ప్రసూతి
ప్రసూతి ఒక హిందూ దేవత, స్వాయంభువ మనువు, శతరూప యొక్క కుమార్తె, దక్షుడు భార్య, అనేక మంది కూతుర్లకు తల్లి. ఈమెకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, ఆకూతి, దేవహూతి తోడబుట్టిన వారు. స్వాయంభువ మనువు, తన మొదటి కుమార్తె అకూతిని రుచి ప్రజాపతికి, మధ్య కుమార్తె అయిన దేవహుతినికర్దమ ప్రజాపతికి, చిన్న కుమార్తె ప్రసూతిని దక్ష ప్రజాపతికి అప్పగించాడు.[1]
ప్రసూతి | |
---|---|
భర్త / భార్య | దక్షుడు |
పిల్లలు | స్వాహా, స్వధా, దితి, అదితి, రోహిణి, రేవతి, సతి |
తండ్రి | స్వాయంభువ మనువు |
తల్లి | శతరూప |
వివాహం, పిల్లలు
మార్చుహిందూమతంలో మొట్ట మొదటి వివాహం దక్షుడు, ప్రసూతి యొక్క వివాహం. వీరు ఇద్దరూ పదహారు (16) మంది కుమార్తెలకు జన్మనిచ్చారు. వీరిలో శ్రద్ధ, మైత్రి, దయ, శాంతి, తుష్టి, పుష్టి, ఉన్నతి, బుద్ధి, మేధ, తితిక్ష, హ్రీ, మూర్తి, క్రియ ఈపదిమువ్వురు (13) కుమార్తెలను ధర్ముడుకు ఇచ్చి వివాహం చేశారు. అలాగే స్వాహాదేవిని అగ్నిదేవుడుకు, స్వధను పితృదేవతలకు, సతి (పార్వతి)ని శివుడుకు ఇచ్చి వివాహం చేశారు.