బాబా వాంగ
This article includes a list of references, related reading or external links, but its sources remain unclear because it lacks inline citations. (2023 సెప్టెంబరు) |
బాబా వాంగ బల్గేరియా దేశానికి చెందిన ఒక ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని. ఈవిడ జోస్యం చాలా సందర్భాలలో నిజమైనది.బాబా వాంగ బతికున్నప్పుడు ఆమె చెప్పిన మాటలు నిజమవుతుండడంతో ధనవంతులు, వివిధ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు ఆమె వద్దకు వెళ్లి తమ భవిష్యత్ గురించి చెప్పించుకునేవారు.
వాంగ | |
---|---|
జననం | |
మరణం | 1996 ఆగస్టు 11 | (వయసు 85)
జాతీయత | బల్గేరియన్[2] |
జీవిత భాగస్వామి |
|
నేపధ్యము
మార్చుఫ్రెంచ్ ఆధ్యాత్మికవేత్త నోస్ట్రడామస్ కన్నా ఎక్కువ కచ్చితంగా ప్రపంచ భవిష్యత్ పరిణామాలు అంచనా వేసినదీ బల్గేరియాకు చెందిన బాబా వాంగ. ఆమె 1996లో తన 85వ ఏట చనిపోయారు. ఇప్పుడు చెబుతున్నవన్నీ ఆమె అంతకుముందే అంచనావేసినవి. తన చిన్నప్పుడు వచ్చిన ఓ భయంకర పెనుతుపానులో చిక్కుకుని కళ్లు పోగొట్టుకున్న బాబా వాంగ దూరదృష్టితో భవిష్యత్ పరిణామాలను వీక్షించారని ప్రతీతి
ఫలించిన జోస్యాలు
మార్చురెండు లోహ విహంగాలు అమెరికాను తీవ్రంగా దెబ్బతీస్తాయని, వేలాది మంది అమాయక ప్రజలు మరణిస్తారని బాబా వాంగ 1989లో చెప్పడం, 2001, సెప్టెంబరు 11న అమెరికా ట్విన్ టవర్స్‌పై జరిగిన దాడి గురించేనని ఆమె అనుచర వర్గాలు పేర్కొన్నాయి. అలాగే 1950లో సముద్రపు అలలు భూభాగాన్ని కబళించివేస్తాయని చెప్పడం 2004, డిసెంబరు 26వ తేదీన ఇండోనేసియా, సుమిత్ర దీవులను కుదిపేసిన సునామీ గురించి చెప్పడమేనని ఆ వర్గాలు అన్నాయి. క్రిస్మస్ రోజుల్లో వచ్చిన ఆ సునామీని బాక్సింగ్ డే సునామీ అని కూడా వ్యవహరిస్తున్నారు.
భవిష్యత్తు
మార్చుభూమండలంపై వచ్చే పెను వాతావరణ మార్పుల గురించి కూడా ఆమె 60 ఏళ్ల క్రితమే ఊహించారు. ధ్రువ ప్రాంతాల్లో మంచుకొండలు కరిగిపోతాయని, ఫలితంగా సముద్ర మట్టాలు పెరిగిపోతాయని, వేడి ప్రాంతాలు చల్లగాను, చల్లటి ప్రాంతాలు వేడిగాను మారిపోతాయని, అగ్ని పర్వతాలు బుసలకొడతాయని చెప్పింది.
అమెరికా 44వ అధ్యక్షుడిగా ఓ ఆఫ్రికన్-అమెరికన్ ఎన్నికవుతారని, ఆయనే అమెరికాకు ఆఖరి అధ్యక్షుడవుతారని కూడా బాబా వాంగ అంచనా వేసినట్టు అనుచర వర్గాలు చెబుతూ వస్తున్నాయి. 44వ అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఎన్నికయ్యాడు. కానీ ఆయన తర్వాత 2017 లో డోనాల్డ్ ట్ర౦ప్ ఎన్నికయ్యారు. 2130 నాటికల్లా భూభాగంపై ఒక్క జీవి కూడా మిగలకుండా నశించి పోతుందని, అంతరిక్షవాసుల సహకారంతో సముద్ర గర్భంలో మానవులు జీవిస్తారని వాంగ అంచనా వేసింది. 3005 నాటికి అంగారక గ్రహంపై కూడా యుద్ధం జరుగుతుందని, 3,797 నాటికి ఈ భూమండలమంతా నశించి పోతుందని, అప్పటికే భూమి మీద మిగిలిన మానవులు మరో సౌర వ్యవస్థలోకి వెళ్లిపోతారని కూడా ఆమె అంచనా వేసింది.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ NOTES FROM HISTORY: Baba Vanga
- ↑ Christianity and Modernity in Eastern Europe, Bruce R. Berglund, Brian A. Porter, Central European University Press, 2010, ISBN 9639776653, 9789639776654, pp. 252-253; 265.