ప్రపంచ తెలుగు మహాసభలు - 2017
ప్రపంచ తెలుగు మహాసభలు - 2017 తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమి నిర్వహణలో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలు. తెలుగు సాంస్కృతిక వికాసంలో తెలంగాణ జాతి ఖ్యాతిని ప్రపంచానికి విదితం చేయాలనే సంకల్పంతో ఈ సభలు నిర్వహించారు.[1] ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యవేక్షణలో 2017, డిసెంబరు 15 నుంచి 19 వరకు ఐదు రోజులపాటు హైదరాబాదులో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించారు.[2] ఈ సమావేశాలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ముగింపు సమావేశాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరయ్యారు. ఈ సభలకు 42 దేశాల నుంచి ప్రతినిధులు విచ్చేశారు.
ప్రపంచ తెలుగు మహాసభలు - 2017 | |
---|---|
![]() ప్రపంచ తెలుగు మహాసభలు - 2017 ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రి తదితరులు | |
నిర్వహించు దేశం | భారతదేశం |
తేదిs | 15-19 డిసెంబర్, 2017 |
నగరాలు | హైదరాబాద్ |
సారధి | తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి |
వెబ్సైట్ | అధికారిక వెబ్సైట్[dead link] |
మహాసభల కమిటీసవరించు
ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి సారథ్యంలో కోర్ కమిటీ ఏర్పాటు చేయబడింది. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, గ్రంథాలయ పరిషత్ చైర్మన్ అయాచితం శ్రీధర్, తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ, కవి, రచయిత దేశపతి శ్రీనివాస్, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఈ కోర్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.[3]
తెలుగు అకాడమీ సారథ్యంలో ఇప్పటికే 50 మంది తెలంగాణ వైతాళికుల జీవిత విశేషాల పుస్తకాలు సిద్ధమయ్యాయి. తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి ఎస్వీ సత్యనారాయణ సంపాదకత్వంలో ప్రపంచ తెలుగు మహాసభల ప్రత్యేక సంచిక రూపుదిద్దుకుంటున్నది. జీవిత విశేషాల పుస్తకాలు, ప్రత్యేక సంచిక రూపకల్పనకు సాహితీ ప్రముఖులతో కమిటీలను ఏర్పాటుచేశారు.[4]
కార్యక్రమాల ప్రణాళికసవరించు
ఈ సభల నిర్వహణకు ప్రణాళికలు తయారుచేశారు.[2]
దీనికొరకు ఎల్ బి స్టేడియం, తెలుగు విశ్వవిద్యాలయం, రవీంద్రభారతి, ఇందిరా ప్రియదర్శిన ఆడిటోరియం, తెలుగు సారస్వత పరిషత్ సభాభవనంలో వేదికలు ఏర్పరిచారు. వీటికి పాల్కురికి సోమన ప్రాంగణం, బిరుదు రామరాజు ప్రాంగణం, గున్నమ్మ గారి లక్ష్మీనరసింహ శర్మ ప్రాంగణం, డా.యశోదారెడ్డి ప్రాంగణం- అచ్చమాంబ వేదిక, అలిశెట్టి ప్రభాకర్ ప్రాంగణం, కృష్ణమాచార్య వేదికలుగా పిలిచారు. కార్యక్రమాల కరదీపికను ముద్రించారు. [5]
ప్రారంభోత్సవంసవరించు
ప్రారంభోత్సవం ప్రధాన వేదికయైన పాల్కురికి సోమన ప్రాంగణం -ఎల్.బి. స్టేడియంలో జరిగింది. ముఖ్య అతిధిగా ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఇ.ఎస్.ఎల్. నరసింహం, చెన్నమనేని విద్యాసాగర్ రావులు పాల్గొన్నారు. సభాధ్యక్షునిగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకు సభ ప్రారంభం జరిగింది. తెలంగాణ యొక్క విశిష్టతను తెలిపే చిత్ర ప్రదర్శన అనంతరం డా. రాజారెడ్డి, రాధారెడ్డి యొక్క సంగీత నృత్యరూపకం జరిగింది.
వేదికలుసవరించు
ప్రధాన వేదిక, పాల్కురికి సోమన ప్రాంగణం -ఎల్.బి. స్టేడియంసవరించు
దీనిని ప్రధాన వేదికగా అలంకరించారు. దీని యొక్క చుట్టుప్రక్కల 10 తెరల ద్వారా సమావేశ వేదికపై జరిగేవాటిని అందరూ చూసేటందుకు ఏర్పాటుచేసారు. వేదికకు ముందు ప్రత్యేక ఆహ్వానితులకు ముదు వరుసలో కూర్చొనే ఏర్పాట్లు చేసారు. దాని తరువాత రెండు వరుసలుగా ఆహ్వానితులకు తరువాత సామాన్య ప్రేక్షకులకు కూర్చొని కార్యక్రమం తిలకించేందుకు ఏర్పాట్లు చేసారు.
- మొదటిరోజు అయిన 15 వతేదీన ముఖ్యాతిధిగా భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహం, మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావులు పాల్గొన్నారు. సభాధ్యక్షునిగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు. సాయంత్రం 6 గంతలకు సభ ప్రారంభం జరిగింది. తెలంగాణ యొక్క విశిష్టతను తెలిపే చిత్ర ప్రదర్శన అనంతరం డా. రాజారెడ్డి, రాధారెడ్డి యొక్క సంగీత నృత్యరూపకం జరిగింది. లిటిల్ మ్యూజికల్ అకాడమీ వారి పాటకచేరీ జరిగింది.
- రెండవరోజు 16 వతేదీ తెలంగానలో తెలుగు భాషా వికాసం అంశం, సాహిత్య సభ, సాంసృతిక సమావేశం జరిగాయి.
- మూడవరోజు 17 వతేదీ మౌఖిక వాజ్మయం భాష సాహిత్య సభ, సాంసృతిక సమావేశం జరిగాయి.
- నాల్గవ రోజు 18వతేదీ తెలంగాణ జీవితం సాహిత్య సభ, సాంస్కృతిక సమావేశం జరిగాయి.
- ఐదవరోజు 19 వతేదీ ముగింపు సభ. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, గవర్నర్ నరసింహన్ లు అతిథులుగా కల్వకుంట్ల చద్రశేఖర్ రావు అధ్యక్షతన సమావేశాలు ముగిసాయి.
'తెలుగు విశ్వవిద్యాలాయం, బిరుదు రామరాజు ప్రాంగణంసవరించు
- 15 వతేదీ తెలంగాణ పద్య కవితా సౌరభం సదస్సు
- 16 వతేదీ తెలంగాణ వచన కవితా వికాసం.
- 17 వతేదీ కథా సదస్సు, తెలంగాణా నవలా సాహిత్యం సదస్సు
- 18 వతేదీ తెలంగాణా విమర్శ పరిశోధన, శతక సంకీర్తనా గేయ సాహిత్యం, కవి సమ్మేళనం
- 19 వతేదీ తెలంగానలో తెలుగు భాష సదస్సు.
రవీంధ్రభారతి, గున్నమ్మ గారి లక్ష్మీనరసింహ శర్మ ప్రాంగణంసవరించు
- 16 వతేదీ అష్తావధానం, హాస్వావధానం, పద్యకవి సమ్మేళనం
- 17 వతేదీ జంటకవుల అష్టావధానం, అక్షర గణితావధానం, నేత్రావధానం, ప్రతాపరుద్ర విజయం
- 18 వతేదీ పత్రికలు, ప్రసార మాద్యమాల్లో తెలుగు, న్యాయ పరిపాలన రంగాల్లో తెలుగు
- 19 వతేదీ తెలంగాణ చరిత్ర
రవీంధ్రభారతి, డా.యశోదారెడ్డి ప్రాంగణం, అచ్చమాంబ వేదికసవరించు
- 15 వతేదీ నుండి 19 వరకూ బృహత్ కవి సమ్మేళణం,
- 16 వతేదీ బాల సాహిత్యం సదస్సు,
- 17 వతేదీ బాల కవి సమ్మేళనం
- 18 వతేదీ తెలంగాణ మహిళా సాహిత్యం సదస్సు
- 19 వతేదీ ప్రవాస భారతీయుతో చర్చలు, రాష్త్రేతరులతో చర్చలు
ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియం, అలిశెట్టి ప్రభాకర్ ప్రాంగణంసవరించు
18 వతేదీ నుండి 19 వతేదీ వరకు సమావేశాలు
తెలుగు సాస్వత పరిషత్ సభాభవనం, కృష్ణమాచార్య వేదికసవరించు
16 వతేదీ శతావధానం
ముగింపు సభసవరించు
ముగింపు సభ ముఖ్యఅతిథిగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పాల్గొన్నాడు.
చిత్రమాలికసవరించు
మూలాలుసవరించు
- ↑ ప్రపంచ తెలుగు మహాసభలు అధికారిక జాలగూడు. "ప్రపంచ తెలుగు మహాసభల గురించి". Archived from the original on 10 November 2017. Retrieved 13 November 2017.
- ↑ 2.0 2.1 టీన్యూస్ (12 September 2017). "డిసెంబర్ లో ప్రపంచ తెలుగు మహాసభలు". Archived from the original on 3 November 2017. Retrieved 13 November 2017.
- ↑ ప్రపంచ తెలుగు మహాసభలు అధికారిక జాలగూడు. "పాలనా విభాగాలు". wtc.telangana.gov.in. Archived from the original on 11 November 2017. Retrieved 13 November 2017.
- ↑ టీన్యూస్ (19 October 2017). "ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లు ముమ్మరం". Retrieved 13 November 2017.[permanent dead link]
- ↑ వేదికల కరదీపిక