బసవకల్యాణ్
బసవకల్యాణ్ కర్ణాటక రాష్ట్రంలో బీదర్ జిల్లాలోని చారిత్రక నగరం, మునిసిపల్ పట్టణం. ఇది కల్యాణి చాళుక్యులు, కల్యాణి కలచురిలు అనే రెండు ప్రాచీన రాజవంశాలకు కేంద్రంగా ఉండేది. ఇక్కడ ప్రపంచంలోకెల్లా ఎత్తైన విగ్రహం (108 అడుగులు) ఉంది. ఇది బీదర్ జిల్లాలో ముఖ్యమైన పారిశ్రామిక కేంద్రం.
బసవకల్యాణ | |
---|---|
నగరం | |
Nicknames:
| |
Coordinates: 17°52′22″N 76°56′59″E / 17.87278°N 76.94972°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | కర్ణాటక |
కర్ణాటక విభాగాలు | కలబురగి |
ప్రాంతం | బయలుసీమె |
జిల్లా | బీదర్ జిల్లా |
తాలూకా | బసవకల్యాణ తాలూకా |
Government | |
• Type | మునిసిపల్ కౌన్సిల్ |
• Body | బసవకల్యాణ నగర పంచాయితీ |
విస్తీర్ణం | |
• Total | 32 కి.మీ2 (12 చ. మై) |
Elevation | 621 మీ (2,037 అ.) |
జనాభా (2011) | |
• Total | 69,717 |
• జనసాంద్రత | 2,200/కి.మీ2 (5,600/చ. మై.) |
• మగ | 36,116 |
• ఆడ | 33,601 |
Demonym(s) | బసవకల్యాణి, కల్యాణి |
భాషలు | |
• అధికారిక భాషలు | కన్నడ భాష |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పోస్టల్ కోడ్ | 585 327 |
టెలిఫోన్ కోడ్ | 08481 |
Vehicle registration | KA-56 |
Website | http://www.basavakalyancity.mrc.gov.in/ |
చరిత్ర
మార్చుస్వాతంత్ర్యానికి పూర్వం ఈ నగరాన్ని కళ్యాణి అని పిలిచేవారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత 12 వ శతాబ్దంలో కర్ణాటక ప్రాంతంలో గొప్ప సంఘ సంస్కర్త అయిన బసవణ్ణ పేరుమీదుగా దీనిని బసవకల్యాణ్ అని మార్చారు.
ఈ నగరాన్ని కల్యాణి చాళుక్యులు, కల్యాణి కలచురియులు, దేవగిరి యాదవులు, కాకతీయులు, ఢిల్లీ, బహమనీ, బీదర్, బీజాపూర్ సుల్తానులు, మొఘలులు, హైదరాబాద్ నిజాములు పరిపాలించారు.
సా.శ 1050 నుంచి 1195 వరకు దక్కన్ ప్రాంతాన్ని పరిపాలించిన పశ్చిమ చాళుక్యుల ముఖ్యపట్టణం ఇది. ఒకటవ సోమేశ్వరుడు (1041–1068) ఈ నగరాన్ని రాజధానిగా చేసుకుని, ఇంతకు ముందు ఉన్న బాదామి చాళుక్యుల నుంచి వేరుగా గుర్తింపు పొందడం కోసం, తమని తాము కల్యాణి చాళుక్యులనమని పిలుచుకున్నాడు. ఇతను తన రాజధాని నగరాన్ని మాన్యఖేటం (ప్రస్తుతం కలబురగి జిల్లా, మాల్ఖేడ్) నుంచి కళ్యాణికి మార్చాడు.[1] ఇతని తర్వాత రెండవ సోమేశ్వరుడు, ఆరవ విక్రమాదిత్య, మూడవ సోమేశ్వరుడు, మూడవ జగదేకమల్లుడు, మూడవ తైలపుడు ఈ ప్రాంతం నుంచి పరిపాలన చేశారు.
మూలాలు
మార్చు- ↑ "Sights around Basavakalyan". 28 March 2016.