బాజ్‌బాల్
బాజ్‌బాల్ అనేది 2022 ఇంగ్లీష్ క్రికెట్ సీజన్‌లో ESPN క్రిక్‌ఇన్‌ఫో UK ఎడిటర్ ఆండ్రూ మిల్లెర్ కాయించిన అనధికారిక పదం. ఇది టెస్ట్ మ్యాచ్‌లలో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ఆట తీరును సూచిస్తుంది. 2022 మేలో ఇంగ్లిష్ క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ, బ్రెండన్ మెకల్లమ్ను (ఇతని ముద్దుపేరు బాజ్ ) తమ టెస్టు జట్టుకు హెడ్ కోచ్‌గా, బెన్ స్టోక్స్‌ను టెస్ట్ కెప్టెన్‌గా నియమించిన తర్వాత వాళ్ళు దీనిని అభివృద్ధి చేశారు. 2023 అక్టోబరులో, లారెన్స్ బూత్, నిక్ హౌల్ట్ రచించిన బాజ్‌బాల్: ది ఇన్‌సైడ్ స్టోరీ ఆఫ్ ఎ టెస్ట్ క్రికెట్ రివల్యూషన్ అనే పుస్తకం దీని గురించే రాసారు.
బ్యాటింగులో గానీ, ఫీల్డింగులో గానీ, దాడిలో గానీ, డిఫెన్స్‌లో గానీ సానుకూల నిర్ణయాలు తీసుకోవడమే బాజ్‌బాల్ పద్ధతి, దాని ఆలోచనా ధోరణి. వన్ డే ఇంటర్నేషనల్, ట్వంటీ 20 మ్యాచ్‌లలో ఈ నైపుణ్యాలు, వ్యూహాలు చాలా వరకు అభివృద్ధి అయ్యాయి.[1] ఈ శైలి ప్రారంభమైనప్పటి నుండి 2023 జూన్ వరకు, ఇంగ్లండ్ సగటు రన్ రేట్ ఓవర్‌కు 4.65గా ఉంది. ఇది టెస్ట్ మ్యాచ్ చరిత్రలోనే అత్యధికం. వేగంగా పరుగులు తీసిన జట్టు తమ ఇన్నింగ్స్‌ను ముందుగానే డిక్లేర్ చేయడానికి, సాధారణంగా డ్రా అయ్యే మ్యాచ్‌లో ఫలితాన్ని సాధించడానికీ ఇది వీలు కలిగించింది.
మూలాలు
మార్చుపేరు
మార్చుస్విచ్ హిట్ పాడ్‌కాస్ట్ ఎపిసోడ్‌లో ESPN క్రిక్‌ఇన్‌ఫో UK ఎడిటర్ ఆండ్రూ మిల్లర్ "బాజ్‌బాల్" అనే పేరును ఉపయోగించారు. 2022 మేలో ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ కోచ్‌గా మెకల్లమ్ నియామకం తర్వాత ఇది జరిగింది. మెకల్లమ్ స్వయంగా ఈ పదాన్ని ఇష్టపడలేదు. ఇంగ్లాండ్ జట్టు సూక్ష్మ నైపుణ్యాల విధానాన్ని గానీ, తన నిర్వహణ శైలిని గానీ ఈ పదం వివరించడంలేదని ఆందోళన వ్యక్తం చేశాడు.[2] అతను "ఈ పిచ్చి మాట అంటే నాకు నిజంగా ఇష్టం లేదు... 'బాజ్‌బాల్' అంటే ఏమిటో కూడా నాకు తెలియదు. దానికి అర్థం ర్యాష్‌గా వెళ్ళేసి గుద్దేయడం కాదు." అన్నాడు.[3]అయినప్పటికీ, ఈ పేరు క్రికెట్ మీడియాలో విస్తృతంగా వ్యాప్తి లోకి వచ్చింది.[4][5][6]
బాజ్ అనేది బ్రెండన్ మెకల్లమ్ కున్న మారుపేరు నుండి వచ్చింది. ఆటగాడిగా అతను తన దూకుడు ఆటకు ప్రసిద్ధి చెందాడు. న్యూజిలాండ్ కెప్టెన్‌గా అతను అటాకింగ్ విధానాన్ని అమలు చేసి అత్యంత విజయవంతమయ్యాడు. ఈ విధానం, స్టీవ్ మెక్‌మోరాన్ అసోసియేటెడ్ ప్రెస్‌లో రాస్తూ, మెకల్లమ్ "బ్లాక్ క్యాప్స్ వారి సాంప్రదాయిక విధానాన్ని, అణగిమణగి ఉండే విధానాన్నీ విడనాడడానికి" దీన్ని వాడాడు.[7]
ఆలోచనా విధానం
మార్చుది గార్డియన్‌లోని అలీ మార్టిన్ బాజ్‌బాల్ తత్వాన్ని, "పాజిటివ్ రెడ్-బాల్ [టెస్ట్] క్రికెట్ ఆడడం; ఒత్తిడిని స్వీకరించడం, కానీ వీలైనంత త్వరగా, ధైర్యంగా తిరిగి దాన్ని ప్రత్యర్థులపై పెట్టదం; వికెట్లు తీయడమే ఫీల్డ్‌లో ఏకైక లక్ష్యంగా ఉండడం; డ్రాను అసలు పరిగణనలోకే తీసుకోకుండా ఐదు రోజులలో విజయం కోసం ప్రధానంగా కృషి చేయడం". [8]
క్రికెట్ రచయిత క్రిస్ స్టాక్స్, బాజ్‌బాల్‌లో ఉన్న ఏడు సూత్రాలను గుర్తించాడు. అత్యున్నత స్థాయిలో ఆడేటపుడు జట్టులో క్రికెట్ కోచ్ వీటిని పాటిస్తాడు. అవి:
- మరీ లోతుగా అలోచించకపోవడం
- నెగటివ్ మాటలు ఉండవు
- గెలిచి తీరాలనే మనస్తత్వం
- ఓటమి అంటే భయం లేకపోవడం
- ప్రశంసించడం - చిన్నచిన్న విషయాలకు కూడా
- చెప్పేది సూటిగా సింపులుగా చెప్పడం
- మానసికంగా స్వేచ్ఛగా, సరదాగా ఉండడం
టెస్టు మ్యాచ్‌లపై ప్రభావం
మార్చు2022: లక్ష్య ఛేదనలు
మార్చుఆట శైలిలో వచ్చిన మార్పు 2022 వేసవిలో తక్షణ ఫలితాలను అందించింది. COVID-19 మహమ్మారి కారణంగా వాయిదా పడిన మునుపటి సిరీస్‌ను ముగించడానికి ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ జట్టు న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను, భారత్‌తో ఒక టెస్టు ఆడింది. 2022 వేసవిలో ఇంగ్లండ్ మొత్తం నాలుగు మ్యాచ్‌ల లోనూ నాల్గవ ఇన్నింగ్స్‌లో లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. నాలుగు ఇన్నింగ్స్ లలో 277, 299, 296, 378 పరుగుల లక్ష్యాలను ఛేదించి విజయం సాధించింది.[9] టెస్ట్ చరిత్రలో న్యూజిలాండ్‌పై వరసగా మూడు గేమ్‌లలో 250 పైచిలుకు స్కోర్‌లను చేసిన మొదటి జట్టుగా ఇంగ్లాండ్ నిలిచింది. చివరి ఇన్నింగ్సుల్లో బ్యాటింగు చేస్తూ వరుసగా నాలుగు టెస్ట్ మ్యాచ్‌లను గెలిచిన మొదటి ఇంగ్లాండ్ జట్టు అది. కెప్టెన్ స్టోక్స్ టాస్ గెలిచిన తర్వాత ఛేజింగ్ ఎంచుకోవడం ప్రారంభించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇది మామూలే గానీ, టెస్ట్ క్రికెట్‌లో మాత్రం మామూలుగా పాటించే పద్ధతికి విరుద్ధమైనది. [10]
వేగవంతమైన పరుగుల సాధన
మార్చుఈ పద్ధతి మొదలైనప్పటి నుండి 2023 జూన్ వరకు, ఇంగ్లండ్ సగటు రన్ రేట్ ఓవర్‌కు 4.65 గా ఉంది. ఇది టెస్ట్ మ్యాచ్ చరిత్రలోనే అత్యధికం. దీని తరువాతి అత్యధిక సగటు, స్టీవ్ వా నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు సాధించిన 3.66 కంటే చాలా ఎక్కువ. సాధారణంగా గెలవడానికి 140 లేదా అంతకంటే ఎక్కువ ఓవర్లు అవసరమౌతాయనే టెస్టు మ్యాచ్‌ల తీరుకు ఈ జట్టు అడ్డుకట్ట వేసిందని దీని అర్థం. [11] 2022 డిసెంబరు 1 న, పాకిస్తాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్, మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 506-4 కి సాధించింది. ఈ పరుగులు 75 ఓవర్లలో 6.75 రన్ రేట్‌తో చేసింది. ఇది టెస్ట్ క్రికెట్‌లో అపూర్వమైన రికార్డు. ఇదే రన్ రేట్‌తో ఆ రోజు మొత్తం 90 ఓవర్లనూ ఆడి ఉంటే ఇంగ్లండ్ జట్టు 600 పరుగులను దాటేది.[12] 112 సంవత్సరాల క్రితం 1910లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా చేసిన 494 పరుగులు అప్పటి వరకూ ఉ1న్న మొదటి రోజు అత్యధిక పరుగుల రికార్డు.[13] ఈ ఇన్నింగ్స్‌లో ఒక టెస్ట్ మొదటి సెషన్‌లో ఇంగ్లండ్ అత్యధిక స్కోరు (174) సాధించగా, జాక్ క్రాలీ మొదటి ఓవర్‌లోనే అత్యధిక పరుగులు చేసిన ఇంగ్లండ్ ఆటగాడుగా (14) నిలిచాడు. క్రాలే బెన్ డకెట్‌లు అత్యంత వేగంగా స్కోరు చేశారు. సెంచరీ ఓపెనింగ్ స్టాండ్ (83 బంతుల్లో), క్రాలీ, డకెట్ లు టెస్ట్ క్రికెట్ చరిత్రలో వేగవంతమైన ఓపెనింగ్ డబుల్ సెంచరీ భాగస్వామ్యం (181 బంతుల్లో) నెలకొల్పారు.[14]
డిక్లరేషన్లు
మార్చు2023 ఫిబ్రవరి 16 న, న్యూజిలాండ్ పర్యటనలో మౌంట్ మౌన్‌గనుయ్‌లోని బే ఓవల్‌లో డే/నైట్ టెస్ట్ మ్యాచ్‌లో మొదటి రోజున, సాయంత్రం పరిస్థితులను గమనించిన ఇంగ్లండ్, అప్పుడు బ్యాటింగు చెయ్యడం కంటే బౌలింగుకు అనువుగా ఉటుందని భావించింది. దాంతో తమ ఎగువ వరుస బ్యాటర్లతో వేగంగా పరుగులు చేయించి తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.[15] ఒక టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఇంత త్వరగా డిక్లేరు చెయ్యడం టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది రెండవది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ పరుగులు చేసిన వేగం కారణంగా పరిస్థితులకు అనుగుణంగా డిక్లరేషన్ చేయడానికి వీలైంది. మైకేల్ అథర్టన్ ఆ "ధైర్యాన్ని" వివరిస్తూ, అది "కెప్టెన్‌గా ఆటను స్తబ్దుగా గానీ, సాగదీయడానికి గానీ ఇష్టపడని స్టోక్స్ ఖ్యాతికి" నిదర్శనంగా నిలిచింది అన్నాడు. [16] 2023 యాషెస్ సిరీస్‌లో తొలి టెస్టు తొలి ఇన్నింగ్సులో జో రూట్ 118 పరుగులతో నాటౌట్‌గా ఉన్నప్పటికీ, మొదటి రోజున ఆస్ట్రేలియా బ్యాటర్లకు కనీసం నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయాలనే తలంపుతో స్టోక్స్, కేవలం 78 ఓవర్ల తర్వాత డిక్లేర్ చేశాడు. యాషెస్ చరిత్రలో ఇంతకు మునుపెన్నడూ ఇంత త్వరగా డిక్లేరు చెయ్యలేదు.[17][18] కెప్టెన్‌గా స్టోక్స్, తన మునుపటి పద్నాలుగు టెస్టుల్లో తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడం ఇది ఐదోసారి.[19] టెస్ట్ చరిత్రలో ఇన్నింగ్స్‌లో 110 వ ఓవర్ల లోపే అత్యధిక డిక్లరేషన్‌లు చేసిన న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌తో అతను సమానమయ్యాడు. అయితే ఫ్లెమింగ్ ఆ మార్కును చేరుకోవడానికి 80 మ్యాచ్‌లు తీసుకోగా, స్టోక్స్ పదిహేను మ్యాచ్‌ల లోనే అది సాధించాడు.[20] ఆ టెస్టులో ఆస్ట్రేలియా ఐదో రోజున చివరి ఓవర్లలో రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఫలితం కోసం వేట
మార్చు"గందరగోళం లేని క్రికెట్" అనేది బాజ్‌బాల్‌లో ఒక భాగం అంటారు. "అన్ని సమయాలలో దాడి చేయడమే కీలకం, అయితే గుడ్డిగా దాడి చేయకపోవడం దాని మంత్రం". తద్వారా "ఆటను చతికిలబడిపోనివ్వకుండా, ఎల్లప్పుడూ ఫలితం తేలేలా ఆడే ఖచ్చితమైన విధానం." [21] 2022 జూన్‌లో ట్రెంట్ బ్రిడ్జ్‌లో న్యూజిలాండ్‌తో నాటింగ్‌హామ్‌లో జరిగిన టెస్ట్‌లో స్టోక్స్, జానీ బెయిర్‌స్టో తొమ్మిది ఓవర్లలో చేసిన 102 పరుగులతో సహా, ఇంగ్లండ్ రికార్డు స్థాయిలో లక్ష్య ఛేదన చేసిన తర్వాత మాట్లాడుతూ స్టోక్స్, "ఆటలో చేష్టలుడిగి నిలబడిపోవడమో, ఆటలో వెనకడుగు చెయ్యడమో కాకుండా ఆట పట్ల ఉండే భయాన్ని ఎదుర్కోవడం. సింపిలుగా చెప్పాలంటే - అయితే గెలుస్తాం లేదా ఓడిపోతాం, అంతే. అదే మనస్తత్వం. ఆటలో దిగే ప్రతీ బ్యాటరూ ఈ మనస్తత్వంతో ఉండాలని అన్నాం. స్పష్టంగా ఇది ఫలితాలనిచ్చింది. కోచ్, కెప్టెన్లు ఇచ్చే మద్దతు ఆటగాళ్లపై చాలా సానుకూలంగా పడుతుంది. వాళ్ళు వైఫల్యానికి భయపడరు. ఆటలో దిగడం, అనుకున్నది చేయడం అంతే" అన్నాడు. [22]
యావత్తు టెస్టు క్రికెట్‌పై ప్రభావం
మార్చుప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో టెస్ట్ క్రికెట్‌కు ఆదరణ తగ్గడం, కొంతమంది క్రికెట్ నిర్వాహకులు వన్డే, ట్వంటీ 20 లకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి నేపథ్యంలో <i id="mw8A">ది రోర్</i> లో పాల్ సట్టన్, "బాజ్‌బాల్ ఇంగ్లండ్ క్రికెట్ జట్టును పునరుజ్జీవింపజేయడమే కాకుండా, ఆట లోని సాంప్రదాయిక ఆకృతికి చాలా ఆవశ్యకమైన ఊపు ఇస్తుంది." అని రాసాడు.[23] పునరుజ్జీవం అనే మాటనే వాడుతూ మాజీ ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్, "ఇప్పటివరకు ఇది నమ్మశక్యం కానిట్లుగా ఉంది. వాస్తవానికి ఇది టెస్ట్ మ్యాచ్ క్రికెట్‌ను దాదాపుగా పునరుజ్జీవింపజేసింది" అని చెప్పాడు. [24] 2022 డిసెంబరులో ఇంగ్లండ్ పాకిస్థాన్‌లో ఆడిన తర్వాత మాజీ పాకిస్థాన్ కెప్టెన్ ఉరూజ్ ముంతాజ్ ఇలా అన్నాడు: "ఇంగ్లండ్ నిజంగా గర్వపడాల్సిన సమయం. వారు టెస్ట్ క్రికెట్‌లో విప్లవాత్మక మార్పులు తెస్తున్నారు. టెస్ట్ క్రికెట్‌కు ఉండాల్సిన కొత్త జీవితాన్ని ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఆటను వినోదభరితంగా చెయ్యాలనేది వాళ్ళ సంకల్పం. ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ, పాకిస్తాన్‌లో, అది సాధించారు." [25]
మూలాలు
మార్చు- ↑ Baum, Greg (21 December 2022). "Will Australia come to the Bazball?". The Sydney Morning Herald. Nine Newspapers. Retrieved 21 June 2023.
- ↑ "'I don't really like that silly term Bazball'". thenews.com.
- ↑ Lucas, Katherine (2023-06-19). "What 'Bazball' means - a beginner's guide". inews.co.uk (in ఇంగ్లీష్). Retrieved 2023-07-09.
- ↑ "The birth of 'Bazball' – and what it actually means". Pocketmags.com.
- ↑ "Forget 'Bazball' – McCullum's England could be given reality check by South Africa". The Times.
- ↑ "Bazball isn't a philosophy or blueprint – it is a response to a game in decay". The Guardian.
- ↑ "Bazball goes home as England takes on Kiwis in New Zealand". Associated Press.
- ↑ Martin, Ali (2023-01-10). "Ben Stokes and Brendon McCullum offer counties a guide to 'Bazball'". The Guardian (in బ్రిటిష్ ఇంగ్లీష్). ISSN 0261-3077. Retrieved 2023-07-09.
- ↑ "What is the new cricketing term 'Bazball'?". Sportstiger.com.
- ↑ "Ben Stokes' England revelling in thrill of the chase". Cricket365.
- ↑ Martin, Ali; Bull, Andy (2023-06-13). "Bazball unpacked: how England have turned up the dial in Test cricket". The Guardian (in బ్రిటిష్ ఇంగ్లీష్). ISSN 0261-3077. Retrieved 2023-07-09.
- ↑ "Pakistan v England: Are Ben Stokes' team changing Test cricket forever?". BBC Sport.
- ↑ "What is 'Bazball', England's revolutionary new approach to test cricket?". Indian Express.
- ↑ "The incredible stats from England's record-breaking Bazball blitz in Pakistan". The Daily Telegraph.
- ↑ "Duckett, Brook set up England attacking declaration in first Test". France24.com. Archived from the original on 2023-02-16. Retrieved 2024-02-28.
- ↑ "Harry Brook leads England to day one declaration before seamers strike". The Times.
- ↑ McKern, James (17 June 2023). "Cricket world in shock over England's 'outrageous' day one declaration". Foxsports.com.au. Retrieved 17 June 2023.
- ↑ Brown, Oliver (16 June 2023). "England's astonishing declaration proved Bazball will not bow to Ashes pressure". The Daily Telegraph. Retrieved 17 June 2023.
- ↑ "The Ashes: England's Jonny Bairstow hails adventurous declaration from Ben Stokes in first Test vs Australia". Sky Sports. 16 June 2023. Retrieved 17 June 2023.
- ↑ Samson, Andrew; Martin, Ali; Bull, Andy (13 June 2023). "Bazball unpacked: how England have turned up the dial in Test cricket". The Guardian. Retrieved 17 June 2023.
- ↑ "What's Bazball and why is it the right approach to keep Test cricket alive?". Business Standard. Archived from the original on 2023-02-15. Retrieved 2024-02-28.
- ↑ "Ben Stokes: "That blows away Headingley, it blows away Lord's and the World Cup final"". The Cricketer.
- ↑ "Proteas cutting back fixtures a bad sign for Test cricket but BazBall could save format amid white-ball explosion". The Roar.
- ↑ "Can 'Bazball' win the Ashes? Ponting has his say". ICC-cricket.com.
- ↑ "'Ultimate moment of clarity': Inside Bazball's beginnings and secrets to its 'rapid' success". Foxsports.com.au.