పోలాప్రగడ సత్యనారాయణమూర్తి
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
ఈ వ్యాసంలో బొమ్మలు గాని, మరి కొన్ని భాగాలు గాని కాపీ హక్కుల నియమాలను ఉల్లంఘిస్తున్నాయి అనిపిస్తున్నది. రచయితలు లేదా బొమ్మలు అప్లోడ్ చేసినవారు సరైన వివరణల ద్వారా గాని, లేదా పాఠాన్ని మార్చడం ద్వారా గాని ఈ లోపాన్ని సవరించవలసిందిగా మనవి. అలా కాకుంటే ఆయా భాగాలు లేదా బొమ్మలు లేదా పూర్తి వ్యాసం తొలగించవలసిన అవసరం రావచ్చును. మార్గ దర్శకాల కోసం ఈ లింకులు చూడవచ్చును:-- |
పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి (1929 - ?) ప్రముఖ కథా రచయిత. తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు గ్రామంలో 1929లో జన్మించాడు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాలలో విద్యాభ్యాసం చేసిన తరువాత భీమవరం, అనంతపురం, ఏలూరు, బాపట్లలో ఆంగ్ల ఉపన్యాసకులుగా పనిచేశాడు. 1947లో కథలు రచించడం మొదలుపెట్టాడు.
పోలాప్రగడ సత్యనారాయణమూర్తి | |
---|---|
జననం | పోలాప్రగడ సత్యనారాయణమూర్తి 1929 తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు |
ఇతర పేర్లు | పోలాప్రగడ సత్యనారాయణమూర్తి |
ప్రసిద్ధి | ప్రముఖ కథా రచయిత. |
భార్య / భర్త | పోలాప్రగడ రాజ్యలక్ష్మి |
ఈయన రచనలలో కౌసల్య (1984), భోగి మంటలు (1965), దీపశిఖ (1968), సంఘం చేసిన మనిషి (1970), కవి సార్వభౌమ (1972), నవోదయం (1973), ప్రేమాయణం (1980), సదువుకున్న మారాజులు (1981), ప్రేమకలాపం (1986), మనసిచ్చి చూడు (1983) మొదలైన నవలలు, ఆరోజుల్లో అనే వ్యాస సంపుటి ముఖ్యమైనవి. ఆయన దాదాపు 120 పైగా చక్కని కథలు రచించారు. తల్లిదండ్రులు, రామరాజ్యం, ప్రేమాయణం మొదలైన సినిమాలకు కథలు వ్రాశాడు. రేడియో నాటకాలు కూడా రాశాడు. జాతీయ దూరదర్శిని సీరియల్ 'అప్నా అప్నా ఆస్మాన్' కథా రచయితగా ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు.
1964లో ఆంధ్రప్రభ నవలలో ద్వితీయ బహుమతి, 1989లో స్వాతి కథల పోటీలో ప్రథమ బహుమతి పొందాడు. 1971లో ఉత్తమ సినీ కథా రచయితగా నంది అవార్డు, 1992లో రవీంద్రనాథ్ ఠాగూర్ అవార్డు పొందాడు.
ఆయన భార్య పోలాప్రగడ రాజ్యలక్ష్మి కూడా ప్రఖ్యాత రచయిత్రి.
పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి రచించిన పొత్తుల బావి నవల నుండి
మార్చునీటి బొట్టుకి నోచుకోని కరువు ప్రాంతం అది. ఉరి ప్రజలందరికి ఊపయోగపడుతుందని లక్షలు ఖర్చు పెట్టి తాత బావి తవ్విస్తే, తన ఆనందానికి అనుగుణంగా కొడుకు దాన్ని విభజించి పొత్తుల బావిని చేశాడు. మనవడి రాక్షస రాజకీయాలు వచ్చే సరికి అది కాస్తా చెత్త కుండీగా మారింది. అయితే బండ బారిన గుండేల్లో మమతలు పండిస్తే, ప్రేమామృతాన్ని పండించనూ వచ్చు కన్నీళ్ళ కడలిలో మునిగిపోయిన జన జీవనాన్ని వడ్డున్న దిక్కుకూ చేర్చనూ వచ్చు ఈ నిజాన్ని తరాల వ్యత్యాసంలో సుతారంగా మలచి అందిచిన నవలే పోలాప్రగడ సత్యనారాయణమూర్తి గారు రచించిన పొత్తుల బావి నవల.