బిభూతి భూషణ్ దాస్ గుప్తా

భారత స్వాతంత్ర్య సమరయోధుడు మరియు రాజకీయవేత్త

బిభూతి భూషణ్ దాస్ గుప్తా, ఒక భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త. దాస్ గుప్తా 1904 జనవరిలో దక్కా జిల్లా (బంగ్లాదేశ్) లోని సోనారంగ్ గ్రామంలోజన్మించాడు.[1] అతను రిషి నిబరన్ చంద్రదాస్ గుప్తాకుమారుడు.[1] దాస్ గుప్తా ఫరీద్‌పూర్‌లోని రజీంద్ర కళాశాలలో చదువుకున్నాడు. [2] అతను తన కళాశాల విద్యను పూర్తి చేయలేదు. దానిని మధ్యలోఆపి, భారతస్వాతంత్ర్య పోరాటంలో చేరాడు. [1]

రాజకీయాలు

మార్చు

1921లో అతను భారత జాతీయ కాంగ్రెస్ గ్రామస్థాయి కార్యదర్శిగా పనిచేశాడు.[1]1922,1948 మధ్య అతను మన్భుమ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ, బీహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడుగా పనిచేసాడు.[1]దాస్ గుప్తా 1938,1948 మధ్య భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడుగా ఉన్నాడు [1]

ఉప్పు సత్యాగ్రహానికి సంబంధించి అరెస్టయిన మంభుమ్‌లోని కాంగ్రెస్ నాయకులలో దాస్‌గుప్తా ఒకడు. [3] జైలు నుండి విడుదలైన తరువాత దాదాపు 1931-1932 ప్రాంతంలో అతను నిబరాంచంద్ర దాస్ గుప్తాతో కలిసి లోక్ సేవక్ సంఘ్, స్వరాజ్, సామాజిక సంస్కరణ కోసం పనిచేస్తున్న గాంధేయ ఉద్యమాన్ని స్థాపించాడు.[3] వారు అగ్రవర్ణ హిందువులతో సమానంగా సామాజిక, రాజకీయ జీవితంలో పాల్గొనవలసిందిగా ఆదివాసీలు, దళితులకు బోధించడంతో వారుకుల సోపానక్రమాలను సవాలు చేశారు.[3] కుష్టురోగులపై వివక్షకు వ్యతిరేకంగా పోరాడటానికి సంస్థ ప్రయత్నించింది.[3]

1938-1939లో అతను పురులియా మునిసిపాలిటీ వైస్ ఛైర్మన్‌గా పనిచేశాడు.[1] [2] క్విట్ ఇండియా ఉద్యమంలో అతడిని అరెస్టు చేశారు.[4] అతను 1948లో లోక్ సేవక్ సంఘాన్ని రాజకీయ పార్టీగా మార్చడంలో పాల్గొన్నాడు.దాని ప్రధాన కార్యదర్శి అయ్యాడు.[1]దాస్ గుప్తా 1957 భారత సార్వత్రిక ఎన్నికల్లో పురులియాస్థానం నుండి లోకసభకు (రాజ్యసభ) ఎన్నికయ్యాడు.[5]దాస్ గుప్తా 1967 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో పురులియా నియోజకవర్గం నుంచి గెలిచాడు.[6]ఎన్నికల తరువాత దాస్ గుప్తా మొదటి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో పంచాయితీలు, సాంఘిక సంక్షేమ మంత్రిగా పనిచేసాడు. [7] [8]1969 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో దాస్ గుప్తా పురులియా స్థానాన్నినిలబెట్టుకున్నాడు.[6]1969లో ఏర్పడిన రెండవ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో అతను పంచాయితీల మంత్రిగా ఎంపికయ్యాడు.[6]

అతను ముక్తి ఎడిటర్‌గా పనిచేశాడు.[1] అతను పురులియాలోని శిల్పాశ్రమంలో నివసించాడు. [1]

ప్రస్తావనలు

మార్చు
  1. 1.00 1.01 1.02 1.03 1.04 1.05 1.06 1.07 1.08 1.09 India Who's who. INFA Publications. 1973. p. 284.
  2. 2.0 2.1 Lok Sabha. Second Lok Sabha Members Bioprofile Archived 20 డిసెంబరు 2016 at the Wayback Machine
  3. 3.0 3.1 3.2 3.3 West Bengal (India); Jatindra Chandra Sengupta (1985). West Bengal district gazetteers. Vol. 12. State editor, West Bengal District Gazetteers. pp. 104–105.
  4. Sajal Basu; Indian Institute of Advanced Study (1992). Regional movements: politics of language, ethnicity-identity. Indian Institute of Advanced Study. p. 113.
  5. Election Commission of India. STATISTICAL REPORT ON GENERAL ELECTIONS, 1957 TO THE SECOND LOK SABHA - VOLUME I (NATIONAL AND STATE ABSTRACTS & DETAILED RESULTS)
  6. 6.0 6.1 6.2 Communist Party of India (Marxist). West Bengal State Committee. Election results of West Bengal: statistics & analysis, 1952-1991. The Committee. pp. 379, 440.
  7. Asian Recorder. Vol. 13. 1967. p. 7634.
  8. Subhash C. Kashyap (1974). The politics of power: defections and state politics in India. National Pub. House. p. 509.

వెలుపలి లంకెలు

మార్చు