శరత్ పోలవరపు
పోలవరపు శరత్ - ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు.1986లో సుమన్ హీరోగా నటించిన చాదస్తపు మొగుడు సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు.
హీరో కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు చిత్రానికి అప్రెంటిస్‌గా కెరీర్ ప్రారంభించిన శరత్ ఎ.కోదండరామిరెడ్డి దగ్గర అసోసియేట్‌గా ఎక్కువ కాలం పనిచేశారు.[1] నందమూరి బాలకృష్ణ హీరోగా వంశోద్ధారకుడు, పెద్దన్నయ్య, సుల్తాన్ చిత్రాలను తెరకెక్కించి ప్రత్యేకత చాటుకున్నారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు నటించిన రథసారథి, కాలేజీబుల్లోడు, పండగ చిత్రాలు ఆయనికి చక్కని పేరు తెచ్చిపెట్టాయి. శరత్ తన 15ఏళ్ల సినీప్రయాణంలో దాదాపు 35 చిత్రాలు దర్శకత్వం వహించారు. 2001లో తన ఆఖరి చిత్రం శ్రీహరి కథానాయకుడిగా వచ్చిన ఎవడ్రా రౌడీ. ఆయన సోదరుడు 1979లో వచ్చిన రతీమన్మథ చిత్ర దర్శకుడు పోలవరపు బ్రహ్మనందరావు.
74 ఏళ్ల శరత్ 2022 ఏప్రిల్ 1న హైదరాబాదులో క్యాన్సర్‌తో బాధపడుతూ కన్నుమూశారు.[2]
మూలాలు
మార్చు- ↑ "సీనియర్ దర్శకుడు శరత్ కన్నుమూత". www.andhrajyothy.com. Archived from the original on 2022-04-02. Retrieved 2022-04-02.
- ↑ "ప్రముఖ సీనియర్ దర్శకుడు కన్నుమూత". ETV Bharat News. Retrieved 2022-04-02.
ఈ వ్యాసాన్ని ఏ వర్గం లోకీ చేర్చలేదు. దీన్ని సముచిత వర్గం లోకి చేర్చండి. (ఏప్రిల్ 2022) |