బాలసాని లక్ష్మీనారాయణ

బాలసాని లక్ష్మీనారాయణ గౌడ్ తెలంగాణ రాష్ట్రంకు చెందిన రాజకీయ నాయకుడు.[1] భారత్ రాష్ట్ర సమితి తరపున ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించాడు.

బాలసాని లక్ష్మీనారాయణ
బాలసాని లక్ష్మీనారాయణ

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2009 - 4 జనవరి 2022
నియోజకవర్గం ఖమ్మం

వ్యక్తిగత వివరాలు

జననం అక్టోబర్ 7, 1959
మరికాల, వెంకటాపురం మండలం, ములుగు జిల్లా
జాతీయత భారతీయుడు
ఇతర రాజకీయ పార్టీలు భారత్ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి సామ్రాజ్యం
నివాసం హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
మతం హిందూ

బాలసాని లక్ష్మీనారాయణ 1959, అక్టోబర్ 7వ తేదీన ములుగు జిల్లా, వెంకటాపురం మండలం, మరికాల గ్రామంలో సన్యాసయ్య గౌడ్ , రత్తమ్మ దంపతులకు జన్మించాడు. ఆయనకు నలుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు.

రాజకీయ జీవితం

మార్చు

బాలసాని లక్ష్మీనారాయణ 1987లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. 1987, జూలై 20వ తేదీన తొలిసారిగా మరికాల పీఏసీఎస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అదే సంవత్సరంలో డీసీఎంఎస్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1987 నుండి వరుసగా మూడుసార్లు డీసీఎంఎస్‌ చైర్మన్‌ గా ఎన్నికై, 1995, ఆగస్టు 10న డీసీసీబీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాడు. 1990లో ఖమ్మం జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. ఆయన 1995 నుంచి 2004 వరకు తొమ్మిదిన్నరేళ్లపాటు డీసీసీబీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించాడు.[2] 1997- 2000 వరకు జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా, 2004- 2009 వరకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా పని చేశాడు. ఆయన రెండుసార్లు టీడీపీ తరఫున ఖమ్మం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2009లో ఆయన టీడీపీ నుండి ఎమ్మెల్సీగా ఎన్నికై చట్ట సభల్లో అడుగుపెట్టాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[3]

2023 తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో భాగంగా భద్రాచలం బీఆర్ఎస్ ఇంఛార్జ్ పదవి నుంచి ఆయనను తప్పించడంతో మనస్థాపం చెందిన[4] బాలసాని లక్ష్మినారాయణ 2023 అక్టోబర్ 15న బీఆర్ఎస్‌ పార్టీకి రాజీనామా చేశాడు.[5]

ఎమ్మెల్సీ

మార్చు

2009లో ఆయన టీడీపీ నుండి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. 2015లో ఖమ్మం స్థానిక సంస్థల స్థానం నుండి టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి సిపిఐ అభ్యర్థీ పువ్వాడ నాగేశ్వర్‌ రావుపై 31 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు.[6]ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ) సభ్యుడిగా ఉన్నాడు.[7]

మూలాలు

మార్చు
  1. సాక్షి, ఖమ్మం (21 July 2019). "హలంపట్టి.. పొలం దున్నిన". Sakshi. Archived from the original on 6 July 2020. Retrieved 7 July 2020.
  2. Andhra Jyothy (23 December 2020). "సహకార." (in ఇంగ్లీష్). Archived from the original on 18 April 2022. Retrieved 18 April 2022.
  3. ఆంధ్రజ్యోతి, ఖమ్మం (11 February 2020). "తొమ్మిదిన్నరేళ్లపాటు అధ్యక్షుడిగా." www.andhrajyothy.com. Archived from the original on 6 July 2020. Retrieved 7 July 2020.
  4. Sakshi (10 October 2023). "బాలసాని అలక". Archived from the original on 15 October 2023. Retrieved 15 October 2023.
  5. V6 Velugu (15 October 2023). "బీఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్సీ రాజీనామా!". Archived from the original on 15 October 2023. Retrieved 15 October 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. ప్రజాశక్తి, ఖమ్మం (30 December 2015). "ఖమ్మం ఎమ్మెల్సీ బాలసాని గెలుపు". www.prajasakti.com. Archived from the original on 7 July 2020. Retrieved 7 July 2020.
  7. Sakshi (22 September 2019). "తెలంగాణ పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ". Archived from the original on 15 July 2021. Retrieved 15 July 2021.