ప్రేమ్‌జీ

భారతీయ సామాజిక సంస్కర్త, నటుడు

ముల్లమంగళ పరమేశ్వరన్ భట్టారిపాడ్ (23 సెప్టెంబరు 1908 - 10 ఆగస్టు 1998), ప్రేమ్‌జీ అని కూడా పిలుస్తారు. సామాజిక కార్యకర్త, రచయిత, నటుడు.[1] పిరవి సినిమాకు ఉత్తమ నటుడిగా జాతీయ చిత్ర అవార్డును గెలుచుకున్నాడు.[2]

ప్రేమ్‌జీ
జననం
ముల్లమంగళ పరమేశ్వరన్ భట్టారిపాడ్

23 సెప్టెంబరు 1908
వన్నేరి, మలప్పురం, కేరళ, భారతదేశం
మరణం1998 ఆగస్టు 10(1998-08-10) (వయసు 89)
వృత్తిసామాజిక కార్యకర్త, రచయిత, నటుడు
జీవిత భాగస్వామిఆర్య ప్రేమ్‌జీ
పిల్లలుఎం.పి. ప్రేమచంద్రన్
ఎం.పి. నీలకందన్
హరీంద్రనాథన్
ఎం.పి. ఇందుచూడన్
ఎంపి. సతి
పురస్కారాలుభారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
1989 - పిరవి
కేరళ రాష్ట్ర సినిమా పురస్కారాలు
1989 - పిరవి
దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు
1989 - పిరవి

జీవిత విషయాలు మార్చు

ప్రేమ్‌జీ 1908, సెప్టెంబరు 23న కేరళ రాష్ట్రం, మలప్పురంలోని వన్నేరిలో జన్మించాడు.[3] ఇతని పెద్ద సోదరుడు ఎంఆర్ భట్టారిపాడ్, మలయాళ నాటకరంగంలో పేరొందిన వ్యక్తి.[4][5] నంబుదిరి సమాజంలో ఉన్న కులతత్వం, సాంప్రదాయ వాదంకు వ్యతిరేక పోరాటంలో వి.టి.భట్టారిపాడ్, ఈయెమ్మెస్, అతని సోదరుడు ఎంఆర్ భట్టారిపాడ్‌తో కలిసి పనిచేశాడు.[6][7] ప్రేమ్‌జీ 40 ఏళ్ళ వయసులో త్రిస్సూరులోని కంజనిలోని కరువత్ ఇల్లంకు చెందిన ఆర్య అంతర్జనమ్ (28 సంవత్సరాలు)ను వివాహం చేసుకున్నాడు. ఆర్య అంతర్జనమ్ 17 సంవత్సరాల వయస్సు నుండి వితంతువుగా ఉంది.[8] నంబుదిరి సమాజంలో వితంతు వివాహాలను పూర్తిగా నిషేధించినప్పుడు ఈ వివాహం జరిగింది.[9][10] అంతకు తొమ్మిదేళ్ళ క్రిందట ఉమా అంతర్జనమ్ తో తన సోదరుడు ఎంఆర్‌బి వితంతు వివాహం తర్వాత ఆధునిక కేరళ చరిత్రలో ప్రేమ్‌జీది రెండవ వితంతు వివాహం.[11]

ప్రేమ్‌జీ తన 19 ఏళ్ళ వయసులో త్రిస్సూరులోని మంగళోదయం ప్రెస్ లో ప్రూఫ్ ఎడిటర్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. విటి భట్టారిపాడ్ రచించిన అడుక్కలయిల్ నిన్ను అరంగతక్కు నాటకంలో తొలిసారిగా నటించాడు.[12] అటుతరువాత అనేక నాటకాల్లో నటించాడు. ఎంబిఆర్ రాసిన మరక్కుదక్కుల్లిలే మహానరకం, మూతిరింగోడ్ భవత్రతన్ నంబూతిరిపాడ్ రాసిన అఫాంటే మకల్, చెరుకాడ్ నమ్మలోను, స్నేహిబింబంగల్, పిఆర్ వారియర్ రాసిన చవిట్టిక్కుజచ మన్నూ వంటి నాటకాల్లో నటించాడు. కలకౌముడి నాటక కూట్టైమా నిర్మించిన షాజహాన్ నాటకంలో తన నటనకు కేరళ ప్రభుత్వం నుండి బంగారు పతకం అందుకున్నాడు. కేరళ సంగీత నాటక అకాడమీ నుండి ఫెలోషిప్ కూడా అందుకున్నాడు.[12] నాటకరంగంలో రాణించిన తరువాత సినీరంగంలోకి అడుగుపెట్టాడు.

మిన్నమినుంగు సినిమాలో తొలిసారిగా నటించి తచోలి ఒతెనెన్, కుంజాలి మరక్కర్, లిసా, యాగం, ఉత్తరాయణం, పిరవి వంటి 60 సినిమాలలో నటించాడు. 1989లో షాజీ ఎన్. కరుణ్ దర్శకత్వం వహించిన పిరవి (1989)లో తప్పిపోయిన తన కొడుకును వెతకే తండ్రిగా నటించి ఉత్తమ నటుడిగా జాతీయ చిత్ర అవార్డుతోపాటు కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాన్ని, ఉత్తమ మలయాళ నటుడిగా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నాడు.[13][14] అనేక ప్రశంసలు పొందిన రితుమతి నాటకంకోసం సపక్త్ని, నాల్కలికల్, రక్త సందేశం, ప్రేమ్జీ పదన్ను అనే శ్లోకాలు సేకరించాడు.[12]

మరణం మార్చు

1998, ఆగస్టు 10న తన 90 సంవత్సరాల వయస్సులో మరణించాడు.[15]

అవార్డులు మార్చు

జాతీయ చలనచిత్ర పురస్కారాలు:

కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు :

దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు:

  • ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు - మలయాళం - 1989 - పిరవి

సినిమాలు మార్చు

  • పిరవి (1988) చక్యార్ గా
  • పాడిప్పుర (1989)
  • భగవాన్ (1986)
  • కొచ్చు థెమాడి (1986)
  • అనుబంధం (1985) వాలియ నంపూతిరి
  • మంగళం నెరును (1984)
  • శ్రీకృష్ణ పరుండు (1984)
  • ఓరు తీరా పిన్నియం తీరా (1982)
  • యాగం (1982)
  • ష్రిష్ణ (1981) శంకర్ మీనన్
  • సాంచారి (1981) వైద్యగా
  • శేఖం (1980) శేఖరన్ నాయర్
  • విల్కేనుండు స్వాప్నంగల్ (1980)
  • సంధ్యారం (1979)
  • లిసా (1978)
  • అనప్పప్పచన్ (1978)
  • జగద్గురు ఆదిసంకరన్ (1977)
  • తులవర్షం (1976)
  • చెన్నే వలార్తియ కుట్టి (1976)
  • సమస్య (1976)
  • నీరమల (1975)
  • ఉత్తరాయణం (1975)
  • తుంబోలార్చా (1974)
  • పొన్నపురకోట (1973)
  • తీర్థయాత్ర (1972)
  • సింధూరచెప్పు (1970)
  • ఒథెనెంటే మకాన్ (1970)
  • కిండున్నీ (1970)
  • కుంజలి మరక్కర్ (1966)
  • పాకల్కినావు (1966)
  • థాచోలి వలేయ (1964)
  • మూడూపదం (1963)
  • శైమల చెచి (1965)
  • అమ్మూ (1965)
  • తీరా, వీండం ఓరు తీరా
  • మిన్నమినంగు (1957)
  • నీలకుయిల్ (1954)

మూలాలు మార్చు

  1. Praveen, S. r (2018-11-19). "A life that played with emotions". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 27 July 2021.
  2. "Thilakan, Jagathy, Seema, Jalaja and others: The long list of Mollywood's unsung stars". www.thenewsminute.com. Retrieved 27 July 2021.
  3. "Premji born on, 23 September". English News Portal (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 1 ఆగస్టు 2019. Retrieved 27 July 2021.
  4. Basheer, K. P. M. "Arya Premji, an icon of struggle for Namboodiri widows' rights". @businessline (in ఇంగ్లీష్). Retrieved 27 July 2021.
  5. Venkiteswaran, C. S. (2016-05-12). "Fight for equality". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 27 July 2021.
  6. "Finding her voice". Frontline (in ఇంగ్లీష్). Retrieved 27 July 2021.
  7. Datta, Amaresh (1987). Encyclopaedia of Indian Literature: A-Devo (in ఇంగ్లీష్). Sahitya Akademi. ISBN 9788126018031.
  8. "ചരിത്രം ഉറങ്ങാത്ത പ്രേംജി വീട്". ManoramaOnline. Retrieved 27 July 2021.
  9. Menon, Ramesh (15 July 1991). "Once-affluent Namboodiris of Kerala fall on hard days". India Today.
  10. "നടന്‍ പ്രേംജിയുടെ ഭാര്യ ആര്യ പ്രേംജി അന്തരിച്ചു". Mathrubhumi (in ఇంగ్లీష్). Retrieved 27 July 2021.
  11. "ആര്യ പ്രേംജി അന്തരിച്ചു". Deshabhimani. Retrieved 27 July 2021.
  12. 12.0 12.1 12.2 Weblokam profile Archived 9 అక్టోబరు 2007 at the Wayback Machine
  13. "The all-seeing eye of director Shaji Karun". Deccan Herald (in ఇంగ్లీష్). 2019-02-19. Retrieved 27 July 2021.
  14. "The stillness in Shaji N Karun's Piravi". The New Indian Express. Archived from the original on 27 జూలై 2021. Retrieved 27 July 2021.
  15. "ആര്യ പ്രേംജി അന്തരിച്ചു | Kerala | Deshabhimani | Tuesday May 24, 2016". www.deshabhimani.com. Retrieved 27 July 2021.

బయటి లింకులు మార్చు