బికిని

(బికినీ నుండి దారిమార్పు చెందింది)

బికిని స్ర్తీలు ధరించే ఒక రకమైన ఈత దుస్తులు. వీటిని ఈత కొడుతున్నపుడు , సముద్ర తీరాలలో విహరిస్తున్నపుడు ధరిస్తారు. ఈ దుస్తుల నిర్మాణం నీటిలో శరీర కదలికలకు అనుగుణముగా రూపొందించబడినది. వీటిలో పలు రకాలు ఉన్నాయి. కురచగా ఉండి స్త్రీ శరీర భాగాలను బహిర్గతం చేస్తున్నదనే కారణంతో కొన్ని దేశాలలో వీటిని నిషేధించారు.

సముద్రతీరంలో బికినీ ధరించి విహరిస్తున్న స్త్రీ

చరిత్ర

మార్చు
 
క్రీస్తు శకం (286–305 ) మధ్య గీయబడిన రోమన్ చిత్రపటంలో బికినీని పోలిన దుస్తులు

టు పీస్ బికినీగా ప్రపంచమంతా ఆకట్టుకుంటున్న ఈ డ్రెస్‌ను మొదటిసారి ఫ్రాన్స్ దేశీయుడైన లూయిజ్ రియర్డ్ రూపకల్పన చేశాడు. ఇతను రూపొందించిన బికినీని ‘బెర్నార్డి’ అనే ఫ్రెంఛ్ మోడల్ ధరించి జూలై 5, 1946లో ప్యారిస్ ఫ్యాషన్ షోలో హొయలు పోయింది. ఆ విధంగా ప్రపంచ ప్రజల దృష్టిని ఆకట్టుకుంది బికిని.

పేరు వెనుక చరిత్ర

మార్చు

పసిఫిక్ మహా సముద్రంలోని మార్షలీస్ దీవులలో ‘బికిని అటోల్’ అనేది ఒక దీవి పేరు. ఇక్కడ అమెరికా మొదటిసారి అణుబాంబు పరీక్షలు జరిపింది. ఈ దీవి పేరునే లూయిజ్ రియర్డ్ టూ పీసెస్ డ్రెస్‌కు పెట్టాడు . ‘వరల్డ్ స్మాలెస్ట్ బాతింగ్ సూట్’గా ప్రకటనలలో ప్రసిద్ధి చెంది అటు తర్వాత ఫిలిప్పీన్స్, బాలి, హవాలి, గోవా... వంటి ఎన్నో దేశాలలో రంగురంగుల బికినీలు వచ్చాయి. బికినీతో పాటు పై నుంచి కింది వరకు ఒళ్లంతా కప్పే ఈత దుస్తులెన్నో నేడు విపణిలో లభిస్తున్నాయి.

భారతదేశంలో బికినీ వస్త్రధారణ

మార్చు

మనదేశంలో వీటిని సాధారణ ప్రజలు ధరించడం చాలా అరుదు. కానీ సినిమాలలో కథానాయికలు అందాల ఆరబోతకు ఎక్కువగా దీనిని ధరిస్తుంటారు.మొదటిసారి బికినీని పోలిన దుస్తులు ధరించిన తార మీనాక్షి శిరోద్కర్. ‘బ్రహ్మచారి’ (1938) అనే మరాఠీ సినిమాలో ఈమె ఈత కొలనులో సింగిల్ పీస్ స్విమ్ సూట్‌లో కనిపించి అప్పటి వరకు ఉన్న సాంప్రదాయాలను తిరగరాసింది. ఈమె బాలీవుడ్ తారలు నమ్రత శిరోద్కర్, శిల్పా శిరోద్కర్‌ల బామ్మ.

షర్మిలా ఠాగూర్ మొట్టమొదట బాలీవుడ్‌లో ‘యాన్ ఈవెనింగ్ ఇన్ ప్యారిస్ (1967) సినిమాలో బికినీలో కనిపించిన నాయిక . ఈ సినిమాలో ఒన్ పీస్ బాతింగ్ సూట్‌లో కనిపించా రు ఈమె. ఆ తర్వాత డింపుల్ కపాడియా బాబీ (1973) సినిమాలో... ఆ తర్వాత వరుసగా హీరా పన్నా, పర్వీన్ బాబి స్విమ్‌సూట్‌లో కనిపించారు.

తెలుగు సినిమాలలో నాటి తరం హీరోయిన్ లు లక్ష్మి మొదలుకొని మాధవి వరకు బికినీలో కనిపించారు. నేటితరం తారలలో నయనతార, అనుష్క, దీపిక పదుకొనెలు బికినీ భామల జాబితాలో తొలి మూడు స్థానాలలో ఉన్నారు. ఆ తర్వాత ఇలియానా, ప్రియమణి, శ్రీయా శరన్, కాజల్, నమిత, శ్రుతిహాసన్, సదా, అంకిత, లక్ష్మీరాయ్, దీక్షాసేథ్... తదితరులు ఉన్నారు.

వివిధ రకాల శరీరాకృతులు, వాటికి తగ్గ బికినీలు

మార్చు
 
1909 లో తను స్వంతంగా రూపొందించుకున్న బికినీ లో ఈత పోటీలకు సిద్దంగా ఉన్న క్రీడాకారిణి అన్నెటె కెల్లర్‌మాన్

స్విమ్ సూట్ / బికిని ఎంపిక శరీరాకృతికి తగిన విధంగా ఉండాలి.

టాప్స్

మార్చు
  • ట్రయాంగిల్ : మెడ, వీపు భాగంలో ముడులు వేసుకొని అడ్జెస్ట్ చేసుకునే స్టైల్ ఇది. ఛాతి పరిమాణం తక్కువగా ఉన్నవారికి ఇవి నప్పుతాయి.
  • అండర్‌వైర్ : ఛాతి పరిమాణం ఎక్కువ ఉన్నవారి నుంచి తక్కువ ఉన్నవారి వరకూ ఈ స్టైల్ నప్పుతుంది.
  • హాల్టర్ : ఈ స్టైల్‌లో వెడల్పాటి పట్టీలు ఉండటంలో ఛాతి భాగంలో మరింత సపోర్టివ్‌గా ఉంటుంది.
  • టాన్‌కిని : ఉదరభాగాన్ని కూడా కవర్‌చేసే స్టైల్ ఇది.

బాటమ్స్

మార్చు
  • బ్రెజిలియన్ : పిరుదల భాగం బాగున్నవారికి ఈ స్టైల్ నప్పుతుంది.
  • సైడ్‌టై : రెండు వైపులా ముడులు వేసుకోవడానికి స్ట్రాప్స్ ఉంటాయి. పిరుదల భాగాన్ని తక్కువ కవర్ చేస్తుంది.
  • హిప్స్‌టర్ : ఈ బాటమ్ సైడ్స్ విశాలంగా ఉండటం వల్ల పిరుదుల భాగం ఎక్కువ కవర్ అవుతుంది.
  • హై వెయిస్టెడ్ : పొత్తికడుపు ఎత్తు ఉన్నవారికి నప్పుతుంది.
  • స్కర్టెడ్ : బాటమ్‌కి సరిపడా స్కర్ట్ కూడా అటాచ్ అయి ఉంటుంది.
రకము చిత్రము మొదట ఆవిష్కరణ వివరాలు
బాండేయు / బాండేకిని
 
noborder
శరీరాకృతి తీరుగా ఉన్నవారు స్ట్రాప్స్‌లేని బాండేయు టాప్ స్టైల్ స్విమ్ వేర్‌ను ఎంచుకోవాలి.[1]
మైక్రోకిని   1995
మోనోకిని   1964
ప్యూబికిని 1985
స్కర్టిని  
స్ల్గింగ్ బికిని
స్ట్రింగ్ బికిని   1974
టాన్‌కిని   1998
ట్రైకిని   1967

విశేశాలు

మార్చు
  • 1920లో క్రీడాకారులు స్లీవ్‌లెస్ టాంక్ సూట్స్‌ను ఈత సమయాలలో ధరించేవారు.
  • 1930లో నూలు దుస్తులతో విపణిలోకి వచ్చిన ఒన్‌పీస్ బాతింగ్‌సూట్ 20వ శతాబ్ధపు అతి చెత్త ఫ్యాషన్ జాబితాలో చేరింది .
  • 1931లో సముద్ర తీరాలకు ప్రత్యేకం అనిపించే ‘కోర్‌సెట్’ ఈత దుస్తులు మార్కెట్లోకి వచ్చాయి.
  • 1940ల కాలంలో మహిళల శరీరాకృతికి తగిన విధంగా స్ట్రాప్‌లెస్, సన్నని స్ట్రాప్స్.. వంటి రకరకాల ఈత దుస్తులని తయారుచేశారు
  • 1950ల కాలం నుంచి నేటి వరకు ఈ తరహాను పోలిన ఈత దుస్తులు కనిపిస్తున్నాయి.
  • 1960ల కాంలో నైలాన్ లేదా లిక్రా లేదా ఈ రెంటినీ పోలిన మెటీరియల్స్‌తో ఈత దుస్తులను తయారుచేసేవారు. ఈ తరహా దుస్తులు సాగడం, ఒంటికి హత్తుకున్నట్టు సౌకర్యంగా ఉండటంతో బాగా ప్రాచుర్యం పొందాయి.
  • స్పాండెక్స్ మెటీరియల్‌తో తయారైన ఈత దుస్తులు ప్రపంచమంతటా ఆకట్టుకుంటున్నాయి. నూలు, పాలియస్టర్ కలిపి తయారుచేయడంతో చూడటానికి, ధరించడానికి సౌకర్యంగా ఉంటాయి ఇవి. సాగే గుణం గల ఈ వస్త్రం దీర్గకాలం మన్నుతుంది.

మూలాలు

మార్చు
  1. Rena Fulka, "Seasonal style", The Star (Tinley Park), June 14, 2007

బయటి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=బికిని&oldid=3979465" నుండి వెలికితీశారు