ప్రెసిడెంట్ పేరమ్మ
ప్రెసిడెంట్ పేరమ్మ (1979 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | కె.విశ్వనాధ్ |
నిర్మాణం | డి.వి.యస్.రాజు |
తారాగణం | నూతన్ ప్రసాద్ , కవిత |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | కవిత ఆర్ట్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
కథ సవరించు
ఒక ఊరు. ఆ వూరికో ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ రాయుడు ఆడింది ఆట. పాడింది పాట. ఆ వూళ్ళోనే పేదరికంలో పుట్టినా మంచితనానికి పేదరికం లేని ఓ చక్కని యువతీయువకుల జంట పేరమ్మ, పెద్దిరాజు.ఓ శుభముహూర్తాన ఆ జంట ఓ ఇంటి వారవుతారు. పంచాయితీ మెంబర్లను తన గుప్పెట్లో పెట్టుకున్న ప్రెసిడెంట్ రాయుడు తన ఆగడాలను కొనసాగిస్తూనే వుంటాడు. ఊరుమ్మడి సొమ్ము, సర్కారు నిధులు స్వేచ్ఛగా దుర్వినియోగం చేస్తూవుంటాడు. ఎలాగైతేనేం ఊరు ముఖ్యంగా మహిళాలోకం ఎదురుతిరిగింది. పంచాయితీ ఎన్నికలొచ్చాయి. రాయుడిని దింపేసి పేరమ్మను ప్రెసిడెంటుగా ఎన్నుకున్నారు. రాయుడు ఆగడాలకు బ్రేక్ పడింది. ఊరివారు కాస్త వూపిరి పీల్చుకున్నారు. అయితే ఎంతోసేవు వారి ఆనందం నిలవలేదు. రాయుడు మెంబర్లను తనవైపు తిప్పుకోగలిగాడు. పేరమ్మ దేవుడి నగలను అపహరించిందని ఊరి ప్రజలను నమ్మిస్తాడు. పెద్దిరాజు సైతం పేరమ్మను అనుమానిస్తాడు. పేరమ్మ తన నిజాయితీని ఎలా నిరూపించుకున్నదనేది మిగిలిన కథ[1].
నటీనటులు సవరించు
సాంకేతికవర్గం సవరించు
- దర్శకుడు: కె.విశ్వనాథ్
- కథ, మాటలు: దాసం గోపాలకృష్ణ
- ఛాయాగ్రహణం: జి.కె.రాము
- సంగీతం: చక్రవర్తి
పాటలు సవరించు
- అందరాని చందమామ నాకెందుకు అద్దంలాంటి నా మామ - పి.సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: డా. సి.నారాయణరెడ్డి
- ఏమంత తొందర కాసింత ఆగరా కడసందె కాలేదు - పి.సుశీల - రచన: డా. సి.నారాయణరెడ్డి
- కూత్ కూత్ కూత్ కూత్ కుక్కపిల్లలు రొట్టెముక్కలు చూపిస్తె - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: దాసం గోపాలకృష్ణ
- తెల్లారి కలగన్నా పెళ్ళాడినట్టు గదిలోకి రాగానే - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: వేటూరి
- పంచమినాడే పెళ్ళంట అహ పంచలచాపు నేయించు - పి.సుశీల, నూతన్ ప్రసాద్ - రచన: వేటూరి
- పానకాలస్వామిని నేను పూనకంమీదున్నాను - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం బృందం - రచన: వేటూరి
మూలాలు సవరించు
- ↑ పి.ఎస్. (30 April 1979). "చిత్రకథ - ప్రెసిడెంట్ పేరమ్మ". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 66 సంచిక 29. Retrieved 14 December 2017.[permanent dead link]
బయటి లింకులు సవరించు
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)