డిస్కో రాజా

వి ఆనంద్ దర్శకత్వంలో 2020లో విడుదలైన తెలుగు చలనచిత్రం.

డిస్కో రాజా[2][3] 2020, జనవరి 24న విడుదలైన తెలుగు చలనచిత్రం.[4][5] వి ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ, పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్‌, వెన్నెల కిషోర్, సత్య, అజయ్, బాబీ సింహా తదితరులు నటించగా, ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించాడు. ఎస్.టి.ఆర్. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్ళూరి ఈ చిత్రాన్ని నిర్మించాడు.

డిస్కో రాజా
డిస్కో రాజా సినిమా పోస్టర్
దర్శకత్వంవి ఆనంద్
రచనవి ఆనంద్
అబ్బూరి రవి (మాటలు)
స్క్రీన్ ప్లేవి ఆనంద్
కథవి ఆనంద్
నిర్మాతరామ్ తాళ్లూరి
తారాగణంరవితేజ
పాయల్ రాజ్‌పుత్
నభా నటేష్
తాన్యా హోప్‌
Narrated byవి ఆనంద్
ఛాయాగ్రహణంకార్తీక్ ఘట్టమనేని
కూర్పుశ్రవణ్ కటికనేని
సంగీతంఎస్.ఎస్. తమన్
నిర్మాణ
సంస్థ
ఎస్.టి.ఆర్. ఎంటర్టైన్మెంట్స్
పంపిణీదార్లుఎస్.టి.ఆర్. ఎంటర్టైన్మెంట్
విడుదల తేదీ
24 జనవరి 2020 (2020-01-24)
సినిమా నిడివి
2 గంటల 29 నిముషాలు (149 నిముషాలు)
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్₹30 కోట్లు[1]

కథా సారాంశం

మార్చు

లడఖ్‌లో ప్రారంభమై ఢిల్లీ, చెన్నై, రుద్రాపూర్‌, ముంబై, గోవాల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. వాసు (రవితేజ) ఓ అనాథ. తనతో పాటు మరికొంతమంది అనాథలతో రామచంద్రం అనే ఓ పెద్దాయనతో కలిసి ఓ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఈ క్రమంలోనే నభా (నభా నటేష్‌)తో ప్రేమలో పడతాడు. అయితే తన కుటుంబానికి వచ్చిన సమస్యను సెటిల్‌మెంట్‌ చేసుకోవడం కోసం గోవా వెళ్లిన వాసు తిరిగిరాడు. అయితే ఇదే క్రమంలో కొన్ని అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటాయి. మరోవైపు పరిణితి ( తాన్యా హోప్‌), పాల్గుణి (వెన్నెల కిశోర్‌) అండ్‌ టీం చేసిన ఓ ప్రయోగం సక్సెస్‌ అవుతుంది. చివరికి ఆ ప్రయోగం చేసింది డిస్కో రాజా(రవి తేజ)పై అని తెలుసుకుంటారు. అయితే ఇంతకీ ఆసలు డిస్కో రాజా ఎవరు? బర్మా సేతు (బాబీ సింహా), హెలెన్‌ (పాయల్‌ రాజ్‌పుత్‌), భరణి (రామ్‌కీ), పీటర్‌ (సత్య), ఉత్తరకుమారా అలియాస్‌ దాస్‌ (సునీల్‌)లు ఈ కథలో ఎందుకు ఎంటర్‌ అవుతారా? అసలు వాసు, డిస్కో రాజాకు ఉన్న సంబంధం ఏమిటి? డిస్కో రాజాపై వారు చేసిన ప్రయోగం ఏమిటి? అనేదే డిస్కోరాజా సినిమా కథ.[6][7]

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు
డిస్కో రాజా
పాటలు by
Released2020
Recorded2019
Venueఏఎమ్ స్టూడియోస్
Studioచెన్నై
Genreసినిమా పాటలు
Labelలహరి మ్యూజిక్, టీ-సిరీస్
Producerఎస్.ఎస్.తమన్
ఎస్.ఎస్. తమన్ chronology
అల వైకుంఠపురములో
(2020)
డిస్కో రాజా
(2020)
మిస్ ఇండియా
(2020)
External audio
  Official Audio Jukebox యూట్యూబ్లో
మూస:Singles

ఈ చిత్రం రవితేజ, తమన్ కాంబినేషన్‌లో పదకొండవ సినిమా కాగా.. వి ఆనంద్, తమన్ కాంబినేషన్‌లో టైగర్ తరువాత రెండవ సినిమా.[13] సిరివెన్నెల సీతారామశాస్త్రి రచనలో ఎస్.పి. బాలసుబ్రమణ్యం పాడిన నువ్వు నాతో ఏమన్నావో పాట 2019, అక్టోబరు 19న విడుదలయింది.[14] రామజోగయ్య శాస్త్రి రచనలో ఆదిత్య అయ్యంగార్, గీతా మాధురి, రాహుల్ నంబియార్ తదితరులు పాడిన ఢిల్లీ వాలా పాట 2019, డిసెంబరు 20న విడుదలయింది.[15] సిరివెన్నెల సీతారామశాస్త్రి రచనలో రవితేజ, బప్పీలహరి, శ్రీకృష్ణ తదితరులు పాడిన రమ్ పమ్ బమ్ పాట 2020, జనవరి 16న విడుదలయింది. ఫ్రీక్ ఔట్ థీమ్ మ్యూజిక్ 2020, జనవరి 21న విడుదలయింది.

పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."నువ్వు నాతో ఏమన్నావో (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి. బాలసుబ్రమణ్యం5:40
2."ఢిల్లీ వాలా (రచన: రామజోగయ్య శాస్త్రి)"రామజోగయ్య శాస్త్రిఆదిత్య అయ్యంగార్, గీతా మాధురి, రాహుల్ నంబియార్5:11
3."రమ్ పమ్ బమ్ (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"సిరివెన్నెల సీతారామశాస్త్రిరవితేజ, బప్పీలహరి, శ్రీకృష్ణ3:26
4."ఫ్రీక్ ఔట్"థీమ్ మ్యూజిక్వాయిద్యం2:15
మొత్తం నిడివి:15:22

మార్కెటింగ్

మార్చు

2019, జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రవితేజ పుట్టినరోజున ఈ చిత్ర మోషన్ పోస్టర్ విడుదలయింది.[16] 2019, నవంబరు 6న బాబీ సింహా పుట్టినరోజున బర్మా సేతు పాత్రలో ఉన్న తన ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలయింది.[17] 2019, డిసెంబరు 4న రవితేజ ఉన్న కొత్త పోస్టర్‌ను విడుదలచేస్తూ టీజర్ విడుదల తేదీ ప్రకటించబడింది.[18] 2019, డిసెంబరు 5న పాయల్ రాజ్‌పుత్ పుట్టినరోజున తన ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలయింది.[19] 2019, డిసెంబరు 11న నభా నటేష్ పుట్టినరోజున తన ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలయింది.[20] 2019, డిసెంబరు 6న ఈ చిత్ర తొలి అధికారిక టీజర్ విడుదలయింది.[21] 2020, జనవరి 13న ఈ చిత్ర రెండవ అధికారిక టీజర్ విడుదలయింది.[22] 2020, జనవరి 19న హైదరాబాదు మాదాపూర్‌ లోని ఎన్ కన్వెన్షన్‌ లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగింది.[23]

విడుదల - స్పందన

మార్చు

ఈ చిత్రం 2020, జనవరి 24న విడుదలయింది.[24][25] సినీ విమర్శకులు, ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.

మూలాలు

మార్చు
 1. "Anand's script requires a budget of Rs 40 crore. Following the revisions, the budget has come down to Rs 30 crore". Deccan Chronicle. 3 May 2019. Retrieved 24 January 2020.
 2. "Disco Raja team announces teaser release date with a new poster featuring Ravi Teja. See pic - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 24 January 2020.
 3. "Disco Raja Teaser To Be Out On December 6, Ravi Teja Fans Delighted!". filmibeat (in ఇంగ్లీష్). 1 December 2019. Archived from the original on 6 December 2019. Retrieved 24 January 2020.
 4. "Ravi Teja's Disco Raja release date out". The New Indian Express. Retrieved 24 January 2020.
 5. "Ravi Teja's upcoming film Disco Raja to hit the big screen on THIS date; Find Out". PINKVILLA (in ఇంగ్లీష్). Archived from the original on 6 December 2019. Retrieved 24 January 2020.
 6. సాక్షి, సినిమా (24 January 2020). "'డిస్కో రాజా' మూవీ రివ్యూ". సంతోష్‌ యాంసాని. Archived from the original on 24 January 2020. Retrieved 24 January 2020.
 7. ఈనాడు, సినిమా (24 January 2020). "రివ్యూ: డిస్కోరాజా". Archived from the original on 24 January 2020. Retrieved 24 January 2020.
 8. 23 (6 December 2019). "Disco Raja Teaser : Ravi Teja Done With The Crap". Gulte (in english). Archived from the original on 6 December 2019. Retrieved 24 January 2020. {{cite web}}: |last= has numeric name (help)CS1 maint: unrecognized language (link)
 9. kavirayani, suresh (9 November 2019). "A birthday gift for Ravi Teja!". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 24 January 2020.
 10. Adivi, Sashidhar (6 December 2019). "From hot to versatile". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 24 January 2020.
 11. "Tanya Hope to play scientist in Ravi Teja's Disco Raja". The New Indian Express. Archived from the original on 15 July 2019. Retrieved 25 January 2020.
 12. "Bobby Simha's role in 'Disco Raja' revealed on his birthday". www.thenewsminute.com. Archived from the original on 6 December 2019. Retrieved 24 January 2020.
 13. "'It's a challenge to compose music for commercial films': S Thaman". The New Indian Express. 4 December 2019. Retrieved 24 January 2020.
 14. "Nuvvu Naatho Emannavo: A refreshing melody from Ravi Teja's Disco Raja". The Times of India. 20 October 2019. Retrieved 24 January 2020.
 15. "DISCO RAJA'S NEW SONG DILLI WALA' IS JUST 'WOW'". Iqlikmovies.com. 22 December 2019. Archived from the original on 15 January 2020. Retrieved 24 January 2020.
 16. "Disco Raja - Motion Poster". The Times of India. 26 January 2019. Retrieved 24 January 2020.
 17. "Bobby Simha as Burma Sethu in Disco Raja". The Times of India. 6 November 2019. Retrieved 24 January 2020.
 18. "Disco Raja team announces teaser release date with a new poster featuring Ravi Teja". The Times of India. 4 December 2019. Retrieved 24 January 2020.
 19. "First Look of Payal Rajput from Disco Raja". Tollywood.Net. 5 December 2019. Archived from the original on 8 December 2019. Retrieved 24 January 2020.
 20. "Birthday Girl Nabha Natesh's look from Ravi Teja-Vi Anand's film Disco Raja". The Times of India. 11 December 2019. Retrieved 24 January 2020.
 21. "Disco Raja teaser out! Ravi Teja is the perfect blend of disco and danger in VI Anand directorial". Times Now. 6 December 2019. Retrieved 24 January 2020.
 22. "Disco Raja Second Teaser Out, Ravi Teja Back with a Bang". CNN-News18. 14 January 2020. Retrieved 24 January 2020.
 23. "Disco Raja pre-release event to be held on January 19". The Times of India. 14 January 2020. Retrieved 24 January 2020.
 24. "Official: Ravi Teja's Disco Raja to hit the theaters on January 24, 2020". The Times of India. 7 November 2019. Retrieved 24 January 2020.
 25. "A birthday gift for Ravi Teja!". Deccan Chronicle. 9 November 2019. Retrieved 24 January 2020.

ఇతర లంకెలు

మార్చు