జానీ బెయిర్‌స్టో

జోనాథన్ మార్క్ బెయిర్‌స్టో (జననం 1989 సెప్టెంబరు 26) అన్ని ఫార్మాట్లలో ఇంగ్లండ్ తరపున అంతర్జాతీయంగా ఆడే క్రికెటరు. దేశీయ క్రికెట్‌లో, అతను యార్క్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్‌తో సహా పలు ఇతర ట్వంటీ20 లీగ్‌లలో ఆడాడు.

జానీ బెయిర్‌స్టో
2015 లో బెయిర్‌స్టో
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జోనాథన్ మార్క్ బెయిర్‌స్టో
పుట్టిన తేదీ (1989-09-26) 1989 సెప్టెంబరు 26 (వయసు 35)
Bradford, West యార్క్‌షైర్, England
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రవికెట్-కీపర్-batter
బంధువులుDavid Bairstow (father)
Andrew Bairstow (half-brother)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 652)2012 మే 17 - వెస్టిండీస్ తో
చివరి టెస్టు2023 జూలై 27 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 223)2011 సెప్టెంబరు 16 - ఇండియా తో
చివరి వన్‌డే2022 జూలై 24 - దక్షిణాఫ్రికా తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.51
తొలి T20I (క్యాప్ 56)2011 సెప్టెంబరు 23 - వెస్టిండీస్ తో
చివరి T20I2023 సెప్టెంబరు 5 - న్యూజీలాండ్ తో
T20Iల్లో చొక్కా సంఖ్య.51
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2009–presentయార్క్‌షైర్
2016పెషావర్ జాల్మి
2018కేరళ Kings
2019–2021సన్ రైజర్స్ హైదరాబాద్
2021–presentవెల్ష్ ఫైర్
2022-presentపంజాబ్ కింగ్స్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు టి20 ఫక్లా
మ్యాచ్‌లు 95 95 68 210
చేసిన పరుగులు 5,804 3,634 1,427 13,535
బ్యాటింగు సగటు 37.20 46.58 29.12 43.38
100లు/50లు 12/26 11/15 0/9 30/68
అత్యుత్తమ స్కోరు 167* 141* 90 246
క్యాచ్‌లు/స్టంపింగులు 239/14 48/3 45/1 537/25
మూలం: ESPNcricinfo, 1 September 2023

బెయిర్‌స్టో తన వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే), ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) 2011లో రంగప్రవేశం చేసాడు. 2012లో తన తొలి టెస్టు ఆడాడు. అతను 2019 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టులో సభ్యుడు. [1]

బెయిర్‌స్టో కుడిచేతి వాటం కలిగిన వికెట్ కీపరు, బ్యాటరుగా ఆడుతున్నాడు. బెన్ స్టోక్స్‌తో కలిసి, 2015-16 ఇంగ్లండ్ పర్యటనలో దక్షిణాఫ్రికాపై 399 పరుగులతో టెస్ట్‌లలో అత్యధిక ఆరో వికెట్ భాగస్వామ్య ప్రపంచ రికార్డును అద్ధించాడు.[2]

జీవితం తొలి దశలో

మార్చు

బెయిర్‌స్టో 1989 సెప్టెంబరు 26 న వెస్టు యార్క్‌షైర్‌ లోని బ్రాడ్‌ఫోర్డ్‌లో జన్మించాడు. మాజీ యార్క్‌షైర్, ఇంగ్లండ్ వికెట్-కీపర్ డేవిడ్ బెయిర్‌స్టో రెండవ కుమారుడతడు. మాజీ డెర్బీషైర్ ఆటగాడు ఆండ్రూ బెయిర్‌స్టోకు తమ్ముడు.[3] 2007లో సెయింట్ పీటర్స్ స్కూల్ తరపున 654 పరుగులు చేసిన తర్వాత, యంగ్ విస్డెన్ స్కూల్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికయ్యాడు.[4] బెయిర్‌స్టో లీడ్స్ యునైటెడ్ యూత్ ఫుట్‌బాల్ జట్టుకు కూడా ఆడాడు. [5]

అంతర్జాతీయ కెరీర్

మార్చు

వన్‌డే, T20I జట్లలోకి ప్రవేశం

మార్చు

బెయిర్‌స్టో 2011 ఆగస్టులో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ వన్‌డే జట్టులో సభ్యుడు; అయితే, తుది జట్టులో అతను ఎంపిక కాలేదు. [6] తరువాతి నెలలో భారత్‌తో జరిగిన చివరి వన్‌డే లో అతను రంగప్రవేశం చేసాడు. [7] స్పెషలిస్టు బ్యాటర్‌గా ఆడుతూ, కేవలం 21 బంతుల్లోనే అజేయంగా 41 పరుగులు చేసి ఇంగ్లండ్‌ గెలవడంలో తోడ్పడ్డాడు. అతని ఇన్నింగ్స్‌లో మూడు సిక్సర్లు ఉన్నాయి. అతను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

2011 అక్టోబరు 11న, ఇంగ్లాండ్ భారత్‌తో సిరీస్ కోసం వార్మప్ గేమ్‌లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ XIని ఓడించిన మ్యాచ్‌లో బెయిర్‌స్టో 53 బంతుల్లో సెంచరీ సాధించాడు. [8]

బెయిర్‌స్టో శ్రీలంకతో జరిగిన మొదటి టెస్టులో 140 పరుగులు చేసి 2016లో ఇంగ్లండ్‌లో జరిగిన సిరీస్‌లో ఇంగ్లండ్‌ను అనిశ్చిత పరిస్థితి నుండి బయటపడేలా చేశాడు. అతని ప్రయత్నాలకు అతను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు, ఇందులో తొమ్మిది క్యాచ్‌లు కూడా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గెలిచి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో మ్యాచ్‌లో అతను 48 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ భారీ తొలి ఇన్నింగ్స్ స్కోరును నమోదు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందడంతో అతను బ్యాటింగ్ చేయాల్సిన అవసరం రాలేదు. సిరీస్ లోని మూడవ, ఆఖరి మ్యాచ్‌లో తన ఫామ్‌ను కొనసాగిస్తూ, ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో అజేయంగా 167 పరుగులు చేసాడు. ఇంగ్లాడ్ 416 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో 32 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ 2-0తో సిరీస్‌ను గెలుచుకుంది, బెయిర్‌స్టోకు కౌశల్ సిల్వాతో కలిసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.

2016 నుండి ఇప్పటి వరకు

మార్చు
 
2019 క్రికెట్ ప్రపంచ కప్ తర్వాత అభిమానులతో జానీ బెయిర్‌స్టో

2016లో భారత్‌తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 537 పరుగుల చేయగా బెయిర్‌స్టో 46 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయాల్సిన అవసరం రాలేదు. ఆరు క్యాచ్‌లు, ఒక స్టంపింగ్ కూడా చేసాడు. రెండో టెస్టులో అతను మొదటి ఇన్నింగ్స్‌లో 53 పరుగులు చేసి, రెండో ఇన్నింగ్సులో అజేయంగా 34 పరుగులు చేసాడు. ఇంగ్లండ్ 246 పరుగుల తేడాతో ఓడిపోయింది. మూడవ టెస్ట్‌లో బెయిర్‌స్టో, ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు 283లో 89 పరుగులు చేశాడు. అయితే ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అప్పగించిన తర్వాత, అతను రెండవ ఇన్నింగ్స్‌లో కేవలం 15 పరుగులు మాత్రమే చేసాడు. భారతదేశం ఎనిమిది వికెట్ల విజయాన్ని సాధించింది. నాలుగో టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో 14 పరుగులు, రెండవ ఇన్నింగ్స్‌లో 51 చేశాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 36 పరుగుల తేడాతో ఓడిపోయింది.

బెయిర్‌స్టో భారత్‌తో జరిగిన మూడో వన్‌డేలో ఆడి, 56 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ 321/8 చేసి, ఐదు పరుగుల తేడాతో గెలిచింది. అయితే వారు సిరీస్‌ను 2-1తో కోల్పోయారు. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో నాల్గవ టెస్ట్‌లో, బెయిర్‌స్టో 100 టెస్టు అవుట్‌లు చేసిన తొమ్మిదవ ఇంగ్లండ్ వికెట్ కీపర్‌గా నిలిచాడు. 2017 సెప్టెంబరు 19న, బెయిర్‌స్టో ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో వెస్టిండీస్‌పై అజేయంగా 100 పరుగులు చేసి వన్‌డే క్రికెట్‌లో తన మొదటి సెంచరీని నమోదు చేశాడు. పది రోజుల తర్వాత అతను సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్‌లో వెస్టిండీస్‌పై అజేయంగా 141 పరుగులు చేశాడు. ఇది వన్డేల్లో వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ చేసిన అత్యధిక స్కోరు. మార్కస్ ట్రెస్కోథిక్ 2004లో చేసిన మునుపటి అత్యుత్తమ స్కోరు, 130 పరుగులను అధిగమించాడు.


2017 డిసెంబరు 15 న, సస్పెండైన బెన్ స్టోక్స్ స్థానంలో బెయిర్‌స్టో నెం.6కి పదోన్నతి పొందాడు. అతను ఆస్ట్రేలియాపై 119 పరుగులు చేశాడు. పరిమిత ఓవర్ల సిరీస్‌లో అతను ఓపెనింగ్ బ్యాటర్‌గా ప్రమోట్ అయ్యాడు.

2018లో బెయిర్‌స్టో వన్డే ఇంటర్నేషనల్స్‌లో వరుసగా మూడు సెంచరీలు సాధించిన తొలి ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 2018లో అతని ప్రదర్శనలకు, అతను ICC, Cricinfo ల వరల్డ్ వన్‌డే XIలో ఎంపికయ్యాడు. [9] [10] [11] [12] 2019 మే 14న బెయిర్‌స్టో 93 బంతుల్లో చేసిన 128, కౌంటీ గ్రౌండ్‌లో జరిగిన ఒక రోజు అంతర్జాతీయ మ్యాచ్‌లో ఇంగ్లండ్ పాకిస్థాన్‌పై విజయం సాధించడంలో సహాయపడింది.

2019 క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఇంగ్లండ్ జట్టులో బెయిర్‌స్టో ఎంపికయ్యాడు. [1] దక్షిణాఫ్రికాపై గోల్డెన్ డక్‌తో టోర్నీని ప్రారంభించాడు. తర్వాత టోర్నమెంట్‌లో, అతను శ్రీలంకపై మరొకసారి గోల్డెన్ డకౌటయ్యాడు. ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో రెండుసార్లు గోల్డెన్ డకౌటైన నాల్గవ ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్ అయ్యాడు. అయితే, తర్వాత ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, న్యూజిలాండ్‌లపై వరుసగా 90, 111, 109 స్కోర్‌లను సాధించాడు. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఐదుసార్లు ఛాంపియనైన ఆస్ట్రేలియాను ఓడించిన ఇంగ్లండ్ సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. వారు ఫైనల్‌లో 2015 రన్నరప్ న్యూజిలాండ్‌ను ఓడించారు. బెయిర్‌స్టో 36 పరుగులు చేసాడు. బౌండరీల సంఖ్య ప్రకారం, ఇంగ్లాండ్ ట్రోఫీని గెలుచుకుంది.

బెయిర్‌స్టోను 2019 యాషెస్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టులోకి తీసుకున్నారు. [13] అతను సిరీస్‌లో 23.77 సగటుతో, ఒక అర్ధ సెంచరీ చేశాడు. [14] న్యూజిలాండ్ పర్యటన కోసం ఇంగ్లాండ్ టెస్టు జట్టు నుండి బెయిర్‌స్టోను తొలగించారు. ఇంగ్లండ్ సెలెక్టర్ ఎడ్ స్మిత్ 'ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగం కాని న్యూజిలాండ్‌లో జరిగే ఈ రెండు టెస్టుల కోసం అతను టెస్టు స్క్వాడ్ నుండి తప్పుకుంటాడు. టెస్టు సెటప్ నుండి కొంచెం విశ్రాంతి తీసుకున్నాక మరింత పుంజుకుని తిరిగి వస్తాడు' అని అన్నాదు. రెడ్ బాల్ క్రికెట్‌లో బెయిర్‌స్టో తన టెక్నిక్‌పై కృషి చేయమని పిలుపునిస్తూ, తిరిగి వచ్చే అవకాశాన్ని తెరిచి ఉంచాడు. [15] [16] బెయిర్‌స్టో అస్వస్థతకు గురైన ఓల్లీ పోప్‌ను స్థానంలో తిరిగి జట్టులోకి వచ్చి. 9, 25 పరుగులు చేశాడు. [17] [18] బెయిర్‌స్టో అప్పటికే దక్షిణాఫ్రికాలో తన రెడ్ బాల్ టెక్నిక్‌పై పనిచేస్తున్న శిక్షణా శిబిరంలో ఉన్నాడు. [19] కీటన్ జెన్నింగ్స్‌ కోసం, శ్రీలంకలో పర్యటించే జట్టు నుండి అతన్ని తొలగించారు. ఇది చాలా 'స్వల్పకాలిక' విధానం అని మీడియాలో కొందరు విమర్శించారు. [20]


2020 జూలైలో, బెయిర్‌స్టో ఐర్లాండ్‌తో జరిగిన వన్‌డే సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టులో ఎంపికయ్యాడు, [21] [22] అందులో అతను మూడు మ్యాచ్‌లు ఆడి 88 పరుగులు చేశాడు. [23] 2020 సెప్టెంబరు 6న, ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ T20 అంతర్జాతీయ మ్యాచ్‌లో, బెయిర్‌స్టో T20 అంతర్జాతీయ మ్యాచ్‌లో తన హిట్ వికెట్‌ ద్వారా అవుట్ అయిన మొదటి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ అయ్యాడు. [24]

2022 జూన్లో, ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన ఇంగ్లండ్ v న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌లో రెండో టెస్టులో, [25] 299 పరుగుల విజయవంతమైన ఇంగ్లండ్ ఛేజింగ్‌లో భాగంగా ఐదో రోజు 92 బంతుల్లో 136 పరుగులతో మ్యాచ్-విజేతగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌కు అతను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. అతని సెంచరీ 77 బంతుల్లో వచ్చింది, ఇది ఒక ఇంగ్లిష్ బ్యాట్స్‌మన్ చేసిన రెండవ వేగవంతమైన టెస్టు సెంచరీగా నిలిచింది. [26] మూడవ టెస్ట్‌లో, బెయిర్‌స్టో ఇంగ్లండ్‌ను 55–6 స్థాయి నుండి బలమైన స్థితికి తీసుకువచ్చాడు. విజయానికి మార్గంలో బంతికొక పరుగు కంటే ఎక్కువగా చేస్తూ 162 పరుగులు చేశాడు. [27] అతను భారతదే జట్టుతో జరిగిన ఐదవ టెస్ట్‌లో వేసవిలో తన మూడవ, నాల్గవ సెంచరీలను సాధించాడు - ఇంగ్లండ్ రికార్డ్ టెస్టు మ్యాచ్ ఛేజింగ్‌ను పూర్తి చేసిన నాల్గవ ఇన్నింగ్స్‌లో అతని స్కోరు 114 నాటౌట్. [28] గోల్ఫ్ ప్రమాదంలో కాలు విరిగిపోవడంతో అతను 2022 టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. 2022 ఇంగ్లీష్ సమ్మర్‌లో అతని ప్రదర్శనలకు, బెయిర్‌స్టో ప్రొఫెషనల్ క్రికెటర్స్ అసోసియేషన్ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, [29] క్రికెట్ రైటర్స్ క్లబ్ వారి బాబ్ విల్లీస్ ట్రోఫీని అందుకున్నాడు. [30] అతను 2022 పురుషుల టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ [31] కి కూడా నామినేట్ అయ్యాడు. ICC పురుషుల టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్‌లో స్థానం పొందాడు. [32]

ఫ్రాంచైజ్ కెరీర్

మార్చు

2016 నుండి 2018 వరకు, అతను పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పెషావర్ జల్మీ తరపున ఆడాడు.

2018 డిసెంబరులో, 2019 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆటగాళ్ళ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అతన్ని కొనుగోలు చేసింది. [33] [34]

2018 నవంబరు చివరలో, ఇంగ్లండ్ v శ్రీలంక టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత, షార్జాలో జరిగిన T10 లీగ్‌లో కేరళ కింగ్స్ తరపున ఆడేందుకు బెయిర్‌స్టో స్వల్పకాలిక ఒప్పందంపై సంతకం చేశాడు. అక్కడ అతను ఇయాన్ మోర్గాన్‌తో కలిసి ఆడాడు. ఆ సంవత్సరం ఫ్రాంచైజీ కోసం అతని రెండవ (చివరి) గేమ్‌లో, అతను 24 బంతుల్లో 84 పరుగులు చేశాడు. ఇది ఈ ఫార్మాట్‌లో కొత్త రికార్డు. అతని జట్టు 7 వికెట్ల విజయాన్ని నమోదు చేయడంలో అది సహాయపడింది. [35]

2022 IPL వేలంలో, బెయిర్‌స్టోను పంజాబ్ కింగ్స్ ₹6.75 కోట్లకు కొనుగోలు చేసింది. [36]

ది హండ్రెడ్‌లో అతను 2021, 2022 సీజన్లలో ఇంగ్లాండ్ సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్‌గా వెల్ష్ ఫైర్ కోసం సంతకం చేశాడు. [37]

మీడియా

మార్చు

2017లో, జానీ బెయిర్‌స్టో డంకన్ హామిల్టన్‌తో కలిసి వ్రాసిన తన జీవిత చరిత్ర ఎ క్లియర్ బ్లూ స్కై ను ప్రచురించాడు. ఈ పుస్తకం, అతని జీవితంలో ప్రారంభంలోనే అతని తండ్రి డేవిడ్ బెయిర్‌స్టోను కోల్పోయినప్పటి నుండి, దాని నుండి అతని మొదటి టెస్టు సెంచరీని సాధించే ప్రయాణం గురించి వివరిస్తుంది. తన మొదటి సెంచరీ చేసాక తన తండ్రికి నివాళిగా ఆకాశం వైపు, "స్పష్టమైన నీలి ఆకాశాన్ని" చూస్తాడు. అదే ఈ పుస్తకం శీర్షిక. [38]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "England Cricket World Cup player ratings: How every star fared on the road to glory". Evening Standard. 15 July 2019. Retrieved 15 July 2019.
  2. "Jonny Bairstow profile and biography, stats, records, averages, photos and videos". Espncricinfo.com.
  3. Chris Waters (December 7, 2013). "Janet Bairstow continues strong family tradition at Yorkshire CCC". Yorkshire Post. Retrieved 28 March 2020.
  4. Jonathan Bairstow wins inaugural award, Wisden Cricketers' Almanack, Retrieved on 12 June 2009
  5. Bloomer, Danny (5 July 2022). "England hero Jonny Bairstow on his Leeds United academy background". Leedslive.co.uk. Retrieved 3 September 2022.
  6. "Eoin Morgan named as England captain for Ireland ODI". BBC Sport. 20 August 2011. Retrieved 20 August 2011.
  7. "Jonny Bairstow Debut and last played matches in Tests, ODIs, T20Is and other formats". ESPNcricinfo. Retrieved 2023-01-01.
  8. Jonny Bairstow hits century as England win warm-up game, BBC Sport
  9. "ICC announces men's Test and ODI Teams of the Year". Icc-cricket.com.
  10. "The pick of the pack". ESpncricinfo.com. 3 January 2019.
  11. "Jofra Archer misses World Cup cut but included to play Ireland, Pakistan". ESPN Cricinfo. 17 April 2019. Retrieved 17 April 2019.
  12. "England leave out Jofra Archer from World Cup squad". Icc-cricket.com. Retrieved 17 April 2019.
  13. "Ashes 2019: England call up Jofra Archer for first Test v Australia". BBC Sport (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2019-07-27. Retrieved 2020-02-13.
  14. "Batting records | Test matches | Cricinfo Statsguru | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2020-02-13.
  15. "England drop Jonny Bairstow, call up Dom Sibley, Zak Crawley for New Zealand Tests". ESPNcricinfo (in ఇంగ్లీష్). 2019-09-23. Retrieved 2020-02-13.
  16. "Challenge clear for Jonny Bairstow as axing marks start of England's new Test focus". ESPNcricinfo (in ఇంగ్లీష్). 2019-09-23. Retrieved 2020-02-13.
  17. "Recent Match Report - South Africa vs England, ICC World Test Championship, 1st Test | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2020-02-13.
  18. "Match Preview - South Africa vs England, ICC World Test Championship 2020, 2nd Test | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2020-02-13.
  19. Siddiqui, Fahad (2019-11-25). "Jonny Bairstow head to South Africa Training camp". Latest Cricket News and Updates (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-02-13.
  20. "Foakes and Jennings on the rise, Bairstow and Moeen slide from view". ESPNcricinfo (in ఇంగ్లీష్). 2020-02-11. Retrieved 2020-02-13.
  21. "England Men name 14-strong squad for Royal London Series". England and Wales Cricket Board. Retrieved 27 July 2020.
  22. "England v Ireland: David Willey & Reece Topley recalled for ODI series". BBC Sport. Retrieved 27 July 2020.
  23. "Ireland in England ODI Series, 2020 - England Cricket Team Records & Stats | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2022-01-07.
  24. "'You don't want to see that as a batsman' - Bairstow hits own wicket". BBC Sport. Retrieved 6 September 2020.
  25. "Full Scorecard of New Zealand vs England 2nd Test 2022 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 2022-06-15.
  26. "Brilliant Bairstow leads England to victory". BBC Sport (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2022-06-15.
  27. "Jonny Bairstow hits brilliant century to lead stunning England fightback from 55-6 vs New Zealand". Sky Sports (in ఇంగ్లీష్). Retrieved 6 October 2022.
  28. "Go Jonny, go - Bairstow's love affair with Bazball". BBC Sport. Retrieved 6 October 2022.
  29. "Sciver & Bairstow take top PCA awards". BBC Sport. Retrieved 6 October 2022.
  30. "Bairstow wins Cricket Writers' Club award". BBC Sport. Retrieved 6 October 2022.
  31. "Nominees for ICC Men's Test Cricketer of the Year 2022 revealed". International Cricket Council. Retrieved 6 January 2023.
  32. "ICC Men's Test Team of the Year 2022 revealed". www.icc-cricket.com (in ఇంగ్లీష్). Retrieved 12 February 2023.
  33. "IPL 2019 auction: The list of sold and unsold players". ESPN Cricinfo. 18 December 2018. Retrieved 18 December 2018.
  34. "IPL 2019 Auction: Who got whom". The Times of India. Retrieved 18 December 2018.
  35. "Jonny Bairstow smashes eight sixes in new T10 record score". BBC Sport (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2018-11-30. Retrieved 2019-01-13.
  36. "PL Auction 2022 live updates". Sportstar.thehindu.com. 12 February 2022. Retrieved 12 Feb 2022.
  37. "The Hundred 2022: latest squads as Draft picks revealed". BBC Sport. Retrieved 5 April 2022.
  38. Bairstow, Jonny (2017). A clear blue sky. Duncan Hamilton. London. ISBN 978-0-00-823268-9. OCLC 1012738193.{{cite book}}: CS1 maint: location missing publisher (link)