ప్రగతి కళామండలి, సత్తెనపల్లి
ప్రగతి కళామండలి ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా, సత్తెనపల్లిలో 1948, ఏప్రిల్ 25న ప్రారంభించిన నాటక సంస్థ. ప్రతి ఏటా నాటక పోటీల నిర్వహణతోపాటు 25మంది పేద కళాకారులకు ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నది.[1]
ప్రారంభం
మార్చుసత్తెనపల్లిలోని పత్రి జగన్నాథరావు, పులహరి లక్ష్మోజిబాబు, చలపతిరావు, లింగారెడ్డి మరికొంతమంది మిత్రులు కలిసి ఈ నాటక సంస్థను ప్రారంభించారు.
ప్రదర్శనలు
మార్చు- అల్లిముఠా
- ప్రగతి
- కులంలేని పిల్ల
- శాంతి
- తమాషా
- ఆడది
- కూలి
- ఈ ఇల్లు అమ్మబడును
- మాస్టార్‌జీ
పరిషత్తు నిర్వహణ
మార్చు1974లో సంస్థ రజతోత్సవాల సందర్భంగా ప్రగతి కళా పరిషత్తును ప్రారంభించి, నాలుగు దశాబ్ధాలకు పైగా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం నాటక పోటీలను ఏర్పాటుచేస్తున్నారు. సినీరంగం, తెలుగు నాటకరంగంలో పేరుగాంచిన నటులందరూ ఈ పరిషత్తులో పాల్గొన్నారు. ప్రతిఏటా 25మంది పేద కళాకారులకు (రూ. 3,000 నగదు, జ్ఞాపిక, నూతన వస్త్రాలు) ఆర్థిక సహాయం, పత్రి జగన్నాథరావు జ్ఞాపకార్థం కళాసంస్థ నిర్వాహక పురస్కారం, నూతలపాటి సాంబయ్య జీవన సాఫల్య పురస్కారం అందజేస్తున్నారు.[2]
జీవన సాఫల్య పురస్కారం
మార్చు- 2016: గండవరం సుబ్బరామిరెడ్డి, (త్యాగరాయ గానసభ, హైదరాబాదు, 8 ఆగస్టు 2016)[3]
మూలాలు
మార్చు- ↑ కళా ప్రగతిని నిదర్శనం ప్రగతి కళామండలి, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 20 ఫిబ్రవరి 2017, పుట.14
- ↑ ప్రజాశక్తి (30 April 2016). "ఆకట్టుకున్న ప్రగతి కళామండలి నాటికలు". Archived from the original on 8 ఆగస్టు 2019. Retrieved 8 August 2019.
- ↑ నవతెలంగాణ, కల్చరల్ (9 August 2016). "నాటకమే జీవనం". www.navatelangana.com. Archived from the original on 8 ఆగస్టు 2019. Retrieved 8 August 2019.