వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021
అభినందనలు, చాలా ముఖ్యమైన వ్యాసాలకు సరైన ఫోటోలు లేవు, ఈ వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 కార్యక్రమం ద్వారా వేల వ్యాసాలు కొత్త రూపును సంతరించుకోగలవు అని ఆశిస్తున్నాను. : Kasyap (చర్చ) 08:18, 18 జూన్ 2021 (UTC)
బొమ్మలు కావలసిన వ్యాసాలు వర్గంలో బొమ్మలు ఉన్న పేజీలు కూడా ఉన్నాయి
మార్చువర్గం:బొమ్మలు కావలసిన వ్యాసాలు వర్గంలో ఉన్న మొత్తం 11,647 పేజీలకు గాను, 1,268 పేజీల్లో బొమ్మలు ఈసరికే చేర్చారు. అయితే, ఆ పేజీల్లో బొమ్మలను చేర్చినపుడు, వాటి చర్చ పేజీల్లో ఉన్న {{బొమ్మ అభ్యర్థన}} మూసను తీసివేయనందున ఆ పేజీలు ఇంకా ఈ వర్గంలోనే కనిపిస్తున్నాయి. వీటిని నేను ప్రాజెక్టు మొదలయ్యేలోపు తీసేస్తాను. అంటే బొమ్మలు చేర్చాల్సినవి సుమారుగా 10,400 పేజీలు మన ప్రాజెక్టు కోసం మిగులుతాయి. __చదువరి (చర్చ • రచనలు) 16:25, 18 జూన్ 2021 (UTC)
ప్రాజెక్టు పేజీలో లింకుల సవరించాలి
మార్చుముందుగా ఈ ప్రాజెక్టును గుర్తించి ఆచరణలోకి తీసుకువచ్చిన స్వరలాసిక గార్కి ధన్యవాదాలు.అయితే నేను ప్రాజెక్టు చదువుతూ కొన్ని లింకులు సరియైన పేజీలుకు కలపాల్సి ఉన్నట్లుగా గమనించాను.
- ఇతర అనేక మార్గాల ద్వారా వికీమీడియా కామన్స్లో ఎన్నో వేల చిత్రాలను చేర్చారు. ఇందులో లింకు దీనికి కలపాలి అనుకుంటాను.
- వికీపీడియా ఏయే భాషల్లో ఉందో ఇక్కడ చూడవచ్చు.ఇది తెలుగు వికీపీడియా ఆంగ్ల శీర్షికకు కలుపబడింది.ఇది ఆంగ్ల వ్యాసానికి దీనికి కలపాలి అనుకుంటాను.
దీనిమీద స్వరలాసిక గారూ, చదువరి గారూ పరిశీలించకోరుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 08:57, 20 జూన్ 2021 (UTC)
- @యర్రా రామారావు గారూ, సవరించాను. ఇలాంటివి ఇంకేమైనా ఉంటే సవరించెయ్యండి సార్. __ చదువరి (చర్చ • రచనలు) 10:10, 22 జూన్ 2021 (UTC)
- మరలా తిరిగి ఒకసారి పరిశీలిస్తాను. యర్రా రామారావు (చర్చ) 10:29, 22 జూన్ 2021 (UTC)
పోటీకి సంబంధించి కొన్ని అంశాలు
మార్చునేను ఒక పరీక్షా దిద్దుబాటు చేసాను- అందులో అసలు ఫొటో చేర్చనే లేదు. పైగ ఆ పేజీలో ఫొటో ఈసరికే ఉంది. పాఠ్యంలో ఒక స్పేసు మాత్రమే చేర్చి, దిద్దుబాటును ప్రచురిస్తూ సారాంశంలో #WPWPTE అనే హ్యాష్‌టాగును రాసానంతే. దాన్ని పోటీ లోకి పరిగణించింది! అంటే నిర్ణేతలకు ఈ పోటీలో పని చాలానే ఉన్నట్టు లెక్క. కాబట్టి కింది అంశాలను పరిశీలించవలసినదిగా నిర్ణేతలను కోరుతున్నాను:
- దిద్దుబాటు నిబంధనలకు లోబడి ఉన్నదని నిర్ధారించుకోవాలి. కింది వాటిని పరిశీలించాలి. వీటిలో అన్నిటినీ గట్టింగా పట్టించుకోవాలా, లేక కొన్నిటిని గట్టిగా పట్టించుకుని, మిగతావాటిని చూసీ చూడనట్టుగా వదిలెయ్యాలా అనేది నిర్ధారించుకోవాలి.
- అసలు ఆ దిద్దుబాటులో ఫొటో అంటూ చేర్చారో లేదో చూడాలి
- ఆ ఫోటో వ్యాసానికి సముచితంగా ఉందో లేదో చూడాలి
- అ పేజీలో గతంలో వేరే బొమ్మలు ఉండకూడదు
- ఫొటోకు వ్యాఖ్య ఉండాలి
- దిద్దుబాటు సారాంశం ఉండాలి - అవి తెలుగు లోనే ఉండాలి. యాంత్రికానువాదం అయి ఉండకూడదు (ఎందుకంటే, మీకు తెలియని భాషలో పాల్గొనవద్దు అని పోటీ నిబంధన ఒకటి చెబుతోంది).
- ఫొటో నాణెంగా ఉండాలి - అసలంటూ నాణెమైన ఫొటో వికీలో లేకనే పోతే, దాన్ని అనుమతించాలి. నాణెమైన ఫొటోలు వేరేవి ఉంటే ఈ దిద్దుబాటును అనుమతించకూడదు. (నాఅణెమైన ఫొటో ఉందో లేదో పరిశీలించడం చాలా పెద్ద పని)
- వ్యాసంలో సరైన చోట బొమ్మను చేర్చారో లేదో చూడాలి.
- పైన చూపిన పనులు నిర్ణేతల మధ్య పంపకం ఎలా జరగాలి. పని డూప్లికేషను లేకుండా చూసుకోవాలి గదా.
- రోజుకొక్కరు మాత్రమే పరిశీలించేలా పెట్టుకోవచ్చు. ఆ రోజున మిగతా ముగ్గురూ జోక్యం చేసుకోరు.
- ఎవరి వీలును బట్టి వాళ్ళు చేసుకుంటూ పోతారు. తాము పరిశీలించిన పేజీలను కింది పాయింటులో ఎంచుకున్న చోట నమోదు చేస్తారు.
- పరిశీలన చేసాక, మన నిర్ణయాన్ని ఎలా, ఎక్కడ నమోదు చెయ్యడం
- పోటీకి వచ్చిన ఎంట్రీలన్నిటినీ ఎక్సెల్ ఫైలుగా దింపుకుని దానిలో రాయడం
- లేదా ఆ ఎక్సెల్ ఫైలును వికీలోకి ఎక్కించుకుని దానిలో రాయడం
- బొమ్మను చేర్చిన పేజీ చర్చ పేజీలో ఒక మూసను చేర్చడం - పరిగణించాం / తిరస్కరించాం (కారణం రాయాలి)
వాడుకరి:స్వరలాసిక, వాడుకరి:T.sujatha, వాడుకరి:Palagiri గారలు పరిశీలించవలసినది. __ చదువరి (చర్చ • రచనలు) 02:40, 23 జూన్ 2021 (UTC)
కొన్ని సందేహాలు - సూచనలు
మార్చుప్రయోగాత్మకంగా కొన్ని ఫోటోలు చేర్చాను. అందులో నాకు వచ్చిన కొన్ని సందేహాలు
- నియమాలలో " Only add a photo to an article that has no photo" ఇందులో ఉదాహరణకు చిలుకూరు బాలాజీ దేవాలయం వ్యాసం లో ఒక మూలా రేఖా చిత్రం ఉన్నది , అలాంటప్పుడు వేరే గోపురం ఫోటో పెట్టవచ్చా?.
- కార్వేటినగరం లో భాగంగా ఉన్న వేణుగోపాల స్వామి ఫోటోను చేర్చాను, అయితే ఆ వ్యాస టైటిల్ కు దగ్గరగా లేదు ( ఆ వూరి ఫోటో కాదు ) ఇలాంటివి పరిగణిస్తారా ?
- సమాచార పెట్టె లేని బుడాపెస్ట్ లో పెద్ద చిత్రం , మాడ్రిడ్ లో బొటనవేలి పరిమాణం ఉన్న చిత్రం చేర్చాను, ఇలా చేర్చే వారికి ఎలాంటి సూచన చేయవచ్చు ?
- ఢీ అనే సినిమా వ్యాసంలో ఏ చిత్ర సంబందిత పోటో లేదు, కొన్ని సినిమా పేజీల ఆధారంగా ఇందులో కధానాయకుడి పేరు చేర్చాను , ఇలా చేయటం సమ్మతమేనా ?
- అతిమూత్రవ్యాధి వ్యాసంలో తడిసిన పక్క ఫోటో చేర్చాను ఇలా చేయటం సమ్మతమేనా ?
- విండోస్ చిట్కాలు వ్యాసంలో అన్నీ విండోస్ లకు సంబందించిన చిట్కాలు ఉండటం వలన , వ్యాసములో మైక్రోసాప్ట్ విండోస్ అని రాసి మైక్రోసాప్ట్ లోగో చేర్చాను , ఇలా ఫోటో దొరికింది అని వ్యాసంలో కొత్త సమాచారం చొప్పించి ఆ సంబందిత ఇమేజ్ వాడవచ్చా ?
- కడుపునొప్పి కి మామూలు స్టాక్ ఇమేజు వంటిది వాడాను, ఇలాంటివి నాణ్యమైనది గా గుర్తిస్తారా ?
- ఒక వ్యాసంలో ఒక ఫోటో కాకుండా ఎన్ని ఫోటోలు అయినా చేర్చవచ్చా వాటి పరిమితి ఏమిటి ?
కొన్ని సూచనలు చాలా గ్రామ వ్యాసాలకు పొటోలు లేవు , కాబట్టి ఈ వారంరోజలు వికీపీడియా కామన్స్ లో మీ ఊరి ఫోటో చేర్చండి అన్న పేరుతో ఎలా చేర్చాలో ఒక వీడియో చేసి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తే భోలేడు మంది ఆసక్తి చూపుతారు, తరువాత వారిచేతనే ఆ సంబందిత వూళ్ళో ఆ ఫోటో చేరిస్తే , ఎక్కువ మంది కొత్త ఎడిటర్లను పొందవచ్చు ! . దయచేసి మీ సలహాలు సూచనలు తెలియచేయగలరు. : --Kasyap (చర్చ) 04:01, 23 జూన్ 2021 (UTC)
- @Kasyap గారూ, సూపర్. ఇలాంటి పరీక్షలు చేసినపుడే మనకు ఇందులొని లోటుపాట్లేంటో తెలుస్తాయి. సరైన సందేహాలు వస్తాయి. మీరు ఈ పరీక్షలు చెయ్యకపోయి ఉంటే, బహుశా పోటీ మొదలయ్యాక ఈ సందేహాలు వచ్చి కొంత చికాకు కలిగించి ఉండేవి. మీ సందేహాల్లో కొన్నిటికి నిక్కచ్చిగా ఇవీ అంటూ సమాధానాలు లేవు. ఉన్న నియమాలను నేను అర్థం చేసుకున్నంతలో నా అభిప్రాయాలు రాస్తాను. అలాగే మీరూ, ఇతరులూ కూడా అభిప్రాయాలు రాస్తే స్వరలాసిక గారు తగు నిర్ణయాలు తీసుకునే వీలు కలుగుతుంది. నా అభిప్రాయాలివి:
- చిలుకూరు బాలాజీ దేవాలయం వ్యాసంలో ఈసరికే ఉన్న బొమ్మ చిన్నదేమీ కాదు, బాగానే ఉంది, వ్యాసానికి అతికే బొమ్మయే. కాబట్టి ఇప్పుడూ చేర్చిన బొమ్మను పోటీకి పరిగణించరాదు.
- కార్వేటినగరం లో చేర్చినది ఆ ఊరి ఫొటో కాదని అన్నారు. సంబంధం ఉన్న ఫొటోనే చేర్చాలి. కాబట్టి అది పోటీకి అనర్హమే. పైగా ఆ ఊరి ఫొటో అని వ్యాఖ్యలో రాయడం కూడా సరికాదు.
- ఫొటో పరిమాణం సాధారణంగా 200 లేదా 220 పిక్సెళ్ళు ఉంటుంది. చేర్చే బొమ్మ అలానే ఉంటే బాగుంటుంది. అయితే సందర్భాన్ని బట్టి పెద్దదైనా చేర్చవచ్చు.
- ఢీ సినిమా పేజీలో హీరో బొమ్మ. పేజీలో చేర్చే బొమ్మ వీలైనంత ఖచ్చితంగా ఆ పేజీకి సరిపోయేలా ఉండాలి. జనరిక్ బొమ్మలను చేర్చరాదు. మీరు చేర్చిన ఆ హీరో బొమ్మ అతడు నటించిన అన్ని సినిమా పేజీల్లోనూ చేర్చే వీలుంది. అంటే అది జనరిక్ బొమ్మ అన్నమాట. కాబట్టి అది ఈ పేజీలో తగదు. ఆ బొమ్మ ఆ హీరో పేజీలో నైతేనే సరిగ్గా సరిపోతుంది.
- అతిమూత్రవ్యాధి వ్యాసంలో చేర్చిన ఫోటో - అది అంత సముచితంగా లేదు. బహుశా ఈ పేజీకి సరిపోయే ఫొటో దొరకదేమో!
- విండోస్ చిట్కాలు వ్యాసంలో మైక్రోసాప్ట్ విండోస్ లోగో : సముచితం గానే ఉంది.
- కడుపునొప్పి కి మామూలు స్టాక్ ఇమేజు: అది అంత సముచితంగా లేదు, జనరిక్‌గా ఉంది. ఇలాంటి సందర్భాల్లో ఇతర వికీపీడియాల్లో ఎలాంటి బొమ్మలు వాడారో చూస్తే మనకు ఐడియా వస్తుంది (ఐతే, ఈ పద్ధతి అన్ని సందర్భాల్లోనూ పనిచెయ్యకపోవచ్చు. ఉదాహరణకు, పైన చూపిన అతిమూత్ర వ్యాధి ఎన్వికీ వ్యాసం). దీని ఎన్వికీ వ్యాసంలో ఉన్న బొమ్మ మరింత సముచితంగా ఉంది. దాన్ని వాడొచ్చు. ఒకవేళ అది కామన్సులొ లేకపోతే, ఇదే బొమ్మను తెవికీ లోకి ఎక్కించి వాడవచ్చు.
- ఒక వ్యాసంలో చేర్చదగ్గ ఫోటోల సంఖ్య పరిమితి: పేజీ రూపు వికారం కానంతవరకు సముచితమైన ఫొటోలు ఎన్నైనా చేర్చవచ్చు.
- స్వరలాసిక గారూ, వీటిపై వచ్చిన అభిప్రాయాలను పరిశీలించి నిర్ణయం చేసి, వాటిని ప్రాజెక్టు పేజీలో చేర్చవలసినది. కశ్యప్ గారూ, ధన్యవాదాలు __ చదువరి (చర్చ • రచనలు) 05:09, 23 జూన్ 2021 (UTC)
- Kasyap గారూ, చదువరి గారు సూచించిన సలహాలు బాగా ఉన్నాయి. అయితే కార్వేటినగరం వ్యాసంలో మీరు ఎక్కించిన బొమ్మ ఆ ఊరికి చెందిన ప్రముఖ దేవాలయం కనుక అది సముచితమైన బొమ్మగానే భావించాలి. ఇటువంటి వాటిని పోటీకి అర్హమైన వాటిగా పరిగణించవచ్చు.స్వరలాసిక (చర్చ) 06:13, 23 జూన్ 2021 (UTC)
మరి కొన్ని సందేహాలు - సూచనలు
మార్చు- చిత్రమాలిక రూపంలో ఎక్కించిన ఫొటోలు ఎలా పరిగణిస్తారు.అసలు పరిగణనలోకి తీసుకుంటారా లేదా అనేది నిర్ణయించాలి.ఒక వేళ పరిగణనలోకి తీసుకుంటే ఒకే ఫొటో కింద పరిగణించాలా లేక అన్ని ఫొటోలు పరిగణనలోకి తీసుకుంటారా అనేది ప్రాజెక్టు పేజీలో వివరంగా ఉండాలి.--యర్రా రామారావు (చర్చ) 06:05, 23 జూన్ 2021 (UTC)
- యర్రా రామారావుగారూ ఒక వ్యాసంలో ఎన్ని ఫోటోలను ఎక్కించినా వాటిని ఒకే ఎంట్రీగా పరిగణిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మిగతా న్యాయనిర్ణేతల అభిప్రాయం ఎలా ఉందో చూడాలి.--స్వరలాసిక (చర్చ) 06:15, 23 జూన్ 2021 (UTC)
- స్వరలాసిక గారూ మీ అభిప్రాయంతో నేనూ ఏకీభవిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 06:25, 23 జూన్ 2021 (UTC)
- యర్రా రామారావుగారూ ఒక వ్యాసంలో ఎన్ని ఫోటోలను ఎక్కించినా వాటిని ఒకే ఎంట్రీగా పరిగణిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మిగతా న్యాయనిర్ణేతల అభిప్రాయం ఎలా ఉందో చూడాలి.--స్వరలాసిక (చర్చ) 06:15, 23 జూన్ 2021 (UTC)
- వాడుకరి:Chaduvari గారూ, వ్యాసంలో బొమ్మ చేర్చిన పిదప ఆవ్యాస చర్చా పేజీలో ఉన్న {{బొమ్మ అభ్యర్థన}} మూసను తొలగించాలా? లేదా ఏదైనా మూసతో మార్చవలసి ఉంటుందా? ఆ మూస అలా ఉండిపోతే ఎవరైనా చిత్రం చేర్చిన తరువాత కూడా వేరొకరు అదే వ్యాసంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ➠ కె.వెంకటరమణ⇒చర్చ 10:39, 30 జూన్ 2021 (UTC)
- @K.Venkataramana గారూ, మీరు సరిగ్గా చెప్పారు. వ్యాసంలో బొమ్మ చేర్చాక చర్చా పేజీలో ఉన్న {{బొమ్మ అభ్యర్థన}} మూసను తొలగించాలి. వేరే మూసను చేర్చనక్కరలేదండి.__ చదువరి (చర్చ • రచనలు) 10:51, 30 జూన్ 2021 (UTC)
చిన్న సందేహం
మార్చుఆంగ్లం వికీ లో ఉన్న సినిమా పోస్టర్లు, తెలుగు వ్యాసాల్లో పెడితే సపోర్ట్ చేయడం లేదు. అలాంటివి డౌన్లోడ్ చేసి తెలుగు వికీపీడియాలో ఎక్కించి వ్యాసం లో పెడితే పరిగణలోకి తీసుకుంటారా? అలాగే నా దగ్గర గ్రామ వ్యాసాలకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఉన్నాయి అవి కామర్స్ లోకి అప్లోడ్ చేసి సంబంధిత వ్యాసాలు లో పెట్టవచ్చా దీనిపై వివరణ ఇవ్వగలరు.Ch Maheswara Raju (చర్చ) 05:25, 1 జూలై 2021 (UTC)
- వాడుకరి:Ch Maheswara Raju గారూ, కామన్సులో బొమ్మలు లేకపోతే, ఇతర వికీపీడియాల్లోని బొమ్మలను తెచ్చి తెవికీ లోకి ఎక్కించి వాడవచ్చు. మీ వద్ద ఉన్న ఫొటోలు మీ స్వంతమైతే, లేదా వాటికి కాపీ హక్కుల సమస్యలేమీ లేకపోతే కామన్సు లోకి భేషుగ్గా ఎక్కించవచ్చు, ఇక్కడి వ్యాసాల్లో వాడుకోవచ్చు. ఒకవేళ వాటికి కాపీహక్కుల సమస్యలుంటే, ఫెయిర్ యూజ్ నిబంధనలకు అనుగుణంగా తెవికీ లోకి ఎక్కించవచ్చు.__చదువరి (చర్చ • రచనలు) 06:22, 1 జూలై 2021 (UTC)
గ్రామాల్లో ఫొటోలు చేర్చడం
మార్చుగ్రామాల పేజీల్లో దాదాపు 9000 దాకా బొమ్మల్లేవు. మిగతా పేజీల్లో కూడా 99% వరకూ ఉన్న బొమ్మలు మ్యాపులే. సాంకేతికంగా చూస్తే అవి బొమ్మలే కాబట్టి బొమ్మలు ఉన్నట్టుగానే భావించాలి. అయితే ఇది "ఫొటోలు" పెట్టే పోటీ కాబట్టి, "మ్యాపులు మాత్రమే" ఉన్న గ్రామాల పేజీల్లో "ఫొటో" చేరిస్తే దాన్ని పోటీ లోకి పరిగణిస్తే బావుంటుందని నా అభిప్రాయం. పరిశీలించవలసినది. __చదువరి (చర్చ • రచనలు) 08:01, 1 జూలై 2021 (UTC)
- ఈ ప్రతిపాదన సముచితంగా ఉంది.అలాగే ఈ పోటీలో మ్యాప్ ఎక్కిస్తే ఫొటోగా పరిగణించకూడదు. యర్రా రామారావు (చర్చ) 08:34, 1 జూలై 2021 (UTC)
- బెంగాలీ వంటి , WPWPTR ,WPWPSR,WPWPKWR ,WPWPBN ఇతర వికీలలో మ్యాపుల కన్నా ఫోటోలే ఎక్కువ చేరుస్తున్నారు ఇక్కడ మ్యాపులు ఎక్కించిన, పరిగణించిన దాఖలాలు నాకు కనపడలేదు ,ఇక్కడ ఇది వరకే మ్యాప్ వున్నా కూడా ఎక్కించిన ఫోటోని #WPWP లో ఫోటో లేని వ్యాసంగా పరిగణిస్తున్నారు,కాబట్టి ఇది కూడా మనం గమనించాలి: Kasyap (చర్చ) 10:01, 26 జూలై 2021 (UTC)
- @Kasyap గారూ, రెండు విషయాలు:
- ఇతర వికీలో చేర్చడం లేదు కాబట్టి, మనం చేర్చడం తప్పని మీ ఉద్దేశమేమో నాకు అర్థం కాలేదు. అయితే ఈ విషయమ్మీద స్వరలాసిక గారు పోటీ నిర్వహకులతో చర్చించారు. మ్యాపులు పెట్టవచ్చని వాళ్ళు స్పష్టం చేసారు. కాబట్టి మనం చేసేదానిలో ఏ లోపమూ లేదు. గమనించవలసినది.
- ఈ విభాగంలోని ప్రతిపాదనను ఈ పోటీ మొదలైన రోజున చేసాను. అప్పుడే అందరూ తమతమ అభిప్రాయాలు చెప్పి ఉంటే, ఒక నిర్ణయం తీసుకోగలిగి ఉండేవాళ్ళం. కానీ, అప్పుడు ఆ విషయం గురించి మాట్లాడినది ఇద్దరే. అందుకే ఒక నిర్ణయం అంటూ చెయ్యలేకపోయాం. ఇప్పటికి 25 రోజులు గడిచిపోయాయి. కొన్నివేల దిద్దుబాట్లు జరిగిపోయాయి. ఇప్పుడు దీని గురించి చర్చిస్తే ఏమి ఉపయోగం ఉంటుందో మీరు ఆలోచించండి.
- __ చదువరి (చర్చ • రచనలు) 10:19, 26 జూలై 2021 (UTC)
- @Kasyap గారూ, రెండు విషయాలు:
చదువరి గారూ మ్యాపులు పెట్టవచ్చని వాళ్ళు స్పష్టం సంగతి తెలుసునండీ అయితే ఈరోజు వివిధ భాషల్లో ఇలా చేరుస్తున్నారు అని నా దృష్టిలో రాలేదు, ఇకపోతే ఇలా ఈరోజు పెట్టటంతో ఉద్దేశం, ఇందులో ఎవరూ చేయని వాటిమీద మన శ్రమ ఎంత వరకూ సమంజసం ఎందుకంటే ఇలాంటి మ్యాచులు మ్యాపులు ఒక బాటు ద్వారా కూడా చేయగలము కదా , ఏమైనా ఇబ్బంది ఉంటే మన్నించండి : Kasyap (చర్చ) 17:50, 26 జూలై 2021 (UTC)
- @Kasyap గారూ, మ్యాపు చేర్చడం పోటీ నిబంధనలకు అనుగుణమైనదే అనే విషయం స్పష్టమే కాబట్టి, దాన్ని పక్కన పెడదాను. దాని గురించి మాటాణ్ణు. మరో రెండు సంగతులు చెప్పాలి:
- గ్రామాల వ్యాసాల్లో మ్యాపు చేర్చడమనేది చాలా ముఖ్యమైన పని. బహుశా ఆ పేజీల్లో మొదటి రెండు లైన్ల తరువాత ఇదే ముఖ్యమైన అంశం. ఇన్నాళ్ళూ లేని అంశం దానికి చేరుతున్నందుకు అందరం సంతోషించాలి.
- ఈ పని చేసేందుకు బాటు వాడడం.. మంచి సంగతి! కానీ అందులో కొన్ని సమస్యలున్నాయి
- గ్రామం పేరు పట్టుకోవాలి (తెవికీలో గ్రామాల పేర్లలో దోషాలు దాదాపు 20% ఉంటాయని నా అంచనా)
- దాన్ని ఇంగ్లీషు స్పెల్లింగు లోకి మార్చుకోవాలి. మ్యాపు అప్లికేషన్లు తెలుగును చూపించవు. ఇంగ్లీషు లోకి ఎలా మారుస్తాం? లిప్యంతరీకరణ ద్వారా చేసేది కుదరదు. ఎందుకంటే హైదరాబాద్ ను లిప్యతరీకరణ చేస్తే haidaraabaad అని వస్తుంది. ఇంగ్లీషు స్పెల్లింగు అలా ఉండదు కదా.
- గూగుల్ మ్యాపుల్లో తెలుగు చూపిస్తుంది, ఒప్పుకుంటాను. కానీ, ఆ తెలుగు పేర్లలో 90% యాంత్రికంగా లిప్యంతరీకరణ చేసినవి. మిగతా 10% మాత్రమే మనబోటి గాళ్ళు రాసినవి. లిప్యంతరీకరణ చేసినవి ఎలా ఉంటాయో మీకు తెలుసు. Hyderabad ను లిప్యంతరీకరణ చేస్తే హ్య్దెరబద్ అని వస్తుంది. Uddandarayunipalem ను లిప్యంతరీకరణ చేస్తే "ఉద్దందరయునిపలెం" అని వస్తుంది.
- ఈ రెండు పద్ధతుల్లో ఏది పాటించినా, పై లోపాల వలన అది సక్సెసయ్యే సంభావ్యత తక్కువగా ఉంటుంది. పైగా ఒకఏపేరుతో ఒకటి కంటే ఎక్కువ పేజీలున్న పేర్లు చాలానే ఉన్నాయి.
- ఇక ఆ తరువాత మ్యాపుల నుండి నిర్దేశాంకాలను సేకరించాలంటే ఆ అప్లికేషన్లు ఆందుకు తగ్గ API ని అందుబాతులో ఉంచాలి.
- నేను బాటు ఆలోచనను నిరుత్సాహపరచడం లేదు సుమండి. ఈ సమస్యలున్నాయని మనం ఆగనక్కర్లేదు కూడా. పనులు వేగంగా చెయ్యాలనేది, చాలా తక్కువ సమయంలో చాల ఎక్కువ పనులు చెయ్యాలనేదీ నా సిద్ధాంతం కూడా. అందుకే నేను AWB ని చాలా విరివిగా వాడతాను. గతంలో బాటు కోసం బాటు అభ్యర్థనలు పేజీలో నాలుగైదు ప్రతిపాదనలు కూడా పెట్టాను. ఈ ఆలోచనను కూడా మీరు వివరంగా బాటు పేజీలో పెట్టండి. ధన్యవాదాలు. __ చదువరి (చర్చ • రచనలు) 01:58, 27 జూలై 2021 (UTC)
- వాడుకరి:స్వరలాసిక గారూ, అనేక గ్రామాల్లో ఒకే మ్యాపును కోఆర్డినేట్స్ మార్పులతో చేర్చితే వాటిని ఈ ప్రాజెక్టులో పరిగణిస్తారో లేదో స్పష్టంగా కనుక్కోండి. పరిగణించకపోతే తెవికీలో గ్రామవ్యాసాలు అభివృద్ధి జరిగినా ఈ ప్రాజెక్టులో మన కృషి వృధాగా పోతుంది. మనం గ్రామ వ్యాసాల్లో కోఆర్డినేట్స్ మాత్రమే చేరుస్తున్నాం. తత్ఫలితంగా మ్యాపు కనబడుతుంది. వారు దస్త్రాన్ని చేర్చాలనే నిబంధన ఏమైనా ఉందా? కనుక్కొని తెలియజేయగలరు. ➠ కె.వెంకటరమణ⇒చర్చ 03:26, 27 జూలై 2021 (UTC)
- కశ్యప్ గారూ మీరు చెప్పిన దాంట్లో కొంత వాస్తవం లేకపోలేదు. చర్చలో మొదట ఎవ్వరూ దీనిమీద స్పందించలేదు.చదువరి గారూ, నేను మాత్రమే స్పందించాం.అందువలన అ విషయం మీద స్తబ్ధత ఏర్పడింది.బాటు ద్వారా అనుకోవటమే గానీ, పని జరిగే యోచన కనపడ్డంలేదు. దాని నిర్వహణకు కలిగే ఇబ్బందులు చదువరి గారు పైన వివరించారు.వెంకటరమణ గారు కోరినట్లుగా అక్షాంశ, రేఖాంశాల ద్వారా చేరిన మ్యాపును పరిగణిస్తారా, లేదా అని స్వరలాసిక గారు తెలుసుకొనగలరు. యర్రా రామారావు (చర్చ) 08:23, 27 జూలై 2021 (UTC)
- ➠ కె.వెంకటరమణ గారూ, యర్రా రామారావు గారూ, చదువరి గారూ, కశ్యప్ గారూ ప్రాజెక్టు కోఆర్డినేటర్ చెప్పిన దాని ప్రకారం
అక్షాంశ, రేఖాంశాలను చేర్చడం పోటీ పరిగణన(WPWP) లోనికి రాదు. ఐతే మనలో ఎవరికీ అభ్యంతరం లేకపోతే మనం స్థానికంగా (WPWPTE) వాటిని పరిగణనలోనికి తీసుకుందాం. స్వరలాసిక (చర్చ) 11:27, 27 జూలై 2021 (UTC)
- వాడుకరి:స్వరలాసిక గారూ, అనేక గ్రామాల్లో ఒకే మ్యాపును కోఆర్డినేట్స్ మార్పులతో చేర్చితే వాటిని ఈ ప్రాజెక్టులో పరిగణిస్తారో లేదో స్పష్టంగా కనుక్కోండి. పరిగణించకపోతే తెవికీలో గ్రామవ్యాసాలు అభివృద్ధి జరిగినా ఈ ప్రాజెక్టులో మన కృషి వృధాగా పోతుంది. మనం గ్రామ వ్యాసాల్లో కోఆర్డినేట్స్ మాత్రమే చేరుస్తున్నాం. తత్ఫలితంగా మ్యాపు కనబడుతుంది. వారు దస్త్రాన్ని చేర్చాలనే నిబంధన ఏమైనా ఉందా? కనుక్కొని తెలియజేయగలరు. ➠ కె.వెంకటరమణ⇒చర్చ 03:26, 27 జూలై 2021 (UTC)
ఈ విభాగం చర్చ మొదట్లో యర్రా రామారావు, చదువరి గార్లు చర్చ ప్రారంభంలో చెప్పినట్లు "ఫొటో" చేరిస్తే దాన్ని పోటీ లోకి పరిగణిస్తే బావుంటుందని నా అభిప్రాయం.➠ కె.వెంకటరమణ⇒చర్చ 11:35, 27 జూలై 2021 (UTC)
- ఎట్టకేలకు #WPWPCampaign 2021 వారిని ఒప్పించ గలిగాను. ఈ విధమైన మార్పులు అంటే అక్షాంశ, రేఖాంశాలను సమాచారపెట్టెలో పెట్టడం పోటీకి అంగీకారమే అని తెలియజేశారు.
వారి సమాధానం ఇలా ఉంది.
Hi Murali,
These sort of contributions are valid and count for the campaign.
Best regards
Isaac
--స్వరలాసిక (చర్చ) 14:26, 27 జూలై 2021 (UTC)
- ఇప్పటివరకునా? ఇకముందు కూడానా ? వివరించగలరు యర్రా రామారావు (చర్చ) 14:32, 27 జూలై 2021 (UTC)
- ఇప్పటివరకు అనే అభిప్రాయం తెలుపుచున్నట్లుగా ఉంది యర్రా రామారావు (చర్చ) 14:34, 27 జూలై 2021 (UTC)
- యర్రా రామారావు గారూ, ఇప్పటి వరకూ, ఇక ముందు కూడా లెక్కలోనికి వస్తాయి. ఇక అందరూ ఎటువంటి సందేహం లేకుండా గ్రామవ్యాసాలపై పడదాం. --స్వరలాసిక (చర్చ) 14:58, 27 జూలై 2021 (UTC)
- మరో ముందడుగు.మీ కృషికి ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 15:03, 27 జూలై 2021 (UTC)
- @స్వరలాసిక గారు మా సందేహాలకు సమాధానాలిస్తూ, అలాగే కావాల్సిన ప్రోత్సాహం సహకారం అందిస్తున్నందుకు ధన్యవాదాలు సార్. Nskjnv (చర్చ) 15:38, 27 జూలై 2021 (UTC)
- యర్రా రామారావు గారూ, ఇప్పటి వరకూ, ఇక ముందు కూడా లెక్కలోనికి వస్తాయి. ఇక అందరూ ఎటువంటి సందేహం లేకుండా గ్రామవ్యాసాలపై పడదాం. --స్వరలాసిక (చర్చ) 14:58, 27 జూలై 2021 (UTC)
- ఇప్పటివరకు అనే అభిప్రాయం తెలుపుచున్నట్లుగా ఉంది యర్రా రామారావు (చర్చ) 14:34, 27 జూలై 2021 (UTC)
ఈ ప్రాజెక్టును ముందుండి లాక్కెళ్ళే వాళ్ళు మరికొంతమంది కావాలి
మార్చువ్యాసాల్లో ఫొటోలు చేర్చే ప్రాజెక్టును చేపట్టినందుకు ముందుగా స్వరలాసిక గారికి ధన్యవాదాలు. ఇప్పటికి దాదాపు 600 పైచిలుకు వ్యాసాల్లో ఫొటోలు చేరాయి. రోజుకు సగటున 120 పైగా వ్యాసాల్లో ఫొటోలు చేరుతూ ఉన్నాయి. సీనియర్ వాడుకరులతో పాటు, కొత్తగా చేరిన వారు కూడా కలిసి మొత్తం 20 మంది విశేషంగా కృషి చేస్తూండడంతో ఇది సాధ్యపడింది. ఇది ఇలా సాగితే ఈ పోటీ ముగిసే లోగా 6000 కు పైగా వ్యాసాల్లో బొమ్మలు చేరతాయి. ఆ విధంగా తెవికీ వ్యాసాల మెరుగుదలకు ఎంతగానో తోడ్పడే ప్రాజెక్టిది.
అయితే వ్యాసాలకు సరిపడే ఫొటోలు ఉన్నపుడే ఈ 20 మంది ఈ ప్రాజెక్టును విజయవంతం చేయగలుగుతారు. ఫొటోలు చేర్చాల్సిన పేజీలు- వివిధ వర్గాల్లో చేరినవి - 16 వేలకు పైగానే ఉన్నాయి. (వర్గాల్లో చేరనివి ఇంకా అనేకం ఉంటాయి) వాటిలో గ్రామాలు, వ్యక్తులు, సినిమాల వ్యాసాలే 45 వేల దాకా ఉన్నాయి. ఈ పేజీలకు అనువైన ఫొటోలు తక్కువగా దొరుకుతున్నాయి. ఎందుకంటే, వీటిలో 90% వ్యాసాలు తెవికీ లోనే ఉంటాయి. ఇతర భాషల్లో ఉన్నా.., వాటికి తెవికీ వ్యాసమే మాతృక అవుతుంది. వీటిలో పెట్టాల్సిన ఫొటోలు తెవికీపీడియనులు, తెలుగువాళ్ళు ఎక్కిస్తే తప్ప సాధారణంగా దొరకవు. కాబట్టి మనం ఫొటోలు ఎక్కించే విషయంపై కూడా దృష్టి పెట్టాలి. స్వరలాసిక గారు కొన్ని ఫొటోలను సంపాదించే ప్రయత్నంలో ఉన్నారు. రాజశేఖర్ గారు, విశ్వనాథ్ గారు, పవన్ సంతోష్ గారు, ప్రణయ్ రాజ్ గారు గతంలో ఫొటోలు సంపాదించడానికి కృషి చేసినట్లు గుర్తు. వారు తమ కృషిని మళ్ళీ మొదలెట్టి, మరిన్ని ఫొటోలను సంపాదించేందుకు కృషి చెయ్యాలని వినతి.
ఇవన్నీ ఒక ఎత్తు కాగా.., ఫొటోలు తీయడం, వికీలోకి ఎక్కించడంపై ఆసక్తి చూపే వాడుకరులు మనలో కొందరున్నారు. వాళ్ళు కూడా ఈ ప్రాజెక్టులో పాలుపంచుకుని తమ వద్ద ఉన్న ఫొటోలను ఎక్కిస్తే ఈ ప్రాజెక్టు మరింత విజయవంతమౌతుంది. నాకు తెలిసినంతలో ఐ.మహేష్ గారు, అదిత్య పకిడె గారు, శశిధర్ గారు ఫొటోగ్రఫీ విషయంలో విశేష కృషి చేసిన, చేస్తున్నవాళ్ళు. రవిచంద్ర గారు, భాస్కరనాయుడు గారు కూడా ఫొటోలపై ఆసక్తి చూపిస్తూంటారు. భాస్కరనాయుడు గారు ఎక్కించిన ఫొటో ఒకటి ఫొటో ఆఫ్ ది డే గా కామన్సులో ప్రదర్శించారు కూడాను. ఈ రంగంలో ఆసక్తి ఉన్న ఇతర వాడుకరులు కూడా ఉండవచ్చు. వారందరినీ ఈ పోటీపై దృష్టి సారించాలని, ఈ పోటీ దిగ్విజయంగా ముందుకు సాగడానికి అవసరమైన ఇంధనాన్ని అందించాలనీ కోరుతున్నాను. __ చదువరి (చర్చ • రచనలు) 10:17, 5 జూలై 2021 (UTC)
- @చదువరి గారు, ట్యాగుకు ధన్యవాదాలు. నేను [[ఫిలిం] పైన తీసిన ఫోటోలు చాలానే ఉన్నాయి. ఆఫీసు పని వత్తిడి, ఫిజికల్ ఫిట్ నెస్ మీద కొద్దిగా పెట్టిన దృష్టి వలన ఈ మధ్య నా వికీ యాక్టివిటీ కొద్దిగా మందగించింది. ఇప్పుడిప్పుడే మరల వికీ పై దృష్టి సారించాను. ఖచ్చితంగా నా వద్ద ఉన్న ఫోటోలను అప్ లోడ్ చేస్తాను. చక్కని ప్రాజెక్టు తలపెట్టిన స్వరలాసిక గారికి ధన్యవాదాలు! - శశి (చర్చ) 10:28, 5 జూలై 2021 (UTC)
- ధన్యవాదాలు @Veera.sj గారు.__ చదువరి (చర్చ • రచనలు) 10:37, 5 జూలై 2021 (UTC)
- టాగేసి పిలిచినందుకు చాలా ధన్యవాదాలు, చదువరి గారూ. వాడుకరి:IM3847 గారు ఆంధ్రప్రదేశ్ పట్టణాలు, గ్రామాలకు సంబంధించి చాలా అందమైన, అవసరమైన ఫోటోలు తీసి కామన్సులో చేరుస్తున్నారు. అంతే కాకుండా, ఫ్లికర్‌లో మంచి ఫోటోగ్రాఫర్లు ఎవరైనా ఆం.ప్ర., తెలంగాణలకు సంబంధించిన ఫోటోలు సీసీ లైసెన్సుల్లో అప్‌లోడ్ చేస్తూంటే వాటిలో స్వేచ్ఛా లైసెన్సుల్లో ఉన్న ఫోటోలు కామన్సులో పెట్టడం, ఫ్రీ లైసెన్సుల్లో పెట్టని ఫోటోగ్రాఫర్లను నేరుగా సంప్రదించి వారి ఫోటోల్లో కొన్నిటిని అయినా ఫ్రీ లైసెన్సులోకి మార్పించి ఫోటోలు పెట్టించడం చేస్తున్నారు. ఆయన చాలా సహాయం చేయగలరని ఆశిస్తున్నాను. ఆదిత్య పకిడె రోజుకో ఫోటోని కామన్సుకు అందించి యజ్ఞంలాగా పనిచేసినవారు. ఆయన కూడా చాలా ఫోటోలు ఇందించనూ గలరు, తన సన్నిహితులను (యువ చరిత్రకారుడు అరవింద్ ఆర్య పకిడె వీరి అన్నయ్యే), మిత్రులను పలకరించి వారితో కూడా ఎక్కింపజేసే నాయకత్వ లక్షణాలనూ చూపగలరు. ఇక మీరన్నట్టు వీరా, రాజశేఖర్, విశ్వనాథ్, ప్రణయ్, భాస్కరనాయుడు, రవిచంద్ర గార్లు కూడా ఒక చేయివేస్తే మనకు ఫోటోల లోటు తీరిపోతుంది. నా వంతుగా నేనూ చేయగలిగిందంతా చేస్తాను. --పవన్ సంతోష్ (చర్చ) 10:52, 5 జూలై 2021 (UTC)
- చదువరి గారూ, నాకూ సహకారం అందించాలనే ఉంది. ఆఫీసు కార్యకలాపాల్లో తీరిక లేకుండా ఉండటంతో పాలు పంచుకోలేకున్నాను. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకున్న వెళుతున్న వారందరికీ నా అభినందనలు. - రవిచంద్ర (చర్చ) 13:17, 5 జూలై 2021 (UTC)
- చదువరి గారు, ఈ ప్రాజెక్టును ప్రారంభించిన స్వరలాసిక గారికి ధన్యవాదాలు. పోటీలో పాల్గొని ముందుకు తీసుకొనిపోతున్న వారందరికీ నా అభినందనలు. అయితే నేనొక మరొక విధంగా ఈ కృషిలో పాల్గొనడానికి ప్రయత్నిస్తున్నాను. భారత ప్రభుత్వం వారి ద్వారా కామన్స్ లో చేర్చబడిన వేలకొలదీ (https://commons.wikimedia.org/wiki/Category:Government_ministries_of_India ) భారతీయ బొమ్మలు వున్నాయి. వీటిలో కొందరు వ్యక్తులు, సంస్థలు మరియు ఇతర విషయాలకు చెందిన చాలా బొమ్మలు వున్నాయి. అయితే వాటికి సరైన లింకులు లేవు. ఉదాహరణకు పద్మశ్రీ అవార్డు పొందిన వ్యక్తుల బొమ్మల్లో (https://commons.wikimedia.org/wiki/Category:Padma_Shri ) అవార్డు అందుకొంటున్న వ్యక్తికి వ్యాసాలకు లింకు చేయలేదు. అలాగే చాలా తపాళాబిల్లలు ( https://commons.wikimedia.org/wiki/Category:Stamps_of_India ) వాటికి సంబంధించిన విషయాలకు లింకుచేయలేదు. వికీసోర్సులోని పుస్తకాలలో కొన్ని ఉచిత బొమ్మలున్నాయి. అయితే వాటిని ప్రత్యేకంగా బయటకు తీసి తిరిగి అప్లోడు చేయాలి. ఈ విధంగా చూసుకుంటే చాలా పనివున్నది. అయితే ఇక ప్రస్తుత విషయానికి సంబంధించిన సుమారు 70-80 బొమ్మలను నేను ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక 1911 నుండి వేరుచేసి కామన్స్ లోకి చేర్చాను. ( https://commons.wikimedia.org/wiki/Category:Andhra_Patrika_(1911) ) వీటిలో మీకు అవసరమైన బొమ్మలను Commonsలో ˛Croptool ఉపయోగించి కత్తిరించి సుళువుగా తిరిగి అప్లోడు చేయవచ్చును (పవన్ నాకు నేర్పించారు) ఈ పైన పేర్కొన్న వివిధ పద్ధతులలో మీరు సమయాన్ని వెచ్చించి వ్యాసాలలో బొమ్మలను చేర్చవచ్చును. శుభాకాంక్షలు.--Rajasekhar1961 (చర్చ) 19:58, 13 జూలై 2021 (UTC)
మిగతా వికీల్లో
మార్చుఇప్పటి వరకు మనం 680 వ్యాసాల్లో ఫొటోలు పెట్టాం. వెంకటరమణ గారు 145, NSKJNV గారు 141, యర్రా రామారావు గారు 99, మురళీ కృష్ణ ముసునూరి గారు 81 చేసారు. ఇతర భారతీయ భాషల్లో.. హిందీ, కన్నడ, తమిళ, మలయాళ, మరాఠీ, పంజాబీ, గుజరాతీ వాళ్ళు అస్సలు చెయ్యడం లేదు. బెంగాలీ వాళ్ళు 2 వేలు చేసారు ఇప్పటి వరకు.
అన్ని భాషల్లోనూ కలిపి (#WPWP ట్యాగున్న దిద్దుబాట్లు) 14 వేలు అయ్యాయి. తెలుగు వికీపీడియా ఆరవ స్థానంలో ఉంది. బెంగాలీ వికీపీడియన్లలో ఇద్దరు చెరో 600 దిద్దుబాట్లు చేసారు -రోజుకు వంద. బొమ్మలు విరివిగా దొరికితే అది పెద్ద సంగతేమీ కాదు. వాళ్ళు బొమ్మలను ఎలా పట్టుకుంటున్నారో తెలుసుకోవాలి. పెద్దగా వెతికే పని లేకుండా బొమ్మలు దొరికితే మనమూ చెయ్యవచ్చు.
అన్నట్టు.., బెంగాలీ గణాంకాల్లోకి వెళ్ళి, ఒక్కో పేజీని తెరిచి, దాని అంతర్వికీ లింకుల్లో తెలుగు ఉంటే, ఆ తెలుగు పేజీలో బొమ్మ లేకపోతే, బెంగాలీ వాళ్ళు పెట్టిన బొమ్మనే మనమూ పెట్టవచ్చు. ఆసక్తి ఉన్నవాళ్ళు ఆ పని చెయ్యవచ్చు. ఈ డేటాను నేరుగా డేటాబేసు నుండి కూడా తేవచ్చు. నేను ప్రయత్నిస్తాను. __ చదువరి (చర్చ • రచనలు) 02:00, 6 జూలై 2021 (UTC)
బెంగాలీ పేజీలో బొమ్మ చేర్చిన తెలుగు పేజీలు
మార్చుకింది పేజీలకు చెందిన బెంగాలీ పేజీలో ఈమధ్య బొమ్మను చేర్చారు. (కొన్ని పేజీల్లో ఈసరికే బొమ్మలున్నాయి. కొన్నిట్లో ఇప్పుడు చేర్చాను. పనైపోయింది) __చదువరి (చర్చ • రచనలు) 04:57, 6 జూలై 2021 (UTC)
సినిమా పోస్టర్ లకు వనరులు
మార్చుఒక అనామకుడు కొన్ని పత్రిక స్కాన్ కాపీలు కాపీ హక్కుల నియమాలు ఉల్లంఘిస్తూ ఇక్కడ పెట్టాడు, వీటిని నుండి స్రీన్ షాట్ తీసి ఫెయిర్ యూజ్ ప్రకారం వికీ సినిమా పేజీలో తెలుగు వికీపీడియాలో నేరుగా దస్త్రం ఎక్కించి, ఆ సంబంధిత వ్యాసంలో చేర్చ వచ్చా తెలుపగలరు. 2021-07-08T13:12:59 Kasyap
- ఎక్కించవచ్చునని నా అభిప్రాయం. ఎందుకంటే - మనం ఫెయిర్‌యూజ్ కిందనే ఇస్తున్నాం. మనం ఏమీ కాపీహక్కులు ఉల్లంఘించట్లేదు కాబట్టి. అదికూడా పెద్ద పేద్ద రిజల్యూషన్‌లో ఆ దస్త్రాలు ఉంచొద్దు. రిజల్యూషన్ నిబంధనల మేరకు తగ్గించి పెట్టండి. కాపీహక్కుల ఉల్లంఘన ద్వారా ఎక్కించిన దస్త్రాలు కాబట్టి మూలంగా వాటిని ఇవ్వకుండా పత్రిక పేరు ఇవ్వండి. మూలాలుగా వాటిని ఇస్తే ఆ కాపీహక్కుల ఉల్లంఘనకు ప్రచారం కల్పించినట్టు అవుతుంది. --పవన్ సంతోష్ (చర్చ) 14:28, 6 జూలై 2021 (UTC)
ప్రాజెక్టు సభ్యుల వారాంతర సమావేశాలు
మార్చువికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 లో పాల్గోంటున్న ప్రాజెక్టు జరిగే కాలంలో ఇందులో పాల్గోనే అందరూ సబ్యులూ వీలయితే వారాంతరంలో ఒక రోజు గంటపాటు గూగుల్ మీట్ ద్వారా సమావేశం నిర్వహించుకొంటే నేర్చుకొన్న విషయాలు పంచుకోవచ్చు,సూచనలు కూడా చేయవచ్చు, కొత్త వారికి ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది, అలాంటి అవకాశం వుంటే నిర్వహకులు తెలుపగలరు.--Kasyap (చర్చ) 07:42, 8 జూలై 2021 (UTC)
- @Kasyap గారూ, బానే ఉంటుందండి. నేను సిద్ధమే. ఎంతమంది దీనికి స్పందిస్తారో చూడాలి.__ చదువరి (చర్చ • రచనలు) 00:31, 9 జూలై 2021 (UTC)
- నేను సిద్ధమే. యర్రా రామారావు (చర్చ) 16:04, 10 జూలై 2021 (UTC)
- జూలై 15వ తేదీ సాయంత్రం 7.00 నుండి 8.00 వరకు గూగుల్ మీట్ ద్వారా సభ్యులతో పునస్సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకుందాం. --స్వరలాసిక (చర్చ) 03:12, 11 జూలై 2021 (UTC)
- నేను కూడా సిద్దమే.~~~~ Nskjnv (చర్చ) 10:00, 11 జూలై 2021 (UTC)
నేనూ సిద్ధమే. పున సమీక్ష సమావేశం వలన కొంత ప్రోత్సాహమూ, సమాచారం లభిస్తుంది. Abhi (చర్చ) 17:00, 11 జూలై 2021 (UTC)
- వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 సభ్యుల పునసమీక్షా సమావేశం జూలై 15వ తేదీ సాయంత్రం 7.00 నుండి 8.00 వరకు గూగుల్ మీట్ ID ద్వారా చేరగలరు (లింకు) Or Open Google Meet and enter this code: bqk-vdyf-gzc
ప్రాజెక్టు పురోగతి
మార్చుకేవలం పది రోజులలోనే 1500 పేజీలకు పైగా బొమ్మలను చేర్చడం మన సభ్యుల ఉత్సాహాన్ని సూచిస్తున్నది. మన లక్ష్యం (3000 పేజీలు)లో యాభై శాతాన్ని పూర్తి చేయగలిగాం. ఇదే ఉత్సాహంతో కొనసాగిస్తే 10000 పేజీలలో బొమ్మలను చేర్చగలమనే ధీమా కలుగుతోంది. దీనికి కారకులైన 22 వాడుకరులకు ముఖ్యంగా కె.వెంకటరమణ, సాయి కిరణ్ నేతి, యర్రా రామారావు, మురళీకృష్ణ ముసునూరి, చదువరి, సిరిసిపల్లి వీర హైమవతి, మ్యాడం అభిలాష్, ధూర్జటి, రమేష్ బేతి గార్లకు ధన్యావాదాలు. మీరంతా ఇదే స్ఫూర్తితో మరింత ఉత్సాహంతో బొమ్మలను చేర్చడం కొనసాగించగలరని అభ్యర్థిస్తున్నాను. --స్వరలాసిక (చర్చ) 02:53, 11 జూలై 2021 (UTC)
- 10 వేలకూ మనకూ మధ్య ఒక్కటే అడ్డు - సరిపడా బొమ్మలు లేకపోవడం! ఆ వంతెన కట్టగలిగితే, మనం 10 వేల పండగ చేసుకోవచ్చు. __ చదువరి (చర్చ • రచనలు) 03:11, 11 జూలై 2021 (UTC)
నాకు ఎప్పటి నుండో "నా ఊరి ఫోటో వికీపీడియా లో" లాంటి కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేసుకొని ఇలాంటి shorturl.at/cefvB ఒక ఫారం ద్వారా ఫోటోలు సేకరించి వారి ద్వారానే ఫొటోలో చేర్చాలనే ఆలోచన ఉన్నది, అయితే ప్రస్తుత వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ (WPWP) లక్ష్యం ఉన్న ఫోటోలు జతచేయటం, ఒక వేళ 10 వేల ఫోటోలు చేర్చాలి అంటే ఇంకో మెగా పాజెక్టు చేయాలి.ఇలాంటి ఫారం ద్వారా వివరాల సేకరణ ఎందుకంటే మామూలు ప్రజలు నేరుగా వికీ కామన్స్ లో చేర్చటానికి,దానిని వ్యాసంలో చేర్చటానికి కొంత శిక్షణ అవసరం, సంప్రదించటానికి కూడా వీలుగా ఉంటుంది. వీలయితే ఈ ఫారం shorturl.at/cefvB లో వివరాలు చూసి, ఇంకా చేర్చ దగ్గ అంశాలు ఉంటే తెలియచేయగలరు, ఇంకా ప్రస్తుత WPWP లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టటం మీద మీ అభిప్రాయం తెలియచేయగలరు.--Kasyap (చర్చ) 05:03, 12 జూలై 2021 (UTC)
రెండు వర్గాలు ఖాళీ..!
మార్చుసంస్థలు, చరిత్ర వర్గాల్లోని పేజీలన్నిటిలో బొమ్మలు చేర్చడం అయిపోయింది -అవి ఖాళీ ఐపోయినై. త్వరలోనే శాస్త్ర సాంకేతికాల వర్గం కూడా వాటి సరసన చేరబోతోంది. అందరికీ చప్పట్లతో అభినందనలు.
ఉండేకొద్దీ బొమ్మల లభ్యత తగ్గిపోవడంతో పని మందగిస్తున్నట్టుగా నాకు తోస్తోంది. మన లక్ష్యం 10 వేలు అన్న సంగతీ, వలసినన్ని బొమ్మలు అందుబాటులో ఉంటే దాన్ని సాధించడం పెద్ద కష్టమేమీ కాదన్న సంగతీ మనకు అర్థమైంది. బొమ్మలు ఎక్కించడంలోను, ఇతర విధాలుగా అందుబాటు లోకి తేవడంలోనూ మనందరం కృషి చెయ్యాలి. నాకు చేతనైనంత కృషి నేనూ చేస్తాను. __ చదువరి (చర్చ • రచనలు) 05:13, 19 జూలై 2021 (UTC)
ఫొటోల కోసం మార్గాలు
మార్చుఫొటోల కోసం ఒక మార్గం వెతికాను. ఇది సూటి మార్గం కాదు గానీ ఒక మార్గం. కొంత సమయం పట్టినా ఫొటోలు దొఇకే అవకాశం ఉంది.
- https://petscan.wmflabs.org/?psid=19616619 అనే లింకుకు వెళ్ళండి.
- ఇక్కడ - ఇంగ్లీషు వికీ పేజీలో బొమ్మ ఉండి, సంబంధిత తెలుగు పేజీలో బొమ్మ లేని పేజీల జాబితాను చూడవచ్చు. (వీటిలో కొన్ని పేజీల్లో బొమ్మలు ఉండే అవకాశం ఉంది, గమనించాలి. వికీలో బొమ్మ కోసం వెతకడంలో కొన్ని ఇబ్బందులున్నై. అంచేతనే ఈ డేటా కొంత దోష భరితంగా ఉంటుంది)
- ఈ జాబితాలో సుమారు 4,500 పేజీలున్నై (ఈ పేజీల్లో కొన్ని మన ఫొటోల్లేని పేజీల వర్గాల్లో ఉంటాయి, కొన్ని ఉండవు). వీటిలో
- ఒక్కొక్క పేజీనే తెరిచి,
- దానిలో బొమ్మ లేదని నిర్థారించుకుని,
- సంబంధిత ఎన్వికీ పేజీని తెరిచి
- అక్కడి బొమ్మను తెచ్చి ఇక్కడ పెట్టాలి.
గమనిక: ఇంగ్లీషు పేజీలోని బొమ్మ కామన్సు లోనిది అయితే సింపులుగా దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్టు చేసెయ్యవచ్చు. కానీ అది కామన్సు లోది కాకుండా స్థానికంగా ఎక్కించినదైతే మాత్రం, మనం దాన్ని మన కంప్యూటర్లోకి దించుకుని, మళ్ళీ తెవికీ లోకి ఎక్కించుకోవాలి. (బొమ్మ కామన్సు లోదా స్థానికంగా ఉన్నదా అనేది తెలుసుకోవాలంటే, దానిపై నొక్కండి. బొమ్మ ఒక్కటే పేజీలో కంబిపిస్తుంది గదా దానికి కింద కుడివైపున "More details" అని కనిపిస్తుంది. దాని ఎడమవైపున ఉండే బొమ్మను బట్టి అది ఎక్కడిదో తెలుసుకొవచ్చు. పరిశీలించండి.)
ఈ 4500 పేజీలలో కావలసిన బొమ్మలను వెతికేందుకు మరొక మార్గం కూడా ఉంది: ఈ లింకుకు వెళ్తే అక్కడ ఈ జాబితా లోని పేజీలకు సరిపడే బొమ్మలు, వికీడేటాలో ఉన్న వాటిని, చూపిస్తుంది. మనం వాటి నుంచి మనకు అవసరమైన వాటిని ఎంచుకుని అయా పేజీల్లో చేర్చవచ్చు. ఈ బొమ్మలు గురికి బెత్తెడో బారెడో దూరంగా ఉండే అవకాశం లేకపోలేదు. సరైన వాటిని ఎంచుకుందాం. పరిశీలించండి. __ చదువరి (చర్చ • రచనలు) 06:07, 19 జూలై 2021 (UTC)
- ఒకే పనిని ఇద్దరు చేసే ప్రయత్నం చెయ్యడాన్ని నివారించేందుకు గాను, ఈ పనిని అందరం పంచుకుందాం. నేను మొదటి వంద వ్యాసాలపై పనిచేస్తాను.__ చదువరి (చర్చ • రచనలు) 06:12, 19 జూలై 2021 (UTC)
- 4,528 పేజీలతో ఈ జాబితా మొదలైంది. ప్రస్తుతం ఇందులో 4487 పేజీలున్నై. అంటే సుమారు రెండు గంటల్లో 41 పేజీల్లో బొమ్మలు చేరినట్లు. ఈ జాబితా లోని పేజీల్లో కొన్నిటిలో బొమ్మలు ఉండే అవకాశం ఉంది కాబట్టి మొత్తం 4500 పేజీల్లోనూ సగం, అంటే 2250, పేజీల్లో బొమ్మలు చేర్చే అవకాశం ఉందని భావించవచ్చు. ఈ లెక్కన ఈ జాబితాతో మనకు కొంత ఆహారం దొరికినట్లు గానే భావించవచ్చు. __ చదువరి (చర్చ • రచనలు) 07:46, 19 జూలై 2021 (UTC)
- జూలై 21 రాత్రి 8 గంటల సమయానికి (మధ్యాహ్నం 2:30 యూటీసీ) ఈ జాబితాలో ఉన్నవి 3940. దాదాపు 600 పేజీల్లో బొమ్మలు చేరినై. __ చదువరి (చర్చ • రచనలు) 14:56, 21 జూలై 2021 (UTC)
- జూలై 23 రాత్రి 8 గంటలకు ఈ జాబితాలో 3,354 పేజీలున్నై. అంటే ఇప్పటికి దాదాపు 1200 పేజీల పని చేసేసాం. గత రెండు రోజుల్లో 600 పేజీలయ్యాయి. __ చదువరి (చర్చ • రచనలు) 15:38, 23 జూలై 2021 (UTC)
- జూలై 21 రాత్రి 8 గంటల సమయానికి (మధ్యాహ్నం 2:30 యూటీసీ) ఈ జాబితాలో ఉన్నవి 3940. దాదాపు 600 పేజీల్లో బొమ్మలు చేరినై. __ చదువరి (చర్చ • రచనలు) 14:56, 21 జూలై 2021 (UTC)
- 4,528 పేజీలతో ఈ జాబితా మొదలైంది. ప్రస్తుతం ఇందులో 4487 పేజీలున్నై. అంటే సుమారు రెండు గంటల్లో 41 పేజీల్లో బొమ్మలు చేరినట్లు. ఈ జాబితా లోని పేజీల్లో కొన్నిటిలో బొమ్మలు ఉండే అవకాశం ఉంది కాబట్టి మొత్తం 4500 పేజీల్లోనూ సగం, అంటే 2250, పేజీల్లో బొమ్మలు చేర్చే అవకాశం ఉందని భావించవచ్చు. ఈ లెక్కన ఈ జాబితాతో మనకు కొంత ఆహారం దొరికినట్లు గానే భావించవచ్చు. __ చదువరి (చర్చ • రచనలు) 07:46, 19 జూలై 2021 (UTC)
20 రోజుల్లోనే లక్ష్యాన్ని దాటాం!
మార్చు- ముందు నిర్దేశించుకున్న 3000 పేజీలలో బొమ్మలు చేర్చడం అనే లక్ష్యాన్ని ఈ రోజు అంటే పోటీ ప్రారంభమైన 20 రోజుల్లోనే అధిగమించాం. అందరికీ అభినందనలు! మన తరువాతి లక్ష్యం 6000 పేజీలు.--స్వరలాసిక (చర్చ) 16:17, 20 జూలై 2021 (UTC)
వెయ్యి దాటిన వెంకటరమణ
మార్చు@K.Venkataramana గారు వెయ్యి పేజీల్లో ఫొటోల గీతను దాటేసారు. అభినందనలు రమణ గారు. నిన్నటి దాకా గాలీ వాడుకరి ఒకరు 925 తో ముందుండేవారు. అతన్ని దాటేసి ముందుకు వెళ్ళారు. మన దేశంలో రమణ గారే నంబర్ వన్. ఇక రేపో ఎల్లుడో ఆయన వరల్డ్ టాప్ టెన్ లోకి వెళ్ళడం కూడా ఖాయంగా కనిపిస్తోంది.
పోతే, తెలుగు వికీపీడియా కూడా ప్రస్తుతం వేగంగా ముందుకుపోతూ బెంగాలీ వాళ్లకు దగ్గరౌతోంది. మొన్న మొన్నటి దాకా వాళ్ళు మనకంటే దాదాపు 1200 ముందుండేవారు. ఇప్పుడది 600 కు తగ్గిపోయింది. ఈపాటికే మనం వరల్డ్ టాప్ టెన్ లోకి వచ్చేసినట్టే కనిపిస్తోంది (డేటా తాజాగా ఉన్నట్టు లేదు). రాకపోతే రేపో ఎల్లుడో వచ్చేస్తాం.
చూస్తూనే ఉండండి, ఈ చర్చ పేజీ. చేస్తూనే ఉండండి, పోటీ కృషి! __
చదువరి (చర్చ • రచనలు) 11:05, 22 జూలై 2021 (UTC)
- ధన్యవాదాలు చదువరి గారూ, మీరు పై విభాగంలో తెలిపిన జాబితా మూలంగా సులువుగా చిత్రాలను చేర్చే వీలు కలిగింది. మంది వనరులను అందించినందుకు ధన్యవాదాలు.➠ కె.వెంకటరమణ⇒చర్చ 12:15, 22 జూలై 2021 (UTC)
- ఔను, @K.Venkataramana గారూ, ఆ జాబితాఅ వచ్చాక నా పని కూడా పుంజుకుంది.
- పోతే, బెంగాలీ వాళ్ళ విషయంలో మనం వెనకబడినది కేవలం 200 పేజీలే. ఎందుకంటే, నిన్న నేను పోల్చి చూసినది మొత్తం దిద్దుబాట్లను. కానీ పోల్చాల్సినది ఫొటోలు చేర్చిన పేజీలను. పేజీల సంఖ్యకు దిద్దుబాట్ల సంఖ్యకూ, ఎంచేతనో గానీ, బెంగాలీలో చాలా తేడా ఉంది. మనకు ఆ తేడా చాలా కొద్దిగానే ఉంది.
- ఇవ్వాళ పొద్దుటికి ఫొటోలు చేర్చిన పేజీల సంఖ్య విషాయంలో మనకు బెంగాలీ వాళ్ళకూ మధ్య తేడా 70 కి పడిపోయింది. ఇక ఇవ్వాళ మనం వాళ్లను అధిగమిస్తామనుకుంటాను. __ చదువరి (చర్చ • రచనలు) 03:56, 23 జూలై 2021 (UTC)
- ధన్యవాదాలు చదువరి గారూ, మీరు పై విభాగంలో తెలిపిన జాబితా మూలంగా సులువుగా చిత్రాలను చేర్చే వీలు కలిగింది. మంది వనరులను అందించినందుకు ధన్యవాదాలు.➠ కె.వెంకటరమణ⇒చర్చ 12:15, 22 జూలై 2021 (UTC)
- పోతే, తెలుగు వికీపీడియాలో ఇప్పటి వరకూ చేర్చిన ఫొటోలు చేర్చిన పేజీల సంఖ్య: 3830. చేసిన దిద్దుబాట్ల సంఖ్య: 3913. వరల్డ్ టాప్ టెన్ లో 7 వ స్థానంలో ఉన్న క్రొయేషియన్ వికీపీడియా చేసిన దిద్దుబాట్ల సంఖ్య: 3861 8 వ స్థానంలో ఉన్న స్వాహిళి చేసినది: 3389 అంటే మనం ఈపాటికే 7 వ స్థానంలో ఉండి ఉండాల్సినది. కానీ లేం. ఎందుకంటే..
- మనం ఫొటో చేర్చే ప్రతీ దిద్దుబాటు లోనూ #WPWPTE #WPWP అనే రెండు ట్యాగులనూ తప్పనిసరిగా వాడాలి. మనం చేసిన కొన్న్ని దిద్దుబాట్లకు #WPWPTE అనే ట్యాగు ఒక్కటే పెట్టాం, రెండోది పెట్టలేదు. దాదాపు 600 పైచిలుకు దిద్దుబాట్ల సంఖ్యను ఈ విధంగా కోల్పోయాం. ఈ కారణం వల్లనే తెలుగు వికీపీడియా వరల్డ్ టాప్ టెన్ లోకి ఇంకా వెళ్ళలేదు. ఇప్పుడు మించిపోయిందేమీ లేదు. ఇంకా టైముంది. ఇప్పటి వేగాన్ని కొనసాగిస్తే ఇప్పటికీ టాప్ టెన్ లోకే కాదు టాప్ ఫోర్ లోకి వెళ్ళే అవకాశం కూడా మనకు ఉంది. రండి, దూసుకుపోదాం.__ చదువరి (చర్చ • రచనలు) 04:09, 23 జూలై 2021 (UTC)
- @Chaduvari గారు మీ దూర ద్రుష్టి, తెలుగు వికీపై మీకున్న శ్రద్ధకు నా అభినందనలు. ఈ పోటీలో మన తెవికీని ప్రపంచ స్థాయిలో ముందుండేందుకు ప్రోత్సహిస్తున్న మీకు ఇవే నా జోహార్లు.~~~~ Nskjnv (చర్చ) 10:29, 23 జూలై 2021 (UTC)
@K.Venkataramana గారూ అందుకోండి అభినందనలు!--స్వరలాసిక (చర్చ) 02:10, 23 జూలై 2021 (UTC)
- వెంకటరమణ గారు వరల్డ్ టాప్ టెన్ లోకి వెళ్ళి.తెలుగు వికీపీడియాకు సముచిత గౌరవం తేగలరని ఆశిస్తూ, వార్కి అభినందనలు తెలియజేస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 04:20, 23 జూలై 2021 (UTC)
@K.Venkataramana గారికి అభినందనలు, మీ కృషి నాలో స్ఫూర్తిని నింపుతుంది.Nskjnv (చర్చ) 10:27, 23 జూలై 2021 (UTC)
బొమ్మలు కావలసిన వ్యక్తుల వ్యాసాలు - 150/200 ఏళ్ళ పూర్వము జన్మించిన వారి చిత్రపటాలు ఉండే అవకాశం లేదు
మార్చుబొమ్మలు కావలసిన వ్యక్తుల వ్యాసాలు జాబితాలో, చాలా మంది వ్యక్తులు 150/200 ఏళ్ళ పూర్వము జన్మించిన వారు కావటము వలన వారి చిత్రపటాలు ఉండే అవకాశం లేదు కావున వాటిని ఏ విధము గా చేర్చాలో పాలుపోవడం లేదు?— ఇక్కడి సంతకం లేని వ్యాఖ్య రాసినవారు: Sanivella (చర్చ • రచనలు)
- వాడుకరి:Sanivella గారూ, కొంతమందివి చిత్రకారులు గీసిన చిత్రాలు దొరకొచ్చు. చాలామంది విషయంలో ఏమీ దొరకవు. ఇక చేసేదేమీ లేదండి, వదిలెయ్యడమే. __చదువరి (చర్చ • రచనలు) 03:50, 23 జూలై 2021 (UTC)
నేను ఫొటోలు ఎక్కిస్తాను, మీరు పేజీల్లో చేర్చండి
మార్చుhttps://petscan.wmflabs.org/?psid=19616619 జాబితాలో ఉన్న సినిమా పేజీలల్లో పెట్టాల్సిన ఫొటోలను ఇంగ్లీషు నుంది తెచ్చి ఇక్కడ ఎక్కిస్తాను. మీరేవరైనా వాటిని పేజీల్లో చేర్చండి. ఆ విధంగానైతే మనం మరికొంత వేగంగా పని చెయ్యవచ్చని అనుకుంటున్నాను. పరిశీలించండి. ఇలా చెయ్యాలి:
- https://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95:%E0%B0%9A%E0%B0%BF%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BE?type=upload&user=Chaduvari&page=&wpdate=&tagfilter=&subtype= అనే పేజీకి వెళ్ళండి. అక్కడ నేను ఎక్కించిన దస్త్రాలన్నీ కనిపిస్తాయి. వాటిలో ఒక్కొక్క ఎంట్రీ కింది విధంగా కనిపిస్తుంది
- 09:54, 2021 జూలై 23 Chaduvari చర్చ రచనలు నిరోధించు, దస్త్రం:Kadhal Azhivathillai.jpg ను ఎక్కించారు ({{Non-free use rationale poster | Article = కుర్రాడొచ్చాడు | Use = Infobox | Media =film | Source = https://www.facebook.com/78rajkamalkk/posts/4026009034138335 }} == Licensing == {{non-free poster|image has rationale=yes}})
- ఇవ్వాళ్టి నుండి ఎక్కించిన ఫైళ్ళనే ఎంచుకోండి. నిన్నటి వరకు ఎక్కించినవాటిని నేను పేజీల్లో చేర్చేసాను
- ప్రతి ఎంట్రీ లోను ఫైలు పేరు (Kadhal Azhivathillai.jpg) కనిపిస్తుంది. దాన్ని కాపీ చేసుకోండి.
- ప్రతి ఎంట్రీ లోను అది ఏ పేజీలో పెట్టాలో చూపిస్తుంది (Article = కుర్రాడొచ్చాడు)
- ఆ పేజీని (కుర్రాడొచ్చాడు) తెరిచి, అందులో ఉన్న సమాచారపెట్టెలో, image అనే ఫీల్డును చేర్చి ఆ ఫీల్డులో పై ఫైలు పేరును (Kadhal Azhivathillai.jpg) పేస్టు చెయ్యండి. పేజీని ప్రచురించే ముందు దిద్దుబాటు సారాంశంలో #WPWPTE #WPWP అనే రెండు ట్యాగులనూ పెట్టడం మరచిపోకండి.
అంతే!__ చదువరి (చర్చ • రచనలు) 04:33, 23 జూలై 2021 (UTC)
- ఆలోచన బాగుంది కానీ మీరు చేసే పని గుర్తింపు మాకు వచేస్తుందిగా, మీకు అభ్యంతరం లేకపోతె నేను చేర్చటానికి సిద్ధం. Nskjnv (చర్చ) 06:35, 23 జూలై 2021 (UTC)
- @Nskjnv గారూ, నేను చేసేది బొమ్మ ఎక్కించడం వరకే. చేర్చే పని చేసేది మీరేగదా.. గుర్తింపు మీకు రావడం సహజమే. కానివ్వండి సార్, చేర్చెయ్యండి. ఇవ్వాళ మనిద్దరం కలిసి రెండొందలు చేద్దాం.__ చదువరి (చర్చ • రచనలు) 06:44, 23 జూలై 2021 (UTC)
- బహు బాగు, ఇక నేను పని మొదలు పెడుతున్నా. మీ ప్రోత్సాహానికి , సహకారానికి ధన్యవాదాలు. Nskjnv (చర్చ) 06:46, 23 జూలై 2021 (UTC)
- @Nskjnv గారూ, ఆ జాబితాలో బహుశా ఇంకో నూట యాభై దాకా సినిమా పేజీలు ఉంటాయనుకుంటాను. ఇవ్వాళ వాటి పని పడదాం. __ చదువరి (చర్చ • రచనలు) 02:29, 24 జూలై 2021 (UTC)
- @Chaduvari గారు, సరేనండి .. ఓ పట్టు పట్టెద్దాం . Nskjnv (చర్చ) 03:22, 24 జూలై 2021 (UTC)
- @Nskjnv గారూ, ఆ జాబితాలో బహుశా ఇంకో నూట యాభై దాకా సినిమా పేజీలు ఉంటాయనుకుంటాను. ఇవ్వాళ వాటి పని పడదాం. __ చదువరి (చర్చ • రచనలు) 02:29, 24 జూలై 2021 (UTC)
- బహు బాగు, ఇక నేను పని మొదలు పెడుతున్నా. మీ ప్రోత్సాహానికి , సహకారానికి ధన్యవాదాలు. Nskjnv (చర్చ) 06:46, 23 జూలై 2021 (UTC)
- @Nskjnv గారూ, నేను చేసేది బొమ్మ ఎక్కించడం వరకే. చేర్చే పని చేసేది మీరేగదా.. గుర్తింపు మీకు రావడం సహజమే. కానివ్వండి సార్, చేర్చెయ్యండి. ఇవ్వాళ మనిద్దరం కలిసి రెండొందలు చేద్దాం.__ చదువరి (చర్చ • రచనలు) 06:44, 23 జూలై 2021 (UTC)
ఇరవై నాలుగు గంటల మారథాన్
మార్చుతెలుగు వికీపీడియాలో ఎక్కువగా బొమ్మలను చేర్చి బెంగాలీ వికీపీడియాను అధిగమించి టాప్ టెన్‌లో స్థానం పదిల పరచుకునే దిశగా ఒక మారథాన్ నిర్వహించుకుంటే ఎలా ఉంటుంది? శనివారం 24-07-2021 సాయంత్రం 6 గంటలనుండి ఆదివారం 25-07-2021 సాయంత్రం 6 గంటల వరకూ ఈ మారథాన్‌ను నిర్వహించుకుందాం. #WPWPTE #WPWP అనే రెండు ట్యాగులనూ సవరణ సారాంశంలో మరచిపోకుండా పెడదాం.-స్వరలాసిక (చర్చ) 06:21, 23 జూలై 2021 (UTC)
- ఈ ఆలోచన పట్ల నా సుముఖత తెలియజేస్తున్నాను. ~~~~ Nskjnv (చర్చ) 06:32, 23 జూలై 2021 (UTC)
- నేనూ రెడీయే.__ చదువరి (చర్చ • రచనలు) 06:44, 23 జూలై 2021 (UTC)
- నేనూ సిద్ధమే యర్రా రామారావు (చర్చ) 06:04, 24 జూలై 2021 (UTC)
- మారథాన్ మొదలై పోయిందిగా..! నేను రావడం ఆలస్యమైంది. ఇక మొదలెడతాను.__చదువరి (చర్చ • రచనలు) 14:04, 24 జూలై 2021 (UTC)
- నేనూ సిద్ధమే మొదలెడుతున్నానుAbhi (చర్చ) 14:35, 24 జూలై 2021 (UTC)
టాప్ టెన్ లోకి అడుగుపెట్టాం
మార్చునిన్న రెండు పనులు సాధించాం.
- ప్రపంచ టాప్ టెన్ వికీపీడియాల్లో మనం చేరాం. ఇప్పుడు పదో స్థానంలో ఉన్నాం. ఒక్క రోజులో బహుశా తొమ్మిదో స్థానానికి చేరతాం.
- ఫొటోలు చేర్చిన పేజీల సంఖ్యలో బెంగాలీ వాళ్ళను దాటేసాం. ఇప్పుడు వాళ్ళ సంఖ్య 3963 కాగా మనది 4171. మొత్త్తం దిద్దుబాట్ల సంఖ్యలో మాత్రం కొద్.. ద్దిగా - 40 దిద్దుబాట్లు- వెనకబడి ఉన్నాం. ఇవ్వాళ దాన్నీ అధిగమిస్తాం. చదువరి (చర్చ • రచనలు) 02:26, 24 జూలై 2021 (UTC)
- చప్పట్లు, ప్రాజెక్టులో పనిచేసే అందరికి అభినందనలు యర్రా రామారావు (చర్చ) 06:08, 24 జూలై 2021 (UTC)
- దాటేసాం.. ఇప్పుడు మనం బెంగాలీ వాళ్లను చూడాలంటే, వెనక్కి తిరక్క తప్పదు. __ చదువరి (చర్చ • రచనలు) 07:50, 24 జూలై 2021 (UTC)
- ప్రపంచ టాప్ టెన్‌లో స్వాహిలీ వాణ్ణి వెనక్కి నెట్టేసి, తొమ్మిదో స్థానం లోకి వెళ్ళాం. ఎనిమిదిలో క్రొయేషియా వాడనుకుంటాను, ఉన్నాడు. రెండ్రోజుల్లో వాడికీ ఉంది. __ చదువరి (చర్చ • రచనలు) 07:53, 24 జూలై 2021 (UTC)
పటాలు లేని గ్రామవ్యాసాలు
మార్చుచదువరి గారూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా గ్రామ వ్యాసాలలో చాలా పేజీలకు పటాలు లేవు. అందులో భౌగోళికాంశాలతో పాటు మ్యాపును చేర్చితే ఈ పోటీకి అర్హత పొందుతుందా?
- వెంకట రమణ గారూ, పొందుతుంద్ండి. ఈ విషయంపై స్వరలాసిక గారు వేరే చోట స్పష్టత ఇచ్చారు. మ్యాపులను కూడా ఈ పోటీలో పరిగణిస్తారంట. కాబట్టి చేర్చవచ్చు.
- చాలా గ్రామాల పేజీల్లో {{Infobox settlement}} అనే మూస కాకుండా, {{Infobox settlement/sandbox}} అనే మూసను పెట్టారు. దాన్ని మార్చాల్సి ఉంటుంది. నిర్దేశాంకా లివ్వకుండా అక్షాంశ, రేఖాంశాలు ఏ దిక్కున ఉంటాయో ఇచ్చారు. అదేమో దోషం చూపిస్తోంది. నిర్దేశాంకాలను డిగ్రీ, నిమిషం, సెకండ్లుగా విడగొట్టకుండా {{Coord}} అనే మూస ద్వారా పెడితే బాగుంటుంది. ఇలాంటివే మరికొన్ని పనులున్నై. వీటన్నిటి గురించి తెలియజేస్తూ, అవి ఎలా చెయ్యాలో తెలియజేస్తూ కొత్తవారికి పనికొచ్చేలా ఒక డాక్యుమెంటు చేసే ఆలోచనలో ఉన్నాను. బహుశా సోమవారం నాడు చేస్తాను. మీరు, రామారావు గారూ కూడా ఆ పేజీలను పరిశీలించి ఇంకా ఏమైనా చేర్చాల్సిన పనులు ఉంటే, అందులో చేరిస్తే అందరికీ ప్రయోజనం కలుగుతుంది. __చదువరి (చర్చ • రచనలు) 03:32, 24 జూలై 2021 (UTC)
ఇక, గ్రామాల పేజీల్లో
మార్చుhttps://petscan.wmflabs.org/?psid=19616619 పేజీలోని 4500 పేజీల్లో 1500 పైచిలుకు పేజీలు పూర్తయ్యాయి. మిగతావి కూడా చేద్దాం.కాకపోతే, బొమ్మలను దిగుమతి చేసుకుని మళ్ళీ ఇక్కడ ఎక్కించి ఆపే పేజిలో చేర్చడం అనేది కాస్త సమయం తీసుకుంటోంది. మన పనిని వేగవంతం చేసేందుకు, ఇంతే ప్రాముఖ్యత ఉన్న గ్రామాల పేజీల్లో మ్యాపులను చేరుద్దామని నా ఉద్దేశం. దీని వలన ఆయా పేజీలు మెరుగుపడడమే కాకుండా, మనం పోటీలో ముందుకు పోతాం. పైగా ఈ పని కూడా తొందరగా చెయ్యవచ్చని నేను గమనించాను. ముందుగా ఈ పని సులువుగా ఎలా చెయ్యవచ్చంటే..
- మ్యాపు లేని గ్రామం పేజీని ఎంచుకోండి. దానికోసం కింది లింకులను చూడండి. ఇవి ఆయా జిల్లాల్లోని గ్రామాల్లో బొమ్మలు లేని గ్రామాల పేజీలను మాత్రమే చూపిస్తాయి:
- వీటిలో ఒక పేజీని తీసుకుని దాని అక్షాంశా రేఖాంశాలకోసం maps.google.com లో వెతకండి. అది మ్యాపు చూపిస్తుంది కదా.. ఆ ఊరి మ్యాపు పైన ఎక్కడో ఒకచోట క్లిక్కు చెయ్యండి. maps ఆ బిందువు అక్షాంశ రేఖాంశాలను చూపిస్తుంది. ఉదాహరణకు.. 16.116033, 79.752789
- పై పేజీని "మూలపాఠ్యాన్ని సవరించు" మోడ్‌లో దిద్దుబాటు చెయ్యండి
- ఆ పేజీలో అన్నిటికంటే పైన {{Infobox Settlement/sandbox| అనేది కనిపిస్తుంది. దాని కింద ఉన్న పరామితుల్లో
- | latd = అనే చోట 16.116033
- | longd = అనే చోట 79.752789 అని చేర్చండి
- ఈ పరామితుల్లో |pushpin_map = ఆంధ్ర ప్రదేశ్ అని గానీ |pushpin_map = India AMdhra Pradesh అనిగానీ ఉండాలి లేదంటే అది చేర్చండి.
- అంతే, పని అయిపోయినట్టే.
నేను ఓ ఐదారు పేజీల్లో చేసి ఇది రాస్తున్నాను. చేసెయొచ్చు, తేలికే. ఒక్కోదానికి రెండు మూడు నిమిషాలకు మించి పట్టదనుకుంటాను. పరిశీలించండి. నేను గుంటూరు జిల్లా చేస్తున్నాను. మీరు మిగతా వాటిని ఎంచుకోండి. ఒక్క సంగతి.. అసలు సమాచారపెట్టె లేనివాటిని ప్రస్తుతానికి వదిలేద్దాం వాటిని తరువాత చేద్దాం. వాటిని AWB తో పెట్టవచ్చని అనుకుంటున్నాను. వాడుకరి:K.Venkataramana, వాడుకరి:Nskjnv, వాడుకరి:యర్రా రామారావు, వాడుకరి:మురళీకృష్ణ ముసునూరి, వాడుకరి:MYADAM ABHILASH గార్లు ప్రస్తుత మారథాన్‌లో చేస్తున్నట్లున్నారు, పరిశిలించండి.__ చదువరి (చర్చ • రచనలు) 16:46, 24 జూలై 2021 (UTC)
- సమర భేరి మోగింది, తెవికీ మారథాన్ గ్రామ వ్యూహం ఆరంభం. :) Nskjnv (చర్చ) 16:57, 24 జూలై 2021 (UTC)
- @Nskjnv గారూ, :) ఇది జయప్రదమైతే, ముందుకు దూసుకెళ్డమే నండి. దాదాఅపు 9000 పేజీలున్నాయి బొమ్మ చేర్చాల్సిన గ్రామాలు! __ చదువరి (చర్చ • రచనలు) 17:06, 24 జూలై 2021 (UTC)
- @చదువరి గారు , అయితే ఈ విషయంలో ఓ స్పష్టత కావాలి, మ్యాపు చిత్రం చేర్చడంలో ఇంకా అక్షంశాలతో జోడించడం రెండు పోటీలో పరిగినస్తార లేదా అని. ఇంతకూ ముందు స్వరలాసిక గారు తెలిపిన విషయంలో మ్యాపు కూడా చిత్రం అయినపుడు చేర్చడం గురించే మాట్లాడటం జరిగింది. Nskjnv (చర్చ) 17:11, 24 జూలై 2021 (UTC)
- @స్వరలాసిక గారూ, దీని గురించి మీరే చెప్పాలి. __ చదువరి (చర్చ • రచనలు) 05:35, 25 జూలై 2021 (UTC)
- @చదువరి గారు , అయితే ఈ విషయంలో ఓ స్పష్టత కావాలి, మ్యాపు చిత్రం చేర్చడంలో ఇంకా అక్షంశాలతో జోడించడం రెండు పోటీలో పరిగినస్తార లేదా అని. ఇంతకూ ముందు స్వరలాసిక గారు తెలిపిన విషయంలో మ్యాపు కూడా చిత్రం అయినపుడు చేర్చడం గురించే మాట్లాడటం జరిగింది. Nskjnv (చర్చ) 17:11, 24 జూలై 2021 (UTC)
- గమనిస్తున్నాను.దీనికికన్నా ముందు నేను ఇక్కుర్రు గ్రామంలో పెట్టాను.అది ఒకె నా యర్రా రామారావు (చర్చ) 17:07, 24 జూలై 2021 (UTC)
- మీరు ఏవిధంగా మ్యాపు చేర్చినా అది పోటీకి పరిగణించబడుతుంది. --స్వరలాసిక (చర్చ) 06:07, 25 జూలై 2021 (UTC)
- @Nskjnv గారూ, :) ఇది జయప్రదమైతే, ముందుకు దూసుకెళ్డమే నండి. దాదాఅపు 9000 పేజీలున్నాయి బొమ్మ చేర్చాల్సిన గ్రామాలు! __ చదువరి (చర్చ • రచనలు) 17:06, 24 జూలై 2021 (UTC)
ఎవరెవరు ఏ జిల్లాలు
మార్చుఎవరెవరు ఏయే జిల్లాల్లో చిత్రాలు చేరుస్తారో ఇక్కడ రాస్తే ఇతరులకి ఇబ్బందిలేకుండా పోటీ సాగుతుందని భావనతో, అలాగే @వాడుకరి:యర్రా రామారావు గారు సూచించినట్లు ఏయే జిల్లాలు పూర్తయ్యాయి అని లెక్క ఉంచుకోవడానికి. కె.వెంకటరమణ , చదువరి, మురళీకృష్ణ ముసునూరి, MYADAM ABHILASH గార్లు కూడా తాము చేపట్టిన జిల్లాలు ఇక్కడ రాస్తే మనం వేరొకరరీ పనికి ఆటంకం కలిగించకుండా ఉండొచ్చని నా అభిప్రాయం.Nskjnv (చర్చ) 05:17, 5 ఆగస్టు 2021 (UTC)
- Nskjnv
- నేను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి వెలువడ్డ మంచిర్యాల , నిర్మల్ జిల్లా, కొమరంభీమ్ జిల్లాలలో ప్రస్తుతం మ్యాపులను చేరుస్తున్నాను.Nskjnv (చర్చ) 13:25, 26 జూలై 2021 (UTC)
- కొత్తగా చేపట్టిన జిల్లాలు : భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, వరంగల్ గ్రామీణ, కడప , హన్మకొండ, తూర్పు గోదావరి(చాలా వరకు ముందే చేసి ఉన్నాయి), అనంతపురం(ప్రస్తుతం) Nskjnv (చర్చ) 05:17, 5 ఆగస్టు 2021 (UTC)
- యర్రా రామారావు
- నేను విజయనగరం జిల్లా చేపట్టాను. వెంకటరమణ గారు శ్రీకాకుళం జిల్లా చేపట్టినట్లు తెలుస్తుంది. యర్రా రామారావు (చర్చ) 15:05, 26 జూలై 2021 (UTC)
- నేను విజయనగరం జిల్లా పూర్తి చేసాను.సందిగ్ధంగా ఉన్న 54 గ్రామాలు వదిలేసాను.కృష్ణా జిల్లా చేపడుతున్నాను. యర్రా రామారావు (చర్చ) 15:59, 7 ఆగస్టు 2021 (UTC)
- కృష్ణా జిల్లాలోని అవకాశం లేని గ్రామాలు తప్ప అన్ని మండలాలు పూర్తి చేసాను. యర్రా రామారావు (చర్చ) 04:55, 19 ఆగస్టు 2021 (UTC)
- నేను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా లో అవకాశం లేని గ్రామాలు తప్ప అన్ని మండలాలు పూర్తి చేసాను.--యర్రా రామారావు (చర్చ) 14:01, 23 ఆగస్టు 2021 (UTC)
- నేను నిజామాబాదు జిల్లా తీసుకున్నాను. యర్రా రామారావు (చర్చ) 10:08, 26 ఆగస్టు 2021 (UTC)
- నిజామాబాదు జిల్లా పూర్తైంది. యర్రా రామారావు (చర్చ) 17:31, 28 ఆగస్టు 2021 (UTC)
- నేను నిజామాబాదు జిల్లా తీసుకున్నాను. యర్రా రామారావు (చర్చ) 10:08, 26 ఆగస్టు 2021 (UTC)
- MYADAM ABHILASH
- నేను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండి వెలువడ్డ నారాయణపేట,గద్వాల,వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలలో మ్యాపులు చేరుస్తున్నాను.Abhi (చర్చ) 06:57, 27 జూలై 2021 (UTC)
- చదువరి
- నేను గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు చేసాను. ప్రస్తుతం విశాఖపట్నం జిల్లా చేస్తున్నాను. __చదువరి (చర్చ • రచనలు) 05:21, 5 ఆగస్టు 2021 (UTC)
- చిత్తూరు జిల్లా చేస్తున్నాను.__ చదువరి (చర్చ • రచనలు) 07:34, 11 ఆగస్టు 2021 (UTC)
- నల్గొండ జిల్లా చేస్తున్నాను.__ చదువరి (చర్చ • రచనలు) 04:41, 19 ఆగస్టు 2021 (UTC)
- నెల్లూరు జిల్లా చేస్తున్నాను __చదువరి (చర్చ • రచనలు) 00:59, 24 ఆగస్టు 2021 (UTC)
- కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలు చేస్తాను. కరీంనగర్ తో మొదలెట్టి ఈ వరస లోనే చేస్తాను. నేను చేసే జిల్లా కాకుండా తరువాతి వాటిని ఎవరైనా చెయ్యదలిస్తే, చేసెయ్యండి. __చదువరి (చర్చ • రచనలు) 01:33, 26 ఆగస్టు 2021 (UTC)
- కామారెడ్డి జిల్లా చేస్తున్నాను. __చదువరి (చర్చ • రచనలు) 10:08, 27 ఆగస్టు 2021 (UTC)
గ్రామాల రేఖాంశం - అక్షాంశం వివరాలు
మార్చుతెలుగు రాష్ట్రాలలో గల మొత్తం 16069 పిన్ నెంబర్ లను గూగుల్ జియో లొకేషన్ API సహాయంతో రేఖాంశం మరియు అక్షాంశం వివరాలు ఇక్కడ అందుబాటులో ఉంచాను , ఇది గూగుల్ మ్యాప్స్ కు వెళ్లి రేఖాంశం మరియు అక్షాంశం కాపీ చేసే శ్రమను తగిస్తుంది,ప్రాజెక్టు సభ్యులకు ఉపయోగ పడవచ్చు. Kasyap (చర్చ) 09:45, 29 జూలై 2021 (UTC)
- కశ్యప్ గారూ, బాగుందండి. __చదువరి (చర్చ • రచనలు) 11:05, 29 జూలై 2021 (UTC)
వెంకటరమణ గారి పేరు టాప్ టెన్‌లో ఎందుకు కనబడ్డం లేదు?
మార్చు@స్వరలాసిక గారూ, తెవికీలో #WPWPTE దిద్దుబాట్ల సంఖ్య కంటే #WPWP దిద్దుబాట్ల సంఖ్య 600 పైచిలుకు తక్కువగా ఉంది. ఈ తేడా ప్రధానంగా @K.Venkataramana గారి దిద్దుబాట్లలో తేడా వలన అని గమనించి తో చెప్పాను. మీరు నిర్వాహకులతో మాట్లాడారు కూడాను. ఇప్పుడు వెంకటరమణ గారి దిద్దుబాట్ల సంఖ్యలో తేడా ఇలా చూపిస్తోంది. #WPWPTE దిద్దుబాట్ల సంఖ్య: 1378 కాగా, #WPWP దిద్దుబాట్ల సంఖ్య: 709 అని చూపిస్తోంది. వెంకటరమణ గారు మొదట్లో #WPWP ట్యాగు పెట్టలేదేమోనని భావించాను. మీరు ఈ విషయం గురించి పోటీ నిర్వాహకులను అడిగితే ఏం పర్లేదని వాళ్ళు మీకు చెప్పారు. కానీ లోపం ఇక్కడ లేదు..
నేను వెంకటరమణ గారి దిద్దుబాట్లు పరిశీలించాను.., ఆయన మొదటి నుండీ, ప్రతి దిద్దుబాటు లోనూ రెండూ ట్యాగులనూ చేర్చారు. కాబట్టి ఆయన దిద్దుబాట్లలో #WPWPTE, #WPWP ట్యాగుల సంఖ్య రెండూ 1378 అనే చూపించాలి. కానీ #WPWP ట్యాగు 600 పైచిలుకు తక్కువ చూపిస్తోంది. సరిగ్గా చూపించి ఉంటే ఆయన ఈ క్షణాన వరల్డ్ టాప్ టెన్ లో 7 వ స్థానంలో ఉండాల్సింది. ఈ తేడా కారణంగా ఆయన పేరు వరల్డ్ టాప్ టెన్ లో కనబడ్డం లేదు.
ఎక్కడో తేడా జరిగింది. ఈ విషయంపై మరొక్కమారు నిర్వాహకులను సంప్రదించి తేడాను సరి చేయించవలసినది. __ చదువరి (చర్చ • రచనలు) 05:30, 25 జూలై 2021 (UTC)
- ఈ కింది రెండు లింకులను పరిశీలిస్తే వెంకటరమణ గారి దిద్దుబాట్ల సంఖ్యలో అది తేడా చూపించడాన్ని మనం గమనించవచ్చు.
- చదువరి (చర్చ • రచనలు) 05:32, 25 జూలై 2021 (UTC)
- @Chaduvari గారు అవునండి నేను కూడా మొదటినుండి వెంకటరమణ గారి దిద్దుబాట్లు గమనిస్తున్నాను, అయన అన్ని దిద్దుబాట్లట్లో రెండు ట్యాగులు వాడారు. Nskjnv (చర్చ) 05:46, 25 జూలై 2021 (UTC)
- K.Venkataramana గారు టాప్ టెన్‌లో 7వ స్థానంలో ఉన్నట్లు పోటీ నిర్వాహకులు అంగీకరించారు. వారి సమాధానం ఈ విధంగా ఉంది.
- @Chaduvari గారు అవునండి నేను కూడా మొదటినుండి వెంకటరమణ గారి దిద్దుబాట్లు గమనిస్తున్నాను, అయన అన్ని దిద్దుబాట్లట్లో రెండు ట్యాగులు వాడారు. Nskjnv (చర్చ) 05:46, 25 జూలై 2021 (UTC)
"I want to confirm that User:Venkataramana is in the 7th position at the international level with a total page of 1424 pages improved with photos.
Thanks for the heads up and please do keep me updated after the campaign in 31 August 2021 so that we could review the contributions of this user correctly."
కానీ గణాంకాలలో ఇంకా కనిపించడం లేదు.--స్వరలాసిక (చర్చ) 12:19, 25 జూలై 2021 (UTC)
- @స్వరలాసిక గారూ, పోటీ నిర్వాహకులతో మాట్లాడి, ఈ వ్యవహారాన్ని కొంతవరకు సరిచెయ్యడంలో కృషి చేసినందుకు ధన్యవాదాలు.
- విషయం వాళ్ళకు అర్థమైంది, సమస్య-650 (మనం చేసిన 650 పైచిలుకు దిద్దుబాట్లను అది చూపించలేకపోతోంది కాబట్టి దీన్ని సమస్య 650 అందాం) కు కారణమేంటో కూడా వాళ్ళకు తెలిసింది, కానీ మనకు చెప్పడం లేదు. పోటీ ముగిసాక, ఈ సంగతిని మళ్ళీ గుర్తు చెయ్యమని అడుగుతున్నారంటే దాని అర్థం బహుశా ఈ లోగా ఈ సమస్యను సరిచెయ్యలేరనుకుంటాను. రమణ గారు ఏడో స్థనంలో ఉన్నట్టు చెప్పడం మనకు కొంత ఊరట. కానీ ఆయన ఆ స్థానంలో ఉన్నట్టు ప్రపంచానికి తెలీడం లేదు, అది లోటు.
- మరొక్క సంగతి ఏంటంటే.. వాస్తవానికి ప్రపంచ ర్యాంకుల్లో తెవికీ ఇప్పుడు 5 వ స్థానంలో ఉంది. కానీ సమస్య-650 వలన మనం ఏడవ స్థానంలో ఉన్నట్టు చూపిస్తోంది.
- @K.Venkataramana గారూ, ప్రపంచ స్థాయిలో నిలబడినందుకు, తెవికీని నిలబెట్టడంలో ముందుండి నడిపించినందుకూ మీకు అభినందనలు. __ చదువరి (చర్చ • రచనలు) 02:26, 26 జూలై 2021 (UTC)
బెంగాలీలను వెనక్కి నెట్టేసాం
మార్చుఅందరికీ ఆభినందనలు! --స్వరలాసిక (చర్చ) 16:02, 25 జూలై 2021 (UTC)
గ్రామాల పేజీల్లో ఎవరెవరు ఎన్నేసి పేజీల్లో బొమ్మ చేర్చారంటే..
మార్చుఇవ్వాళ మధ్యాహ్నం 12:45 కు వివిధ వాడుకరులు ఎన్నేసి గ్రామాల పేజీల్లో బొమ్మలు చేర్చారో చూపే పట్టిక ఇది. పరిశీలించండి.
వాడుకరి | బొమ్మ చేర్చిన
గ్రామాల పేజీల సంఖ్య |
యర్రా రామారావు | 484 |
Chaduvari | 427 |
MYADAM ABHILASH | 365 |
Nskjnv | 306 |
K.Venkataramana | 252 |
Ramesh bethi | 70 |
స్వరలాసిక | 19 |
IM3847 | 7 |
Sirisipalli Veera Hymavathi | 5 |
UREMANOJ | 5 |
ప్రభాకర్ గౌడ్ నోముల | 3 |
Kasyap | 3 |
మురళీకృష్ణ ముసునూరి | 3 |
Pranayraj1985 | 1 |
__ చదువరి (చర్చ • రచనలు) 07:21, 26 జూలై 2021 (UTC)
- ఈ డేటాను తెచ్చిన క్వెరీని ఇక్కడ చూడొచ్చు.__ చదువరి (చర్చ • రచనలు) 07:23, 26 జూలై 2021 (UTC)
Nskjnv.. కూడా ప్రపంచ టాప్ టెన్ లో
మార్చు@Nskjnv కూడా ప్రపంచ టాప్ టెన్ లోకి చేరుకున్నారు. వెంకటరమణ గారు ఈసరికే అందులో ఉన్నారు. అభినందనలు సాయికిరణ్ గారు! అలాగే తెలుగు వికీపీడియా ప్రపంచంలో మూడో స్థానపు తలుపు కొడుతోంది. ఇవ్వాళ రేపట్లో రెండు స్థానాలు ఎగబాకి మూడో స్థానానికి చేరుకుంటుంది. అందరికీ అభినందనలు,__ చదువరి (చర్చ • రచనలు) 10:50, 29 జూలై 2021 (UTC)
- ఇప్పుడు తెలుగు వికీపీడియా మూడో స్థానంలో ఉంది. --స్వరలాసిక (చర్చ) 15:50, 29 జూలై 2021 (UTC)
ధన్యవాదాలు @చదువరి గారు, మీరు కూడా త్వరలో ప్రపంచ టాప్ టెన్ లోకి చేరుకుంటారని వేచి చూస్తున్నాను. టాప్ టెన్ లో ముగ్గురు తెలుగు వాళ్ళుంటే ఆ మజాయే వేరు, ఇక మరింత ముందుకు సాగుదాం. మూడవ స్థానంలోకి చేరబోతున్నందుకు అందరికి అభినందనలు. Nskjnv (చర్చ) 11:14, 29 జూలై 2021 (UTC)
ఏయే గ్రామాల పేజీల్లో మ్యాపులు లేవో తెలుసుకోవడం ఎలా
మార్చువెంకటరమణ, రామారావు, సాయికిరణ్, అభిలాష్, మురళీకృష్ణ గార్లకు
గ్రామాల పేజీల్లో వేటిల్లో మ్యాపులు ఉన్నాయో, వేటిల్లో లేవో తెలుసుకోవాలంటే ఆయా పేజీలను తెరిచి చూస్తే తప్ప తెలియని పరిస్థితి ఉంది. కింద చూపిన పద్ధతిలో డేటాబేసు క్వెరీని వాడితే తేలిగ్గా తెలుసుకోవచ్చు:
- https://quarry.wmflabs.org/query/57241 అనే పేజీకి వెళ్ళండి.
- SQL అనే నల్ల పెట్టెలో ఉన్న క్వెరీని కాపీ చేసుకోండి.
- పేజీలో అన్నిటికంటే పైనున్న అడ్డ పట్టీలో ఉన్న New Query అనే లింకును నొక్కండి. ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది. అందులో ఖాళీ పెట్టెలు రెండు ఉంటాయి
- Click to enter database అనే చిన్నపెట్టెలో tewiki అని ఇవ్వండి.
- SQL అనే పెద్ద నల్లపెట్టెలో మీరు కాపీ చేసుకున్న క్వెరీని పేస్టు చెయ్యండి.
- ఇపుడు ఆ క్వెరీలో మొట్టమొదటి లైనులో set @dist := "గుంటూరు_జిల్లా"; అని ఉంది కదా.. అందులో "గుంటూరు_జిల్లా" అనే దాని స్థానంలో మీ జిల్లా పేరు గానీ, మండలం పేరు గానీ రాయండి. ఇది వర్గం పేరు అన్నమాట. ఫలానా జిల్లాలోని గ్రామాలు/ఫలానా మండలం లోని గ్రమాలు అని వర్గాలున్నాయి కదా.. ఆ వర్గాల పేర్లలో చివర్లో ఉన్న "గ్రామాలు" అనే పేరు వదిలేసి మిగతా పేరు ఇక్కడ రాయాలి.
- చాలా ముఖ్యమైన గమనిక: 1. పేరులో స్పేసులుంటే వాటిని తీసేసి ఆ స్థానాల్లో అండర్‌స్కోరు (_) ఇవ్వాలి. లేకపోతే ఇది డేటాను చూపించదు.
- ఇప్పుడు Submit query అనే బొత్తాన్ని నొక్కండి. మ్యాపు లేని పేజీల జాబితాను చూపిస్తుంది.
పరిశీలించండి. __ చదువరి (చర్చ • రచనలు) 00:28, 30 జూలై 2021 (UTC)
- పైన వివరించిన ప్రకారం ప్రయోగించాను.గుంటూరు జిల్లాలో 66 గ్రామాలను చూపిస్తుంది.ఇది మంచి ఉపయోగం.సమయం కలసివస్తుంది.అన్ని గ్రామాలలో పటాలు చేర్చామా? లేదా? అనే వివరాలు తెలుసుకోవటానికి ఉపయోగం.ఇటువంటి విషయాలు సవివరంగా ఎప్పుటికప్పుడు తెలుపుతున్నందుకు చదువరి గార్కి ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 05:06, 30 జూలై 2021 (UTC)
WPWPTE తాజా గణాంకాలు
మార్చుగణాంకాలను తాజాచెయ్యడంలో ఒక్కోసారి బాగా ఆలస్యం చేస్తున్నారు. ఇవ్వాళ అలాగే జరిగింది. అందుకని తాజా గణాంకాలను చూసేందుకు ఒక క్వెరీ రాసాను. దాన్ని https://quarry.wmflabs.org/query/57272 వద్ద చూడవచ్చు. __ చదువరి (చర్చ • రచనలు) 08:55, 31 జూలై 2021 (UTC)
- తాజా పర్చుటలో లేటు అయినప్పుడు మనం ఈ పద్దతిలో పరిశీలించుకోవటమే.మంచి ప్రయోగం. అయితే ఈ లింకు ఇప్పటికేకానీ తరువాత పనికిరాదేమో! యర్రా రామారావు (చర్చ) 09:14, 31 జూలై 2021 (UTC)
గడువు సమయం సగమే అయింది.. పెట్టుకున్న లక్ష్యానికి 3.3 రెట్లు చేసాం
మార్చుఎట్టకేలకు WPWP వారి ముల్లు కదిలింది. జూలై 31 వరకూ జరిగిన దిద్దుబాట్ల లెక్క తీసింది. మనం పదివేలు దాటేసాం. పోటీ వ్యవధి 2 నెలలు అనుకున్న లక్ష్యం 3 వేలూ కాగా ఒక నెల గడిచేసరికి 10 వేలు చేసాం. పూర్తి సమయం ముగిసేసరికి 20 వేలు దాటటం ఖాయమని అనిపిస్తోంది. వచ్చే సంవత్సరం ఈ పోటీ మనకు పెట్టే అవసరంఉండదు అనేంత వేగంగా ఈ పని చేస్తున్నాం మనం. (నిజంగానే.. అన్ని పేజీల్లో ఫొటోలు పెట్టేస్తే ఇక పోటీ అవసరముండదుగా!) యావత్ప్రపంచంలో మూడో స్థానంలో నిలిచాం. బహుశా తెలుగు వికీపీడియా ఈ స్థాయిలో నిలబడ్డం ఇదే మొదటిసారేమో. ఇదే మొదటిసారి కాకపోతే, మరింత సంతోషం. అందరికీ అభినందనలు.
మ్యాపులు చేరడంతో గ్రామాల పేజీలు చక్కటి విలువను ఆపాదించుకుంటున్నై. ఈ పోటీ వలన మనకు ఒనగూడిన మరో గొప్ప లాభమిది. వెండి పళ్ళేనికి బంగారపు టంచు లాంటిది. __ చదువరి (చర్చ • రచనలు) 01:29, 3 ఆగస్టు 2021 (UTC)
ఇప్పటి వరకు మనం చేసిన దిద్దుబాట్లు
మార్చు2021 ఆగస్టు 10 సాయంత్రం 4:40 వరకు మనం చేసిన మొత్తం దిద్దుబాట్లు 16,232. ఇంకా 20 రోజులుంది. ఈ నెలలో మొదటి 10 రోజుల్లో దాదాపు 6 వేలు చేసాం. గడువు ముగిసేనాటికి పాతిక వేలు దాటడం ఖాయంగా కనిపిస్తోంది. __ చదువరి (చర్చ • రచనలు) 11:21, 10 ఆగస్టు 2021 (UTC)
బహుశా తెలుగు వికీపీడియా చరిత్రలోని ఇది అత్యంత ఎక్కువ సవరణలు జరిగిన సమయం అయ్యుండొచ్చు. @చదువరి , @స్వరలాసిక, @యర్రా రామారావు గారి ప్రోత్సాహం సహకారం, @Kasyap గారి సూచనలు , @➠ కె.వెంకటరమణ గారి నిర్విరామ కృషి యొక్క స్ఫూర్తి దీనికి ప్రధాన కారణాలుగా నేను భావిస్తున్నాను. ఈ స్థాయిలో దిద్దుబాట్లు చేయడం వ్యాసాలను మెరుగు పరచడం మునుముందు కూడా కొనసాగించాలని, దానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించుకోవాలని ప్రతిపాదిస్తున్నాను.కాలవిరాగ్య (చర్చ) 14:58, 10 ఆగస్టు 2021 (UTC)
ఆగస్టు 12 సాయంత్రం 3:45 కు
మార్చుఆగస్టు 12 సాయంత్రం 3:45 వరకు మనం చేసిన దిద్దుబాట్లు 18229. సుమారుగా 48 గంటల్లో 2 వేల పేజీల్లో బొమ్మలు చేర్చాం - రోజుకు వెయ్యి! ఈ లెక్కన గడువు ముగిసే సరికి 30 వేలు చెయ్యడం ఒక లెక్కే కాదు మనకు. __చదువరి (చర్చ • రచనలు) 10:18, 12 ఆగస్టు 2021 (UTC)
- ఈ స్పూర్తి తగ్గకుండా సాగిద్దాం.గ్రామాలు పేజీలలో పటాలు అన్నిటిలో ఎక్కించటం అయిపోతుందనుకుంటాను. యర్రా రామారావు (చర్చ) 11:07, 12 ఆగస్టు 2021 (UTC)
సరైన బొమ్మలను మాత్రమే చేర్చండి
మార్చుమురళీకృష్ణ ముసునూరిగారూ! మీరు సినిమాపేజీలలో చేరుస్తున్న బొమ్మలను గమనిస్తున్నాను. ఆ సినిమాకు చెందిన పోస్టర్ కానీ, సన్నివేశం ఉన్న చిత్రంగానీ మాత్రమే చేర్చండి. మీరు చేర్చేబొమ్మ వ్యాసానికి తగిన విధంగా ఉంటే బాగుంటుంది. సినిమాలో పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్ల ఫోటోలు పెట్టడం సముచితంగాలేదు. అటువంటి దిద్దుబాట్లను తిరస్కరించే అవకాశం ఉంది. కాబట్టి ఇక నుండి ఐనా ఈ విషయం గమనించి సినిమా పోస్టర్లను కానీ, సన్నివేశం ఉన్న బొమ్మలను మాత్రమే చేర్చగలరు. --స్వరలాసిక (చర్చ) 06:32, 13 ఆగస్టు 2021 (UTC)
ధన్యవాదాలు
మార్చునమస్కారం సర్.. సంబంధిత సినిమా పోస్టర్, సన్నివేశం ఉన్న చిత్రం అందుబాటులో లేనప్పుడు దానికి బదులుగా నటీనటులు, టెక్నీషియన్ల ఫోటోలు పెట్టకూడదన్న విషయం నాకు తెలియదు. ఇక నుంచి జాగ్రత్త పడతాను. ధన్యవాదాలు..! - మురళీకృష్ణ ముసునూరి (చర్చ) 06:50, 13 ఆగస్టు 2021 (UTC)
నాలుగో స్థానంలో తెవికీ
మార్చుఈ నెల 12వ తారీఖు వరకు కదిలిన ముల్లు మనం 4 వ స్థానానికి చేరినట్టు చూపిస్తుంది, ఇక మనల్ని దాటిన cebuano వికీ మనకంటే చాలా మించిపోయింది. ఇక మన స్థానం పదిలంగా ఉంచుకోవాలన్న ముందుకు వెళ్ళాలి అన్న ఒక మారథాన్ నిర్వహించుకోవాలేమో @స్వరలాసిక గారు పరిశీలించవలసినదిగా కోరుతున్నాను. ఈ మారథాన్ వల్ల ప్రపంచ టాప్ టెన్ ఉన్న వెంకటరమణ, చదువరి గార్ల స్థానాలు కూడా పదిలంగా ఉండటానికి సోఫానామవుతాయి, పరిశీలించండి. ధన్యవాదాలు Nskjnv (చర్చ) 03:46, 17 ఆగస్టు 2021 (UTC)
- ఈనెల 22, 29 తేదీల్లో రెండు ఎడిటథాన్లు పెట్టుకుందామా?__ చదువరి (చర్చ • రచనలు) 05:09, 19 ఆగస్టు 2021 (UTC)
అక్షాంశ, రేఖాంశాలు నమోదు చేసినా పటాలు కనపడుటలేదు
మార్చుమమత గారు ఫొటోలు ఎక్కింపు కార్యక్రమంలో అక్షాంశ,రేఖాంశాలు నమోదు చేసినా మ్యాపులు కనపడటంలేదు.ఒకటి రెండుకాదు.వరసగా అన్నిటిలో లేవు నేను దాదాపు 15 పేజీలుకు పైగా పరిశీలించాను.ఈ సమస్యను స్వరలాసిక గారూ. చదువరి గారూ పరిశీలించగలరు.--యర్రా రామారావు (చర్చ) 03:43, 20 ఆగస్టు 2021 (UTC)
24 గంటల మారథాన్
మార్చుపోటీ ఇక 10 రోజులు మాత్రమే ఉంది. ఈ పది రోజుల్లో వీలైనన్ని ఎక్కువ బొమ్మలను చేర్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేద్దాం. అందులో భాగంగా మరోసారి 24 గంటల మారథాన్‌ను 21వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటల నుండి 22వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించుకుందాం. అందరూ ఉత్సాహంగా పాల్గొంటారని ఆశిస్తున్నాను. --స్వరలాసిక (చర్చ) 14:32, 20 ఆగస్టు 2021 (UTC)
25,000 దాటేసాం
మార్చు25,000 సంఖ్యను దాటేసాం! ఆగస్టు 27 సాయంత్రం 4:30 సమయానికి మనం చేసిన దిద్దుబాట్ల సంఖ్య 25,247. ఇంకో నాలుగు రోజులుంది, ఈ పోటీలో.__ చదువరి (చర్చ • రచనలు) 11:05, 27 ఆగస్టు 2021 (UTC)
తెలంగాణలో చెయ్యాల్సిన వర్గాలు
మార్చుగ్రామాల పేజీలు దాదాపు 20 వేలు చేసాం. చెయ్యని గ్రామాల సంఖ్య తగ్గిపోవడంతో, మన వేగం కొంత తగ్గింది. చాలా మండల వర్గాలు ఖాళీ ఐపోయాయి లేదా ఒకటీ అరా మిగిలిపోయాయి. అంచేత పెద్దగా పని జరగని వర్గాల జాబితాను తయారుచేసాను. తెలంగాణలో మ్యాపులు చేర్చని పేజీలు కనీసం 5 ఉన్న వర్గాల జాబితాలను కింద ఇచ్చాను. ఆ వర్గాలను ఎంచుకుని పనిచేస్తే మనం మన వేగాన్ని నిలబెట్టుకోవచ్చు. పరిశీలించండి. __
రెండు రాష్ట్రాల్లోనూ..
మార్చు- ఆగస్టు 29 ఉదయం 9 గంటల సమయానికి, ఇంకా మ్యాపులు చేర్చాల్సిన గ్రామాలు రెండు రాష్ట్రాల్లోనూ కలిపి 3878 మిగిలాయి -ఆంధ్రప్రదేశ్‌లో 1947, తెలంగాణలో 1931.
- వాటిలో అసలు సమాచారపెట్టే లేనివి ఆంధ్రప్రదేశ్‌లో 285, తెలంగాణలో 196. అవి పోగా మిగిలినవి 1662, 1735 మొత్తం సుమారు 3400.
- వీటిల్లో గూగుల్ మ్యాపులో దొరకనివి, సందిగ్ధంగా ఉన్నవి వగైరాలు ఒక 500-1000 ఉంటాయనుకుంటే, ఇక మనం చెయ్యగలిగేవి అటూఇటూగా 2 వేలుంటై. వాటిలో సింహభాగం తెలంగాణ లోనే ఉన్నై.
ఇక మిగిలిన 3 రోజుల్లోనూ వాటిపై పనిచేసేందుకు పై విభాగంలో ఇచ్చిన జాబితా పనికొస్తుంది. __ చదువరి (చర్చ • రచనలు) 03:55, 29 ఆగస్టు 2021 (UTC)
ఇప్పటివరకూ చేసిన మొత్తం దిద్దుబాట్లు
మార్చుఆగస్టు 29 ఉదయం 9:00 వరకు చేసిన మొత్తం దిద్దుబాట్ల సంఖ్య: 26,639. చదువరి (చర్చ • రచనలు) 03:59, 29 ఆగస్టు 2021 (UTC)
తుది గణాంకాలు
మార్చుపోటీ ముగిసాక, డేటాబేసు నుండి తీసుకున్న గణాంకాల వివరాలను కింది పట్టికలో చూడవచ్చు. అధికారిక గణాంకాలు వెలువడేందుకు కొన్ని రోజులు పట్టవచ్చు.
క్ర.సం | వాడుకరి | చేసిన దిద్దుబాట్ల సంఖ్య |
---|---|---|
1 | వాడుకరి:Nskjnv | 7500 |
2 | వాడుకరి:Chaduvari | 7229 |
3 | వాడుకరి:K.Venkataramana | 3999 |
4 | వాడుకరి:యర్రా రామారావు | 3256 |
5 | వాడుకరి:మురళీకృష్ణ ముసునూరి | 1695 |
6 | వాడుకరి:MYADAM ABHILASH | 1170 |
7 | వాడుకరి:Divya4232 | 1153 |
8 | వాడుకరి:స్వరలాసిక | 935 |
9 | వాడుకరి:Tmamatha | 739 |
10 | వాడుకరి:Ramesh bethi | 185 |
11 | వాడుకరి:PARALA NAGARAJU | 121 |
12 | వాడుకరి:Thirumalgoud | 115 |
13 | వాడుకరి:Kalasagary | 91 |
14 | వాడుకరి:Sirisipalli Veera Hymavathi | 64 |
15 | వాడుకరి:Dhurjati1 | 60 |
16 | వాడుకరి:Kasyap | 57 |
17 | వాడుకరి:Pranayraj1985 | 47 |
18 | వాడుకరి:ప్రశాంతి | 40 |
19 | వాడుకరి:Vadanagiri bhaskar | 27 |
20 | వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల | 25 |
21 | వాడుకరి:Ch Maheswara Raju | 22 |
22 | వాడుకరి:KINNERA ARAVIND | 18 |
23 | వాడుకరి:Aloknandaprasad | 12 |
24 | వాడుకరి:Goutam1962 | 11 |
25 | వాడుకరి:IM3847 | 9 |
26 | వాడుకరి:UREMANOJ | 9 |
27 | వాడుకరి:Bvprasadtewiki | 6 |
28 | వాడుకరి:Kishorahs | 6 |
29 | వాడుకరి:MYADAM KARTHIK | 1 |
30 | అజ్ఞత వాడుకరులు | 3 |
మొత్తం | 28,605 |
చదువరి (చర్చ • రచనలు) 02:05, 1 సెప్టెంబరు 2021 (UTC)
గ్రామాల పేజీల్లో
మార్చుగ్రామాల పేజీల్లో బొమ్మలు చేర్చిన గణాంకాలు కింది విధంగా ఉన్నాయి
క్ర.సం | వాడుకరి | గ్రామాల పేజీల సంఖ్య |
---|---|---|
1 | వాడుకరి:Nskjnv | 6671 |
2 | వాడుకరి:Chaduvari | 6588 |
3 | వాడుకరి:యర్రా రామారావు | 2907 |
4 | వాడుకరి:K.Venkataramana | 2641 |
5 | వాడుకరి:Divya4232 | 1060 |
6 | వాడుకరి:MYADAM ABHILASH | 908 |
7 | వాడుకరి:స్వరలాసిక | 769 |
8 | వాడుకరి:Tmamatha | 733 |
9 | వాడుకరి:Ramesh bethi | 178 |
10 | వాడుకరి:PARALA NAGARAJU | 121 |
11 | వాడుకరి:Thirumalgoud | 113 |
12 | వాడుకరి:ప్రశాంతి | 39 |
13 | వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల | 23 |
14 | వాడుకరి:మురళీకృష్ణ ముసునూరి | 10 |
15 | వాడుకరి:IM3847 | 7 |
16 | వాడుకరి:Kishorahs | 6 |
17 | వాడుకరి:Kasyap | 6 |
18 | వాడుకరి:UREMANOJ | 5 |
19 | వాడుకరి:Sirisipalli Veera Hymavathi | 5 |
20 | వాడుకరి:Pranayraj1985 | 1 |
మొత్తం | 22791 |
అభినందనలు
మార్చుపోటాపోటీగా గ్రామాల వ్యాసాలలో పటాలను గత రెండు నెలల నుంచి విరామము లేని సమయాన్ని కేటాయించి శ్రమ ఫలితాన్ని అందుకున్న మొదటి మూడు స్థానాల్లో నిలిచిన Nskjnv, చదువరి, వెంకటరమణ గార్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు, విజేతలకు... అభినందనలు. మొదటి పది స్థానాల్లో నిలిచిన వారికి శుభాభినందనలు. ఎంతో కొంత సమయం వెచ్చించి తర్వాత స్థానాల్లో నిలిచిన వారికి అభినందనలు ధన్యవాదాలు... ఇంత మంచి ప్రాజెక్టును నిర్వహించిన నిర్వాహకులకు ప్రత్యేక శుభాకాంక్షలు అభినందనలు... గత ప్రాజెక్టుల కంటే పోటీతత్వం చాలా పెరిగింది... దానికి సాక్ష్యం 3000 ల టార్గెట్ పెట్టుకుంటే 30,000 టార్గెట్ కు చేరువలో చేరడం తెలుగు వికీపీడియా చరిత్రలో ఇదే మొదటిసారి, ఈ పోటీ తత్వం అన్ని ప్రాజెక్టులలో కొనసాగించాలని నా మనవి. ఇందులో పాల్గొన్న ప్రతివారికి పేరుపేరునా ధన్యవాదాలు. __ ప్రభాకర్ గౌడ్చర్చ 05:54, 1 సెప్టెంబరు 2021 (UTC)
- ఈ పోటీలో పాల్గొన్నవారికి కొన్నివేల తెలుగు వ్యాసాలలో బొమ్మలు చేర్చి మన తెవికీ వ్యాసాల నాణ్యతను పెంచిన వాడుకరులు అందరికీ ధన్యవాదాలు. సమిష్టికృషి వికీపీడియా ఉద్యమానికి కీలకం. పంజాబ్ ఎడిటథాన్ లో దేశానికే ప్రథమస్థానంలో నిలిచిన మనకు ఈ కార్యక్రమం మరింత ఉత్సాహాన్ని అందించి, తెవికీ అభివృద్ధికి బాటలు వేయాలి.--Rajasekhar1961 (చర్చ) 06:03, 1 సెప్టెంబరు 2021 (UTC)
- @ప్రభాకర్ గౌడ్ నోముల గారూ ధన్యవాదాలు.
- ఈ పోటీ అందించిన బహుమానాలు కాదు ప్రధానం, దీని ద్వారా 28 వేల పేజీల్లో పెరిగిన నాణ్యతే అన్నిటికంటే ముఖ్యమైనది! ఆ సంగతిని చాలా ఖచ్చితంగా గుర్తించిన @Rajasekhar1961 గారూ, మీ విజ్ఞతకు నమస్సులు. సమష్టికృషి విలువను, అది సాధించగల విజయాలనూ కూడా సరిగ్గా గుర్తించారు, మీ ప్రోత్సాహకర వ్యాఖ్యలు ఈ పోటీలో పాల్గొన్నవారికి, నిర్వాహకులకూ ఉత్తేజాన్నిస్తాయి. ధన్యవాదాలు. పంజాబ్ ఎడిటథాన్ లాగానే ఇప్పుడు కూడా దేశంలో మనదే ప్రథమ స్థానం. అంతేకాకుండా ప్రపంచ వికీ ప్రాజెక్టుల్లో మన స్థానం మొదటి పది స్థానాల్లో ఉంది -బహుశా మనం నాలుగో స్థానంలో ఉంటాం. ఇవి మనకు గర్వకారణాలు. __ చదువరి (చర్చ • రచనలు) 08:34, 1 సెప్టెంబరు 2021 (UTC)
- ఈ పోటీలో పాల్గొన్నవారికి కొన్నివేల తెలుగు వ్యాసాలలో బొమ్మలు చేర్చి మన తెవికీ వ్యాసాల నాణ్యతను పెంచిన వాడుకరులు అందరికీ ధన్యవాదాలు. సమిష్టికృషి వికీపీడియా ఉద్యమానికి కీలకం. పంజాబ్ ఎడిటథాన్ లో దేశానికే ప్రథమస్థానంలో నిలిచిన మనకు ఈ కార్యక్రమం మరింత ఉత్సాహాన్ని అందించి, తెవికీ అభివృద్ధికి బాటలు వేయాలి.--Rajasekhar1961 (చర్చ) 06:03, 1 సెప్టెంబరు 2021 (UTC)
అధికారిక లెక్కలు..
మార్చుఅధికారిక లెక్కలు ఇంకా తేలలేదు. ఇవ్వాళే 31 వ తేదీ లోకి ప్రవేశించినై. కానీ ఆ తేదీ నాటి లెక్క ఇంకా పూర్తికాలేదు. ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం మనం తిరిగి మూడో స్థానం లోకి వచ్చేసాం. పూర్తి లెక్క బయటి కొచ్చేసరికి ఈ స్థానం నిలబడుతుందనే అనిపిస్తోంది. రేపుదయం లోపు పూర్తి లెక్క వచ్చేస్తుంది. __ చదువరి (చర్చ • రచనలు) 09:22, 6 సెప్టెంబరు 2021 (UTC)
అధికారిక ఫలితాలొచ్చేసాయ్
మార్చుఅధికారిక ఫలితాలను స్వరలాసిక గారు ప్రకటించారు.
293 వికీలు పాల్గొంటే వాటిలో మనది మూడో స్థానం. మొదటి ఇద్దరూ బొమ్మ చేర్చేందుకు బాట్లు స్క్రిప్తులూ వాడారు. అలా వాడొచ్చా తప్పు కదూ అనే చర్చ జరిగింది. వాడవచ్చు అని నిర్వాహకులు స్పష్టం చేసారు. కాబట్టి దానితో మనకేమీ ఇబ్బంది లేదు. భారత వికీపీడియాల్లో మనది మొదటి స్థానం. ఇది మనందరికీ గర్వకారణం. పోటీలో పాల్గొన్న వారందరికీ అభినందనలు, ధన్యవాదాలు.
ఈ పోటీలో విశేషమేంటంటే - కొత్తవారు ఇతోధికంగా పాల్గొనడం. కొత్తవారే తొలిస్థానంలో ఉండడం. సాయికిరణ్ గారు వికీలో చేరి ఆరేడు నెల్లైనా వికీకృషి పరంగా ఆయన కొత్తవారే. ఆయనకు అభినందనలు. అలాగే చక్కటి కృషి చేసి వందకు పైగా దిద్దుబాట్లు చేసిన మురళీకృష్ణ, దివ్య, అభిలాష్, మమత, నాగరాజు, తిరుమలగౌడ్.. తదితరులందరికీ నా అభినందనలు. అలాగే మరో 13 మంది కొత్తవారు కూడా పోటీలో పాల్గొన్నారు. వారందరికీ కూడా నా అభినందనలు.
తొమ్మిది మంది పాతవారు కూడా పాల్గొన్నారు. వారందరికీ కూడా నా అభినందనలు. ముఖ్యంగా వెంకటరమణ గారు యర్రా రామారావు గారు తొలినాళ్ళలో ఉత్సాహంగా పనిచేసి తోటివారికి (నాతో సహా) స్ఫూర్తినిచ్చారు, పోటీకి ఒక ఊపునిచ్చారు. వారికి నా ధన్యవాదాలు. కశ్యప్ గారు మొదటి కొన్ని పరీక్షలు చేసి పోటీ లోని లోటుపాట్లను వెలికితీసారు. ఆ విధంగా కొన్ని నిబంధనల విషయంలో స్పష్టత తెచ్చుకోగలిగాం. ఆయనకు ధన్యవాదాలు.
ఇకపోతే, స్వరలాసిక గారు ఈ పోటీ నిర్వహణలో చక్కని కృషి చేసారు. ముందు అసలు ఈ పోటీ ఉనికి గురించి తెలుసుకున్నది ఆయనే. అదొకటి ఉందని ఆయన చెప్పేదాకా మనకు తెలియదు. నాకైతే ఆయన చెప్పాక కూడా అర్థం కాలేదు -అక్కడికెళ్ళి విషయం చూసాక కొంత సేపటికి గానీ లైటువెలగలేదు నాకు. అక్కడ మొదలుపెట్టి గ్రాంటుకు ఆమోదం పొందడం దగ్గర్నుండి నిర్వాహకులతో మాటాడుతూ సమన్వయం చేసారు. పోటీ నిబంధనలను రూపొందించడం, బహుమతులను నిశ్చయించడం వంటి అనేక పనులను సమర్థవంతంగా నిర్వహించారు. పోటీ నిబంధనల్లో సందేహాలు వచ్చినపుడు నిర్వాహకులతో మాట్టాడి వారి దగ్గర నుండి స్పష్టత తెప్పించడం వంటి అనేక విషయాల్లో చురుగ్గా పనిచేస్తూ మనందరికీ తోడుగా నిలబడి, ఈ పోటీ విజయవంతం కావడానికి ఎంతో కృషిచేసారు. ఆయనకు నా ధన్యవాదాలు, అభినందనలు.
3 వేల లక్ష్యమెక్కడ? 28 వేల సాధనెక్కడ? వచ్చే యేడు మళ్ళీ ఈ పోటీ పెడితే, మనం అందులో పాల్గొనాల్సిన అవసరం ఉండదేమో అన్నంతగా పని చేసాం. మనందరం కలిసి ఈ పోటీని భారీగా విజయవంతం చేసాం. తెలుగు వికీపీడియా చరిత్రలో ఇదొక మరపురాని మలుపు. ప్రపంచ వికీవేదికపై తెవికీ కాలుమీద కాలేసుకుని కూచ్చోదగ్గ పని చేసాం. మనలని మనం మనసారా అభినందించుకోవాల్సిన క్షణమిది.
అందరికీ మరోసారి నా అభినందనలు. __ చదువరి (చర్చ • రచనలు) 04:33, 8 సెప్టెంబరు 2021 (UTC)
- చదువరి గారూ, మీరు చెప్పింది అక్షరాల నిజం. ఈ పోటిలో మూడోస్థానంలో నిలవడం అనేది ప్రపంచ వికీవేదికపై తెవికీ ప్రస్థానంలో మరో మైలురాయి లాంటిది. పైన మీరు పేర్కొన్న ప్రతిఒక్కరి కృషి ఇందుకు ఎంతగానో తోడ్పడింది. సమిష్టి కృషితో గర్వించదగ్గ ఫలితాలు కూడా వస్తాయని ఈ ప్రాజెక్టు ద్వారా మరోసారి నిరూపణ అయింది. మున్ముందు కూడా ఇలానే ప్రాజెక్టుల్లో సమిష్టి కృషి చేద్దాం. అందరికి శుభాకాంక్షలు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 10:40, 8 సెప్టెంబరు 2021 (UTC)
- గ్రామాలమీద ఎక్కువుగా అభిమానించే వాళ్లలో నేను ఒకడను.నేను ఉద్యోగరీత్యా గ్రామాలకు చెందిన శాఖలో సర్వీసు చేసాను.అది కూడా ఒక కారణం కావచ్చు.ముందు ఇంట గెలిచి రచ్చగెలవాలి.ఇప్పుడు దీనితో ఇంటాగెలిచాం, రచ్చా గెలిచాం.నాకైతే ఈ ప్రాజెక్టులో గ్రామాలలో అంత పెద్ట సంఖ్యలో పటాలు చేర్చటం, వాటిని చూస్తే కొత్తరూపు దిద్దుకుని కనిపిస్తుంటే, చాలా సంతోషంగా ఉంది.ఈ ప్రాజెక్టు మొదలు పెట్టినప్పటినుండి పటాలు ఎక్కించకు ముందు నేను గ్రామ వ్యాసాలలో ప్రముఖుల వ్యాసాల వర్గం తీసుకుని, గ్రామాలలో ప్రముఖులు అనే వర్గంలో వారి పేరు లేకపోతే పేరు చేర్చి, వారిని గురించి సంక్షిప్తంగా నాలుగైదు వాక్యాలు రాసి, ఫొటోలు చేర్చాను. ఒక రకంగా చెప్పాలంటే మరలా ఆ వ్యాసంలో గమనించిన చిన్న చిన్న సవరణలు సవరిస్తూ చేసాను.దీని వలన గ్రామ వ్యాసాలలో మరికొన్ని చేయవలసిన సవరణలు గుర్తించటానికి మంచి అవకాశం కలిగింది.
- గ్రామం, పురపాలక సంఘం, మండలం, రెవెన్యూ డివిజను, జిల్లా, పరిపాలనా విభాగం, రాష్ట్రం, దేశం ఇలా సెటప్ వ్యాసాలు పూర్తిగా, దానికి సంబంధించిన వ్యాసాలు అన్నీ ఒక పద్దతిలో ఉండాలనే సంకల్పం ఉంది.ఇది ఏ ఒక్కడి వల్లా అయ్యేపనికాదు.ఈ ప్రాజెక్టులో లభించిన గౌరవ వికీపీడియన్లు సహాకారం చూస్తుంటే, ఎలాంటి ప్రాజెక్టు పని పెట్టినా దిగ్విజయం కాగలదని చెప్పకనే చెపుతుంది.కొత్త వాడుకరులు చాలా ఉత్సాహంగా చేసారు.ఒకరకంగా వారు సముదాయానికి న్యూరోబిన్ (నీరసంగా ఉన్నప్పుడు చేస్తారు) ఇంజెక్షను లాంటివారు.ఈ ప్రాజెక్టుకు స్వరలాసిక గారు నేను లేస్తే మనిషిని కాదు, యంత్రాన్ని (ఇంజను) అన్నట్లుగా ఉంది.ఇక వెంకటరమణ గారు ఇంజను స్టార్టు చేసి చాలా వేగంగా బండినడపవచ్చునని అందరికి మార్గదర్శకంగా చూపించారు.ఇక చదువరిగారు బండి నడపటానికి ఇందనంలాంటివారుగానూ, బండి సాఫీగా అవాంతరాలు లేకుండా ప్రయాణించటానికి దిక్సూచి లాగనుా, ఆల్ ఇన్ వన్ గా వ్యవహరించారు.మిగిలిన మనమందరం భోగీలుగా వ్యవహరించాం. ఇక ప్రణయ్ రాజ్ ప్రాజెక్టు విజయం ప్రజలు ముందుకు తీసుకువెళ్లటానికి అంబాసిడర్ గా వ్యవహరించాడు. ఏది ఏమైనా అందరికి మరోకసారి అభినందనలు, ధన్యవాదాలు.ఎక్కువుగా రాసానని అనుకోవచ్చు.వరల్డ్ స్థాయిలో మూడవ స్థానానికి తీసుకువెళ్లినందున ఇది ఎక్కువుగా రాసానని నేను భావించటం లేదు. యర్రా రామారావు (చర్చ) 11:36, 8 సెప్టెంబరు 2021 (UTC)
- తెవికీ సాధించిన ఈ విజయానికి అందరికి అభినందనలు. ఈ పోటీ ఈ స్థాయిలో నిలవడానికి చదువరి గారి కృషి కీలకం అని చెప్పటం అస్సలు అతిశయోక్తి కాదు. ఒక వైపు పోటీ నడిపిస్తూ , పోటీలో వేలాది పేజీల్లో బొమ్మలు చేరుస్తు వచ్చారు. ఈ పోటీలో కృషి చేసి తెలుగు వికీ ఔనత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి పని చేసిన వెంకటరమణ, అభిలాష్ , మురళీకృష్ణ, దివ్య, మమత, నాగరాజు, తిరుమలగౌడ్ గార్లకి ఇతర క్రియాశీల వాడుకరులకు, నిర్వాహకులు స్వరలాసిక గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు.
నా వికీ గురువులు కశ్యప్ గారు, ఏ విషయాన్నైనా బహు దృక్కోణాలతో అలోచించి తగు మార్గాలు నిర్మించుకోవడం నుండి ఈ పోటీలో సూచనల వరకు... అలాగే గ్రామ వ్యాసాల విశ్వకర్మ (నాకు తెలిసిన) యర్రా రామారావు గారికి ఈ పోటీకి అందించిన సేవలకు ధన్యవాదాలు, అభినందనలు.. Nskjnv ☚╣✉╠☛ 16:53, 8 సెప్టెంబరు 2021 (UTC)
ఫారమ్ నింపండి
మార్చుపాల్గొన్న వారందరూ దయచేసి ఈ క్రింది ఫారం వెంటనే నింపండి.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSd-TaLmENAW9Y3HbSDtLyBsneiZqiGFbStEjrr-lC9ASAZywA/viewform