చార్లెస్ ఫిలిప్ బ్రౌన్: కూర్పుల మధ్య తేడాలు

చి 183.82.130.135 (చర్చ) చేసిన మార్పులను రవిచంద్ర చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 47:
కడపలోను, [[మచిలీపట్నం]]లోను కూడా పాఠశాలలు పెట్టి ఉచితంగా చదువు చెప్పించాడు. విద్యార్థులకు ఉచితంగా భోజనవసతి కూడా కల్పించాడు. దానధర్మాలు విరివిగా చేసేవాడు. వికలాంగులకు సాయం చేసేవాడు. నెలనెలా పండితులకిచ్చే జీతాలు, దానధర్మాలు, పుస్తక ప్రచురణ ఖర్చుల కారణంగా బ్రౌను ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. అప్పులు కూడా చేసాడు. [[1834]]లో ఉద్యోగం నుండి తొలగించడంతో [[ఇంగ్లండు]] వెళ్ళిపోయి, తిరిగి [[1837]]లో కంపెనీలో [[పర్షియను]] అనువాదకుడిగా [[ఇండియా]] వచ్చాడు.
బ్రౌను మానవతావాది. [[1832]]-[[1833|33]]లో వచ్చిన ''గుంటూరు కరువు'' లేదా ''[[డొక్కల కరువు]]'' లేదా ''నందన కరువు'' సమయంలో ప్రజలకు బ్రౌను చేసిన సేవలు ప్రశంసలందుకున్నాయి. ఆ సమయంలో కరువును ''కరువు''గా కాక ''కొరత''గా రాయాలని అధికారులు చెప్పినా, అలానే పేర్కొనడంతో వారి అసంతృప్తిని ఎదుర్కొన్నాడు. పందొమ్మిదో శతాబ్ది తొలిపాదం చివర్లో తాను తెలుగు సాహిత్యంలో కృషి మొదలుపెట్టేనాటికి నెలకొని వుండిన స్థితిగతులను గురించి బ్రౌన్ స్ఫుటమయిన మాటల్లో అభివర్ణించాడు. ‘అప్పటికి తెలుగు సాహిత్యం కొనప్రాణంతో కొట్టుకులాడుతోంది. 1825 నాటికి ప్రమిదలో దీపం కొడిగట్టిపోతోంది. తెలుగు సాహిత్యం దాదాపు అంతరించిపోతూ ఉండడం నా కళ్లబడింది. నేను 30 ఏళ్లు కృషి చేసి, దాన్ని పునఃప్రతిష్ట చేశాన’న్నాడు బ్రౌన్. నిరలంకారంగా మాట్లాడ్డం బ్రౌన్ శైలి. ఈ మాటల్లో కూడా అందుకే అతిశయోక్తులు కనిపించవు. 1827 నాటికే, బ్రౌన్ ‘ఆంధ్ర గీర్వాణ ఛందము’ అనే పుస్తకం రాసినప్పటికీ, ఆయనకి మంచి గుర్తింపు తెచ్చిన పుస్తకం 1829 నాటి ‘వేమన శతకం’. అప్పటికి బ్రౌన్ అయిదేళ్లుగా వేమన సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఇందులో దాదాపు ఏడొందల పద్యాలకి ఆంగ్లానువాదాలతోపాటు విస్తృతమయిన పదకోశం కూడా సమకూర్చారు. మరో పదేళ్ల తర్వాత, 1164 పద్యాల మేరకి విస్తరింపచేసి, తిరిగి ‘వేమన శతకం’ అచ్చువేశారు.<ref>{{Cite wikisource|title=సుప్రసిద్ధుల జీవిత విశేషాలు|author=జానమద్ది హనుమచ్ఛాస్త్రి|chapter=సి.పి.బ్రౌన్}}</ref>
పదవీ విరమణ తరువాత [[1854]]లో [[లండన్‌]]లో స్థిరపడి, 1865లో లండన్ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసరుగా నియమితుడైనాడు. బ్రౌన్ [[1884]] [[డిసెంబర్ 12]] న తన స్వగృహము 22 కిల్డారే గార్డెన్స్, వెస్ట్‌బార్న్ గ్రోవ్, లండన్<ref>[http://maps.google.com/maps?f=q&hl=en&geocode=&q=22,+Kildare+gardens,+westbourne+grove,+london&sll=37.0625,-95.677068&sspn=36.231745,80.15625&ie=UTF8&ll=51.516281,-0.192947&spn=0.00087,0.002446&t=h&z=19&iwloc=addr&om=1 గూగుల్ మాప్స్‌లో బ్రౌన్ నివసించిన ఇల్లు]</ref>లో అవివాహితునిగానే మరణించాడు. ఈయనను కెన్సెల్ గ్రీన్ శ్మశానంలో సమాధి చేశారు.<ref>http://www.oxforddnb.com/view/article/3601</ref>{{Cite wikisource |title=లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు|chapter=తెలుగు భాషా భానుడు సి. పి. బ్రౌన్|author=మండలి బుద్ధ ప్రసాద్|year=2010}}
 
==పండితుల సాన్నిహిత్యం==