ప్రాతూరు

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం,గ్రామం

ప్రాతూరు, గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

ప్రాతూరు
—  రెవెన్యూయేతర గ్రామం  —
ప్రాతూరు is located in Andhra Pradesh
ప్రాతూరు
ప్రాతూరు
అక్షాంశరేఖాంశాలు: 16°28′00″N 80°36′00″E / 16.4667°N 80.60°E / 16.4667; 80.60
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం తాడేపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి ప్రాతూరి మేరీరాణి
పిన్ కోడ్ 522501
ఎస్.టి.డి కోడ్ 08645

గ్రామ చరిత్ర

మార్చు

సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]

గ్రామ ప్రముఖులు

మార్చు

ప్రాతూరు తిరుమలరావు

మార్చు

స్వాతంత్ర్య సమరయోధులు, శిశువైద్య నిపుణులు, శిశు వైద్యశాస్త్రంలో తొలి ఆచార్యులు. బాల్యం నుండి జాతీయ భావాలను జీర్ణించుకున్న వీరు, కాకినాడలో 1923లో నిర్వహించిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో పాల్గొన్నారు. గాంధీజీ 1933 లో రాజమహేంద్రవరం వచ్చినప్పుడు, వీరు తమ ఉంగరాన్ని బహూకరించారు. 1942 లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని, 9 నెలల కఠిన కారాగార శిక్షననుభవించారు. చెన్నై లోని స్టాన్లీ వైద్య కళాశాలలో ఎం.బి.బి.ఎస్., అమెరికాలో శిశువైద్యంపై ప్రత్యేక శిక్షణ పొందినారు. చెన్నైలో వైద్యవృత్తిని ప్రారంభించి, అనంతరం హైదరాబాదులో వైద్యవృత్తి చేపట్టినారు. జాతీయస్థాయిలో శిశువైద్యులుగా గుర్తింపుపొందినారు. 1988లో పద్మవిభూషణ్ బిరుదు పొందినారు. తన స్వీయచరిత్రనూ, గాంధీజీతో పరిచయం, అమెరికాలో వైద్య విశేషాలు అను గ్రంథాలను వ్రాసినారు. బాలబంధుగా గుర్తింపు పొందిన శ్రీ తిరుమలరావు, 1997, డిసెంబరు-18న హైదరాబాదులో తుదిశ్వాస విడిచారు.[2]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు

మార్చు

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

  • ఈ గ్రామ పంచాయతీకి 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో ప్రాతూరి మేరీరాణి సర్పంచిగా ఎన్నికైంది.

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-18.
  2. ఆంధ్రజ్యోతి/గుంటూరు; 2016,నవంబరు-8; 2వపేజీ
"https://te.wikipedia.org/w/index.php?title=ప్రాతూరు&oldid=3574739" నుండి వెలికితీశారు