పి. జె. శర్మ
పి.జె.శర్మ (మే 24, 1933 - డిసెంబర్ 14, 2014) పేరొందిన పూడిపెద్ది జోగీశ్వర శర్మ డబ్బింగ్ కళాకారుడు, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. తెలుగు, కన్నడ భాషల్లో 150కి పైగా చిత్రాల్లో నటించాడు. 500 కి పైగా సినిమాలకు డబ్బింగ్ కళాకారుడిగా తన గాత్రం అందించాడు. అతను, రాం రాబర్ట్ రహీం, కలెక్టర్ జానకి మొదలైనవి ఈయనకు గుర్తింపు తెచ్చినవి. వీరి కుమారుడు సాయికుమార్ డబ్బింగ్ కళాకారుడు, కథానాయకుడు. మరో ఇద్దరు కుమారులు రవిశంకర్, అయ్యప్ప శర్మ కూడా నటులు డబ్బింగ్ కళాకారులుగా కొనసాగుతున్నారు. మూడవతరం వాడైన సాయికుమార్ కొడుకు ఆది కూడా కథానాయకుడిగా ఉన్నాడు.[2] బాలకృష్ణ నటించిన అధినాయకుడు ఆయనకు నటుడిగా చివరి చిత్రం.[3]
పి. జె. శర్మ | |
---|---|
జననం | పూడిపెద్ది జోగీశ్వర శర్మ 1933 మే 24 కళ్ళేపల్లి-రేగ గ్రామం,విజయనగరం జిల్లా |
మరణం | 2014 డిసెంబరు 14 హైదరాబాదు | (వయసు 81)
వృత్తి | నటుడు, డబ్బింగ్ కళాకారుడు |
జీవిత భాగస్వామి | కృష్ణజ్యోతి |
పిల్లలు | సాయికుమార్, రవిశంకర్, అయ్యప్ప శర్మ, కమల, ప్రియ |
తల్లిదండ్రులు |
జననం
మార్చువీరు శ్రీకాకుళం జిల్లా కళ్ళేపల్లి గ్రామంలో మే 24, 1933 తేదీన జన్మించారు. చిన్నతనం నుండే నాటకరంగం పై మక్కువ పెంచుకొని పేదరైతు, అనార్కలి, పల్లెపడుచు, ఆశాలత, కులంలేని పిల్ల, ఋష్యశృంగ, నవప్రపంచం మొదలైన నాటకాలలో ప్రధాన పాత్రలను పోషించారు.
వీరు 1954లో మొదటిసారిగా అన్నదాత సినిమాలో చిన్న వేషంలో కనిపించారు. 1957లో విజయనగరం రాఘవ నాటక కళాపరిషత్ పోటీలలో పాల్గొని సినీ ప్రముఖుల ఆహ్వానం మీద మద్రాసు చేరుకున్నారు. ఆరుద్ర, శ్రీశ్రీ ల ప్రోత్సాహంతో తొలిసారిగా ఉత్తమ ఇల్లాలు (1957) చిత్రంలో డబ్బింగ్ చెప్పారు. 1957 లో ప్రత్యగాత్మ దర్శకత్వంలో వచ్చిన ఇల్లరికం ఆయనకు నటుడిగా మొదటి సినిమా.[1] ఆ తర్వాత వందలాది డబ్బింగ్ సినిమాలలో నంబియార్, శ్రీరామ్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, రాజ్ కుమార్, ఉదయ కుమార్ ప్రేమనజీర్ ధరించిన ఎన్నో పాత్రలకు తెలుగులో డబ్బింగ్ చెప్పారు.
ఒక వైపు డబ్బింగ్ కళాకారుడిగా పనిచేస్తూనే కొన్ని వందల చిత్రాలలో నటించారు. వీరు నటి కృష్ణజ్యోతిని 1960లో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పెద్దకొడుకు సాయికుమార్ ప్రముఖ డబ్బింగ్ కళాకారుడు, నటుడు, రెండవ కొడుకు రవిశంకర్ కూడా డబ్బింగ్ కళాకారుడే. మూడవ అబ్బాయి అయ్యప్ప పి. శర్మ సినీ దర్శకుడు. వీరి ఇద్దరు కుమార్తెలు కమల, ప్రియ. వీరి మనవడు ఆది ప్రేమ కావాలి సినిమాతో హీరోగా తెలుగువారికి పరిచయమయ్యాడు.
మరణం
మార్చుఈయన 2014, డిసెంబర్ 14 ఆదివారం నాడు హైదరాబాదులోని తన నివాసంలో గుండెపోటుతో మరణించాడు.[4]
చిత్ర సమాహారం
మార్చు- రంగులరాట్నం (1967)
- భాగ్యచక్రం (1968)
- కళ్యాణ మండపం (1971)
- జేమ్స్ బాండ్ 777 (1971)
- కలెక్టర్ జానకి (1972)
- భక్త తుకారాం (1973) - మంత్రి
- శ్రీరామాంజనేయ యుద్ధం (1975) - శివుడు
- జేబు దొంగ (1975)
- మహాకవి క్షేత్రయ్య (1976) - సిద్ధేంద్రయోగి
- వేములవాడ భీమకవి (1976)
- కురుక్షేత్రం (1977)
- జీవన తీరాలు (1977)
- దాన వీర శూర కర్ణ (1977)
- ఇంద్రధనుస్సు (1978)
- సతీ సావిత్రి (1978)
- రామ్ రాబర్ట్ రహీమ్ (1980)
- స్వప్న (1980)
- న్యాయం కావాలి (1981) - న్యాయమూర్తి
- ఖైదీ (1983)
- ముగ్గురు మొనగాళ్ళు (1983) - కమీషనర్
- విజేత (1985)
- కృష్ణ గారడీ (1986)
- గౌతమి (1987)
- ఇన్స్‌పెక్టర్ ప్రతాప్ (1988)
- కర్తవ్యం (1990)
- అసాధ్యులు (1992)
- ఈశ్వర్ అల్లా (1998)
- పవిత్ర ప్రేమ (1998)
- తొలిప్రేమ (1998)
- అతడు (2001)
- నాగ (2003)
- శ్లోకం (2005)
- పోలీస్ స్టోరీ 2 (2007)
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 "P J Sharma - MaaStars". MAA Stars. Movie Arists Association (MAA). Retrieved 19 April 2018.
- ↑ "Dubbing artist Sai Kumar's father P.J. Sarma no more". thehindu.com. The Hindu. Retrieved 6 March 2018.
- ↑ Kedam, Mahesh (15 December 2014). "సీనియర్ సినీ నటుడు పి.జె.శర్మ నిర్యాణం". jagranjosh.com. Archived from the original on 26 June 2015. Retrieved 19 April 2018.
- ↑ ఎడిటర్ (15 December 2014). "పీజే శర్మ ఇక లేరు". సాక్షి. జగతి పబ్లికేషన్స్, హైదరాబాద్. Retrieved 15 December 2014.