బనిహాల్-ఖాజీగుండ్ రైల్వే సొరంగం

 

బనిహాల్-ఖాజీగుండ్ రైల్వే సొరంగం
ఖాజీగుండ్ రైల్వే సొరంగం
అవలోకనం
వరుసజమ్మూ తావి-ఉధంపూర్- శ్రీనగర్-బారాముల్లా రైలు మార్గం
ప్రదేశంజమ్మూ కాశ్మీర్
స్థితిపనిచేస్తోంది
మొదలుబనిహాల్
చివరఖాజీగుండ్
నిర్వహణ వివరాలు
ప్రారంభం2013 జూన్
యజమనిభారతీయ రైల్వేలు
నిర్వాహకుడుభారతీయ రైల్వేలు
ట్రాఫిక్రైళ్ళు
సాంకేతిక వివరాలు
లైన్ పొడవు11.21 కి.మీ. (6.97 మై.)
ట్రాక్‌ల సం.ఒకటే ట్రాకు
ట్రాక్ గేజ్1,676 mm (5 ft 6 in) (బ్రాడ్ గేజి)
కార్యాచరణ వేగం75 km/h (47 mph) దాకా

బనిహాల్-ఖాజీగుండ్ రైల్వే సొరంగం 11.215 కిలోమీటర్లు (6.969 మై.) పొడవున్న రైల్వే సొరంగం. దీన్ని పీర్ పంజాల్ రైల్వే సొరంగం అని కూడా అంటారు. ఇది జమ్మూ కాశ్మీర్‌లోని మధ్య హిమాలయాలలోని పిర్ పంజాల్ శ్రేణిలో ఖాజిగుండ్ పట్టణానికి దక్షిణంగా ఉంది. ఇది జమ్మూ-బారాముల్లా రైలు మార్గంలో భాగం.

రైల్వే సొరంగం ఉత్తర ప్రవేశం 33°33′42″N 75°11′56″E / 33.5617942°N 75.1988626°E / 33.5617942; 75.1988626 వద్ద, దక్షిణ ప్రవేశం 33°27′48″N 75°11′38″E / 33.463203°N 75.193992°E / 33.463203; 75.193992. వద్ద ఉన్నాయి.

పొడవు, ఎత్తు

మార్చు

రైల్వే సొరంగం సముద్రమట్టం నుండి సగటున 1,760 మీ. (5,770 అ.) ఎత్తున లేదా ప్రస్తుతం ఉన్న జవహర్ రోడ్డు సొరంగానికి 440 మీ. (1,440 అ.) దిగువన ఉంది.[1] సొరంగం 8.40 మీటర్లు (27.6 అ.) వెడల్పు 7.39 మీటర్లు (24.2 అ.) ఎత్తు ఉంది. ఈ సొరంగం పొడవునా దానికి సమాంతరంగా 3 మీటర్ల వెడల్పున్న నిర్వహణ సొరంగం కూడా నిర్మించారు. రైలు పట్టాల నిర్వహణకు అత్యవసర సహాయం కోసం దీన్ని నిర్మించారు. రైలు సొరంగం గుండా వెళ్ళడానికి దాదాపు 9 నిమిషాల 30 సెకన్లు పడుతుంది.[2][3]

కొద్దికాలం పాటు, బనిహాల్-ఖాజిగుండ్ రైల్వే సొరంగమే, భారతదేశంలోని అత్యంత పొడవైన రైల్వే సొరంగం. [2] జిరిబామ్-ఇంఫాల్ లైన్‌లో సేనాపతి, ఇంఫాల్ పశ్చిమ జిల్లాల మధ్య 11.55 కి.మీ పొడవున్న రైలు సొరంగం పూర్తయితే, భారతదేశంలోని అతి పొడవైన సొరంగంగా అది, పీర్ పంజాల్ రైల్వే సొరంగాన్ని అధిగమిస్తుంది.[4]

ప్రాజెక్టు పురోగతి

మార్చు

బనిహాల్‌లోని బిచ్లేరి లోయను కాశ్మీర్ లోయలోని ఖాజిగుండ్ ప్రాంతంతో కలుపుతూ జమ్మూ-బారాముల్లా లైన్ కోసం కొత్త బనిహాల్ - ఖాజిగుండ్ సొరంగాన్ని దాని ఉధంపూర్ - శ్రీనగర్ - బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించారు. తవ్వకం నాలుగు సంవత్సరాలలో - 2011 అక్టోబరులో - పూర్తయింది, దాని లైనింగు, రైలు ట్రాక్‌ల ఏర్పాటు తదుపరి పనులు మరో సంవత్సరంలో పూర్తయి, 2012 డిసెంబరు 28 న ట్రయల్ రన్ మొదలైంది. సొరంగం 2013 జూన్ 26 న ప్రారంభమైంది. జూన్ 27 నుండి వాణిజ్య రవాణా మొదలైంది.

రైలు సొరంగం వలన ఖాజీగుండ్ బనిహాల్‌ల మధ్య దూరం 17 కిలోమీటర్లు (11 మై.) తగ్గింది (రోడ్డు ద్వారా ఈ దూరం 35 కిలోమీటర్లు).[5] బనిహాల్ రైల్వే స్టేషను సగటు సముద్ర మట్టాని నుండి 1,702 మీ. (5,584 అ.) ఎత్తున ఉంది. కాశ్మీర్‌లోని బనిహాల్ నుండి బారాముల్లా వరకు రైల్వే నెట్‌వర్క్ ఇప్పుడు 137 కిలోమీటర్లు (85 మై.). జమ్మూ-బారాముల్లా మార్గం లోని 148 కిలోమీటర్లు (92 మై.) కత్రా -బనిహాల్ విభాగం నిర్మించే వరకు, ప్రజలు జమ్మూ తావి లేదా ఉదంపూర్ నుండి బనిహాల్‌కు రోడ్డు మార్గంలో ప్రయాణించవచ్చు, బనిహాల్ నుండి శ్రీనగర్‌కు బనిహాల్ రైల్వే సొరంగం ద్వారా రైలులో ప్రయాణించవచ్చు.

గ్యాలరీ

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "J & K Project Brief". usbrl.org.
  2. 2.0 2.1 "India's longest railway tunnel unveiled in Jammu & Kashmir". The Times of India. 14 October 2011. Archived from the original on 29 June 2013. Retrieved 14 October 2011.
  3. "Railways' Himalayan Blunder". Tehelka Magazine, Vol 8, Issue 32. 13 Aug 2011. Archived from the original on 19 September 2012.
  4. Imphal, 4th capital city in NE, to come on railway map within 27 months, Assam Tribune, 13 Sep 2021.
  5. "Indian Railways makes history, runs train through Asia's second longest tunnel".