బప్పీలహరి
బప్పీ లహరి (ఆంగ్లం: Bappi Lahiri) (1953 నవంబరు 27 - 2022 ఫిబ్రవరి 16) హిందీ సంగీత దర్శకుడు. తాహిర్ హుస్సేన్ చిత్రం ‘జఖ్మీ’ (1975)తో బాలీవుడ్‌లోకి ప్రవేశించాడు. ఆ తరువాత ఆయన ప్లేబ్యాక్ సింగర్‌గా కూడా మారాడు, ఈయన హిందీ, బెంగాలీ సినిమాలతో కొన్ని తెలుగు , తమిళ, కన్నడ, గుజరాతీ భాషల్లో చిత్రాలకు కూడా సంగీత దర్శకత్వం వహించాడు. హిందీ చిత్రరంగానికి డిస్కో సంగీతమును పరిచయము చేసిన ఘనత ఇతడిదే, బాలీవుడ్లో 50కి పైగా చిత్రాలకు సంగీతం సమకూర్చాడు. 1985 లో ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సంగీతకారుడిగా, 2018లో జీవితకాల సాఫల్య పురస్కారం అందుకొన్నాడు. కొంత కాలంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో 69 సంవత్సరాల వయస్సులో 15 ఫిబ్రవరి 2022న నవీ ముంబైలో మరణించాడు.[2]
బప్పీ లహరి | |
---|---|
జననం | అలొకేశ్ లహరి 1953 నవంబరు 27 చెన్నై, తమిళనాడు, భారతదేశం |
మరణం | 2022 ఫిబ్రవరి 16[1] | (వయసు 68)
జాతీయత | భారతీయుడు |
ఇతర పేర్లు | బప్పీ దా |
వృత్తి | స్వరకర్త, శబ్దగ్రాహకుడు, సంగీత దర్శకుడు, గాయకుడు, వాద్యకారుడు |
వెబ్సైటు | https://www.bappilahiri.com/ |
జననం
మార్చునవంబర్ 27, 1953లో జన్మించారు. ఆయన అసలు పేరు అలోకేష్ లహరి బెంగాల్ జల్పైగురిలో జన్మించాడు, తండ్రి అపరేష్, తల్లి బన్సూరి తల్లిదండ్రులిద్దరూ గాయకులు[3] అతను ఏకైక సంతానం. గాయకుడు కిషోర్ కుమార్ ఇతని బందువు(మామ),[4] మూడేళ్ల వయసులో ఉండగానే తబలా వాయించేవాడు, చిత్రాణి అనే గాయకురాలిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా గాయకుల కుటుంబం నుంచి వచ్చినది. బప్పీలహరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తె రేమా కూడా గాయకురాలు. ఆయన కుమారుడు బప్పా లహరి బాలీవుడ్లో సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాడు.
సంగీతాన్నందించిన తెలుగు సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | గమనికలు |
1986 | సింహాసనం | |
1987 | తేనే మనసులు | |
త్రిమూర్తులు | ||
శంఖారావం | ||
సామ్రాట్ | ||
1988 | కలెక్టర్ విజయ | |
మన్మధ సామ్రాజ్యం | ||
1989 | స్టేట్ రౌడీ | |
1990 | చిన్నా | |
చిన్న కోడలు | ||
1991 | ఇంద్ర భవనం | |
గ్యాంగ్ లీడర్ | ||
రౌడీ గారి పెళ్ళాం | ||
రౌడీ అల్లుడు | ||
1992 | దొంగ పోలీస్ | |
రక్త తర్పణం | ||
రౌడీ ఇన్స్పెక్టర్ | ||
బ్రహ్మ | ||
1993 | నిప్పు రవ్వ | |
రౌడీ రాజకీయం | ||
1995 | పెద్ద యజమాని | |
ముద్దాయి ముద్దుగుమ్మ | ||
ఖైదీ ఇన్స్పెక్టర్ | ||
పుణ్య భూమి నా దేశం | ||
2013 | యాక్షన్ 3D | తన కొడుకు బప్పా లహరితో కలిసి కంపోజ్ చేశారు |
2020 | డిస్కో రాజా | రమ్ పమ్ బమ్ అనే పాటకు గాయకుడు[5] |
రాజకీయ జీవితం
మార్చుబప్పి లాహిరి 2014 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అప్పటి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో 31 జనవరి 2014న పార్టీలో చేరాడు[6]. అతను 2014లో శ్రీరాంపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థిగా ఎంపికయ్యాడు, అయితే ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన కళ్యాణ్ బెనర్జీ చేతిలో ఓడిపోయాడు.
ఇవి కూడ చూడండి
మార్చుబయటి లింకులు
మార్చుమూలాలు
మార్చు- ↑ Sakshi (16 February 2022). "ప్రముఖ గాయకుడు బప్పి లహిరి కన్నుమూత". Archived from the original on 16 February 2022. Retrieved 16 February 2022.
- ↑ "Bappi Lahiri: ప్రముఖ సంగీత దర్శకుడు బప్పి లహిరి కన్నుమూత". EENADU. Retrieved 2022-02-16.
- ↑ Reddy, Divya (2022-02-16). "Bappi Lahiri: బప్పీలహరి తెలుగులో పాడిన చివరి పాట ఇదే." www.tv5news.in (in ఇంగ్లీష్). Retrieved 2022-02-16.
- ↑ "Bappi Lahiri made his acting debut in 1974 in a Kishore Kumar film". Zee News (in ఇంగ్లీష్). 2022-02-16. Archived from the original on 2022-02-16. Retrieved 2022-02-16.
- ↑ "'డిస్కోరాజా' 'రమ్ పమ్ బమ్' .. మామూలుగా లేదుగా ..?". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2022-02-16.
- ↑ "It's music to BJP, Bappi Lahiri joins party". The Hindu (in Indian English). Special Correspondent. 2016-05-13. ISSN 0971-751X. Retrieved 2022-02-16.
{{cite news}}
: CS1 maint: others (link)