బేగం అక్తర్
బేగం అఖ్తర్ (1914 - 1974). అఖ్తరీబాయి ఫైజాబాదీ జననం అక్టోబర్ 7, 1914, ఉత్తర్ ప్రదేశ్ లోని ఫైజాబాద్ లో. ఆమె తొలి గురువులు ఉస్తాద్ ఇమ్దాద్ ఖాన్, మొహమ్మద్ ఖాన్, అబ్దుల్ వహీద్ ఖాన్, ఉస్తాద్ ఝండే ఖాన్. ఆమె తన పదిహేనవ ఏటనే కచేరీలు ఇవ్వడం ప్రారంభించింది. ఆమె గజల్లు, దాద్రాలు, ఠుమ్రీలు ఎన్నో రికార్డుల రూపంలో విడుదలయ్యాయి. 1930లో ఆమె కొన్ని హిందీ సినిమాలలో కూడా నటించింది. 1945లో బారిష్టర్ ఇస్తెయాఖ్ అహ్మద్ అబ్బాసీతో ఆమెకు వివాహం జరిగిన తరువాత బేగం అఖ్తర్‌గా మారింది ."దీవానా బనానా హైతో బనాదే’’ అనే గజల్ తో చాలా పేరు గాంచింది. పాటియాలా ఘరానాకు చెందిన ఉస్తాద్ అతా అహ్మద్ ఖాన్ దగ్గర, మరి కొన్నాళ్ళు ఉస్తాద్ అబ్దల్ వహీద్ ఖాన్ దగ్గర శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించింది.పెళ్ళి తరువాత మన రావు బాలసరస్వతిదేవి లాగానే ఆమె గానం ఆగిపోయింది. లక్నో రేడియో స్టేషన్‌కు ప్రొగ్రాం ప్రొడ్యూసర్ సునీల్ బోస్ జస్టిస్ మల్హోర్ తో కలసి బారిష్టర్ అబ్బాసీని ఒప్పించి బేగం సాహెబాతో పాడించాడు.బేగం అఖ్తర్ "గజల్ గాయని"గా పాడిన పాటలు దాదాపు 400 వరకు ఉంటాయి. 30 అక్టోబర్ 1974, ఆమె మరణించారు.
బేగం అక్తర్ | |
---|---|
దస్త్రం:Begum Akhtar (1942).jpg | |
వ్యక్తిగత సమాచారం | |
జన్మ నామం | అక్తరీబాయి ఫైజాబాది |
మూలం | ఫైజాబాద్, ఉత్తర ప్రదేశ్, భారత్ |
సంగీత శైలి | గజల్, ఠుమ్రి, దాద్రా [1] |
వృత్తి | సంగీతకారుడు |
క్రియాశీల కాలం | 1929 - 1974 |
ఆమె చివరి గజల్
“ | "సునాకరో మేరీ జాఁ ఉన్ సె ఉన్ కె అఫ్సానే, సబ్ అజ్ నబీ హైఁ యహాఁ కౌన్ కిస్కే పహచానే. | ” |
పురస్కారాలు
మార్చు- 1968: పద్మశ్రీ
- 1972: సంగీత నాటక అకాడమీ అవార్డు
- 1975: పద్మభూషణ్
సూచికలు
మార్చు- ↑ Dadra Thumri in Historical and Stylistic Perspectives, by Peter Lamarche Manuel, Peter Manuel. Published by Motilal Banarsidass Publ., 1989. ISBN 8120806735. Page 157.
బయటి లింకులు
మార్చు- [1] ద వాల్ స్ట్రీట్ జర్నల్లో బేగం అక్తర్ గురించి
- వీడియో లింకులు [2][permanent dead link]
- Biography of Beghum Akhtar
- An Article of Beghum Akhtar
- Beghum Akhtar -interesting insights
- Short biography
- Begum Akhtar Resource website
- Begum Akhtar's Thumri and Ghazals in Bengali by Parag Ray (Vocalist based in Canada/India)
- Begum Akhtar's Tomb, Lucknow: Some Photographs
- Begum Akhtar the Undisputed Malika of Ghazals (NewAgeIslam)
- Video links