త, వృషభ లగ్నమందు, నూతన ధ్వజ, శిఖర, ప్రతిష్ఠా మహోత్సవములను, (2014, ఏప్రిల్-9, చైత్ర దశమి, బుధవారంనాడు) అత్యంత వైభవంగా నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుండి భక్తులు ఉదయమే ఆలయానికి చేరుకోగా, దేవాదాయ ధర్మాదాయ శాఖవారి ఆధ్వర్యంలో, వేదపండితులు ఆంజనేయస్వామికి ప్రత్యేకపూజలు నిర్వహించి, వేదమంత్రాల నడుమ, ధ్వజ, శిఖర, బలిపీఠ, ఉష్ఠ్ర, గణపతి విగ్రహాల ప్రతిష్ఠ, అనంతరం, సీతారాముల శాంతికళ్యాణం నిర్వహించారు. యాగం నిర్వహించి, పూర్ణాహుతి నిర్వహించగా, భక్తులు ప్రదక్షణలు చేశారు. అనంతరం ప్రదర్శించిన కోలాట భజన భక్తులను అలరించింది. అనంతరం భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. ఈ దేవాలయంలో హనుమజ్జయంతి నాడు (23-మే/2014 న) ఉదయం స్వామివారికి క్షీరాభిషేకం, లక్ష తమలపాకుల పూజ నిర్వహించి, అనంతరం హనుమాన్ చాలీసా పఠనం, శ్రీ సీతారాముల తాళం భజన, కోలాట భజన నిర్వహించెదరు. [1],[2]&[3]

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

గ్రామములోని ప్రధాన వృత్తులుసవరించు

గ్రామ ప్రముఖులు (నాడు/నేడు)సవరించు

గ్రామ విశేషాలుసవరించు

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 721 - పురుషుల సంఖ్య 351 - స్త్రీల సంఖ్య 370 - గృహాల సంఖ్య 243
జనాభా (2001) -మొత్తం 804 -పురుషులు 395 - స్త్రీలు 409 -గృహాలు 205 -హెక్టార్లు 178

మూలాలుసవరించు

వెలుపలి లింకులుసవరించు

[1] ఈనాడు కృష్ణా; 2013,డిసెంబరు-12. [2] ఈనాడు కృష్ణా; 2014,ఏప్రిల్-10; 6వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2014,మే-21; 2వపేజీ. [4] ఈనాడు కృష్ణా, 2014,జులై-31; 7వపేజీ. [5] ఈనాడు అమరావతి; 2015,ఆగస్టు-9; 27వపేజీ.

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Pamarru/Undrapudi". Retrieved 29 June 2016. External link in |title= (help)[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=ఉండ్రపూడి&oldid=3199920" నుండి వెలికితీశారు