సినివారం

తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రతి శనివారం నిర్వహిస్తున్న కార్యక్రమం.

సినివారం అనేది తెలంగాణలోని సినీ కళాకారులు, ఔత్సాహిక ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రతి శనివారం నిర్వహిస్తున్న కార్యక్రమం.[1] 2016, నవంబరు 12న హైదరాబాదులోని రవీంద్రభారతిలో ప్రారంభమైన ఈ సినివారం వేదికలో వర్థమాన దర్శకులు తమ ప్రతిభకు పదును పెడుతూ సృజనాత్మక కథాంశాలతో రూపొందించిన లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలను ప్రతి శనివారం రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో ఉచితంగా ప్రదర్శిస్తున్నారు.[2][3][4]

ఉద్దేశ్యం

మార్చు
  • "తెలంగాణల మట్టిని ముట్టుకుంటే కథ వస్తది.. మనిషిని ముట్టుకుంటే సినిమా అయితది"
  • "We are not going to make parallel cinema.. But to create ALTERNATIVE CINEMA"
  • "10 percent cash, 90 percent creativity, 100 percent NATIVE CINEMA"

రూపకల్పన

మార్చు

తెలంగాణ సకల కళలకు కాణాచి. వారసత్వ కళల హరివిల్లు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలోని కళలకు పునఃర్వికాసం కలిగించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులువేస్తూ, అందమైన రంగుల జానపద, వారసత్వ, సాంస్కృతిక కళలను ప్రోత్సహిస్తుంది. అందులో భాగంగా భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులుగా మామిడి హరికృష్ణను నియమించింది. ఆనాటినుండి వివిధ కళలకు తనవంతు సహకారం అందిస్తువస్తున్న హరికృష్ణకు తెలంగాణ సినిమాపై దృష్టిపడింది.

తెలంగాణ దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు అద్భుతమైన కథా, కథనాలతో సినిమాలు తీస్తున్నారు. ఆ సినిమాల్లో కొత్తదనం రావడంకోసం కొత్తతరాన్ని ప్రోత్సహించాలి. ఏ ప్రోత్సాహం లేకపోయినా లఘుచిత్రాలను తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తూ వీడియో కింద వచ్చే కామెంట్లను చూసుకుని తమని తామే ప్రోత్సహించుకుంటున్న యువకులు చాలామంది ఉన్నారు. అలాంటి వారికి ఓ వేదిక కల్పించి, నలుగురు నిపుణులతో సలహాలు, సూచనలు ఇప్పిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనకు రూపమే ఈ సినివారం.[5] లఘుచిత్రాల దర్శకులను రేపటి సినిమా దర్శకులుగా చూడాలన్న ఆశయంతో ఏర్పడిన సినివారంలో వర్ధమాన దర్శకులు తీసిన లఘుచిత్రాలను ప్రదర్శింపజేస్తున్నారు. అంతేకాకుండా అనుభవజ్ఞులైన సినీ దర్శకులు, టెక్నీషియన్లు, నిర్మాతలను పిలిపించి ప్రదర్శన తర్వాత సినీ ప్రముఖులు, చూసిన ప్రేక్షకులతో దర్శకుడికి, నటులకు ముఖాముఖి నిర్వహిస్తున్నది.[6][7]

టాక్‌ @ సినివారం

మార్చు

ప్రతి నెల రెండవ శనివారం ‘టాక్‌ @ సినివారం’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో శేఖర్‌ కమ్ముల, హరిశంకర్‌, వంశీ పైడిపల్లి, ఎల్‌. శ్రీనాథ్‌, ప్రవీణ్‌ సత్తార్‌, నాగ్‌ అశ్విన్‌, తరుణ్‌ భాస్కర్‌, సంకల్ప్‌ రెడ్డి, సందీప్‌ రెడ్డి తదితర సినిమా ప్రముఖుల వచ్చి వాళ్ళ అనుభవాలను పంచుకున్నారు.

ఫిల్మ్ @ తెలంగాణ

మార్చు

తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఫిల్మ్ మేకర్స్ వారివారి గ్రామాల్లో, వారికున్న లిమిటెడ్ సోర్సెస్ తో సినిమాలు, షార్ట్ ఫిల్మ్, వెబ్ సిరీస్ లు తీస్తూ తెలంగాణ గ్రామీణ నేపథ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. అటువంటి తెలంగాణ గ్రామీణ ప్రాంతాల ఫిల్మ్ మేకర్స్ కి ప్రోత్సాహం అందించేందుకు 2023 సెప్టెంబరు 2న 'ఫిల్మ్ @ తెలంగాణ' కార్యక్రమం ప్రారంభించబడింది. ఇందులో భాగంగా 2023 సెప్టెంబరు నెలలో 5 వారాలు 'ఫిల్మ్ @ఆదిలాబాద్' పేరుతో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఫిల్మ్ మేకర్స్ రూపొందించిన షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ లను ప్రదర్శించనున్నారు.

ప్రదర్శనలు

మార్చు

పెళ్ళిచూపులు’ సినిమా దర్శకుడు తరుణ్ భాస్కర్ తీసిన ‘సైన్మా’ అనే షార్ట్ ఫిల్మ్ తో ఈ సినివారం కార్యక్రమం ప్రారంభించబడింది. ఆరేళ్ళు పూర్తి చేసుకున్న సినీవారంలో ఇప్పటివరకు దాదాపు 3000కి పైగా చిత్రాలను ప్రదర్శించారు.[8][9] వేలమంది సినీకళాకారుల్ని అభినందించి సత్కరించారు

కొత్త దర్శకులు

మార్చు

2024 మే నెల నాటికి ఈ సినివారం వేదిక ద్వారా 13మంది కొత్త దర్శకులు తెలుగు సినిమారంగానికి పరిచయమ్యారు.[10] ఆ దర్శకుల ఫోటోలను పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ హాల్ ఆఫ్ ఫేం లో ఏర్పాటుచేయడం జరిగింది.

  1. తరుణ్ భాస్కర్ (పెళ్ళిచూపులు)
  2. కెవీఆర్ మహేంద్ర (దొరసాని)
  3. సాహిత్ మోత్కూరి (సవారి)
  4. ఉదయ్ గుర్రాల (మెయిల్)
  5. బడుగు విజయ్ కుమార్ (తమసోమ జ్యోతిర్గమయా)
  6. వేణు ముల్కల (విశ్వక్)
  7. సంపత్ కుమార్ (సురాపానం)
  8. గంగాధర్ అద్వైత (సురభి 70ఎంఎం)
  9. ధృవ (కిరోసిన్)
  10. జాన్ జక్కి (2020 గోల్ మాల్)
  11. సూర్యతేజ (ఫోకస్)
  12. అక్షర కుమార్ (షరతులు వర్తిస్తాయి)
  13. నవీన్ కుమార్ గట్టు (శరపంజరం)

మూలాలు

మార్చు
  1. Uddagiri, Nikisha (2023-04-02). "Ravindra Bharathi's Cinevaaram guiding, inspiring young Telugu filmmakers". newsmeter.in (in ఇంగ్లీష్). Archived from the original on 2023-04-02. Retrieved 2023-04-02.
  2. నమస్తే తెలంగాణ (19 November 2016). "'సిని వారం సినిమాలు'". Archived from the original on 28 February 2021. Retrieved 8 November 2017.
  3. ఆంధ్రజ్యోతి (30 October 2016). "షార్ట్‌ఫిల్మ్స్‌ తీసే యువ దర్శకులకు బంపర్‌ఆఫర్!". Archived from the original on 2 నవంబరు 2016. Retrieved 11 November 2017.
  4. Times of India, Hyderabad City (27 January 2019). "Lights, camera! Cinema in state set for a lot of action". Srirupa Goswami. Archived from the original on 27 January 2019. Retrieved 27 January 2019.
  5. "ప్రతి శనివారం.. సినివారం". EENADU. 2023-08-19. Archived from the original on 2023-08-19. Retrieved 2023-08-19.
  6. నమస్తే తెలంగాణ, జిందగీ (11 November 2017). "సి(శ)నివారం!". Retrieved 11 November 2017.[permanent dead link]
  7. నమస్తే తెలంగాణ, జిందగీ వార్తలు (10 November 2018). "రెండేళ్ల సినివారం తెలంగాణ నినాదం". www.ntnews.com. ఆసరి రాజు. Archived from the original on 11 November 2019. Retrieved 11 November 2019.
  8. నమస్తే తెలంగాణ (7 January 2018). "సండే సినిమా.. చూడండి!". Archived from the original on 28 February 2021. Retrieved 20 January 2018.
  9. MIC TV (20 June 2017). "షా.. షా.. షా.. షార్ట్ ఫిలిం !". Archived from the original on 18 July 2021. Retrieved 18 July 2021.
  10. telugu, NT News (2023-06-22). "Telangana | తెలంగాణ తల్లి నుదుట సాంస్కృతిక తిలకం". www.ntnews.com. Archived from the original on 2023-06-22. Retrieved 2023-06-22.
"https://te.wikipedia.org/w/index.php?title=సినివారం&oldid=4222404" నుండి వెలికితీశారు