బెరీలియం అయోడైడ్

బెరిలీయం అయోడైడ్ ఒక రసాయన సంయోగపదార్థం. ఇది ఒక అకర్బన సంయోగపదార్థం.బెరీలియంమరియు అయోడిన్ మూలక పరమాణు సంయోగం వలన ఏర్పడినది. ఈ సంయోగ పదార్థం రసాయన సంకేతపదం BeI2. తేమను పీల్చుకునే/చెమ్మగిల్లే/ఆర్ద్రతాకర్షక (hygroscopic ) గుణమున్న సంయోగ పదార్థం. బెరిలీయం అయోడైడ్ నీటిలో తీవ్రంగా చర్య జరపడంవలన హైడ్రో అయోడిక్ ఆమ్లాన్ని ఏర్పరచును.

బెరీలియం అయోడైడ్
పేర్లు
Systematic IUPAC name
Beryllium iodide
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [7787-53-3]
పబ్ కెమ్ 82231
SMILES [Be+2].[I-].[I-]
ధర్మములు
BeI2
మోలార్ ద్రవ్యరాశి 262.821 g/mol
స్వరూపం colorless needle-like crystals
సాంద్రత 4.325 g/cm³
ద్రవీభవన స్థానం 480 °C (896 °F; 753 K)
బాష్పీభవన స్థానం 590 °C (1,094 °F; 863 K) [1]
reacts explosively
ద్రావణీయత Slightly soluble in CS2
Soluble in ethanol, diethyl ether[2]
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
orthorhombic
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
-192.62 kJ/mol
దహనక్రియకు కావాల్సిన
ప్రామాణీక ఎంథ్రఫీ
ΔcHo298
19 kJ/mol
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ
So298
130 J/mol K
విశిష్టోష్ణ సామర్థ్యం, C 71.14 J/(mol × K)
ప్రమాదాలు
ప్రధానమైన ప్రమాదాలు see Berylliosis
US health exposure limits (NIOSH):
PEL (Permissible)
TWA 0.002 mg/m3
C 0.005 mg/m3 (30 minutes), with a maximum peak of 0.025 mg/m3 (as Be)
REL (Recommended)
Ca C 0.0005 mg/m3 (as Be)
IDLH (Immediate danger)
Ca [4 mg/m3 (as Be)]
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
ఇతర కాటయాన్లు
magnesium iodide
calcium iodide
strontium iodide
barium iodide
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

భౌతిక గుణాలు

మార్చు

బెరిలీయం అయోడైడ్ భౌతికంగా రంగులేని, సూదుల వంటి పొడవైన స్పటిక రూపంలో ఉండును.బెరిలీయం అయోడైడ్ అణుభారం 262.821గ్రాములు/మోల్.సాధారణ ఉష్ణోగ్రత వద్ద సాంద్రత 4.325 గ్రాములు/సెం.మీ3. బెరిలీయం అయోడైడ్ ద్రవీభవన స్థానం 480 °C (896 °F; 753K, బాష్పీభవన స్థానం 590 °C (1,094 °F; 863K). నీటితో తీవ్రంగా చర్య జరుపును. బెరిలీయం అయోడైడ్ ఈథర్, డైఇథైల్ ఈథర్‌లో కరుగుతుంది.కార్బన్ సల్ఫేట్ లో స్వల్పంగా కరుగుతుంది.ఆర్తోరోంబిక్ స్పటికరూప నిర్మాణంకలిగి ఉంది.

రసాయన చర్యలు

మార్చు

500 °C -700 °C ఉష్ణోగ్రత వద్ద బెరీలియం లోహాన్ని అయోడిన్ మూలకంతో రసాయన చర్య జరపడం వలన బెరిలీయం అయోడైడ్ ఉత్పత్తి అగును.

Be + I2 → BeI2

బెరీలియంకార్బైడ్ తో హైడ్రోజన్ అయోడైడ్ తో వాయుస్థితిలో చర్య వలన బెరిలీయం అయోడైడ్ ఉత్పత్తిఅగును.

Be2C + 4HI → 2BeI2 + CH4

బెరిలీయం అయోడైడ్ అణువు లోని అయోడిన్ ను సులభంగా తొలగించి, దాని స్థానంలో ఏదైన హలోజన్ను ప్రవేశపెట్టవచ్చును.ఫ్లోరిన్ తో బెరిలీయం ఫ్లోరైడ్, అయోడిన్ ఫ్లోరైడులను ఏర్పరచవచ్చును.అలాగే క్లోరిన్తో బెరిలీయం క్లోరైడ్, బ్రోమిన్‌తో బెరీలియం బ్రోమైడ్‌లు ఏర్పడును.క్లోరేట్, పర్మాంగానేట్ వంటి అక్స్సికరణ కారకాలతో బెరిలీయం అయోడైడ్ తీవ్రంగా చర్య జరిపి బచ్చలి పండు రంగుకలిగిన వాయురూప అయోడిన్ ను విడుదల చేయును.బెరిలీయం అయోడైడ్ ఘన స్థితిలో, వాయుస్థితిలో గాలిలో మండుస్వభావం కలిగిఉన్నది.

వినియోగం

మార్చు

బెరిలీయం అయోడైడ్ ను వేడిగా ఉన్న టంగ్‌స్టన్ లోహ ఫిలమెంట్ మీదుగా పంపడం ద్వారా అధికశుద్ధమైన బెరిలీయాన్ని ఉత్పత్తి చెయ్యవచ్చును.

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు/ఆధారాలు

మార్చు
  1. Perry, Dale L.; Phillips, Sidney L. (1995), Handbook of Inorganic Compounds, CRC Press, p. 63, ISBN 0-8493-8671-3, retrieved 2007-12-10
  2. Parsons, Charles Lathrop (1909), The Chemistry and Literature of Beryllium, Easton, Pa.: Chemical Publishing, pp. 22–23, retrieved 2007-12-10