బియ్యాల జనార్ధన్‌రావు

బియ్యాల జనార్ధన్‌రావు (1955, అక్టోబరు 12 - 2002, ఫిబ్రవరి 27) మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, ప్రొఫెసర్. ఆదివాసీల భూసమస్యలు, స్వయంపాలన ఉద్యమాలపై పరిశోధన చేసి వారి సంక్షేమానికి కృషి చేశాడు.[1]

బియ్యాల జనార్ధన్‌రావు
బియ్యాల జనార్ధన్‌రావు
జననం
బియ్యాల జనార్ధన్‌రావు

(1955-10-12)1955 అక్టోబరు 12
మరణం2002 ఫిబ్రవరి 27(2002-02-27) (వయసు 46)
వృత్తిప్రొఫెసర్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
తెలంగాణ ఉద్యమకారుడు
తల్లిదండ్రులు
  • కిషన్‌రావు (తండ్రి)
  • అంజనమ్మ (తల్లి)

జననం, విద్య

మార్చు

జనార్ధన్‌రావు 1955, అక్టోబరు 12న కిషన్‌రావు - అంజనమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాదు జిల్లా, నెల్లికుదురు మండలంలోని మునిగలవీడు గ్రామంలో జన్మించాడు. 1983లో కాకతీయ విశ్వవిద్యాలయంలో చదువు పూర్తిచేశాడు. గిరిజన భూముల పరాయీకరణ అనే అంశంపై పరిశోధన చేసి 1985లో పీహెచ్‌డీ పట్టాపొంది తొలి గిరిజనేతర వ్యక్తిగా నిలిచాడు.[2]

వృత్తి జీవితం

మార్చు

పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పార్ట్ టైం అధ్యాపకుడిగా చేరి, ఆ తర్వాత కాకతీయ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తూ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగపు ప్రధానాచార్యునిగా పనిచేశాడు. 62 జాతీయ సదస్సులలో అమెరికా, జర్మనీ, స్వీడన్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో జరిగిన 11 అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొని పరిశోధనా పత్రాలు సమర్పించాడు. 1993-95 మధ్య ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్’ న్యూఢిల్లీ పోస్ట్ డాక్టోరల్ ఫెలోగా ఎంపికయ్యాడు.

ఆదివాసీ ఉద్యమం

మార్చు

1993- 1995 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆదివాసీ ఉద్యమాలు, 1/70 చట్టం, ఏజెన్సీ ప్రాంత గ్రామీణ సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టి, ఆదివాసుల స్వయం పాలనపై అనేక వ్యాసాలు రాశాడు.[3]

తెలంగాణ ఉద్యమం

మార్చు

మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని తెలంగాణపై వివక్ష, అణచివేత గురించి అనేక రచనలు చేశాడు. ప్రొఫెసర్ జయశంకర్‌తో కలసి అమెరికాలో జరిగిన ‘తానా’ సభల్లో పాల్గొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవశ్యకతపై ప్రసంగించాడు. 2001లో తెలంగాణ రాష్ట్రసమితి పార్టీ ఏర్పాటులో కీలకపాత్ర పోషించాడు.

జనార్ధన్‌రావు 2002, ఫిబ్రవరి 27న గుండెపోటుతో మరణించాడు.

మూలాలు

మార్చు
  1. telugu, NT News (2022-10-12). "ఉద్యమ దివిటీ". www.ntnews.com. Archived from the original on 2022-11-09. Retrieved 2022-11-09.
  2. "తెలంగాణ ఉద్యమ పునాదిరాయి 'బియ్యాల'". Sakshi. 2015-02-27. Archived from the original on 2022-11-09. Retrieved 2022-11-09.
  3. "ఆదివాసీల ఆత్మబంధువు జనార్ధన్‌". Sakshi. 2019-02-27. Archived from the original on 2022-11-10. Retrieved 2022-11-10.