బికారి రాముడు
సుఖీభవ ప్రొడక్షన్స్ బికారి రాముడు,1961 డిసెంబర్ 14 న విడుదల .పాలగుమ్మి పద్మరాజు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో కాంతారావు, జి . వరలక్ష్మి,రాజసులోచన,నాగభూషణం, మున్నగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం బి.గోపాలం సమకూర్చారు .
బికారి రాముడు (1961 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పాలగుమ్మి పద్మరాజు |
---|---|
తారాగణం | కాంతారావు, జి. వరలక్ష్మి , నాగభూషణం |
సంగీతం | బి.గోపాలం |
నిర్మాణ సంస్థ | సుఖీభవ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- కాంతారావు,
- రాజసులోచన,
- జి.వరలక్ష్మి,
- నాగభూషణం,
- సి.ఎస్.ఆర్.ఆంజనేయులు
- రమణారెడ్డి
- రామనాథశాస్త్రి
- సత్యనారాయణ
- మీనాకుమారి
- ఋష్యేంద్రమణి
- సీత
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: పాలగుమ్మి పద్మరాజు
- సంగీతం: బి. గోపాలం
పాటలు
మార్చుపాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
వాడేనే చెలి వాడేనే ఈడూ జోడూ కలవాడేనే | మల్లాది | బి.గోపాలం | పి.సుశీల |
రంగేళీ లీలల నారాజా | మల్లాది | బి.గోపాలం | ఎస్.జానకి |
ఇదియే నీ కధ తుదిలేని వ్యధ | పాలగుమ్మి పద్మరాజు | బి.గోపాలం | ఘంటసాల, శ్రీరంగం గోపాలరత్నం |
ఇదేం లోకం గురూ గురూ నువ్ చెప్పిందానికి | ఆరుద్ర | బి.గోపాలం | బి.గోపాలం బృందం |
ఈదినం నా మనం పూలతోరణం ఈ వనం | పాలగుమ్మి పద్మరాజు | బి.గోపాలం | ఎస్.జానకి, బి.గోపాలం |
ఎచటినుండి వచ్చావో ఎచటి కేగినావో | పాలగుమ్మి పద్మరాజు | బి.గోపాలం | శ్రీరంగం గోపాలరత్నం |
తంబి తంబి ఇంగే వా తమాషా నీవు చూసావా | పాలగుమ్మి పద్మరాజు | బి.గోపాలం | పి.బి.శ్రీనివాస్, బి.గోపాలం |
నిదురమ్మా నిదురమ్మా కదలి వేగమే రావమ్మ | పాలగుమ్మి పద్మరాజు | బి.గోపాలం | బి.గోపాలం |
చల్లని నీ దయ జల్లవయ్యా ఎల్లలోకముల | పాలగుమ్మి పద్మరాజు | బి.గోపాలం | ఘంటసాల, శ్రీరంగం గోపాలరత్నం |
నిదురమ్మా నిదురమ్మా కదిలి వేగమే రావమ్మా , రచన:పాలగుమ్మి పద్మరాజు, గానం: శ్రీరంగం గోపాలరత్నం .
సంక్షిప్త కథ
మార్చుకృష్ణయ్య అనే లక్షాధికారి భార్య సుభద్రమ్మకు లేకలేక కవలలు పుడతారు. ఒకడు అందాలబొమ్మ ఐతే మరొకడు కురూపి. తల్లికి తెలివి రాక ముందే కృష్ణయ్య వికారిని అనాథశరణాలయానికి పంపిస్తాడు. ఒకడు బికారిగా పెరిగి మంచివాడైతే, మరొకడు పువ్వుల్లో పెరిగి తల్లిదండ్రుల గుండెల్లో కుంపటి అవుతాడు. ఐతే బికారిరాముడు మాతృమూర్తి వాత్సల్యం కోసం పరితపిస్తూ ఆ ఇంటిలోనే చేరి ప్రేమగుణం వంటి ఔన్నత్యాన్ని తన అమాయకత్వంతో ఋజువు చేస్తాడు[1].
మూలాలు
మార్చు- ↑ కృష్ణానంద్ (25 January 1962). "చిత్రసమీక్ష:బికారి రాముడు". ఆంధ్రపత్రిక దినపత్రిక. Retrieved 22 February 2020.[permanent dead link]