బాలరాజు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
బాలరాజు తెలుగు సినిమా మార్కెట్ స్థాయి ఎంతో తొలిసారి చూపించి అనూహ్యమైన సంచలనాన్ని రేపిన చిత్రం. అప్పటి వరకూ మూడు పదుల వయసు దాటిన కథానాయకుల చిత్రాలే ఎక్కువగా వచ్చాయి. అంతా ఓ సంప్రదాయ పద్ధతిలో వెళ్లే కథలే. 'బాలరాజు' ఆ ధోరణిని మార్చింది. ఈ సినిమా అక్కినేని నాగేశ్వరరావు, కస్తూరి శివరావుల సినీ జీవితాన్ని మలుపు తిప్పింది.
బాలరాజు (1948 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఘంటసాల బలరామయ్య |
---|---|
నిర్మాణం | ఘంటసాల బలరామయ్య |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వరలక్ష్మి, కస్తూరి శివరావు, అంజలీదేవి |
సంగీతం | గాలిపెంచల నరసింహారావు (సహాయకులు: ఘంటసాల, సి.ఆర్.సుబ్బరామన్) |
గీతరచన | సముద్రాల రాఘవాచార్య (సహాయకులు: మల్లాది రామకృష్ణశాస్త్రి) |
సంభాషణలు | సముద్రాల రాఘవాచార్య (సహాయకులు: మల్లాది రామకృష్ణశాస్త్రి) |
కళ | ఎస్.వి.ఎస్. రామారావు |
నిర్మాణ సంస్థ | ప్రతిభా పిక్చర్స్ |
విడుదల తేదీ | ఫిబ్రవరి 26 |
భాష | తెలుగు |
కథ
మార్చుఒక యక్ష కన్య ఓ యక్షుడితో ప్రేమలోపడుతుంది. వీళ్ల గురించి తెలుసుకొని మహేంద్రుడు శపిస్తాడు. దాంతో భూలోకంలో మానవులుగా పుడతారు. ఆ యక్షుడు బాలరాజవుతాడు. ఆ కన్య సీతగా కనిపిస్తుంది. బాలరాజుకి తన ప్రేమ గుర్తుండదు. అతని వెంటపడుతూ గతం గుర్తు చేయాలని సీత తపిస్తుంది. ఈ ప్రేమ కథ పలు మలుపులు తిరుగుతుంది. అప్పటి వరకూ వచ్చిన చిత్రాల్లో - కథానాయకుడు ప్రేమించమంటూ కథానాయకి వెంటపడతాడు. కథానాయకుడు అంటే ధీరోదాత్తుడు. ఇలాంటి 'సినీ ప్రాథమిక సూత్రాల'కు భిన్నంగా వెళ్లిన చిత్రమిది.
పాత్రధారులు - పాత్రలు
మార్చు- అక్కినేని నాగేశ్వరరావు - బాలరాజు
- ఎస్.వరలక్ష్మి - సీత
- కస్తూరి శివరావు - యలమంద
- అంజలీదేవి - మోహిని
- డి సదాశివరావు - ఇంద్రుడు
- జి రామయ్య - కమ్మ నాయుడు
- బి సీతారాం - రాముడు
- జి సుబ్బారావు - సెట్టి
- ఎ ఎల్ నారాయణ - గంధర్వుడు
- ఎన్ క్రిష్ణయ్య - అగ్ని దేవుడు
- నారాయణరావు - కుబేరుడు
- సి వెంకటేశ్వరరావు - యక్షుడు
- ఎ ఆదిశేషయ్య - శివుడు
- కె రామమూర్తి - వరుణుడు
- టి కె వి నాయుడు - ఋషి
- లింగం సుబ్బారావు - దొంగ
- కె కె అయ్యంగార్ - చలమయ్య
- కె వి సుబ్బారావు - పెద్ద నాయుడు
- నారీమణి - లక్ష్మి
- సి రాజరత్నం - లక్ష్మమ్మ
- బి సీతారామమ్మ - పున్నమ్మ
విశేషాలు
మార్చు- అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఏడో చిత్రమిది. తెలుగులో మొదటి రజతోత్సవ చిత్రం కూడా ఇదే.[1]
- ఈ చిత్రానికి ముందు ప్రతిభ పిక్చర్స్ ఘంటసాల బలరామయ్య అక్కినేని కథానాయకుడుగా ముగ్గురు మరాఠీలు అనే జానపద చిత్రాన్ని తీశారు. ఆ చిత్రం వంద రోజులు ఆడిన విజయోత్సాహంతో బాలరాజు చిత్రానికి శ్రీకారం చుట్టారు.
- ఈ సినిమాలో 20 పాటలున్నాయి.
- అక్కినేనికి తొలిసారి నేపథ్యగానం చేసే అవకాశం ఘంటసాల వెంకటేశ్వరరావుకి ఈ సినిమాతోనే దక్కింది. వీళ్లిద్దరూ మద్రాసులో రూమ్మేట్స్. అప్పట్లో అక్కినేని స్వయంగా పాడుకొనేవారు. ఇందులో 'చెలియా కనరావా...' పాట పాడేటప్పుడు పక్కన ఎస్.వరలక్ష్మిదీ, తనదీ ఒకే శ్రుతిలో ఉండటం; పైగా తన గాత్రంలో స్త్రీత్వం వినిపించడం అక్కినేనికి నచ్చలేదు. దాంతో బలరామయ్య దగ్గరకు వెళ్లి 'నేపథ్య గానం సదుపాయం వచ్చింది. ఈ పాటను ఘంటసాలతో పాడించండి' అనడంతో ఈ సినిమాలో పాడే అవకాశం ఘంటసాలకు దక్కింది.
- అప్పటి వరకూ చిన్న వేషాలు వేసిన కస్తూరి శివరావు 'యలమంద' పాత్ర వేసి ఎంతో పేరు తెచ్చుకొన్నారు.
- తీయని వెన్నెల రేయి అనే పాటకు నర్తించిన అంజలీదేవి ఆ తరువాతి కాలంలో కథానాయికగా ఎదిగింది.
- అప్పట్లో చిన్న కేంద్రాలైన మదనపల్లి, ప్రొద్దుటూరుల్లో రజతోత్సవాలు జరిగాయి. అలాంటి కేంద్రాలెన్నింట్లోనో బాలరాజు వందాడింది. ఈ సినిమా కురిపించిన వసూళ్లు చూసి చిత్రశాలల నిర్మాణానికి చాలా మంది ఉత్సాహం చూపించారు.
- ఆ రోజుల్లో నాగేశ్వరరావుని చూసి పొడుగాటి జుట్టుని పెంచిన మగాళ్లెందరో! ఆ కేశాలంకరణ, మీసకట్టు 'బాలరాజు స్టైల్'గా పేరొందాయి.
- ఇది విడుదలయ్యాక చాన్నాళ్లు నాగేశ్వరరావుని బాలరాజు అనే పిలిచేవారు.
- నాగేశ్వరరావు అర్థాంగి అన్నపూర్ణగారు పెళ్లిచూపులు చూసింది బాలరాజు సినిమా చూసే.
పాటలు
మార్చుపాట | పాడిన వారు | సంగీతం | సాహిత్యం |
---|---|---|---|
నవోదయం - శుభోదయం | ఘంటసాల, వక్కలంక సరళ | ఘంటసాల | సముద్రాల రాఘవాచార్య |
తీయని వెన్నెల రేయి | వక్కలంక సరళ | ఘంటసాల | సముద్రాల రాఘవాచార్య |
ఎవరినే ...నేనెవరినే | ఎస్.వరలక్ష్మి | ఘంటసాల | సముద్రాల రాఘవాచార్య |
సూడ చక్కని చిన్నది | పిఠాపురం నాగేశ్వరరావు | గాలి పెంచల నరసింహారావు | సముద్రాల రాఘవాచార్య |
నీకు నీవారు లేరు | ఎస్.వరలక్ష్మి | గాలి పెంచల నరసింహారావు | సముద్రాల రాఘవాచార్య |
గూటిలో చిలకేదిరా | ఉడుతా సరోజిని, పిఠాపురం | గాలి పెంచల నరసింహారావు | సముద్రాల రాఘవాచార్య |
ఓ బాలరాజా | ఎస్.వరలక్ష్మి | ఘంటసాల | సముద్రాల రాఘవాచార్య |
వరుణా వరుణా వర్షించగదయ్యా | ఎస్.వరలక్ష్మి | ఘంటసాల | సముద్రాల రాఘవాచార్య |
ఓ బాలరాజా | ఎస్.వరలక్ష్మి | ఘంటసాల | సముద్రాల రాఘవాచార్య |
దేముడయ్యా దేముడు | కస్తూరి శివరావు | గాలి పెంచల నరసింహారావు | సముద్రాల రాఘవాచార్య |
చెలియా కానరావా ఇక | అక్కినేని నాగేశ్వరరావు | గాలి పెంచల నరసింహారావు | సముద్రాల రాఘవాచార్య |
తేలి చూడుము హాయి | ఘంటసాల, ఎస్.వరలక్ష్మి | ఘంటసాల | సముద్రాల రాఘవాచార్య |
రాజా రారా - నారాజా రారా | ఎస్.వరలక్ష్మి | గాలి పెంచల నరసింహారావు | సముద్రాల రాఘవాచార్య |
వరాల కూన నిన్ను | కస్తూరి శివరావు | గాలి పెంచల నరసింహారావు | సముద్రాల రాఘవాచార్య |
ఒకరిని నానవేశా | కస్తూరి శివరావు, నారీమణి | గాలి పెంచల నరసింహారావు | సముద్రాల రాఘవాచార్య |
రూపము నీయరయాపతి | ఎస్.వరలక్ష్మి | ఘంటసాల | సముద్రాల రాఘవాచార్య |
వేరేలేరయా పరమేశా | ఎస్.వరలక్ష్మి | ఘంటసాల | సముద్రాల రాఘవాచార్య |
చాలు వగలు | ఎస్.వరలక్ష్మి , అక్కినేని నాగేశ్వరరావు | ఘంటసాల | సముద్రాల రాఘవాచార్య |
మూలాలు
మార్చు- ↑ "Memorabilia of Telugu cinema in The Hindu, 2007". Archived from the original on 2011-06-06. Retrieved 2014-01-22.