బి.సి. గౌరీశంకర్

కర్ణాటక రాష్ట్రానికి చెందిన సినిమాటోగ్రాఫర్, దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత

బి.సి. గౌరీశంకర్ (1950, ఫిబ్రవరి 25 - 2004, నవంబరు 16) కర్ణాటక రాష్ట్రానికి చెందిన సినిమాటోగ్రాఫర్, దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. ప్రధానంగా కన్నడ సినిమాలకు పనిచేశాడు. సినిమాటోగ్రాఫర్‌గా తన అసాధారణ శైలికి ప్రసిద్ది చెందాడు.[1] గౌరీశంకర్ సినిమాటోగ్రాఫర్‌గా తన కెరీర్‌లో ఆరు కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులను గెలుచుకున్నాడు.[2] 1988లో అంబరీష్, గౌతమి, రమేష్ అరవింద్‌ తదితరులతో ఏలు సుట్టిన కోట సినిమా తీసి మంచి విజయాన్ని సాధించాడు.

బి.సి. గౌరీశంకర్
జననం(1950-02-26)1950 ఫిబ్రవరి 26
మరణం2004 నవంబరు 16(2004-11-16) (వయసు 54)
వృత్తిసినిమాటోగ్రాఫర్, దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత
క్రియాశీల సంవత్సరాలు1977–2004
జీవిత భాగస్వామిమమతా రావు
పిల్లలురక్షిత

జీవిత విశేషాలు మార్చు

తొలి జీవితం మార్చు

గౌరీశంకర్ 1950 ఫిబ్రవరి 26న బి. చన్నబసప్ప - శశిముఖి దంపతులకు కర్ణాటకలోని బెంగళూరులో జన్మించాడు. జయచామరాజేంద్ర పాలిటెక్నిక్ నుండి సినిమాటోగ్రఫీలో డిప్లొమా పొందాడు. బెంగళూరులోని కంఠీరవ స్టూడియోస్‌లో కొంతకాలం పనిచేశాడు.

వివాహం మార్చు

హోస బెలకు, ప్రాయ ప్రాయ ప్రాయ, అంతరాల వంటి సినిమాల్లో నటించిన కన్నడ నటి మమతా రావుతో గౌరీశంకర్ వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె రక్షిత (సినిమా నటి) ఉంది.

సినిమారంగం మార్చు

1977లో అనురూప అనే కన్నడ సినిమాతో సినిమాటోగ్రాఫర్‌గా పరిచయమయ్యాడు. ఆ తరువాత స్పందన (1978), అరివు (1979) వంటి 1970ల సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా విమర్శకుల ప్రశంసలను పొందాడు.[2]

1995 విమర్శకుల ప్రశంసలు పొందిన మాఫియా చిత్రం ఓం (1995)లో, అండర్ వరల్డ్ మానసిక స్థితిని చూపించడానికి ఫిల్టర్‌లను ఉపయోగించాడు. పుష్పక విమానం (1987), ముంగరిన మించు (1998) సినిమాలకు పనిచేసి ప్రశంసించబడ్డాడు. 1996లో వచ్చిన జనుమద జోడి సినిమాలో సూర్యాస్తమయం కొన్ని నిమిషాలపాటు మాత్రమే ఉండేలా తొమ్మిది రోజులపాటు సూర్యాస్తమయం నేపథ్యంలో శివరాజ్‌కుమార్, శిల్పా, పవిత్రా లోకేష్‌లపై "మణి మణిగొండు దారా" పాటను చిత్రీకరించాడు. మైసూర్ మల్లిగే (1992) సినిమాలోని "దీపావు నిన్నే గాలియు నిన్నడే" పాటను ఒక చిన్న దీపం వెలుగులో సుధారాణిపై చిత్రీకరించాడు. ఈ సినిమాకు ఇతడికి ఐదవ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం లభించింది.

సినిమాలు మార్చు

సినిమాటోగ్రాఫర్‌గా మార్చు

  • అనురూప (1977)
  • హులి బంతు హులి (1978)
  • అపరిచిత (1978)
  • స్పందన (1978)
  • ఖండవిదేకో మంసవిదేకో (1979)
  • మధు చంద్ర (1979)
  • ఎనే బరాలి ప్రీతి ఇరాలి (1979)
  • అరివు (1979)
  • మించిన ఓట (1980)
  • ప్రేమ అనురాగ (1980)
  • దొడ్డమనే ఎస్టేట్ (1980)
  • జన్మ జన్మద అనుబంధ (1980)
  • గాలి మాటు (1981)
  • గీత (1981)
  • మునియాన మదారి (1981)
  • ఆలేమనే (1981)
  • హోసా బెలాకు (1982)
  • అమర మధుర ప్రేమ (1982)
  • నాన్న దేవరు (1982)
  • చలీసువ మొదగలు (1982)
  • అంతరాల (1982)
  • బెత్తలే సెవె (1982)
  • కామన బిల్లు (1983)
  • గాయత్రి మదువే (1983)
  • ఈరడు నక్షత్రాలు (1983)
  • సమయదా గొంబే (1984)
  • ప్రేమ సాక్షి (1984)
  • రామపురాడ రావణ (1984)
  • శృంగార మాస (1984)
  • మరలి గూడిగే (1984)
  • అపూర్వ సంగమ (1984)
  • బెట్టాడ హూవు (1985)
  • జ్వాలాముఖి (1985)
  • ధృవ తారే (1985)
  • బెంగళూరు రాత్రియల్లి (1985)
  • ఆనంద్ (1986)
  • ఓండు ముట్టిన కథే (1987)
  • విజయోత్సవ (1987)
  • మనమెచ్చిద హుడుగి (1987)
  • కెండాడ మలే (1987)
  • పుష్పక విమాన (1987)
  • ఏలు సుట్టిన కోటే (1988)
  • అదే రాగ అదే హాదు (1990)
  • ఆసెగొబ్బ మీసగొబ్బ (1990)
  • కడిన వీర (1990)
  • మైఖేల్ మదన కామ రాజన్ (1990)
  • ఆటా బొంబటా (1990)
  • హృదయ హదీతు (1991)
  • గండు సిడిగుండు (1991)
  • కల్యాణ మంటప (1991)
  • మైసూర్ మల్లిగే (1992)
  • బెల్లియప్ప బంగారప్ప (1992)
  • మన్నిన దోని (1992)
  • అంగైలీ అప్సరే (1993)
  • ఊర్వశి కళ్యాణ (1993)
  • చిన్నారి ముఠా (1993)
  • రూపాయి రాజా (1993)
  • ఓడహుట్టిదవరు (1994)
  • సాగర దీప (1994)
  • ఓం (1995)
  • పోలీస్ పవర్ (1995)
  • సూత్రధార (1996)
  • జనుమద జోడి (1996)
  • చిక్కా (1997)
  • ముంగారిన మించు (1997)
  • విమోచనే (1997)
  • స్వస్తిక్ (1998)
  • భూమి తయ్య చొచ్చల మగా (1998)
  • జనుమదత (1999)
  • తువ్వి తువ్వి తువ్వి (1999)
  • హృదయ హృదయ (1999)
  • ఆర్యభట్ట (1999)
  • మహాత్మా (2000)
  • కృష్ణ లీలే (2000)
  • కురిగలు సార్ కురిగలు (2001)
  • ప్రీమి నం.1 (2001)
  • కొత్తిగలు సార్ కొత్తిగలు (2001)
  • లవ్ లవికే (2002)
  • ప్రేమ (2002)
  • సింగరవ్వ (2003)
  • చిగురిడ కనసు (2003)
  • కాంచన గంగ (2004)

దర్శకుడిగా మార్చు

  • కెండాడ మేలే (1987)
  • ఏలు సుట్టిన కోటే (1988)
  • ఆటా బొంబటా (1990)

స్క్రీన్ రైటర్ గా మార్చు

  • ఏలు సుట్టిన కోటే (1988)
  • ఆటా బొంబటా (1990)

అవార్డులు మార్చు

  • ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డు
    • స్పందన (1977–78)
    • అరివు (1979–80)
    • మించిన ఓట (1979–80)
    • ధృవ తారే (1985–86)
    • మైసూర్ మల్లిగే (1991–92)
    • ఓం (1995–96)

మరణం మార్చు

ఇతడు 2004, నవంబరు 16న కర్ణాటకలోని బెంగళూరులో మరణించాడు.

మూలాలు మార్చు

  1. "B.C. Gowrishankar dead". The Hindu. 17 November 2004. Archived from the original on 7 February 2005. Retrieved 2023-07-23.
  2. 2.0 2.1 "Camera was his magic wand". Deccan Herald. 5 December 2004. Archived from the original on 13 January 2016. Retrieved 2023-07-23.

బయటి లింకులు మార్చు