ప్రేమ (1989 సినిమా)

1989 సినిమా

ప్రేమ 1989 లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో డి. రామానాయుడు నిర్మాణ సారథ్యంలో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై విడుదలైన విషాద ప్రేమకథా చిత్రం. వెంకటేష్, రేవతి ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించాడు.

ప్రేమ
దర్శకత్వంసురేష్ కృష్ణ
నిర్మాతడి. రామానాయుడు
తారాగణంవెంకటేష్, రేవతి
ఛాయాగ్రహణంపి. ఎస్. ప్రకాష్
కూర్పుకె. ఎ. మార్తాండ్
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లురాజేశ్వరి ఫిల్మ్స్
విడుదల తేదీ
జనవరి 12, 1989 (1989-01-12)
భాషతెలుగు

పృథ్వి ఒక అనాథ యువకుడు. మంచి గాయకుడు కావాలని ప్రయత్నం చేస్తుంటాడు. ఒకసారి అతనికి మ్యాగీ అనే అమ్మాయితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారుతుంది. పృథ్వి మ్యాగీని పెళ్ళి చేసుకోవడం మ్యాగీ తల్లి స్టెల్లాను అడుగుతారు. కానీ స్టెల్లాకు పృథ్వి ఆవేశం గురించి తెలుస్తుంది. అంతే కాకుండా అతను తల్లి ఆత్మహత్యకు కారణమైనందుకు స్వంత తండ్రినే హత్య చేశాడని తెలుసుకుంటుంది. అలాంటి వాడికి తన కూతురునిచ్చి పెళ్ళి చేయనని చెబుతుంది. మ్యాగి కూడా అతని కోపాన్ని తగ్గించుకోమని చెబుతుంది.

పృథ్వి ఎలాగోలా కష్టపడి మ్యాగీని పెళ్ళి చేసుకోవడానికి ఆమె తల్లిని ఒప్పిస్తాడు. తీరా పెళ్ళి జరిగే సమయానికి మ్యాగీ కళ్ళు తిరిగి పడిపోతుంది. వైద్యసహాయం కోసం వెళితే, ఆమె చిన్న చిన్న సమస్యలకు కూడా మందుకు ఎక్కువగా వాడటం వలన శరీరంలో అతి కీలకమైన అవయవాలు పనికిరాకుండా పోయాయనీ, ఆమె ఇక ఎంతోకాలం బతకదనీ చెబుతారు.

తారాగణం

మార్చు

పాటలు

మార్చు

పాటల రచయిత: ఆచార్య ఆత్రేయ

  • ప్రియతమా! నా హృదయమా!
గానం - ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

*ఇవ్వు ఇవ్వు , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర

  • ఈనాడే ఏదో అయ్యింది
గానం - చిత్ర, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
  • ఎక్కడ ఎక్కడ, గానం. ఎస్ పి శైలజ
  • మాటే మంత్రము
గానం - ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. పి. శైలజ
  • యూ ఆర్ మై హీరో, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కె ఎస్ చిత్ర
  • ఐయాంసారీ , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

*ఒంటరి వాడిని నేను, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.

మూలాలు

మార్చు