ఫ్లోరోబోరిక్ ఆమ్లం
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
ఫ్లోరోబోరిక్ ఆమ్లంఒక ఆకర్బన రసాయన సంయోగ పదార్ధం.ఇది బలమైన ఆమ్లం.ఇది ద్రవస్థితిలో వున్న ఆమ్లం. దీనిని టెట్రాఫ్లోరోబోరిక్ ఆమ్లం అనికూడా అంటారు. ఈ ఆమ్లం యొక్క రసాయన ఫార్ములా H3OBF4.ఫ్లోరోబోరిక్ ఆమ్లాన్ని ఇతర ఫ్లోరోబోరేట్లవణాలను ఉత్పత్తి చేయు పూర్వగామిగా వాడుటకై ఉత్పత్తి చేస్తారు.ఫ్లోరోబోరిక్ ఆమ్లం తినివేయు/క్షయికరణ గుణం కల్గిన ఆమ్లం.ఇది చర్మం మీద తన ప్రభావాన్ని కనపర్చుతుంది.ఈ ఆమ్లం వాణిజ్యపరంగా నీటిలో కాని లేదా డైఇథైల్ ఇథరు వంటి ద్రావణిలలో కరగింఛిన స్థితిలో లభిస్తుంది.ఈ ఆమ్లం పెర్క్లోరిక్ ఆమ్లంవంటి అణు నిర్మాణాన్ని కల్గిఉన్నది.
పేర్లు | |
---|---|
Preferred IUPAC name
టెట్రా ఫ్లోరోబోరిక్ ఆమ్లం | |
ఇతర పేర్లు
టెట్రా ఫ్లోరోబోరిక్ ఆమ్లం, oxonium tetrafluoroboranuide, oxonium tetrafluoridoborate(1-)
| |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | |
పబ్ కెమ్ | 28118 |
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 240-898-3 |
వైద్య విషయ శీర్షిక | Fluoroboric+acid |
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:38902 |
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | ED2685000 |
SMILES | F[B](F)(F)[FH] |
జి.మెలిన్ సూచిక | 21702 |
ధర్మములు | |
BF4H | |
మోలార్ ద్రవ్యరాశి | 87.81 g·mol−1 |
స్వరూపం | రంగులేని ద్రవం |
ద్రవీభవన స్థానం | −90 °C (−130 °F; 183 K) |
బాష్పీభవన స్థానం | 130 °C (266 °F; 403 K) |
ఆమ్లత్వం (pKa) | ~1.8 (MeCN solution)[1] |
ప్రమాదాలు | |
భద్రత సమాచార పత్రము | External MSDS |
ఇ.యు.వర్గీకరణ | {{{value}}} |
R-పదబంధాలు | R34 |
S-పదబంధాలు | (S1/2), S26, మూస:S27, S45 |
సంబంధిత సమ్మేళనాలు | |
సంబంధిత సమ్మేళనాలు
|
Hydrogen fluoride |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
భౌతిక ధర్మాలు
మార్చుఫ్లోరోబోరిక్ ఆమ్లం రంగులేని ద్రవఆమ్లం.విష పూరితమైనది.[2]
అణుభారం
మార్చుఫ్లోరోబోరిక్ ఆమ్లం అణుభారం 87.81గ్రాములు/మోల్[3]
సాంద్రత
మార్చు20°Cవద్ద ఫ్లోరోబోరిక్ ఆమ్లం సాంద్రత1.38గ్రాములు/మి.లీ[4]
ఫ్లోరోబోరిక్ ఆమ్లం ద్రవీభవన స్థానం −90 °C(−130 °F;183 K)[4]
మరుగు ఉష్ణోగ్రత
మార్చుఫ్లోరోబోరిక్ ఆమ్లం బాష్పీభవన స్థానం 130 °C(266 °F;403 K)[4] సాల్వెంట్ ఫ్రీ ఫ్లోరోబొరిక్ ఆమ్లాన్ని వేరుపరచ లేనప్పటికీ,వీటి యొక్కద్రావణీయలను(solvates)ను విశ్లేషించడం జరిగింది.ఈలవణాలు ప్రోటోనేటేడ్ ద్రావణిని కేటాయాన్ గా కల్గి(ఊదా: H3O+ and H5O+2), చుర్భుజకోణ BF−4 అనయాన్ కల్గి ఉండును. ఇందులోని అనయాన్, కేటాయాన్ లు బలమైన హైడ్రోజన్ బంధాన్ని కల్గి ఉండును.
రసాయన చర్యలు
మార్చునీటిలో కరిగినపుడు వేడిని విదుదలచేయును[2].
ఉత్పత్తి
మార్చుబోరిక్ ఆమ్లాన్ని సజల హైడ్రోఫ్లోరిక్ ఆమ్లంలో కరగించి ఫ్లోరోబోరిక్ ఆమ్లం తయారు చేయుదురు.సజల ఫ్లోరో బొరిక్ ఆమ్లాన్నిబొరిక్ ఆమ్లంతో చర్య జరిపించినపుడు మూడు హైడ్రో ఫ్లోరిక్ ఆమ్ల ఇక్విలెంట్ భాగాల చర్యా ఫలితంగా మధ్య స్థాయి బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఏర్పడును.నాల్గవ ఇక్విలెంట్ హైడ్రో ఫ్లోరిక్ ఆమ్లభాగం చర్యా ఫలితంగాఫ్లోరో బొరిక్ ఆమ్లాన్ని ఏర్పడును.
- B(OH)3 + 4 HF → H3O+ + BF−4 + 2 H2O
నిర్జల/అనార్ద్ర ఫ్లోరోబొరిక్ ఆమ్లాన్ని అనార్ద్ర అసిటిక్ (acetic anhydride)తోచర్య జరిపించి ఉత్పత్తి చెయ్యవచ్చును.
అనువర్తనాలు
మార్చుఫ్లోరోబోరేటులను ఉత్పత్తి చెయ్యుటకు ఫ్లోరోబోరిక్ ఆమ్లాన్ని పూర్వగామి(precursor)గా వినియోగిస్తారు.లోహఆక్సైడ్ లను ఫ్లోరో బోరిక్ ఆమ్లంతో చర్య జరిపి ఫ్లోరోబోరేట్ లను తయారు చేయుదురు.జ్వాల వ్యాప్తి నిరోధక పదార్థాల తయారీలో,,ఫ్రిట్స్/సెరామిక్ పదార్థాలు(frits)మెరుగు పరచుటలో ఈ ఆకర్బనలవణాలను వాడెదరు.[5] అలాగే అల్యూమినియం ఇచ్చింగ్(etching)అ, ఆసిడ్ పికిలింగ్(acid pickling)లో ఉపయోగిస్తారు.
సేంద్రియ రసాయన శాస్త్ర పరిధిలో వినియోగం
మార్చుఅల్కిలెసన్(alkylation), పాలిమెరిజేసన్ లో ఫ్లోరో బోరిక్ ఆమ్లాన్ని ఉత్ప్రేరకంగా వాడెదరు.
గల్వమిక్ సెల్స్(Galvanic cells)
మార్చుగాల్వనిక్ ఆక్సిజన్ సెన్సర్ వ్యవస్థలో ఫ్లోరోబోరిక్ ఆమ్లాన్నిఎలక్ట్రోలైట్గా ఉపయోగిస్తారు.
మెటల్ ప్లెటింగు
మార్చుక్రోమియం(III)ఆక్సైడ్, సల్ఫోనిక్ ఆమ్లంతో కలిపి కాతోడ్ చర్య ద్వారా టిన్ ప్లేటేడ్ స్టిల్ లోహ పూతగాఉపయోగిస్తారు.ఎలక్ట్రో ప్లేటింగులో ఉపయోగిస్తారు[2]..
ఇవికూడా చూడండి
మార్చుఅధారాలు/మూలాలు
మార్చు- ↑ Kütt, A., et al., "Equilibrium Acidities of Superacids", J. Org. Chem. 2010, volume 76, pp. 391-395. doi:10.1021/jo101409p
- ↑ 2.0 2.1 2.2 "FLUOROBORIC ACID". cameochemicals.noaa.gov. Archived from the original on 2017-04-11. Retrieved 2017-04-11.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Fluoroboric Acid". pubchem.ncbi.nlm.nih.gov. Archived from the original on 2017-04-11. Retrieved 2017-04-11.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ 4.0 4.1 4.2 "Fluoroboric acid". chemicalbook.com. Archived from the original on 2017-04-11. Retrieved 2017-04-11.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "FLUOROBORIC ACID". chemicalland21.com. Archived from the original on 2017-04-11. Retrieved 2017-04-11.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)