ఫైబర్ గ్రిడ్ పథకం

తెలంగాణ ప్రభుత్వ పథకం
(ఫైబర్‌ గ్రిడ్‌ పథకం నుండి దారిమార్పు చెందింది)

ఫైబర్‌ గ్రిడ్‌ పథకం (టి-ఫైబర్) ఇంటింటికీ ఇంటర్నెట్‌ అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకం.[1] దేశంలోనే ప్రప్రథమంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ ఫైబర్‌ గ్రిడ్‌ పథకమిది.[2][3][4][5] 4000 కోట్ల రూపాయలు వ్యయం అవుతున్న ఈ పథకానికి భారత్‌ నెట్‌ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ 23 మిలియన్ల మంది ప్రజలను ప్రభుత్వంతో ప్రభుత్వానికి, ప్రభుత్వం నుండి పౌరులకు సేవలను, ఇతర అప్లికేషన్ల పరిధిని అనుసంధానం చేయడంలో సహాయపడుతుంది.[6]

ఫైబర్‌ గ్రిడ్‌ పథకం
ఫైబర్‌ గ్రిడ్‌ కోసం ఉపయోగించే పైపులు
ప్రాంతంతెలంగాణ, భారతదేశం
వ్యవస్థాపకులుతెలంగాణ ప్రభుత్వం
ముఖ్యమంత్రికల్వకుంట్ల చంద్రశేఖరరావు
మంత్రిత్వ శాఖతెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ
ప్రధాన వ్యక్తులుతెలంగాణ ప్రజలు
వెబ్ సైటుతెలంగాణ ప్రభుత్వ అధికారిక జాలగూడు
నిర్వాహకులుఐటీ శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు


ఫైబర్‌ గ్రిడ్‌ పథకానికి పైపులు వేస్తున్న దృశ్యం

చరిత్ర

మార్చు

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు 2017లో రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలంలో పైలట్ ప్రాజెక్ట్‌తో ప్రారంభించాడు. గ్రామీణ ప్రాంతాల్లోని ఎక్కువ మందికి టెలిమెడిసిన్, విద్యా అవకాశాలను అందించడం ద్వారా ఆరోగ్యం, విద్యను మెరుగుపరచడానికి ఇంటర్నెట్ సదుపాయాన్ని అందిస్తుంది. ఈ పథకం ద్వారా గృహాలకు 4-100 ఎంబిపిఎస్, సంస్థలు ఆన్-డిమాండ్ 20-100 ఎంబిపిఎస్ ఇంటర్నెట్ ను పంపిణీ చేస్తారు.[7]

తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పోరేషన్

మార్చు

తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్‌ను అమలు చేయడానికి, దాని కార్యకలాపాలను నిర్వహించడానికి తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పోరేషన్ లిమిటెడ్ (టి-ఫైబర్) పేరుతో ఒక కమిటీ ఏర్పాటుచేయబడింది. ప్రాజెక్ట్ పర్యవేక్షణ, నిర్వహణ, కార్యకలాపాలకు ఈ ఈ కమిటీ బాధ్యత వహిస్తుంది. ఈ కమిటీలో బోర్డు డైరెక్టర్లు, బోర్డు సభ్యులు, సాంకేతిక సలహా కమిటీ మొదలైనవారు ఉంటారు. సంస్థకు సంబంధించి వ్యూహాత్మక/నిర్మాణాత్మక/ఆర్థిక, కార్యాచరణ రంగాలకు సంబంధించిన క్లిష్టమైన విషయాలపై ఈ కమిటీ నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ కమిటీలో నలుగురు బోర్డు సభ్యులు ఉన్నారు.

  • ఐటీ శాఖ మంత్రి, తెలంగాణ ప్రభుత్వం
  • ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐటిశాఖ, తెలంగాణ ప్రభుత్వం
  • డైరెక్టర్, ఎలక్ట్రానిక్స్, ఐటి విభాగం, తెలంగాణ ప్రభుత్వం
  • ఇంజనీర్-ఇన్-చీఫ్, ఆర్.డబ్ల్యూఎస్&ఎస్ శాఖ
 
ఫైబర్‌ గ్రిడ్‌ పథకం గురించి ఆధికారులతో చర్చిస్తున్న కెటీఆర్

లక్ష్యాలు

మార్చు
  1. తెలంగాణ రాష్ట్రం లోని 31 జిల్లాల్లోని 464 మండలాల్లోని 8778 గ్రామ పంచాయతీల్లోని 10,128 గ్రామాల్లోని 83లక్షల 58వేల గృహాలలోని 3కోట్ల 5లక్షల కంటే ఎక్కువ ప్రజలకు అందుబాటు ధరలతో అధిక వేగం కలిగిన అంతర్జాలమును అందించడం
  2. ప్రభుత్వం నుండి ప్రభుత్వమునకు, ప్రభుత్వం నుండి ప్రజలకు (గవర్నమెంట్ టూ గవర్నమెంట్ (జి2జి), గవర్నమెంట్ టూ సిటిజన్స్ (జి2సి) ) ల ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, బ్యాంకులు, ఇతర ప్రజా సేవ సంస్థలకు అధిక వేగం కలిగిన అంతర్జాలమును అందించడం
  3. ఎలాంటి తేడాలు లేకుండా అందరికి ఒకే విధమైన అంతర్జాలమును అందించడం
  4. గృహాలకు 4-20 ఎం.బి.పి.ఎస్. ఇతర సంస్థలలకు 20-100 ఎం.బి.పి.ఎస్. ల వేగంతో అంతర్జాల పంపిణీ

ప్రాజెక్టు వివరాలు

మార్చు
  • ఈ ప్రాజెక్ట్ ద్వారా 22,000 కంటే ఎక్కువ గ్రామాలలో 62,000 మైళ్ల ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వేయబడింది. తాగునీటి ప్రాజెక్ట్ మిషన్ భగీరథతో పాటు ఫైబర్ ఆప్టిక్ లైన్[8] పెద్ద నల్ల పైపు నీటి కోసం, నీలిరంగు పైపులో ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ఉంటుంది.[9] తెలంగాణలో వాటర్ గ్రిడ్ ఏర్పాటుతోపాటు టి-ఫైబర్ లేయింగ్‌ను చేపట్టడం ద్వారా తన ప్రాజెక్ట్ వ్యయం తగ్గుతోంది.
  • ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు పరిధిని రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను, గ్రామపంచాయతీలను, రైతు వేదికలను ఈ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు ద్వారా అనుసంధానించనున్నారు.[10]

డిజిటల్‌ ఇండియా అవార్డు

మార్చు

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, గృహాలు, వ్యాపార సంస్థలకు మెరుగైన ఇంటర్నెట్‌ సేవలు అందించేందుకు డిజైన్‌ చేయబడిన టీ-ఫైబర్‌కు ఐసీటీ ట్రాన్స్‌ఫర్మేషన్‌ అండ్‌ డిజిటల్‌ ఇండియా విభాగంలో నాలెడ్జ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (కేసీసీఐ) బిజినెస్‌ ఎక్స్‌లెన్స్‌-2022 అవార్డు లభించింది. కేసీసీఐ ఐదవ వార్షికోత్సవం సందర్భంగా 2022, జూన్ 20న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తమ్‌ రూపాలా చేతులమీదుగా టీ-ఫైబర్‌ ఎండీ సుజయ్‌ కారంపురి ఈ అవార్డును అందుకున్నాడు.[11][12]

మూలాలు

మార్చు
  1. "ఇంటింటికీ ఇంటర్నెట్‌". Sakshi. 2020-07-08. Archived from the original on 2020-09-03. Retrieved 2021-11-27.
  2. www.ETTelecom.com. "Telangana Fiber Grid Corp and HP Enterprise to launch 'digital villages' pilot project - ET Telecom". ETTelecom.com (in ఇంగ్లీష్). Retrieved 2021-11-27.
  3. T-Fiber showcased at WCIT in Hyderabad
  4. "Telangana unveils T-Fiber network". The Hindu Business Line. 19 February 2018. Retrieved 20 February 2020.
  5. "Telangana showcases T-Fiber at World IT Congress". The Hindu (in Indian English). Special Correspondent. 2018-02-20. ISSN 0971-751X. Retrieved 2021-11-27.{{cite news}}: CS1 maint: others (link)
  6. "T-Fiber Project To Be Completed By Mid-2018: KTR". Moneycontrol (in ఇంగ్లీష్). Retrieved 2021-11-27.
  7. "Government to provide high-speed internet to 83 lakh households". The New Indian Express. Archived from the original on 2021-11-27. Retrieved 2021-11-27.
  8. "Fibre grid to go underground with Mission Bhagiratha pipelines". The Hindu (in Indian English). Special Correspondent. 2016-06-14. ISSN 0971-751X. Retrieved 2021-11-27.{{cite news}}: CS1 maint: others (link)
  9. Wu, Huizhong. "One Indian State's Grand Plan to Get 23 Million People Online". Wired (in అమెరికన్ ఇంగ్లీష్). ISSN 1059-1028. Retrieved 2021-11-27.
  10. "'టి ఫైబర్‌'తో రైతు వేదికలకు ఇంటర్నెట్‌." Sakshi. 2021-04-09. Archived from the original on 2021-04-13. Retrieved 2021-11-27.
  11. India, The Hans (2022-06-21). "T-Fiber gets ICT transformation award under 'Digital India' from KCCI Gujarat". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2022-06-21. Retrieved 2022-06-23.
  12. "T-Fiber receives ICT transformation award". The New Indian Express. 2022-06-21. Archived from the original on 2022-06-21. Retrieved 2022-06-23.