వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 91:
::: టాగేసి పిలిచినందుకు చాలా ధన్యవాదాలు, చదువరి గారూ. [[వాడుకరి:IM3847]] గారు ఆంధ్రప్రదేశ్‌ పట్టణాలు, గ్రామాలకు సంబంధించి చాలా అందమైన, అవసరమైన ఫోటోలు తీసి కామన్సులో చేరుస్తున్నారు. అంతే కాకుండా, ఫ్లికర్‌లో మంచి ఫోటోగ్రాఫర్లు ఎవరైనా ఆం.ప్ర., తెలంగాణలకు సంబంధించిన ఫోటోలు సీసీ లైసెన్సుల్లో అప్‌లోడ్ చేస్తూంటే వాటిలో స్వేచ్ఛా లైసెన్సుల్లో ఉన్న ఫోటోలు కామన్సులో పెట్టడం, ఫ్రీ లైసెన్సుల్లో పెట్టని ఫోటోగ్రాఫర్లను నేరుగా సంప్రదించి వారి ఫోటోల్లో కొన్నిటిని అయినా ఫ్రీ లైసెన్సులోకి మార్పించి ఫోటోలు పెట్టించడం చేస్తున్నారు. ఆయన చాలా సహాయం చేయగలరని ఆశిస్తున్నాను. ఆదిత్య పకిడె రోజుకో ఫోటోని కామన్సుకు అందించి యజ్ఞంలాగా పనిచేసినవారు. ఆయన కూడా చాలా ఫోటోలు ఇందించనూ గలరు, తన సన్నిహితులను (యువ చరిత్రకారుడు అరవింద్ ఆర్య పకిడె వీరి అన్నయ్యే), మిత్రులను పలకరించి వారితో కూడా ఎక్కింపజేసే నాయకత్వ లక్షణాలనూ చూపగలరు. ఇక మీరన్నట్టు వీరా, రాజశేఖర్, విశ్వనాథ్, ప్రణయ్, భాస్కరనాయుడు, రవిచంద్ర గార్లు కూడా ఒక చేయివేస్తే మనకు ఫోటోల లోటు తీరిపోతుంది. నా వంతుగా నేనూ చేయగలిగిందంతా చేస్తాను. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 10:52, 5 జూలై 2021 (UTC)
:చదువరి గారూ, నాకూ సహకారం అందించాలనే ఉంది. ఆఫీసు కార్యకలాపాల్లో తీరిక లేకుండా ఉండటంతో పాలు పంచుకోలేకున్నాను. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకున్న వెళుతున్న వారందరికీ నా అభినందనలు. - [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 13:17, 5 జూలై 2021 (UTC)
::[[User:Chaduvari|చదువరి]] గారు, ఈ ప్రాజెక్టును ప్రారంభించిన స్వరలాసిక గారికి ధన్యవాదాలు. పోటీలో పాల్గొని ముందుకు తీసుకొనిపోతున్న వారందరికీ నా అభినందనలు. అయితే నేనొక మరొక విధంగా ఈ కృషిలో పాల్గొనడానికి ప్రయత్నిస్తున్నాను. భారత ప్రభుత్వం వారి ద్వారా కామన్స్ లో చేర్చబడిన వేలకొలదీ (https://commons.wikimedia.org/wiki/Category:Government_ministries_of_India ) భారతీయ బొమ్మలు వున్నాయి. వీటిలో కొందరు వ్యక్తులు, సంస్థలు మరియు ఇతర విషయాలకు చెందిన చాలా బొమ్మలు వున్నాయి. అయితే వాటికి సరైన లింకులు లేవు. ఉదాహరణకు పద్మశ్రీ అవార్డు పొందిన వ్యక్తుల బొమ్మల్లో (https://commons.wikimedia.org/wiki/Category:Padma_Shri ) అవార్డు అందుకొంటున్న వ్యక్తికి వ్యాసాలకు లింకు చేయలేదు. అలాగే చాలా తపాళాబిల్లలు ( https://commons.wikimedia.org/wiki/Category:Stamps_of_India ) వాటికి సంబంధించిన విషయాలకు లింకుచేయలేదు. వికీసోర్సులోని పుస్తకాలలో కొన్ని ఉచిత బొమ్మలున్నాయి. అయితే వాటిని ప్రత్యేకంగా బయటకు తీసి తిరిగి అప్లోడు చేయాలి. ఈ విధంగా చూసుకుంటే చాలా పనివున్నది. అయితే ఇక ప్రస్తుత విషయానికి సంబంధించిన సుమారు 70-80 బొమ్మలను నేను ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక 1911 నుండి వేరుచేసి కామన్స్ లోకి చేర్చాను. ( https://commons.wikimedia.org/wiki/Category:Andhra_Patrika_(1911) ) వీటిలో మీకు అవసరమైన బొమ్మలను Commonsలో ˛Croptool ఉపయోగించి కత్తిరించి సుళువుగా తిరిగి అప్లోడు చేయవచ్చును (పవన్ నాకు నేర్పించారు) ఈ పైన పేర్కొన్న వివిధ పద్ధతులలో మీరు సమయాన్ని వెచ్చించి వ్యాసాలలో బొమ్మలను చేర్చవచ్చును. శుభాకాంక్షలు.--[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 19:58, 13 జూలై 2021 (UTC)
 
== మిగతా వికీల్లో ==
Return to the project page "వికీప్రాజెక్టు/వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021".