భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి

(బి. సత్యనారాయణ రెడ్డి నుండి దారిమార్పు చెందింది)

భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి (ఆగష్టు 21, 1927 - అక్టోబరు 6, 2012) మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచనోద్యమకారుడు. సోషలిస్ట్ రాజకీయ నాయకుడు ఉత్తర ప్రదేశ్, ఒడిశా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేశాడు.[1] [2][3] రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, ఉత్తర ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేశాడు. 2012 అక్టోబరు 6న హైదరాబాదులో మరణించాడు.[4]

బి.సత్యనారాయణ రెడ్డి
ఒడిశా గవర్నర్
In office
1993 జనవరి 1 – 1995 జూన్ 17
అంతకు ముందు వారుసయ్యద్ హుస్సేన్
తరువాత వారుగోపాల రామానుజం
పశ్చిమ బెంగాల్ గవర్నర్
In office
1993 జులై 13 – 1993 ఆగస్టు 14
అంతకు ముందు వారుసయ్యద్ హుస్సేన్
తరువాత వారుకె.వి. రఘునాథరెడ్డి
ఉత్తరప్రదేశ్ గవర్నఉర్
In office
1990 ఫిబ్రవరి 12 – 1993 మే 25
అంతకు ముందు వారుమహమ్మద్ అరీఫ్
తరువాత వారుమోతిలాల్ వోరా
వ్యక్తిగత వివరాలు
జననం1927 ఆగస్టు 21
మహబూబ్ నగర్ తెలంగాణ భారతదేశం
మరణం2012 అక్టోబర్ 6
హైదరాబాద్ తెలంగాణ భారతదేశం
జాతీయతభారతీయుడు
నైపుణ్యంరాజకీయ నాయకుడు

సత్యనారాయణ రెడ్డి 1927 ఆగస్టు 21న మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ మండలం అన్నారంలో భీంరెడ్డి నర్సిరెడ్డి, మాణిక్యమ్మ దంపతులకు వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. షాద్‌నగర్ మండలం అన్నారంలో 1927 ఆగస్టు 21న జన్మించి, మొగిలిగిద్ద, హైదరాబాదులలో విద్య అభ్యసించాడు.

బాల్యం, విద్యాభ్యాసం

మార్చు

ప్రాథమిక విద్య మొగిలిగిద్దలో ఆ తర్వాత హైదరాబాదు లోని వివేకవర్ధిని ఉన్నత పాఠశాల‌, నిజాం కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేశాడు. విద్యార్థి దశలోనే సామ్యవాద భావాలు కలిగిన సత్యనారాయణరెడ్డి 14 ఏళ్ల వయసులోనే క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్టయ్యాడు. సత్యనారాయణరెడ్డి స్వగ్రామంలో ఆంజనేయస్వామి ఆలయాన్ని కట్టించాడు. దళితులకు పక్కా ఇళ్లు మంజూరు చేయించారు.

స్వాతంత్ర సమరయోధుడు

మార్చు

1942లో సత్యనారాయణ రెడ్డి 14 ఏళ్ల వయసుకే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. ఉద్యమంలో పాల్గొన్నందుకు సత్యనారాయణ రెడ్డిని బ్రిటిష్ పోలీస్ అధికారులు అరెస్టు చేశారు. 1947లో నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం చేసి ఆరు నెలల పాటు చంచల్ గూడ జైలులో గడిపాడు. అతను జైలులో ఉన్న సమయంలో పయం-ఎ-నవ్ అనే వారపత్రికకు సంపాదకత్వం వహించాడు.[5]

రాజకీయాలు

మార్చు

ఆచార్య నరేంద్రదేవ్‌, 'లోక్‌నాయక్‌' జయప్రకాశ్‌ నారాయణ్‌, రామ్‌మనోహర్‌ లోహియాల స్ఫూర్తితో తొలుత సోషలిస్టు పార్టీలో క్రియాశీలంగా పాల్గొన్నాడు. వినోబా భావే భూదాన ఉద్యమం లోనూ పాల్గొన్నాడు. ఎమర్జెన్సీ కాలంలో 'మీసా' చట్టం కింద అరెస్టయి 18 నెలలు జైల్లో ఉన్నాడు. జైల్లో 'పయామ్‌-ఇ-నవ్‌' అనే హిందీ పత్రిక నడిపి సహచరులకు పంచిపెట్టేవాడు. తర్వాత జనతా పార్టీలో చేరాడు. 1978లో జనతా పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యాడు. 1983లో తెలుగుదేశం పార్టీలో చేరి 1994లో రెండవసారి రాజ్యసభకు ఎన్నికయ్యాడు. పార్లమెంటుకు చెందిన కమిటీలలో వివిధ హోదాల్లో పనిచేశాడు.

గవర్నరు పదవులు

మార్చు

సత్యనారాయణ రెడ్డి 12 ఫిబ్రవరి 1990 నుండి 25 మే 1993 వరకు ఉత్తర ప్రదేశ్ గవర్నర్‌గా 1 జూన్ 1993 నుండి 17 జూన్ 1995 వరకు ఒడిశా గవర్నర్‌గా పనిచేశారు. [6] అతను 13 జూలై 1993 14 ఆగస్టు 1993 మధ్య పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తించాడు. బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో సత్యనారాయణ రెడ్డి ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా ఉన్నారు.

వ్యక్తిగత జీవితం

మార్చు

ప్రజాసేవకే అంకితం కావాలన్న ఉద్దేశంతో ఆయన పెళ్ళి కూడా చేసుకోలేదు. ఆర్యసమాజ్ ఆదర్శాలను అమలులో పెట్టాడు.[7] తనకు సంక్రమించిన 25 ఎకరాల భూమిని అన్న కుమారుడైన రాంచంద్రారెడ్డికి ఇచ్చి, తన శేషజీవితాన్ని రాంచంద్రారెడ్డి వద్దే గడిపాడు. ఎమ్మెల్యేగా పనిచేసిన దామోదర్ రెడ్డి ఇతనికి సొంత పెద్దమ్మ కుమారుడు.

ఊపిరితిత్తుల వ్యాధితో చికిత్స పొందుతూ 85 సంవత్సరాల వయస్సులో 2012 అక్టోబరు 6 న తుది శ్వాస విడిచాడు.

మూలాలు

మార్చు
  1. "All India Freedom Fighters' Organisation". Archived from the original on 26 March 2012.
  2. "Archived copy" (PDF). Archived from the original (PDF) on 19 December 2013. Retrieved 2016-08-29.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  3. "SHRI. B. SATYA NARAYAN REDDY". Rajbhavan Lucknow. Archived from the original on 21 May 2007. Retrieved 14 January 2011.
  4. ఈనాడు దినపత్రిక, తేది 07-10-2012
  5. "SHRI. B. SATYA NARAYAN REDDY". Archived from the original on 21 May 2007.
  6. "Brief History of Odisha Legislative Assembly Since 1937". ws.ori.nic.in. 2011. Archived from the original on 9 January 2007. Retrieved 24 April 2012. NAME OF THE GOVERNORS OF Odisha
  7. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగు యోధులు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ సొసైటీ ప్రచురణ,తొలి ముద్రణ 2006