బోయలపల్లి

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం లోని గ్రామం

బోయలపల్లి ప్రకాశం జిల్లా, యర్రగొండపాలెం మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన యర్రగొండపాలెం నుండి 7 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మార్కాపురం నుండి 40 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 724 ఇళ్లతో, 3298 జనాభాతో 1221 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1703, ఆడవారి సంఖ్య 1595. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 978 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 25. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590544[2].

బోయలపల్లి
పటం
బోయలపల్లి is located in ఆంధ్రప్రదేశ్
బోయలపల్లి
బోయలపల్లి
అక్షాంశ రేఖాంశాలు: 15°58′32.160″N 79°18′54.504″E / 15.97560000°N 79.31514000°E / 15.97560000; 79.31514000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంయర్రగొండపాలెం
విస్తీర్ణం12.21 కి.మీ2 (4.71 చ. మై)
జనాభా
 (2011)[1]
3,298
 • జనసాంద్రత270/కి.మీ2 (700/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు1,703
 • స్త్రీలు1,595
 • లింగ నిష్పత్తి937
 • నివాసాలు724
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్523327
2011 జనగణన కోడ్590544

గ్రామ చరిత్ర

మార్చు

ఈ గ్రామం ఒక కులంపేరుతో ఏర్పడింది. పూర్వం బోయకులస్ధులు ఎక్కువగా ఉండటంతో ఈగ్రామానికి ఆపేరు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ గ్రామంలో రెండు పంచాయితీలతో కలిసిఉంది. ఒకటి బోయలపల్లి కాగా, రెండోది శోత్రియం బోయలపల్లి. ఈ శోత్రియం బోయలపల్లి శిధిలగ్రామం.

బోయలపల్లి గ్రామం గురించి బోయలపల్లి ఎగువచెరువుకట్టన శ్రీనివాసప్రసాద్ కనుగొన్న శాసనం లో (తేదీ- 04/02/2024) ప్రస్తావించబడింది. పూర్వం ఈ గ్రామం దువ్వలి కంపణం (కొన్నిప్రాంతాల సముదాయం) క్రింద వుంది. శాలివాహన శకం 1172 వ సంవత్సరం అనగా సాధారణ సంవత్సరం 1250 న కాయస్ధ రాజు, కాకతీయుల మంత్రిగాచేసిన గండపెండేరు గంగయసాహిణి, గణపతిదేవ మహారాజుకు (1199-1262), తనకు పుణ్యం వచ్చుటకొరకు, త్రిపురాంతకేశ్వర స్వామివారికి అంగరంగవైభోగాలకొరకు ‘బోయలపల్లి’, రెడ్డిపల్లి గ్రామాలను ధారాదత్తంచేసి ఈ విషయాన్ని శాసనం ద్వారా తెలియజేశారు. దీనినిబట్టి పన్నెండో శతాబ్ధంనాటికే ఈ గ్రామనిర్మాణం జరిగి ఉంది. ఈ గ్రామం ప్రస్తుతం పెద్దబోయలపల్లి, చిన్నబోయలపల్లి, బిసి కాలనీలుగా మూడు ప్రాంతాల్లో విస్తరించి ఉంది. చిన్నబోయలపల్లి గ్రామంలో పదహారవ శతబ్ధం శాయపనేని వంశస్ధులకాలంనాడు వారు వాడిన బురుజుు ఉంది. ఇది పూర్తిగా శిధిలమవగా ప్రస్తుతం కొత్తగానిర్మించారు. హరిజన కాలనీవద్ద ఇటీవల కాలంలో ఓ శాసనాన్ని జరిగింది.

ఈ శాసనం శాలివాహనశకం 1500 సంవత్సరంలో లిఖించబడింది. అనగా సాదారణ సంవత్సరం 1578. ఈ కాలంలో ఈప్రాంతం దూపాటిసీమ క్రింద వెలుగోటి వారి పాలనలో ఉంది. తిమ్మానాయని కుమారుడు కొండపనాయుడు అనువారు బోయలపల్లి గ్రామంలో వీరూపాక్షదేవుని గుడికట్టించి, నూతన విగ్రహప్రతిష్టచేసి, కోనేరు త్రవ్వించి, స్వామివారి కైంకర్యాలకు, నిత్యనైవేద్యాలకు ‘వెలిచేను’ పొలం దానం చేశారని ఈ శాసనంలో లిఖించబడినది. పదహారవ శతాబ్ధంలో ఇక్కడ శివాలయం ఉన్నట్లు తెలస్తుంది. శాసనం దొరికినచోట ఏలాంటి ఆలయాల ఆనవాళ్ళ కన్పించడంలేదు కానీ కోనేరులాంటి (పూర్తిగా పూడిన) జాడలు ఉన్నాయి.

ఊరికి దక్షిణాన ఉన్న తోడేళ్ళబోడు వద్ద డోలమైన్స్ (పురాతన మానవుల సమాధులు) ఉన్నాయి. ఇవి పెద్దపెద్ద సమాధులు. పెద్దపెద్ద రాళ్ళతో కప్పబడి దాదాపు ఏడడుగుల పైనే ఉన్నాయి. వీటిలో కొన్నిసమాధులను దుండగులు త్రవ్వి, సమాధులపై బండలను తొలగించారు. పాతబోయలపల్లికి పశ్చిమదిశగా పూర్వపు అసలు ‘బోయలపల్లి’ గ్రామం ఉండేదంటారు. అక్కడ దగ్గరలోని కొండపై శివలింగం, నంది ఉన్నాయి. క్రింద వేపచెట్టుదగ్గర గ్రామదేవత పోలేరమ్మ శిలావిగ్రహాలున్నాయి. దగ్గర్లోని దద్దనాల వద్ద ఆంజనేయస్వామి వారివిగ్రహం , పదహారో శతాబ్ధానికి చెందిన వీరభద్రుడు, వినాయకుడు విగ్రహాలు ఉన్నాయి. వీరభద్రుని గుడి శిధిలమైంది. షుమారు యాభైసంవత్సరాలక్రితం ఓ బ్రాహ్మణ సన్యాసి ఈ గ్రామానికివచ్చి తన మహిమలు చూపించారు. మోటబావి నీటిపై తేలడం, కొన్నినిదర్శనాలను చూపించడం జరిగింది. ఆతర్వాత అతను 1969 లో సజీవసమాధి అయ్యాడు. ఇతను ఈ ప్రాంతంవారు ఆత్మానందస్వామి అని పిలుస్తారు. ఇతని సజీవసమాధి దర్శనమిస్తుంది. ఆత్మానందస్వామి సంతానంలేనివారి పాలిట వరప్రదాయని అని చెప్పుతారు. ఇక్కడ ఎక్కువగా ఆత్మానంద, ఆత్మ అనేపేర్లు ఎక్కువగా కనపడతాయి. గ్రామం జిల్లెళ్ళ చంద్రమౌలి అనుకవి కలరు.

ఎగువచెరువుకు ఉత్తరాన ‘ముసలయ్య’ అను ఓ స్వామి గుడిఉంది. దీనియందు ఏలాంటి శిలలులేవు కానీ ఎత్తైనరాళ్ళు పాతబడి ఉన్నాయి. పూర్వం ముసలయ్య అనే యాదవుడు ఆవులను కాస్తూ ఉండేవాడట. రోజు ఆవులను అడవిలో మేతకొరకు తోలుకెళ్ళేవాడు. ఓ రోజు ముసలయ్య మనుమళ్ళు తాతతోపాటు అడవికివచ్చారు. తాతాతాతా పెద్దపులి ఎలా ఉంటుందని ఉత్సుకతతో అడిగారు. మీరు పిల్లలు అదివస్తే, దాన్ని చూస్తే భయపడుతారు, అదికౄరజంతువు అన్నాడు ముసలయ్య. లేదు తాతా ఒక్కసారి చూడాలని ఉంది అని మారాం చేయనారంభించాడు. మనుమళ్ళు, పిల్లలమీద ప్రేమ ఉన్న ముసలయ్య అలాగే అన్నాడు. ముసలయ్యకు ఇదివరకే అడవిలో ఉండె ఓ సాధువు కొన్ని మంత్రాలు నేర్పాడు. ఆసాధువు వద్ద కొన్ని మహిమలను కూడా చూశాడు. మనుమల కోరికమేరకు ముసలయ్య ఆముదాలకాలువ వాగులో ఉన్న ఇసుకను మంత్రించి ఓ మనుమని కుడిచేతిలో పోశాడు. ఇంకొంచెం ఇసుకను మంత్రించి ఎడమచేతిలో పోశాడు.మనుమడా,ఈ కుడిచేతిలోని ఇసుకను నామీద చల్లు నేను పెద్దపులినవుతా, చూసినతర్వాత వెంటనే ఎడమ చేతిలోని ఇసుకను చల్లు,మళ్ళి మనిషినవుతా అన్నాడు. ఉత్సుకతతో ఉన్న ఆబాలుడు వెంటనే కుడిచేతిలోని ఇసుకను ముసలయ్య పైన చల్లాడు.ముసలయ్య గాండ్రిస్తూ పెద్దపులిలా మారాడు. ఆ గాండ్రింపులకు బయపడి ముసలయ్య మనుమళ్ళు పరుగులంఘించుకున్నారు. చేతిలో ఇసుక పారబోశాడు.పెద్దపులైన ముసలయ్య అడవిలోకి వెళ్ళిపోయాడు. నాటినుండి ముసలయ్య గుర్తుగా, ఏటా శ్రావణమాసంలో ఓ రోజు వారి వారసులు, కుటుంబీకులు, పొంగళ్ళు చేయడం, జంతుబలిచేయడం, ముసలయ్యకు నివాళులర్పించడం జరుగుతుంది. ఇప్పుడు ఊర్లో వాళ్ళుకూడా ముసలయ్యకు నైవేద్యాలు పెడుతుంటారు. మొక్కులు తీర్చుకుంటుంటారు.విగ్రహంలేని ముసలయ్యను వెంకటేశ్వరస్వామి రూపుగా తలచి నిలువు నామాలతో అక్కడ ఉన్నరాళ్ళనుతీర్చిదిద్దుతారు. ఇది ముసలయ్యకధ.

పసలయ్య

పసలయ్య కూడా యాదవ వంశానికి చెందినవాడే. కాటకోటేశ్వరుని వరాన నిలిచిన స్వామివారు. పూర్వం ఇక్కడ శిలలు ఉండేవి. తర్వాత తర్వాత శిలలపై పెద్దపుట్టవెలసింది. భక్తులు ఈ పుట్టపై పసుపుకుంకుమ చల్లి పూజిస్తారు. ఇతనిని శివుని అంశగా కొలుస్తారు. వేటలు కోస్తారు.ముసలయ్యకు వేటబలిఇచ్చినవారు పసలయ్యకు కూడా నైవేద్యాలు సమర్పిస్తారు. ముసలయ్య, పసలయ్యల గుడులు ప్రక్కప్రక్కనే ఉంటాయి. ఎగువ చెరువుకు పై ఎత్తునున్న ఈ శిధిలగుడులు ఇప్పటికీ పూజలందుకుంటున్నాయి. చెరువునిండినప్పుడు పసలయ్య పాదాలదాకా నీరువచ్చేదట.

ఇక్కడ తొర్రకొండ దగ్గర భగీరధుని గుడి ఉంది. అక్కడ నీటిప్రవాహం కలదు.ప్రక్కన బొల్లికొండ ఉంది. వరదయ్య అనువారు ఊరికి ఉత్తరాన ఒకమైలు దూరంలో ఓ మఠం నిర్మించుకొని సాధుజీవనం చేసేవారు. ఇతను అక్కడ ఒకభావి త్రవ్వించారు. యర్రగొండపాలెం, మార్కాపురం దారిలో ఇతని మఠం, సమాధిని దర్శించుకొనవచ్చు. ఇంతటి చరిత్రగల రెండు శాసనాలను గ్రామస్తులు భద్రపరచి చారిత్రక ఆధారాలను పరిరక్షించుకొన వలసిన అవసరం ఉందని గ్రామస్తులు భావిస్తున్నారు.

విద్యా సౌకర్యాలు

మార్చు

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది. సమీప బాలబడి యర్రగొండపాలెంలో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల యర్రగొండపాలెంలోను, ఇంజనీరింగ్ కళాశాల మార్కాపురంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు మార్కాపురంలోనూ ఉన్నాయి. సమీప అనియత విద్యా కేంద్రం యర్రగొండపాలెంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఒంగోలులోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం

మార్చు

బోయలపల్లిలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

మార్చు

తాగు నీరు

మార్చు

గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం

మార్చు

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

మార్చు

బోయలపల్లిలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, ఆటో సౌకర్యం మొదలైనవి గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

మార్చు

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

మార్చు

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

మార్చు

బోయలపల్లిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 12 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 208 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 138 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 39 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 107 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 40 హెక్టార్లు
  • బంజరు భూమి: 264 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 410 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 428 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 286 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

మార్చు

బోయలపల్లిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 286 హెక్టార్లు

ఉత్పత్తి

మార్చు

బోయలపల్లిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

మార్చు

వరి, జొన్న

సమీప గ్రామాలు

మార్చు

కవలకుంట్ల 2 కి.మీ, పుల్లలచెరువు 3 కి.మీ, చాపలమడుగు 7 కి.మీ, కొమరోలు 10 కి.మీ.

గ్రామ పంచాయతీ

మార్చు

2021 లో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో పాలడగు వెంకటేశ్వర్లు సర్పంచిగా ఎన్నికయ్యారు.ప్రస్తుతం ఈ గ్రామానికీ కౌత సుధామాధురి పంచాయతి కార్యదర్శిగా పనిచేయుచున్నారు.

గణాంకాలు

మార్చు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2907. ఇందులో పురుషుల సంఖ్య 1473, మహిళల సంఖ్య 1434, గ్రామంలో నివాస గృహాలు 559 ఉన్నాయి.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లింకులు

మార్చు