పంజాబీ కేలండరు
పంజాబీ కేలండరు విక్రమాదిత్య రాజు నుండి వచ్చిన బిక్రమి కేలండరు ఆధారంగా రూపొందించబడి క్రీ.పూ 57 నుండి మొదలయింది. ఈ కేలండరు బిక్రమి కేలండరులోని సౌర అంశాల కోసం ఉపయోగపడుతుంది. దీనిలో వైశాఖిలోని మొదటి రోజును పంజాబీలు కొత్త సంవత్సర దినంగా "వైశాఖి"గా జరుపుకుంటారు.
పంజాబీ నెలలు (సౌర)సవరించు
పంజాబీ కేలండరులో వివిధ నెలలు ఈ విధంగా ఉంటాయి.
సం. | పేరు | పంజాబ్ గురుముఖి | పంజాబ్ షాముఖి | పశ్చిమాది నెలలు |
---|---|---|---|---|
1 | వైశాఖ్ | ਵੈਸਾਖ | ویساکھ | ఏప్రిల్ మధ్య నుండి మే మధ్య వరకు |
2 | జెత్ | ਜੇਠ | جیٹھ | మే మధ్య నుండి జూన్ మధ్య వరకు |
3 | హర్ | ਹਾੜ | ہاڑھ | జూన్ మధ్య నుండి జూలై మధ్య వరకు |
4 | సావన్ | ਸਾਵਣ | ساون | జూలై మధ్య నుండి ఆగస్టు మధ్య వరకు |
5 | భదాన్ | ਭਾਦੋਂ | بھادوں | ఆగస్టు మధ్య నుండి సెప్టెంబరు మధ్య వరకు |
6 | అస్సు | ਅੱਸੂ | اسو | సెప్టెంబరు మధ్య నుండి అక్టోబరు మధ్య వరకు |
7 | కట్టెక్ | ਕੱਤਕ | کاتک | అక్టోబరు మధ్య నుండి నవంబరు మధ్య వరకు |
8 | మఘర్ | ਮੱਘਰ | مگھر | నవంబరు మధ్య నుండి డిసెంబరు మధ్య వరకు |
9 | పోహ్ | ਪੋਹ | پوہ | డిసెంబరు మధ్య నుండి జనవరి మధ్య వరకు |
10 | మాఘ్ | ਮਾਘ | ماگھ | జనవరి మధ్య నుండి ఫిబ్రవరి మధ్య వరకు |
11 | ఫాగున్ | ਫੱਗਣ | پھگن | ఫిబ్రవరి మధ్య నుండి మార్చి మధ్య వరకు |
12 | చెత్ | ਚੇਤ | چیت | మార్చి మధ్య నుండి ఏప్రిల్ మధ్య వరకు |
పంజాబీ చాంద్రమాన కేలండరుసవరించు
పంజాబీ చాంద్రమాన కాలెండరు చైత్ తో మొదలవుతుంది. ఈ మాసం మొదటి రోజు కొత్త చంద్ర సంవత్సరం యొక్క ప్రారంభ దినం కాదు. ఈ నెలలో వచ్చే అమావాస్య నుండి ప్రారంభమవుతుంది. పంజాబీ చాంద్రమాన కేలండరులో ప్రతీ మాసం ఆ నెలలోని పౌర్ణమి తరువాత రోజు ప్రారంభమై తరువాత నెల పౌర్ణమి ముందురోజు అంతమవుతుంది. అందువలన చైత్ మాసం రెండు భాగాలుగా రెండు సంవత్సరాలకు విడిపోతుంది. అయినప్పటికీ చైత్ కొత్త సంవత్సరం పంజాబీ అధికార కొత్త సంవత్సరం కాదు. కానీ చాంద్రమాన సంవత్సరం చైత్ నుండి ప్రారంభమవుతుంది. పంజాబీ ఫోక్ కవితలు, బరాహ్హ్ మహా, సంవత్సరం మొదలుతో ప్రారంభమవుతాయి. పంజాబీ క్యాలెండర్లో చాంద్రమాన కారక అనేక పంజాబీ పండుగలను నిర్ణయిస్తుంది.
2014/2015 యొక్క చాంద్రమాన కేలండరు ఈ దిగువనీయబడింది.[1]
వ.సం. | చాంద్రమాసం పేరు | తేదీ | ఋతువు (అధికారిక) [2] | ఋతువు (పంజాబీ) | పౌర్ణమి | అమావాస్య |
---|---|---|---|---|---|---|
1. | చెతర్ | 17 మార్చి 2014 | వసంత ఋతువు | బసంత్ | 15 ఏప్రిల్ 2014 | 30 మార్చి 2014 |
2. | విశాఖ్ | 16 ఏప్రిల్ 2014 | వసంత ఋతువు | బసంత్ | 14 మే 2014 | 29 ఏప్రిల్ 2014 |
3. | జెత్ | 15 మే 2014 | గ్రీష్మ ఋతువు | రోహీ | 13 జూన్ 2014 | 28 మే 2014 |
4. | హర్ | 14 జూన్ 2014 | గ్రీష్మ ఋతువు | రోహీ | 12 జూలై 2014 | 27 జూన్ 2014 |
5. | సావన్ | 13 జూలై 2014 | వర్ష ఋతువు | బర్సాత్ | 10 ఆగస్టు 2014 | 26 జూలై 2014 |
6. | భదోన్ | 11 ఆగస్టు 2014 | వర్ష ఋతువు | బర్సాత్ | 8 సెప్టెంబరు 2014 | 25 ఆగస్టు 2014 |
7. | అసూజ్ | 10 సెప్టెంబరు 2014 | శరదృతువు | పాట్‌జర్ | 8 అక్టోబరు 2014 | 23 సెప్టెంబరు 2014 |
8. | కట్టెక్ | 9 అక్టోబరు 2014 | శరదృతువు | పాట్‌జర్ | 6 నవంబరు 2014 | 23 అక్టోబరు 2014 |
9. | మఘర్ | 7 నవంబరు 2014 | హేమంత ఋతువు | సియాల్ | 6 డిసెంబరు 2014 | 22 నవంబరు 2014 |
10. | పోహ్ | 7 డిసెంబరు 2014 | హేమంత ఋతువు | సియాల్ | 4 జనవరి 2015 | 21 డిసెంబరు 2014 |
11. | మాఘ్ | 6 జనవరి 2015 | శిశిర ఋతువు | సియాల్ | 3 ఫిబ్రవరి 2015 | 20 జనవరి 2015 |
12. | ఫగ్గన్ | 4 ఫిబ్రవరి 2015 | శిశిర ఋతువు | సియాల్ | 5 మార్చి 2015 | 18 ఫిబ్రవరి 2015 |
పంజాబీ పండుగలుసవరించు
పండుగ | నెల | సౌర లేదా చాంద్రమాన నెల | తేదీ |
---|---|---|---|
మాఘి/మకర సంక్రాంతి | మాఘ్ | సౌరమాన | మాఘమాసం మొదటి రోజు |
హోళీకా దహన్ | ఫాగన్ | చాంద్రమాన | ఫాగన్ నెల పౌర్ణమి |
హోళీ | చైత్ | చాంద్రమాన | చైత్ మాసంలోని ఫాగన్ అమావాస్య మొదటి రోజు |
రక్షాబంధన్ | సావన్ | చాంద్రమాన | సావన్ నెలలోని పౌర్ణమి |
వైశాఖి | విశాఖి | సౌరమాన | వైసాఖ్ మొదటిరోజు |
లోహ్రీ | పోహ | సౌరమాన | ఫోహ్ నెలలో చివరిరోజు |
తీజ్/తీయన్ | సావన్ | చాంద్రమాన | సావన్ నెల/ పౌర్ణమి నుండి మూడవరోజు |
బసంత్ ఫెస్టివల్ | మాఘ్ | చాంద్రమాన | అమావాస్య నుండి ఐదవరోజు |
పంజాబీ జానపద మతం: పండుగలుసవరించు
పండుగ | నెల | సౌర లేదా చాంద్ర మాసం | తేదీ |
---|---|---|---|
గుగ్గా | భాదన్ | చాంద్రమానం | 9 బాదన్ |
సంజీ | అస్సు | చాంద్రమానం | నవరాత్రిలో మొదటిరోజు |
పంజాబీ లో రోజులుసవరించు
సం. | పశ్చిమాది కేలండరులో రోజు | పంజాబీ రోజు[3] |
---|---|---|
1. | సోమవారం | సోమవార్ |
2. | మంగళవారం | మంగలవార్ |
3. | బుధవారం | బుధ్‌వార్ |
4. | గురువారం | వీరవార్ |
5. | శుక్రవారం | శుక్రవార్ |
6. | శనివారం | శనీఛ్చర్ వార్ |
7. | ఆదివారం | ఎత్వార్ |
ఇవీ చూడండిసవరించు
మూలాలుసవరించు
- ↑ Adarsh Mobile Applications LLP. "2015 Purnima Days, Pournami Days, Full Moon Days for San Francisco, California, United States".
- ↑ Faiths, Fairs and Festivals of India by C H Buck Rupa & CoISBN 81-7167-614-6
- ↑ Bhatia, Tej (1993) Punjabi. Routledge