బెరీలియం ఆక్సైడ్

బెరీలియం ఆక్సైడ్ లేదా బెరిల్లియ అను పిలవబడు రసాయన సమ్మేళనం ఒక అకర్బన రసాయన సంయోగపదార్థం.ఈ రసాయనపదార్థం యొక్క రసాయన సంకేతపదం BeO.బెరీలియం ఆక్సైడ్ ఒక రంగులేని రసాయన సంయోగపదార్థం. బెరీలియం ఆక్సైడ్ విద్యుద్బంధకం ( insulator) గా వాసికెక్కిన రసాయన పదార్థం. అలోహాలమైన వజ్రంకన్న బెరీలియం ఆక్సైడ్ ఎక్కువ ఉష్ణవాహకత్వం/ఉష్ణవాహకత కలిగిన సంయోగపదార్థం. చాలాలోహాల కన్న బెరీలియం ఆక్సైడ్ అధిక ఉష్ణవాహకగుణం కల్గిఉన్నది.ఆక్సైడ్ అస్ఫాటిక (amorphous) ఘనపదార్థం.బెరీలియం ఆక్సైడ్ ఎక్కువ బాష్పీభవన స్థానం కలిగి ఉన్నందున రిఫ్రాక్టరిగా ఉపయోగించుటకు ఎంతో అనుకూలమైనది.బెరీలియం ఆక్సైడ్ ప్రకృతిలో బ్రోమేల్లిట్ (bromellite) అను ఖనిజంగా లభిస్తుంది.బెరీలియం ఆక్సైడ్ మెటిరియాల్ విజ్ఞానశాస్త్రంలో, చరిత్రలో గ్లుసినా (glucina) లేదా గ్లుసినియం ఆక్సైడ్ (glucinium oxide) అని పిలువబడుతున్నది.

బెరీలియం ఆక్సైడ్
Unit cell, ball and stick model of beryllium oxide
పేర్లు
Preferred IUPAC name
Beryllium(II) monoxide
Systematic IUPAC name
Oxoberyllium
ఇతర పేర్లు
Beryllia, Bromellete, Thermalox, Natural bromellite, Thermalox 995.[1]
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [1304-56-9]
పబ్ కెమ్ 14775
యూరోపియన్ కమిషన్ సంఖ్య 215-133-1
వైద్య విషయ శీర్షిక beryllium+oxide
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:62842
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య DS4025000
SMILES [Be]=[O]
బైల్ స్టెయిన్ సూచిక 3902801
ధర్మములు
BeO
మోలార్ ద్రవ్యరాశి 25.01 g·mol−1
స్వరూపం Colourless, vitreous crystals
వాసన Odourless
సాంద్రత 3.01 g cm−3
ద్రవీభవన స్థానం 2,507 °C (4,545 °F; 2,780 K)
బాష్పీభవన స్థానం 3,900 °C (7,050 °F; 4,170 K)
0.00002 g/100 mL
Band gap 10.6 eV
Thermal conductivity 330 W K−1 m−1
వక్రీభవన గుణకం (nD) 1.719
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
Hexagonal
P63mc
C6v
కోఆర్డినేషన్ జ్యామితి
Tetragonal
Linear
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
–599 kJ mol−1[2]
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ
So298
13.73–13.81 J K−1 mol−1
విశిష్టోష్ణ సామర్థ్యం, C 25.5 J/mol K
ప్రమాదాలు
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు GHS06: Toxic GHS08: Health hazard
జి.హెచ్.ఎస్.సంకేత పదం DANGER
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు H301, H315, H317, H319, H330, H335, H350, H372
GHS precautionary statements P201, P260, P280, P284, P301+310, P305+351+338
ఇ.యు.వర్గీకరణ {{{value}}}
R-పదబంధాలు మూస:R49, R25, R26, R36/37/38, మూస:R43, మూస:R48/23
S-పదబంధాలు S53, S45
Lethal dose or concentration (LD, LC):
2062 mg kg−1 (mouse, oral)
US health exposure limits (NIOSH):
PEL (Permissible)
TWA 0.002 mg/m3
C 0.005 mg/m3 (30 minutes), with a maximum peak of 0.025 mg/m3 (as Be)
REL (Recommended)
Ca C 0.0005 mg/m3 (as Be)
IDLH (Immediate danger)
Ca [4 mg/m3 (as Be)]
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
ఇతర కాటయాన్లు
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

భౌతిక ధర్మాలు

మార్చు

బెరీలియం ఆక్సైడ్ వాసన, రండులేని సంయోగపదార్థం. బెరీలియం ఆక్సైడ్ అణుభారం 25.01 గ్రాములు/మోల్.గది ఉష్ణోగ్రత (25 °C) వద్ద బెరీలియం ఆక్సైడ్ సమ్మేళనపదార్థం సాంద్రత 3.01గ్రాములు/సెం.మీ3.బెరీలియం ఆక్సైడ్ సంయోగపదార్థం ద్రవీభవన స్థానం2,507 °C (4,545 °F; 2,780K)., బాష్పీభవన స్థానం 3,900 °C (7,050 °F; 4,170K).ఈ రసాయన పదార్థం నీటిలో స్వల్ప ప్రమాణంలో, 0.00002గ్రాములు /100మి.లీ మాత్రమే కరుగును.బెరీలియం ఆక్సైడ్ యొక్క వక్రీభవన సూచిక 1.719

అణునిర్మాణం

మార్చు

బెరీలియం ఆక్సైడ్ అణువు షట్భుజాకారwurtzite నిర్మాణాన్ని కలిగిఉన్నది.ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద బెరీలియం ఆక్సైడ్ అణునిర్మాణం చతుర్భుజాకారం అణుసౌష్టవాన్ని పొందును.

ఉత్పత్తి, రసాయన చర్యలు

మార్చు

బెరీలియం కార్బోనేట్‌ను కాల్చడం (calcining/ roasting) వలనను, బెరీలియం హైడ్రాక్సైడ్ను నిర్జలికరణ కావించడంవలన లేదా లోహ బెరీలియంను గాలిలో (ఆక్సిజన్) మండించడం ద్వారా బెరిలీయంఆక్సైడ్ ను ఉత్పత్తి చేయుదురు.

BeCO3 → BeO + CO2
Be(OH)2 → BeO + H2O
2 Be + O2 → 2 BeO

బెరీలియం ను గాలిలో మండించడం వలన బెరీలియం ఆక్సైడ్, బెరీలియం నైట్రేట్ లమిశ్రమము ఏర్పడును.ఆవర్తన పట్టికలోని రెండవ సమూహం (groupII) కు చెందిన (క్షార మృత్తిక లోహాలు) మూలకాల ఆక్సైడులకన్నా భిన్నంగా, క్షారలక్షణాల కన్న ద్విశ్వాభావయుత (amphoteric) గుణాన్ని కలిగిఉన్నది.

800 °C కన్నఎక్కువ అధిక ఉష్ణోగ్రతవద్ద ఏర్పడు బేరియం ఆక్సైడ్ అచేతనమైనది ( తక్కువ చర్యాశీలత ఉన్నపదార్థం).కాని వేడి సజల అమ్మోనియం బైఫ్లోరైడ్ (NH4HF2) లో త్వరగా కరుగుతుంది.అంతేకాదు వేడి గాఢసల్ఫ్యూరిక్ ఆమ్లం (H2SO4), అమ్మోనియం సల్ఫేట్ ( (NH4) 2SO4) ద్రావణాలలో కరుగుతుంది.

వినియోగం

మార్చు

ఎక్కువ ఉత్తమగుణమున్న బెరీలియం ఆక్సైడ్ స్పటికాలను హైడ్రోథెర్మికల్‌గా లేదా వేర్నియుల్ (Verneuil) పధ్ధతిలో వృద్ధి చెయ్యుదురు.బెరీలియం ఆక్సైడ్ ను ఎక్కువగా స్ఫటికముగా ఏర్పడని ( amorphous) పొడిగా ఉత్పత్తి చేయుదురు.బెరీలియం ఆక్సైడ్ లో ఉండు కార్బన్ వంటి మలినాల వలన సంయోగపదార్థం వివిధ రంగులలో ఏర్పడును.

కరిగేంతవరకు వేడి చేయబడిన (Sintered) బెరీలియం ఆక్సైడ్ స్థిరమైన సెరామిక్ పదార్థం. బెరీలియం ఆక్సైడ్ ను రాకెట్ ఇంజన్ నిర్మాణంలో ఉపయోగిస్తారు. బెరీలియం ఆక్సైడ్ ఉత్తమ ఉష్ణవాహకగుణం కలిగిఉండటం వలన రేడియో ఉపకరాణాలలోవాడు అర్దవాహకాలలో (semiconductor ) ఉపయోగిస్తారు.అంతేకాకుండా బెరీలియం ఆక్సైడ్ మంచి విద్యుతు ఇన్సులేటరు కూడా.

ఇవికూడా చూదండి

మార్చు

బెరీలియం

మూలాలు/ఆధారాలు

మార్చు
  1. "beryllium oxide – Compound Summary". PubChem Compound. USA: National Center for Biotechnology Information. 27 March 2005. Identification and Related records. Retrieved 8 November 2011.
  2. Zumdahl, Steven S. (2009). Chemical Principles 6th Ed. Houghton Mifflin Company. ISBN 0-618-94690-X.