బంధువులొస్తున్నారు జాగ్రత్త

బంధువులొస్తున్నారు జాగ్రత్త శరత్ దర్శకత్వంలో 1989లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాను సేన క్రియేషన్స్ పతాకంపై చలసాని శరత్ బాబు నిర్మించాడు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, రజని ముఖ్యపాత్రలు పోషించారు.

బంధువులొస్తున్నారు జాగ్రత్త
దర్శకత్వంశరత్
నిర్మాతచలసాని శరత్ బాబు
తారాగణంరాజేంద్రప్రసాద్, రజని
సంగీతంవాసురావు
నిర్మాణ
సంస్థ
సేనా కంబైన్స్
విడుదల తేదీ
1989[1]
భాషతెలుగు

కథ మార్చు

ఓ బ్యాంకులో పని చేసే చిట్టిబాబుకు నా అన్న వాళ్ళెవరూ ఉండరు. అతని మిత్రుడు సుధాకర్. బంధువులు లేరని చిట్టిబాబు వాపోవడం చూసి తమ ఊర్లో జరిగే ఒక పెళ్ళికి తీసుకెళతాడు సుధాకర్. అక్కడ సీత అనే అమ్మాయి ప్రేమలో పడతాడు చిట్టిబాబు. సీత తండ్రి సుబ్బారావు బంధువుల సంతోషం కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. వాళ్ళ బంధువులు కూడా సుబ్బారావు ఇల్లు గుల్ల చేస్తుంటారు. చిట్టిబాబు పెద్దల్ని ఒప్పించి ఆమెను పెళ్ళి చేసుకుంటాడు. మద్రాసులో కాపురం పెడతాడు. బంధువులందరూ మద్రాసు చూసే నెపంతో చిట్టిబాబు ఇంటిమీద పడతారు. చిట్టిబాబుకు మొదట్లో సంతోషంగానే ఉన్నా తర్వాత బంధువులనందరినీ పోషించడానికి ఖర్చు తడిసి మోపెడవుతుంది. వాళ్ళ ప్రవర్తన మార్చడానికి స్నేహితుడు సుధాకర్ తో కలిసి నాటకమాడి వారందరికీ కనువిప్పు కలుగజేస్తాడు.

తారాగణం మార్చు

పాటల జాబితా మార్చు

  • మా సిరికి మీహరికి , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల
  • అందాల, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • ఆ ఆహో, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,పి సుశీల
  • మధుర మదన , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • ముందు పక్కా , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • బంధువులోస్తున్నారు జాగ్రత్త , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

మూలాలు మార్చు

  1. "Movie Page on Cineratham". Archived from the original on 2019-08-26. Retrieved 2019-08-26.