బి.ఆర్‌.కె.రెడ్డి

బి.ఆర్‌.కె.రెడ్డి (బొమ్మారెడ్డి రామకోటిరెడ్డి) ప్రముఖ శాస్త్ర ప్రచారకర్త, జన విజ్ఞాన వేదిక కృష్ణా జిల్లా గౌరవాధ్యక్షులు. ఐదు సంపూర్ణ సూర్యగ్రహణాలను వీక్షించిన అతి కొద్దిమందిలో బిఆర్‌కె రెడ్డి ఒకరు[1].

జీవిత విశేషాలు

మార్చు

ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకు చెందిన తేలప్రోలు గ్రామంలో జనవరి 4 1938 న జన్మించారు. ప్రాథమిక విద్యను తేలప్రోలలో పూర్తి చేసారు. ఇంటర్మీడియట్ విద్యను విజయవాడ లోని ఆంధ్ర లయోలా కళాశాలలో చదివారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో బిఎస్‌సి హానర్స్‌ పూర్తిచేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ పొందారు. హైదరాబాదు లోని పివి నరసింహారావు కళాశాలలో భౌతిక శాస్త్ర అధ్యాపకులుగా కొద్దికాలం పనిచేశారు. తరువాత ఆయన విజయవాడ శాతవాహన కళాశాలలో అధ్యాపకులుగా చేరి పదవీ విరమణ చేసేంతవరకు తన సేవలనందించారు. ఆయన విజయవాడలోని గాంధీ హిల్ ప్లానిటోరియంలో 20 యేండ్ల పాటు అతిథి అధ్యాపకునిగా పనిచేసారు.[2]

ఆయన ఖగోళ శాస్త్ర విజ్ఞానం, విశ్వం పుట్టుక, సైన్సు విజ్ఞానం గురించి ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు.[3] అంతేగాక పలు సదస్సుల్లో పాల్గొన్నారు.[4] సంపూర్ణ సూర్యగ్రహణాల సందర్భంగా పలు వార్తాపత్రికల్లో వ్యాసాలు రాశారు. పలు టెలివిజన్ ఛానళ్లు ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. భవానీపురం లోని రీజనల్‌ సైన్స్‌ సెంటర్‌లో కొద్దికాలం పనిచేశారు. ఖగోళ శాస్త్ర విజ్ఞానంపై అవగాహన కల్పించినందుకుగాను డాక్టర్‌ బిఆర్‌కె రెడ్డికి గవర్నర్‌ నుండి, కలెక్టర్‌ నుండి అవార్డులందుకున్నారు. జన విజ్ఞాన వేదికతో కలిసి పలు సదస్సులు నిర్వహించడంతోపాటు సంపూర్ణ సూర్యగ్రహణంపై పలు పుస్తకాలూ రాశారు. ఆయన అనేక కళాశాలలలో జాతీయ సైన్స్ దినోత్సవాలలో పాల్గొన్నారు.[5]

వ్యక్తిగత జీవితం

మార్చు

ఆయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఆయన అనారోగ్యం కారణంగా జనవరి 21 2016 న మృతిచెందారు.[6]

మూలాలు

మార్చు
  1. "'Watch the solar eclipse without fear'". Staff Reporter. The Hindu. July 17, 2009. Retrieved 22 January 2016.
  2. "బి.ఆర్‌.కె.రెడ్డి కన్నుమూత". ప్రజాశక్తి - ఎడ్యుకేషన్‌ (విజయవాడ). prajasakti. 22 January 2016. Retrieved 22 January 2016.[permanent dead link]
  3. "Venus transit enthrals skygazers". STAFF REPORTER. The Hindu. June 7, 2012. Retrieved 22 January 2016.
  4. "Students asked to emulate Einstein". Special Correspondent. The Hindu. March 15, 2008. Retrieved 20 January 2016.
  5. "Young 'scientists' take out rally". SPECIAL CORRESPONDENT. The Hindu. March 1, 2011. Retrieved 20 January 2016.
  6. బి.ఆర్‌.కె.రెడ్డి కన్నుమూత[permanent dead link]

ఇతర లింకులు

మార్చు