ప్రేమ్ చంద్ పాండే

ప్రేమ్ చంద్ పాండే భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త, గ్రహ శాస్త్రవేత్త. శాటిలైట్ ఓషనోగ్రఫీ, రిమోట్ సెన్సింగ్, వాతావరణ శాస్త్రం, అంటార్కిటిక్, వాతావరణ మార్పు రంగాలలో విద్యావేత్త.[1] నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ కు వ్యవస్థాపక డైరెక్టరు.

ప్రేమ్ చంద్ పాండే
ఐఐటి ఖరగ్‌పూర్ లోని తన నివాసంలో ప్రేమ్ చంద్ పాండే
ఐఐటి ఖరగ్‌పూర్ లోని తన నివాసంలో ప్రేమ్ చంద్ పాండే
జననం (1945-08-10) 1945 ఆగస్టు 10 (వయసు 79)
రామాపూర్, యునైటెడ్ ప్రావిన్సెస్, బ్రిటిషు భారతదేశం
నివాసంఖరగ్‌పూర్
జాతీయతభారతీయుడు
రంగముఅంతరిక్ష శాస్త్రం, గ్రహ శాస్త్రవేత్త, వాతావరణ, ఉపగ్రహాలు, ధ్రువీయ రిమోట్ సెన్సింగ్
సంస్థలుస్పేస్ అప్లికేషన్స్ సెంటర్
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ
ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ
NCAOR
ఐఐటి ఖరగ్‌పూర్
ఐఐటి భుబనేశ్వర్
మాతృ సంస్థఅలహాబాద్ యూనివర్సిటీ
పర్యవేక్షకుడుఎస్. ఎల్. శ్రీవాస్తవ
ముఖ్య పురస్కారాలునాసా పురస్కారం
శాంతి స్వరూప్ భట్నాగర్ శాస్త్ర సాంకేతిక పురస్కారం
విజ్ఞాన్ గౌరవ్ పురస్కారం

విద్య, వృత్తి

మార్చు

పాండే అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రానిక్స్, సైన్స్‌ లలో మాస్టర్స్, బ్యాచిలర్స్ డిగ్రీలు పొందాడు. 1972 లో అదే విశ్వవిద్యాలయం[2][3] నుండి డి.ఫిల్ (మైక్రోవేవ్‌లపై) చేసాడు.[4]

1966లో పాండే ఆజంగఢ్‌ లోని డిఎవి డిగ్రీ కళాశాలలో లెక్చరరుగా చేరాడు. 1968 నుండి 1972 వరకు ఆయన అలహాబాద్ విశ్వవిద్యాలయం భౌతికశాస్త్ర విభాగపు మైక్రోవేవ్ పరిశోధనా ప్రయోగశాలలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ రీసెర్చ్ ఫెలోగా, 1973 నుండి 1977 వరకు ఖడక్‌వాస్లా లోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్‌లో పరిశోధనా అధికారిగా పనిచేశాడు. 1977లో ఆయన అహ్మదాబాదులో ఇస్రోవారి స్పేస్ అప్లికేషన్స్ సెంటర్‌లో చేరి ఓషియానిక్ సైన్సెస్ డివిజన్/మెటియోరాలజీ అండ్ ఓషియానోగ్రఫీ గ్రూప్/రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ ఏరియా (ఓఎస్డీ/ఎంఓజీ/రెసా) వ్యవస్థాపక అధిపతి అయ్యాడు. తరువాతి ఇరవై సంవత్సరాలు ఆయన ఎస్.ఏ.సి. లో పనిచేశాడు. 1980 లలో ఆయన నాసా-జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ, పసడేనా లోని పరిశోధనా సహచరుడిగా కూడా పనిచేశారు, అక్కడ ఆయన ఎగువ వాతావరణ పరిశోధన ఉపగ్రహం, సీశాట్ కార్యక్రమాలపై పనిచేశాడు.[5] 1997-2005 సమయంలో, అతను నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ (NCPOR/మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ (MoES) గోవా వ్యవస్థాపక డైరెక్టరుగా ఉన్నాడు.[6]

మురళీ మనోహర్ జోషి చొరవతో ఆయన అలహాబాద్ విశ్వవిద్యాలయంలో వాతావరణ, మహాసముద్ర శాస్త్ర అధ్యయనాల కోసం, కె. బెనర్జీ సెంటర్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ అండ్ ఓషన్ స్టడీస్ (కెబిసిఎఒఎస్) ను స్థాపించాడు. ఇది ఇప్పుడు అలహాబాద్ యూనివర్సిటీకి పూర్తి స్థాయి అధ్యాపక విద్యా కేంద్రంగా మారింది.[7][8][9][10][11] అతను 2005 నుండి 2007 వరకు సెంటర్ ఫర్ ఓషన్, రివర్, అట్మాస్ఫియర్ అండ్ ల్యాండ్ సైన్సెస్ (CORAL) లో విజిటింగ్ ప్రొఫెసరుగా, తరువాత 2007 నుండి ఆగస్టు 2011 వరకు ఐఐటి ఖరగ్‌పూర్‌లో (IIT-Kgp), ఎమెరిటస్ ప్రొఫెసరుగానూ ఉన్నాడు. CORAL స్థాపనలో కీలక పాత్ర పోషించాడు.[12]

డాక్టర్ పాండే 2011 సెప్టెంబరు 1 నుండి ఐఐటి భువనేశ్వర్‌లో స్కూల్ ఆఫ్ ఎర్త్, ఓషన్ అండ్ క్లైమేట్ సైన్సెస్‌లో ప్రొఫెసరుగా చేరాడు.[13][14][15][16] స్కూల్ ఆఫ్ ఎర్త్, ఓషన్ అండ్ క్లైమేట్ సైన్సెస్ సంతృప్తికరంగా అభివృద్ధి చెందాక, డాక్టర్ పాండే ఐఐటి ఖరగ్పూర్ (ఐఐటి-కెజిపి) కు తిరిగి వచ్చి 2017 నవంబరు 20 నుండి 2020 నవంబరు 25 వరకు ఎమెరిటస్ ప్రొఫెసరుగా పనిచేశాడు.[17] 2021 జనవరి 1 నుండి ఐఐటి గాంధీనగర్లోని ఎర్త్ సైన్సెస్ విభాగంలో అనుబంధ ప్రొఫెసరుగా పనిచేస్తున్నాడు.[18]

గౌరవాలు, పురస్కారాలు

మార్చు
  • 1985లో నాసా సర్టిఫికేట్ ఆఫ్ రికగ్నిషన్ అండ్ క్యాష్ అవార్డు [19]
  • శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఎర్త్, అట్మాస్ఫియర్, ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్ అవార్డు (1989) కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్) ద్వారా అత్యుత్తమ శాస్త్రీయ కృషికి ఇవ్వబడింది. ఈ సంవత్సరం నుండి, సిఎస్ఐఆర్ (ఎస్ఎస్బి ప్రైజ్) ప్రకటన ప్రకారం ఎర్త్ సైన్సెస్ విభాగం కింద గుర్తింపు పరిధిని వాతావరణ, మహాసముద్ర, గ్రహ శాస్త్రాలకు విస్తరించడం వలన అతను ఈ అవార్డును పొందిన మొదటి వ్యక్తి.[20][21][22]
  • ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ ప్రదానం చేసిన విజ్ఞాన్ గౌరవ్ అవార్డు (ID1)[23]
  • ఇండియన్ జియోఫిజికల్ యూనియన్ (2007) ప్రదానం చేసిన ప్రొఫెసర్ కె. ఆర్. రామనాథన్ మెమోరియల్ గోల్డ్ మెడల్[24]
  • ఇండియా ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ సొసైటీ వారు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఇచ్చే భారత్ గౌరవ్ అవార్డు (2001)[25]
  • ఎనర్జీ అండ్ ఏరో స్పేస్ తో సహా ఇంజనీరింగ్లో ఓం ప్రకాష్ భసీన్ అవార్డు 2004-2005 [26]
  • హరి ఓం ఆశ్రమం ప్రేరిత డాక్టర్ విక్రమ్ సారాభాయ్ అవార్డు, 1987 లో వాతావరణ శాస్త్రాలు, జల శాస్త్ర రంగంలో బంగారు పతకం (ఇస్రోలో మొదటి గ్రహీత) [27]
  • ఖోస్లా నేషనల్ అవార్డు, గోల్డ్ మెడల్ అండ్ సైటేషన్ బై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కీ, కాన్వొకేషన్ వేడుకలో, 2007 నవంబరు 15 [28]
  • ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) నుండి రేఖా నంది, భుపేష్ నంది బహుమతి [29]
  • "అలహాబాద్ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల సంఘం", NCR, ఘజియాబాద్ (గ్రేటర్ నోయిడా చాప్టర్ 2007-2008 సొసైటీ చట్టం 1860 కింద నమోదు చేయబడిన 42 మంది సభ్యుల జాబితాలో "గర్వించదగిన పూర్వ పూర్వ విద్యార్థుల" గౌరవం.[30][31][32]

రచనా కృషి

మార్చు

పాండే 134 కి పైగా పరిశోధనా పత్రాలు, 7 పుస్తకాలు, 9 నివేదికలు, 4 అట్లాసులను ప్రచురించాడు. 11 PhDలకు మార్గనిర్దేశం చేశాడు.[33] అతను మెరైన్ జియోడెసీ, ఇండియన్ జర్నల్ ఆఫ్ పోలార్ సైన్స్, 2008 పత్రికలకు సంపాదకత్వం చేసాడు. ఇండియా మెటియోరోలాజికల్ డిపార్ట్మెంట్ వారి త్రైమాసిక పరిశోధనా పత్రిక అయిన మౌసమ్ లోని రిమోట్ సెన్సింగ్ విభాగానికి కూడా సంపాదకత్వం వహించాడు.[34][35] అతను జర్నల్ ఆఫ్ ది ఇండియన్ సొసైటీ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఇండియన్ జర్నల్ ఆఫ్ రేడియో & స్పేస్ ఫిజిక్స్ (IJRSP) ఇండియన్ జర్నర్ ఆఫ్ మెరైన్ సైన్స్, ఇండియా (1995-2000), వాయు మండల్, బులెటిన్ ఆఫ్ ఇండియన్ మెటియోరోలాజికల్ సొసైటీ, (1995-1996), ప్రొసీడింగ్స్ ఆఫ్ ఇండియన్ అకాడెమిక్స్ (ఫిజికల్ సైన్సెస్), జర్నల్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఆఫ్ రిమోట సెన్సింగ్ (2006) పత్రికల సంపాదకీయ బోర్డులో సభ్యుడిగా ఉన్నాడు.[36][37]

మూలాలు

మార్చు
  1. "Professor Prem Chand Pandey's profile at NCAOR web page as founding Director/1st former Director". Professor Prem Chand Pandey's profile at NCAOR web page as founding Director/1st former Director
  2. Faculty page Archived 24 నవంబరు 2010 at the Wayback Machine, Indian Institute of Technology, Kharagpur.
  3. " Pandey is Proud Past Alumni of Allahabad University" Archived 7 జూలై 2012 at Archive.today. Pandey is told AU’s Product in Allahabad University Alumni Association web page.
  4. Sahoo, Dinabandhu (2002). Advances in Marine and Antarctic Science. APH Publishing. p. 449. ISBN 9788176483476.
  5. a) NASA TECHNICAL REPORTS SERVER Selected Navigations: Author Pandey, P. C. Dr. P C Pandey at NASA’s Jet Propulsion Laboratory USA. b) Journal of Geophysical Research page[permanent dead link] P C Pandey Author from SAC, Ahmedabad. c) Numerical experiment with modelled return echo of a satellite (PDF) P C Pandey Author, Affiliation: MOG, SAC Ahmedabad. d) Water Vapor Corrections for Radar Altimeter and Its Variability over the Indian Ocean[permanent dead link] P C Pandey Author, Affiliation: MOG, SAC. e) Atmospheric temperature profile for a tropical region from TIROS-N microwave sounding unit Author P C Pandey from SAC/ISRO. f) "A Two Step Linear Statistical Technique Using Leaps And Bounds Procedure for Retrieval of Geophysical Parameters from Microwave Radiometric Data" Dr. Prem Chand Pandey author of article from Meteorology and Oceanography Group (MOG) Space Application Centre (SAC/ISRO). g) Advances in Microwave Remote Sensing of the Ocean and Atmosphere Important Article from SAC/ISRO by P C Pandey
  6. a) NATIONAL ADVISORY COMMITTEE (NAC)-workshop at NCMRWF Archived 16 జూలై 2011 at the Wayback Machine P C Pandey Member from NCAOR Goa. b) Department of Ocean Development(DOD) official page Archived 17 జూలై 2011 at the Wayback Machine P C Pandey Director NCAOR, Goa. c) Council of Managers of National Antarctic Programs(COMNAP)[permanent dead link] Prem Chand Pandey Retired from NCAOR-COMNAP
  7. "KBCAOS" Archived 10 ఆగస్టు 2014 at the Wayback Machine. KBCAOS official page
  8. "Seed R & D activities in the area of Polar Remote Sensing have been initiated in collaboration with other national institutes like SAC, Ahamedabad and K. Banerjee Centre for Atmospheric Sciences, Allahabad. ---In addition, a sum of Rs. 3.00 crore is proposed for the initiation of research programmes at the Dr. Kedareswar Banerjee Centre for Atmospheric and Ocean Studies at the Allahabad University" Archived 25 ఏప్రిల్ 2013 at the Wayback Machine. NCAOR/DOD(MoES) supported initiation establishment of K. Banerjee Centre of Atmospheric and Ocean Studies, University of Allahabad
  9. a) KBCAOS/MNCOSS-Allahabad University Alumni Association Archived 15 జనవరి 2008 at the Wayback Machine. Prem Chand Pandey is man behind establishment of KBCAOS- Allahabad University. b) "(KBCAOS), supported by projects from the Department of Ocean Development" Archived 18 అక్టోబరు 2010 at the Wayback Machine. Allahabad University official web page, KBCAOS/Institute of Interdisciplinary Studies(IIDS) was based on NCAOR/DOD Projects at the time. c) Oceanography and Other Projects at NCAOR & KBCAOS sponsored by NCAOR
  10. "SAGAA 2011 Organizing Committee: P C Pandey is Chairman said to be founder of KBCAOS, Allahabad University" Archived 11 జూలై 2011 at the Wayback Machine. (PDF) National Conference on Science& Geopolitics of Arctic& Antarctic organized in chairmanship of Dr. P. C Pandey where it is stated that he is Founder of KBCAOS, AU.
  11. " KBCAOS: Atmospheric and Ocean Science, Allahabad University (AU)". Allahabad University official web page.
  12. a) Changing global weather pattern causing concern Dr PC Pandey of Kharagpur-based Indian Institute of Technology has study"Tele-connection between melting of Antartica Sea ice and the frequency of El Nino and Southern Occillation phenomena (ENSO)". b) Numerical Simulation of Bay of Bengal Circulation Features from Ocean General Circulation Model P C Pandey Author From IIT Kharagpur
  13. "Prof. P C Pandey Joins IITBBS" Archived 22 ఏప్రిల్ 2012 at the Wayback Machine. (PDF) A doctorate in Physics (Microwaves) from Allahabad University, he is credited with the initiation of the satellite borne microwave remote sensing of Ocean Atmosphere and Cryosphere research in India. Professor Pandey was the Founder Director of National Centre for Antarctic and Ocean Research, Goa from 1997 to 2005. He has spent a major part of his career at Space Application Centre (ISRO), Ahmedabad, and has worked for about five years at the NASA’s world famous Jet Propulsion Laboratory, USA. Professor Pandey has carried out extensive research in the areas of satellite oceanography, atmospheric science, climate change and polar science................He was also a member of the delegation led by Hon’ble Kapil Sibal to Antarctic, the first ever ministerial delegation to visit Antarctica. Professor Pandey has represented India in various International symposia related to Polar Science and Logistics such as Scientific Committee on Antarctic Research (SCAR), Antarctic Treaty Consultative Meeting (ATCM) etc. Professor Pandey is the recipient of the Shanti Swarup Bhatnagar Award (1989), Professor Vikram Sarabhai Award and Gold Medal, Om Prakash Bhasin Award and Vigyan Gaurav Award of U.P. Council of Science and Technology as well as the NASA award:IIT Bhubaneswar web page says.
  14. " Professor Pandey at present at School of Earth, Ocean and Climate Sciences, Indian Institute of Technology, Samantapuri, Bhubaneswar-751 013". According to the Indian Academy of Sciences Pandey is Faculty of IIT Bhubaneswar.
  15. "Faculty Profile of Prof. Prem Chand Pandey". School of Earth, Ocean and Climate Sciences, IIT Bhubaneswar, Faculty profile of Professor Pandey
  16. "Brief resume of Professor Pandey". (PDF) This brief resume describes that he is Faculty at IITBBS and good information about him can be found here
  17. "Pandey is listed as Former Faculty Member of CORAL, IIT Kharagpur 2005-2011 and 2017 to 2020". Pandey is listed as Former Faculty Member of CORAL, IIT Kharagpur.
  18. "IIT Gandhinagar faculty page of Professor Pandey". IIT Gandhinagar faculty page of Professor Pandey
  19. "MOES-NERC workshop for UK-INDIA Cooperation in Water Research-Profile of Indian Delegates: Prof. P C Pandey" Archived 12 నవంబరు 2010 at the UK Government Web Archive. (PDF) Pandey awarded with the Certificate of Recognition and Cash Award-1985 by NASA given in his awards section
  20. "From this year onwards, the scope of recognition SSB Prize under discipline Earth Sciences has been extended to Atmosphere, Ocean and Planetary Sciences". It is according the statement is added by SSB Prize/CSIR web page on 17 August 2020
  21. Earth Sciences: 1989 -Pandey, Prem Chand Archived 27 సెప్టెంబరు 2011 at the Wayback Machine Council of Scientific and Industrial Research "Dr Pandey has made significant contributions to the development of the technique of microwave remote sensing from satellites for obtaining atmosphere and ocean surface parameters. His concept of combining microwaves with infrared derive cloud parameters has been widely acclaimed."
  22. "Professor Prem Chand Pandey's Profile on SSB Prize official web page". Professor Pandey in SSB Prize web page
  23. Scientific Awards: Dr. P.C. Pande- Director, National Centre For Antarctica and Ocean Research Archived 21 జూలై 2011 at the Wayback Machine Council of Science and Technology, Uttar Pradesh.
  24. IGU awards page.
  25. Advances in Marine and Antarctic Science. New Delhi: A.P.H. Publ. Corp. 2002, p. 449 (ISBN 81-7648-347-8).
  26. "SHRI OM PRAKASH BHASIN AWARDS in ENGINEERING Including ENERGY and AERO SPACE". Award Presented by Dr. A. P. J. Abdul Kalam, President of India for 2004–2005 on 26 October 2006.
  27. "according LIFE SKETCHES OF GENERAL PRESIDENT AND SECTIONAL PRESIDENTS 94th INDIAN SCIENCE CONGRESS, ANNAMALAI NAGAR, 2006–20 Dr. Pandey was awarded by Hari Om Ashram Perit Dr. Vikram Sarabhai Award and Gold medal in the field of Atmospheric Sciences and Hydrology, in 1987 (first recipient in ISRO)" Archived 19 జూన్ 2009 at the Wayback Machine. (PDF) EVERYMAN’S SCIENCE Vol. XLI No. 4 (October '06 – November '06) Dr. P C Pandey was President of Section of Environmental Sciences.
  28. "MoES-NERC Workshop on The Changing Water Cycle-MOES Biographies" Archived 12 నవంబరు 2010 at the UK Government Web Archive. (PDF) Prof Pandey is recipient of the Khosla Award.
  29. "The Rekha Nandi and Bhupesh Nandi Award-The Institute of Engineering (India), Kolkata" Archived 2010-11-24 at the Wayback Machine. Dr. Pandey is recipient of The Rekha Nandi and Bhupesh Nandi Prize from the Institution of Engineers (India) during Prize Distribution ceremony of the 25th Indian Engineering Congress, Kochi, 17 December 2010.
  30. " Pandey is Proud Past Alumni of Allahabad University" Archived 7 జూలై 2012 at Archive.today. Pandey is told AU’s Product in Allahabad University Alumni Association web page.
  31. " Internet Archive of Proud Past Alumni"
  32. "Internet Archive of Proud Past Alumni"
  33. "Science and Geopolitics of Arctic and Antarctic: The Organising Committee of SaGAA 2011" Archived 11 జూలై 2011 at the Wayback Machine. Conference at India International Centre web page stated that Dr. Pandey has published 134 research papers
  34. Associate Editors. Marine Geodesy...
  35. Subject Editors – Mausam Archived 13 మే 2009 at the Wayback Machine India Meteorological Department.
  36. Editorial board: Journal of the Indian Society of Remote Sensing[permanent dead link] springer.com, Earth Sciences.
  37. "Csir-Niscair".