నమిత
దక్షిణ భారతదేశ నటీమణి
నమితగా తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయమైన నటీమణి అసలు పేరు నమిత వాంక్వాలా. ఈమె మే 10, 1980లో గుజరాత్ రాష్ట్రం సూరత్ లోజన్మించింది.
నమిత | |
జన్మ నామం | నమిత ముఖేశ్ వాంక్వాలా [1] |
జననం | సూరత్, గుజరాత్, భారతదేశం | 1980 మే 10
ఇతర పేర్లు | భైరవి |
క్రియాశీలక సంవత్సరాలు | 2002-ఇప్పటివరకు |
భార్య/భర్త | వీరేంద్ర చౌదరి (m. 2017) |
1998లో మిస్ సూరత్ గా, 2001లో మిస్ ఇండియా పోటీల్లో నాలుగవ స్థానం సంపాదించింది.
జెమిని చిత్రంతో తెలుగు సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టినది. ఆ తరువాత సొంతం, ఒక రాజు ఒక రాణి, ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి చిత్రాలలో నటించి ప్రేక్షకుల మన్ననల్ని పొందింది. ఆ తరువాత తమిళ, కన్నడ, హిందీ సినీరంగంలోకి ప్రవేశించింది.
ఈ బొద్దుగుమ్మ 2010లో వచ్చిన సింహా చిత్రంలోనూ విశేషంగా అలరించింది. నమిత 2017లో నటుడు, వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరిని పెళ్లాడింది. వీరికి కవలలు జన్మిచ్చారు. ఈ విషయాన్ని 2022 ఆగస్టు 19న ఇద్దరు మగ శిశులకు జన్మనిచ్చినట్టు ఆమె ప్రకటించింది.[2]
నమిత నటించిన తెలుగు చిత్రాలు
మార్చు- సొంతం (2002)
- జెమిని (భైరవిగా పరిచయం) (2002)
- ఒక రాజు ఒక రాణి (2003)
- ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి (2003)
- ఐతే ఏంటి (2004)
- నాయకుడు (2005)
- వ్యాపారి (2007)
- జగన్మోహిని (2009)
- బిల్లా (2009)
- సింహా (2010)
- దేశ ద్రోహి (చిత్రీకరణ జరుగుతున్నది)
- పరమవీరచక్ర
- శుక్ర
- మన్యంపులి (2016)
మూలాలు
మార్చు- ఐ.సౌజన్య జూలై 2007 స్వాతి సపరివారపత్రికలో ప్రచురించిన వ్యాసం ఆధారంగా.
- ↑ http://www.youtube.com/watch?v=WKE_pajGHsM
- ↑ "Namitha: కవలలకు జన్మనిచ్చిన సినీనటి నమిత". web.archive.org. 2022-08-20. Archived from the original on 2022-08-20. Retrieved 2022-08-20.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)