బూచమ్మ బూచోడు
బూచమ్మ బూచోడు 2014, సెప్టెంబరు 5న విడుదలైన తెలుగు చలనచిత్రం. స్నేహ మీడియా, హెజెన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై రమేష్ అన్నంరెడ్డి, ప్రసాద్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో రేవన్ యాదు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాజీ, ఖైనాజ్ మోతీవాల జంటగా నటించగా, శేఖర్ చంద్ర సంగీతం అందించాడు.[1][2]
బూచమ్మ బూచోడు | |
---|---|
![]() బూచమ్మ బూచోడు సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | రేవన్ యాదు (యాదగిరి) |
రచన | సాయి కృష్ణ |
స్క్రీన్ ప్లే | సాయి కృష్ణ |
కథ | సాయి కృష్ణ |
నిర్మాత | రమేష్ అన్నంరెడ్డి & ప్రసాద్ రెడ్డి |
తారాగణం | శివాజీ ఖైనాజ్ మోతీవాల |
ఛాయాగ్రహణం | విజయ్ మిశ్ర |
కూర్పు | ప్రవీణ్ పూడి |
సంగీతం | శేఖర్ చంద్ర |
నిర్మాణ సంస్థ | స్నేహ మీడియా & హెజెన్ ఎంటర్టైన్మెంట్ |
విడుదల తేదీ | 2014 సెప్టెంబరు 5 |
సినిమా నిడివి | 112 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథా నేపథ్యం సవరించు
కార్తీక్ (శివాజీ), శ్రావణి (కైనాజ్) భార్యాభర్తలు, ఎంతో అన్యోన్యంగా ఉంటుంటారు. కొత్తగా కొనుక్కున్న ఫామ్ హౌస్‌లో ఏకాంతంగా గడపడానికి వెళ్ళిన వాళ్ళు, ఒక రాత్రి కారణం లేకుండా ఒకర్నొకరు కొట్టుకుంటారు. ఎందుకు కొట్టుకున్నారన్నది వాళ్ళిద్దరికి అర్థంకాదు. కొన్నిరోజుల తరువాత ఆ ఇంట్లో ఏదో ఉందనే విషయం తెలుస్తుంది. కార్తీక్ భయపడ్డట్టుగానే ఆ ఇంట్లో అదృశ్య శక్తులు తమని అధీనంలోకి తీసుకుని వేధిస్తుంటాయి. అక్కడ్నుంచి బయటపడడానికి కూడా వీలులేని పరిస్థితుల్లో ఒకర్నొకరు ఫలానా రోజున చంపుకుంటామని సవాల్ చేసుకుంటారు. కార్తీక్, శ్రావణి చనిపోయారా, అసలు ఎందుకు అలా జరుగుతుందనేది మిగతా కథ.[3][4]
నటవర్గం సవరించు
- శివాజీ (కార్తీక్)
- ఖైనాజ్ మోతీవాల (శ్రావణి)
- బ్రహ్మానందం (చరణ్-కార్తీక్ అంకుల్)
- పోసాని కృష్ణమురళి (తాంత్రిక్)
- వెన్నెల కిషోర్
- శ్రీనివాసరెడ్డి
- తాగుబోతు రమేష్
- చమ్మక్ చంద్ర (యాదగిరి)
- రవివర్మ
- చిత్రం శ్రీను
- వేణు
- అవినాష్ మాదేటి
- భక్తి
- బేబి మోక్ష
- తేజ కాకుమాను
సాంకేతికవర్గం సవరించు
- దర్శకత్వం: రేవన్ యాదు (యాదగిరి)
- నిర్మాతలు: రమేష్ అన్నంరెడ్డి & ప్రసాద్ రెడ్డి
- కథ, చిత్రానువాదం, మాటలు: సాయి కృష్ణ
- సంగీతం: శేఖర్ చంద్ర
- ఛాయాగ్రహణం: విజయ్ మిశ్ర
- కూర్పు: ప్రవీణ్ పూడి
- పాటలు: శ్రీమణి
- నిర్మాణ సంస్థ: స్నేహ మీడియా & హెజెన్ ఎంటర్టైన్మెంట్
పాటలు సవరించు
- ఈ క్షణమే ఒక - సాయి చరణ్, హార్సెక్స్ - 4:06
- ఏం జరిగిందో - భార్గవి పిళ్ళై, సాయి చరణ్ - 3:33
- ఓహ్ చెలియా ఇది - శేఖర్ చంద్ర - 0:55
మూలాలు సవరించు
- ↑ "Boochamma Boochodu review. Boochamma Boochodu Telugu movie review, story, rating". IndiaGlitz.com.
- ↑ "Archived copy". Archived from the original on 2014-11-20. Retrieved 2020-08-06.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ తెలుగు గ్రేట్ ఆంధ్ర, రివ్యూ (5 September 2014). "సినిమా రివ్యూ: బూచమ్మ బూచోడు". www.telugu.greatandhra.com. Retrieved 7 August 2020.
- ↑ The Times of India, Movie Review (5 May 2016). "Boochamma Boochodu Movie Review". Archived from the original on 7 August 2020. Retrieved 7 August 2020.