బండి నారాయణస్వామి

తెలుగు కథకుడు, నవలా రచయిత
Camera-photo.svg
ఈ వ్యాసాన్ని ఆకర్షణీయంగా అభివృద్ధి చేసే దిశగా వ్యాసం లో బొమ్మ(ఫోటో) లేదా బొమ్మలు(పొటోలు) కోరడమైనది. బొమ్మలు అప్ లోడ్ చేసే సహాయానికి చూడండి.

బండి నారాయణస్వామి అనంతపురం జిల్లాకు చెందిన కథారచయిత, నవలాకారుడు.[1] 'స్వామి' పేరుతో సుప్రసిద్ధుడు.

బండి నారాయణస్వామి
జననంబండి నారాయణస్వామి
1952 జూన్ 3
అనంతపురం జిల్లా అనంతపురం
ఇతర పేర్లుస్వామి
వృత్తివిశ్రాంత ఉపాధ్యాయుడు
సాధించిన విజయాలుభావుకుడు, తాత్వికుడు, కమ్యూనిష్టు భావజాలం పట్ల మొగ్గుచూపిన కథారచయిత. దళితబహుజనవాది.
భార్య / భర్తపరంజ్యోతి
పిల్లలుహృదయవిహారి, అరుణాచల సౌరిస్
తండ్రిబండి హన్నూరప్ప
తల్లిపోలేరమ్మ

జీవిత విశేషాలుసవరించు

బండి నారాయణస్వామి అనంతపురం జిల్లా అనంతపురం పాతఊరులో 1952 జూన్ 3 న జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు హన్నూరప్ప, పోలేరమ్మ. తల్లి,తండ్రి కూలిపని చేసేవారు. తండ్రి తరిమెల నాగిరెడ్డి అనుచరుడు. బాల్యం నుండే స్వామికి పుస్తకపఠనం పట్ల ఆసక్తి కలిగింది. స్థానిక గ్రంథాలయ పుస్తకాలను చదివేవాడు. తండ్రి తెప్పించే సోవియట్ యూనియన్ పుస్తకాలను చదివి ఉత్తేజం పొందాడు. బాల్యస్నేహితుడు దక్షిణామూర్తి ప్రోత్సాహంతో తెలుగు పత్రికలు, నవలలు చదివాడు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పీజీ సెంటర్ లో ఉన్నత విద్యను అభ్యసించాడు. బి.ఎడ్.చేశాడు. ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. జ్వాలాముఖి, ఇస్మాయిల్, చిలుకూరి దేవపుత్ర, నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, కాళీపట్నం రామారావుల నుండి ప్రేరణ పొందాడు.

రచనలుసవరించు

 • మొదటి కథ పరుగు ఆంధ్రప్రభ పత్రికలో ప్రచురింపబడింది.
 • చమ్కీదండ కథకు ఆంధ్రజ్యోతి పత్రికలో రూ.1116/- బహుమతి వచ్చింది.
 • వానరాలె, నడక, తెల్లదయ్యం కథలు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
 • మొత్తం నలభై దాకా కథలు వ్రాశాడు.
 • వీరగల్లు కథాసంపుటి వెలువడింది.
 • గద్దలాడ్తాండాయి, మీరాజ్యం మీరేలండి, రెండు కలలదేశం మొదలైన నవలలు వ్రాశాడు.
 • శప్తభూమి నవల: తానా సంస్థ 2017 లో నిర్వహించిన నవలల పోటీలో బహుమతి పొందింది.

సాహితీ పురస్కారాలుసవరించు

 • మధురాంతకం కథాకోకిల అవార్డు
 • అప్పాజ్యోష్యుల విష్ణుబొట్ల ఫౌండేషన్ అవార్డు
 • ఎన్టీఆర్ ట్రస్ట్ అవార్డు
 • కొలకలూరి పురస్కారం
 • కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం - శప్తభూమి నవలకు.

మూలాలుసవరించు

 1. ఎం. వి, నాగసుధారాణి. "రాయలసీమ కథలు క్షామ చిత్రణ" (PDF). shodhganga. తిరుపతి: శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 48. Retrieved 1 December 2017.