ప‌వ‌ర్ ప్లే 2021లో విడుదలైన తెలుగు థ్రిల్ల‌ర్ సినిమా. వ‌న‌మాలి క్రియేష‌న్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై శ్రీ‌మ‌తి ప‌ద్మ స‌మ‌ర్ప‌ణ‌లో దేవేష్, మహిధర్ నిర్మించిన ఈ చిత్రానికి విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో రాజ్ తరుణ్, హేమ‌ల్ ఇంగ్లే, పూర్ణ‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 5 మార్చ్ 2021లో విడుదలైంది.

ప‌వ‌ర్ ప్లే
దర్శకత్వంవిజ‌య్ కుమార్ కొండా
నిర్మాతమ‌హిధర్‌, దేవేశ్‌‌
తారాగణంరాజ్ తరుణ్, హేమ‌ల్ ఇంగ్లే, పూర్ణ‌
ఛాయాగ్రహణంఐ. ఆండ్రూ
కూర్పుప్రవీణ్ పూడి
సంగీతంసురేష్ బొబ్బిలి‌
నిర్మాణ
సంస్థ
వ‌న‌మాలి క్రియేష‌న్స్ ప్రైవేట్ లిమిటెడ్
విడుదల తేదీ
2021 మార్చి 5 (2021-03-05)
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ సవరించు

విజయ్ (రాజ్ తరుణ్) ఓ మధ్య తరగతి కుర్రాడు. ఇంజినీరింగ్ పూర్తి చేసి గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతుంటాడు. అతడికి కీర్తి (హేమల్) అనే అమ్మాయిని నిశ్చితార్థం జరుగుతుంది. జీవితం సాఫీగా సాగుతున్న ఆ సమయంలో అతను అనుకోకుండా దొంగ నోట్ల కేసులో ఇరుక్కుంటాడు. ఆ కేసులోంచి తనను ఎవరూ బయటపడేయలేని స్థితిలో తనే సొంతంగా పరిశోధన మొదలుపెడతాడు. అసలు విజయ్ ను ఈ కేసులో ఎవరు ఇరికించారు ? ఈ కేసు నుండి బయట పడటానికి విజయ్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు ? అనేదే మిగతా సినిమా కథ.[1]

న‌టీన‌టులు సవరించు

సాంకేతిక నిపుణులు సవరించు

  • సమ‌ర్ప‌ణ‌: శ్రీ‌మ‌తి ప‌ద్మ‌
  • బ్యానర్: వ‌న‌మాలి క్రియేష‌న్స్ ప్రైవేట్ లిమిటెడ్
  • నిర్మాత‌లు: మ‌హిధర్‌, దేవేశ్‌‌
  • స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: విజ‌య్ కుమార్ కొండా
  • క‌థ‌-మాట‌లు: నంద్యాల ర‌వి
  • సంగీతం: సురేష్ బొబ్బిలి
  • ఛాయాగ్ర‌హ‌ణం: ఐ. ఆండ్రూ
  • కూర్పు: ప్రవీణ్ పూడి

మూలాలు సవరించు

  1. Eenadu (5 March 2021). "రివ్యూ: పవర్‌ ప్లే - raj tarun power play telugu movie review". www.eenadu.net. Archived from the original on 15 జూన్ 2021. Retrieved 15 June 2021.
  2. Telugu, TV9 (6 March 2021). "Raj Tarun : నేను ఇంతవరకు ట్రై చేయని కొత్త జోనర్లో చేసిన థ్రిల్లర్ మూవీ ఇది : యంగ్ హీరో రాజ్ తరుణ్ - raj tarun about his movie 'power play'". TV9 Telugu. Archived from the original on 15 జూన్ 2021. Retrieved 15 June 2021.