బడాయి బసవయ్య 1980, మార్చి 14న విడుదలైన కుటుంబగాథాచిత్రం.

బడాయి బసవయ్య
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం బోయిన సుబ్బారావు
తారాగణం నూతన్ ప్రసాద్,
చంద్రమోహన్ ,
కవిత
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ శ్రీ శక్తి చిత్ర
భాష తెలుగు

నటీనటులు సవరించు

సాంకేతికవర్గం సవరించు

కథ సవరించు

బడాయిలు పలుకుతుండడం బసవయ్య అలవాటు. ఎవరి దగ్గర ఎన్ని బడాయిలు పలికినా తండ్రిని చూస్తే మాత్రం బసవయ్యకు భయం. ఆస్తి అంతా తండ్రి చేతుల్లో ఉండడం అందుకు కారణం కావచ్చు. బసవయ్యకు చాలామంది మిత్రులు. అందులో ఒకరు మరీ ముఖ్యుడు. అతనితో స్నేహం పర్యవసానంగా బసవయ్య తండ్రితో తగాదాపడి తన వాటా ఆస్తిని స్వాధీనం చేసుకుంటాడు. బసవయ్యకు ఒక కుమార్తె ఉన్నది. ఆస్తి స్వాధీనం అయిన వెంటనే బసవయ్య మద్రాసు వెళ్లి సినిమా తీస్తాడు. ఆ సినిమా డబ్బాలు అతనికే తిరిగి వస్తాయి. బసవయ్య చేతిలో పైసా మిగలకుండా పోతుంది. రోజులు గడవడమే గండంగా ఉంటే బసవయ్య తన కూతురుకు పెళ్లి ఏం చేయగలడు? ఆ పరిస్థితిలో అతనికి ఎవరు సహాయం చేశారన్నది సినిమా తరువాతి కథ[1].

పాటలు సవరించు

  1. ఎక్కడ ఉన్నదిరా ధర్మం ఏమైపోయిందిరా అడుక్కుతిన్న - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
  2. ఓంకార స్వరూపుణి సర్వాదీస్టప్రదాయినీ ( శ్లోకం ) - ఎస్.జానకి
  3. కాలేజీ చదువయ్యకా మ్యారేజి అయ్యేదాకా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  4. బడాయి బసవయ్యా బజారు పాలైనాడయ్యా - పి. సుశీల బృందం
  5. మదన జనక నీ మగసరి చూసి మత్తైపోయారా - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  6. ద్రౌపదీవస్త్రాపహరణం ( నాటకం ) - నూతన్ ప్రసాద్ బృందం

మూలాలు సవరించు

  1. వి.ఎస్.అవధాని (9 March 1980). "బడాయి బసవయ్య బడాయిలు". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 66, సంచిక 335. Archived from the original on 29 నవంబరు 2020. Retrieved 22 January 2018.

బయటిలింకులు సవరించు