ఉధంపూర్
ఉధంపూర్, జమ్మూ కాశ్మీరు కేంద్రపాలిత ప్రాంతానికి లోని పట్టణం. ఇది ఉధంపూర్ జిల్లా ముఖ్యపట్టణం. ఇది పురపాలక సంఘం హోదాతోఉన్న పట్టణం. రాజా ఉధమ్ సింగ్ పేరు మీద ఈ పట్టణానికి పేరు వచ్చింది. ఇక్కడ భారత సైన్యపు ఉత్తర కమాండు ప్రధాన కార్యాలయం ఉంది. భారత వైమానిక దళానికి చెందిన ఫార్వర్డ్ బేస్ సపోర్ట్ యూనిట్ (ఎఫ్‌బిఎస్‌యు) ఇక్కడే ఉంది. జాతీయ రహదారి 1 ఎలో సాయుధ దళాలు ప్రయాణించేటప్పుడు జమ్మూ, శ్రీనగర్ ల మధ్య ఉధంపూర్ ను మార్గాంతర రవాణా/విశ్రాంతి స్థలంగా వాడుకుంటాయి.
ఉధంపూర్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 32°54′58″N 75°08′31″E / 32.915977°N 75.141937°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | జమ్మూ కాశ్మీరు |
జిల్లా | ఉధంపూర్ |
Founded by | రాజా ఉధం సింగ్ |
Named for | రాజా ఉధం సింగ్ |
Government | |
• Body | ఉధంపూర్ పురపాలక సంఘం |
విస్తీర్ణం | |
• Total | 51 కి.మీ2 (20 చ. మై) |
Elevation | 755 మీ (2,477 అ.) |
జనాభా (2016) | |
• Total | 2,15,213 |
• జనసాంద్రత | 4,686/కి.మీ2 (12,140/చ. మై.) |
భాషలు | |
• అధికార భాషలు | హిందీ, డోగ్రీ |
Time zone | UTC+5:30 |
పిన్ | 182101 |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | 91-1992 |
Vehicle registration | JK-14 |
Website | udhampur.nic.in |
భౌగోళికం
మార్చుఉధంపూర్ జిల్లా హిమాలయాలకు సమీపంలోని శివాలిక్ కొండల పరిధిలో ఉంది. ఈ భూభాగం ఎక్కువగా పర్వత ప్రాంతం. జిల్లా లోని ఎగువ ప్రాంతాల్లో శీతాకాలంలో మంచు కురుస్తుంది. [1] సముద్ర మట్టం నుండి 756 మీటర్లు (2480 అడుగులు) ఎత్తున ఉన్న ఉధంపూర్ సాపేక్షంగా చదునుగా ఉంటుంది. ఇక్కడ మంచు కురవడం అరుదు.
పరిపాలన
మార్చు22 వార్డులతో ఉధంపూర్ పురపాలక సంఘం, పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.
శీతోష్ణస్థితి
మార్చునగరంలో ఉప ఉష్ణమండల శీతోష్ణస్థితి ఉంటుంది. వేసవి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు వరకు పెరుగుతాయి. శీతాకాలంలో గడ్డకట్టే ఉష్ణోగ్రత నమోదవుతుంది. వార్షిక వర్షపాతం 130 సెం. మీ. ఇందులో అధికభాగం వర్షాకాలం, శీతాకాలాలలో పడుతుంది, మారుతున్న శీతోష్ణస్థితి కారణంగా, ఇటీవలి సంవత్సరాలలో భారీ హిమపాతం సంభవిస్తోంది. 2011 లో సుమారు 15 సెం.మీ. మంచు కురిసింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో వడగళ్ల వానలు కురుస్తాయి.
జనాభా
మార్చు2016 అనధికారిక జనాభా లెక్కల ప్రకారం ఉధంపూర్ నగరంలో 2 లక్షల జనాభా ఉంది. అందులో పురుషులు 60.2%, మహిళలు 39.8%. మంది ఉన్నారు. నగర జనాభాలో సైన్యానికి చెందిన పురుషులు ఎక్కువగా నివసించుచున్న కారణంగా పురుషుల శాతం ఎక్కువుగా ఉంది. నగర సగటు అక్షరాస్యత 91.5%. నగరంలో హిందూ మతానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారు.
రవాణా సౌకర్యాలు
మార్చురోడ్డు మార్గం
మార్చుఉధంపూర్ జాతీయ రహదారి ఎన్ఎచ్-44 పైన ఉంది. ఇది శ్రీనగర్‌ను భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే ఏకైక జాతీయ రహదారి. ఉధంపూర్ నుండి ఇతర ప్రదేశాలకు ప్రయాణించటానికి ప్రైవేటు, ప్రభుత్వ యాజమాన్యంలోని బస్సులు ఉన్నాయి. కాశ్మీర్ లోయ, జమ్మూలకు రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. జమ్మూ, శ్రీనగర్, ఇతర సమీప పట్టణాలకు వెళ్ళడానికి టాక్సీ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. నగరంలో మినీబస్సులు తిరుగుతాయి.
రైలు మార్గం
మార్చుజమ్మూ కాశ్మీరు శీతాకాల రాజధాని అయిన జమ్మూతో ఉధంపూర్‌కు రైలు రవాణా సౌకర్యాలున్నాయి. 2005 లో న్యూడిల్లీ ఉత్తర సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ఈ మార్గంలో నడిచిన మొదటి రైలు. డజనుకు పైగా సుదూర రైళ్లు ఉధంపూర్ రైల్వే టెర్మినస్ నుండి భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలకు వెళ్తాయి. ప్యాసింజర్ రైళ్లు జమ్మూ, ఉధంపూర్‌లను అనుసంధానిస్తాయి. రైల్వే నిర్మాణ సంస్థ (జమ్మూ-బారాముల్లా) ఉధంపూర్, శ్రీనగర్లను అనుసంధానించే పనిలో ఉంది.
వాయు మార్గం
మార్చుభారత వైమానిక దళం (ఐఎఎఫ్) ఉధంపూర్ వైమానిక దళం స్టేషన్ ఉధంపూర్‌కు ఉంది. అయితే ఇక్కడ పౌరుల రవాణా సౌకర్యానికి అనుమతి లేదు. ఉధంపూర్‌కు సమీప సమీప పౌర విమానాశ్రయం జమ్మూ విమానాశ్రయం.
సరాసరి వాతావరణ పట్టిక
మార్చుశీతోష్ణస్థితి డేటా - Udhampur | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
అత్యధిక రికార్డు °C (°F) | 24 (75) |
29 (84) |
33 (91) |
39 (102) |
40.5 (104.9) |
40.9 (105.6) |
41 (106) |
38 (100) |
32 (90) |
31 (88) |
29 (84) |
25 (77) |
41 (106) |
సగటు అధిక °C (°F) | 18.8 (65.8) |
21.9 (71.4) |
26.6 (79.9) |
32.9 (91.2) |
38.3 (100.9) |
40.6 (105.1) |
35.5 (95.9) |
33.7 (92.7) |
33.6 (92.5) |
31.7 (89.1) |
26.8 (80.2) |
21.1 (70.0) |
30.1 (86.2) |
సగటు అల్ప °C (°F) | 1.2 (34.2) |
9.7 (49.5) |
13.6 (56.5) |
19.0 (66.2) |
24.4 (75.9) |
26.8 (80.2) |
24.5 (76.1) |
24.0 (75.2) |
23.0 (73.4) |
18.4 (65.1) |
12.6 (54.7) |
8.5 (47.3) |
17.7 (63.9) |
అత్యల్ప రికార్డు °C (°F) | −4.4 (24.1) |
−3 (27) |
3 (37) |
6 (43) |
7 (45) |
13 (55) |
13 (55) |
8 (46) |
12 (54) |
4 (39) |
2 (36) |
−3 (27) |
−4.4 (24.1) |
సగటు వర్షపాతం mm (inches) | 50.0 (1.97) |
46.4 (1.83) |
53.2 (2.09) |
26.3 (1.04) |
16.0 (0.63) |
51.8 (2.04) |
283.4 (11.16) |
644.5 (25.37) |
123.9 (4.88) |
38.1 (1.50) |
11.9 (0.47) |
42.2 (1.66) |
1,387.7 (54.63) |
Source 1: BBC Weather | |||||||||||||
Source 2: IMD |
మూలాలు
మార్చు- ↑ "Maps, Weather, and Airports for Udhampur, India". Retrieved 5 February 2017.
బాహ్య లింకులు
మార్చు- ఉధంపూర్ ప్రభుత్వ వెబ్సైట్
- వైష్ణో దేవి మందిరం Archived 2007-02-04 at the Wayback Machine
- ఉధంపూర్ జిల్లా