సరిహద్దు రహదారుల సంస్థ

దేశ సరిహద్దుల్లో రహదారులు నిర్మించే భారత రక్షణ శాఖ సంస్థ
(బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నుండి దారిమార్పు చెందింది)

సరిహద్దు రహదారుల సంస్థ (బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ - బిఆర్‌వో) భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ యాజమాన్యంలోని చట్టబద్ధమైన సంస్థ. బిఆర్‌వో భారతదేశ సరిహద్దు ప్రాంతాలు, స్నేహపూర్వక పొరుగు దేశాలలో రహదారి నెట్‌వర్క్‌లను అభివృద్ధి, నిర్వహణ చేస్తుంది. ఇందులో 19 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలు (అండమాన్ నికోబార్ దీవులతో సహా), ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, మయన్మార్, తజికిస్తాన్, శ్రీలంక వంటి పొరుగు దేశాలలో మౌలిక సదుపాయాల కార్యకలాపాలు ఉన్నాయి. 2022 నాటికి, బిఆర్‌వో 55,000 కిలోమీటర్లు (34,000 మై.) రహదారులు, మొత్తం 44,000 మీటర్లు (27 మై.) పొడవు గల 450 శాశ్వత వంతెనలు, వ్యూహాత్మక ప్రదేశాలలో 19 ఎయిర్‌ఫీల్డ్‌లు నిర్మించింది. మంచు తొలగింపు వంటి కార్యకలాపాలతో సహా ఈ మౌలిక వసతులను నిర్వహించే పని కూడా బిఆర్‌వో చేస్తుంది.[2][3][4][5]

సరిహద్దు రహదారుల సంస్థ
దస్త్రం:Border Roads Organisation logo.svg
సరిహద్దు రహదారుల సంస్థ లోగో
BRO పతాక
సంకేతాక్షరంBRO
అవతరణ1960 మే 7
సంస్థ స్థాపన ఉద్దేశ్యముభారత సైనిక దళాలకు, మిత్ర దేశాలకూ మౌలిక వసతులను కల్పించడం
కేంద్రస్థానంసీమా సడక్ భవన్, న్యూ ఢిల్లీ
Parent organisationరక్షణ మంత్రిత్వ శాఖ
బడ్జెట్6,004.08 crore (US$750 million) (2022-23)[1]
వెబ్‌సైటుTourism-
రిమార్కులుసరిహద్దు ప్రంతాల్లో మౌలిక వసతుల నిర్మాణం

బోర్డర్ రోడ్స్ ఇంజినీరింగ్ సర్వీస్ (BRES) నుండి అధికారులు, జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్ (GREF) నుండి సిబ్బంది, బిఆర్‌వోకు స్వంత సిబ్బందిగా ఉంటారు. అదనపు రెజిమెంటల్ ఉపాధి (డిప్యుటేషన్‌పై)పై ఇండియన్ ఆర్మీ కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ నుండి తీసుకోబడిన అధికారులు, దళాలు కూడా ఇందులో ఉంటారు. ఇండియన్ ఆర్మీ పయనీర్ కార్ప్స్ ను కూడా బిఆర్‌వో టాస్క్ ఫోర్స్‌కు చేర్చారు. బిఆర్‌వోను ఆర్డర్ ఆఫ్ బాటిల్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్‌లో కూడా చేర్చారు.[6] శ్రమేణ సర్వం సాధ్యం (కష్టపడితే అంతా సాధ్యమే) అనేది సంస్థ నినాదం. [7]

కొత్త ఇండియా-చైనా బోర్డర్ రోడ్‌లను (ICBRs) గణనీయంగా ఉన్నతీకరించడంలో, నిర్మించడంలో బిఆర్‌వో కీలకపాత్ర పోషిస్తుంది. బిఆర్‌వో 2021 నవంబరులో ఉమ్లింగ్ లా వద్ద "అత్యధిక ఎత్తున ఉన్న రహదారి" నింరాణానికి గాను గిన్నిస్ ప్రపంచ రికార్డును నెలకొల్పింది.[8] బిఆర్‌వో అటల్ సొరంగం, అటల్ సేతు, కల్ చెవాంగ్ రించెన్ సేతు వంటి ప్రాజెక్టులను నిర్మించడంలో కీలకపాత్ర పోషించింది.

చరిత్ర

మార్చు

భారతదేశ సరిహద్దులను సురక్షితంగా ఉంచడానికి, ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి 1960 మే 7 న బిఆర్‌వోను ఏర్పాటు చేసారు.[9] ప్రాజెక్టుల సమన్వయం, త్వరితగతిన అమలు చెయ్యడం కోసం భారత ప్రభుత్వం, ప్రధాన మంత్రి ఛైర్మన్‌గా, రక్షణ మంత్రి డిప్యూటీ ఛైర్మన్‌గా సరిహద్దు రోడ్ల అభివృద్ధి మండలి (BRDB) ని ఏర్పాటు చేసింది.

BRDB కి భారత ప్రభుత్వ శాఖ లాగా ఆర్థిక, తదితర అధికారాలు నిర్వర్తిస్తుంది. ఇది రక్షణ శాఖ సహాయ మంత్రి అధ్యక్షతన ఉన్న ఈ బోర్డులో ఆర్మీ, ఎయిర్ స్టాఫ్ చీఫ్(లు), ఇంజనీర్-ఇన్-చీఫ్, బోర్డర్ రోడ్స్‌ డైరెక్టర్ జనరల్ (DGBR), FA(DS) సభ్యులుగా ఉంటారు. బోర్డు కార్యదర్శి భారత ప్రభుత్వ జాయింట్ సెక్రటరీకి ఉండే అధికారాలుంటాయి. బిఆర్‌వో అధిపతి అయిన డైరెక్టర్ జనరల్ బోర్డర్ రోడ్స్ (DGBR) గా లెఫ్టినెంట్ జనరల్ హోదా కలిగిన వారు ఉంటారు.[10] సరిహద్దు కనెక్టివిటీని పెంచే ప్రయత్నంలో, బిఆర్‌వోను పూర్తిగా 2015 లో రక్షణ మంత్రిత్వ శాఖ కిందకు తీసుకువచ్చారు. ఇంతకు ముందు ఇది రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కింద ఉంటూ ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ నుండి నిధులు పొందేది.[11][12]

సంస్థ

మార్చు

బిఆర్‌వోలో రక్షణ మంత్రిత్వ శాఖ, జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్ (GREF) క్రింద బోర్డర్ రోడ్స్ వింగ్ ఉంటుంది. UPSC నిర్వహించే IES పరీక్ష ద్వారా అధికారులను ఎంపిక చేస్తారు. ఇండియన్ ఆర్మీ కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ నుండి కూడా అధికారులను నియమిస్తారు. వారు EREలో GREFకి నియమిస్తారు. GREFలో సివిల్ ఇంజనీర్లు, మెకానికల్ ఇంజనీర్లు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లు ఉంటారు.


ఈ సంస్థ కార్యకలాపాలు భారతదేశం, భూటాన్, మయన్మార్, తజికిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ అంతటా విస్తరించి ఉన్నాయి.[2]

బిఆర్‌వోలో 18 ప్రాజెక్టులు ఉన్నాయి, వీటిని టాస్క్‌ఫోర్స్‌లు, రోడ్‌ కన్‌స్ట్రక్షన్ కంపెనీలు (RCCలు), బ్రిడ్జ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలు (BCCలు), డ్రైన్ మెయింటెనెన్స్ కంపెనీలు (DMCలు), ప్లాటూన్‌లుగా విభజించారు. సంస్థలో బేస్ వర్క్‌షాప్‌లు, స్టోర్ విభాగాలు, శిక్షణ, నియామక కేంద్రాలు, ఇతర సిబ్బంది కూడా ఉన్నారు.[13]

బిఆర్‌వోలో ఒక అంతర్గత ఆర్థిక సలహాదారు (IFA) పనిచేస్తారు. వీరు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్, ఇంటర్నల్ ఆడిటర్ పాత్రలను నిర్వహిస్తారు. సామర్థ్యాన్ని, వనరుల వినియోగాన్ని మెరుగుపరచడానికి ఈ వ్యవస్థను 1995 మార్చి 23 న ప్రవేశపెట్టారు.[14] IFA 1999 డిసెంబర్‌లో ISO 9001 సర్టిఫికేషన్ పొందింది.

ఈ సంస్థ స్థానికంగా కూలీలకు ఉపాధి కల్పిస్తోంది. బిఆర్‌వోలో ఏకబిగిన 179 రోజులకు మించి స్థానిక శ్రామికులెవరినీ నియమించరు. తద్వారా వారి ఉపాధి స్వభావాన్ని క్యాజువల్ లేబరు గానే ఉంచుతుంది. [15]

బోర్డర్ రోడ్స్ డైరెక్టర్ జనరల్

మార్చు
 
బిఆర్‌వో సంస్థ చార్ట్

బిఆర్‌వో పాత్ర

మార్చు
 
లడఖ్‌లో హిమాంక్ బిఆర్‌వో రహదారి గుర్తు

బిఆర్‌వో బాధ్యతలు: [6]

శాంతి సమయంలో

  1. సరిహద్దు ప్రాంతాలలో వాడుకలో ఉన్న జనరల్ స్టాఫ్ (GS) రోడ్డు సదుపాయాలను అభివృద్ధి చేయడం, నిర్వహించడం.
  2. సరిహద్దు రాష్ట్రాల సామాజిక-ఆర్థిక అభివృద్ధికి సహకరించడం.

యుద్ధ సమయంలో

  1. ఒరిజినల్ సెక్టార్లు, పునర్మోహరింపుల సెక్టార్లలో నియంత్రణ రేఖను నిలిపి ఉంచడానికి రోడ్లను అభివృద్ధి చేయడం, నిర్వహించడం.
  2. యుద్ధ ప్రయత్నాలకు సహకరించేందుకు ప్రభుత్వం నిర్దేశించే అదనపు పనులను అమలు చేయడం.

రోడ్లు, వంతెనలు, సొరంగాలు, కాజ్‌వేలు, హెలిప్యాడ్‌లు, ఎయిర్‌ఫీల్డ్‌ల నిర్మాణాలను బిఆర్‌వో కి అప్పగించారు. బిఆర్‌వో దాని రోడ్ నెట్‌వర్క్‌ల నిర్వహణకు కూడా బాధ్యత వహిస్తుంది. చాలా చోట్ల కొండచరియలు విరిగిపడటం, హిమపాతాలు, మంచులు మార్గాలను మూసివేస్తాయి. వీటిని వీలైనంత త్వరగా తొలగించవలసి ఉంటుంది. బిఆర్‌వో పనుల్లో 2,00,000 కంటే ఎక్కువ మంది సాధారణ చెల్లింపు కార్మికులను కూడా నియమించుకుంది.

నిర్మించిన రోడ్ల వార్షిక సారాంశం

మార్చు

బిఆర్‌వో 2017-22 లో 13,525-కి.మీ.ల నిడివి గల 257 సరిహద్దు రోడ్లను పూర్తి చేసింది. అవి:[16]

  • అరుణాచల్ ప్రదేశ్: 64 (3,097-కిమీ).
  • లడఖ్: 43 (3,141-కిమీ).
  • J&K: 61 (2,382-కిమీ).
  • హిమాచల్ ప్రదేశ్: (739-కిమీ).
  • ఉత్తరాఖండ్: 22 (947-కిమీ).
  • సిక్కిం: 18 (664-కిమీ).
  • రాజస్థాన్: 13 (884-కిమీ).
  • మిజోరం: 8 (590-కిమీ)
  • మణిపూర్: 8 (492-కిమీ).
భారతదేశంలో బిఆర్‌వో నిర్మించిన రహదారుల నిడివి
ఆర్థిక సంవత్సరం నిర్మించిన రోడ్ల నిడివి గమనికలు
2015కి ముందు 50,000 కిలోమీటర్లు (31,000 మై.) [2]
2015–2016 ?
2016–2017 ?
2017–2018 612.82 కిలోమీటర్లు (380.79 మై.) [5]
2018–2019 608.62 కిలోమీటర్లు (378.18 మై.) [5]
2019–2020 991.22 కిలోమీటర్లు (615.92 మై.) [5]
2020–2021 940.64 కిలోమీటర్లు (584.49 మై.) [5]
2021–2022 741.70 కిలోమీటర్లు (460.87 మై.) [5] 2017–2018 నుండి 2021–2022 వరకు ఐదు సంవత్సరాలలో నిర్మించిన కొత్త బిఆర్‌వో రోడ్లు:3,595 కి.మీ. (2,234 మై.)[5]
2022–2023
2023–2024
మొత్తం ~ 55,000 కిలోమీటర్లు (34,000 మై.)

ప్రాజెక్టులు, కార్యక్రమాలు

మార్చు

బిఆర్‌వో భారతదేశంలోను, స్నేహపూర్వక దేశాలలోనూ ప్రాజెక్టులను చేపడుతుంది. ఈ ప్రాజెక్టులలో సాధారణంగా శత్రుత్వానికి సంబంధించిన భద్రతా కారణాల వల్ల గాని, పర్యావరణ సవాళ్ల కారణంగా గానీ ప్రైవేట్ సంస్థలు స్వీకరించని రోడ్లు, వంతెనలు, ఎయిర్‌ఫీల్డ్‌లు ఉంటాయి. 1962 యుద్ధం, 1965, 1971లలో పాకిస్తాన్‌తో విభేదాల సమయంలో బిఆర్‌వో చురుకుగా పనిచేసింది. ఈశాన్య ప్రాంతంలో తిరుగుబాటు వ్యతిరేక కార్యకలాపాలలో కూడా చురుకుగా పనిచేసింది. [6]

బిఆర్‌వో 18 ప్రాజెక్టులలో పనిచేస్తుంది:. అవి అరుణాంక్, బీకన్, బ్రాహ్మణ్, చేతక్, దీపక్, దంతక్ [17] (భూటాన్), హిమాంక్, హిరాక్, పుష్పక్, సంపర్క్, యోజక్, సేవక్, శివాలిక్, స్వస్తిక్, ఉదయక్, వర్తక్, విజయక్.[18][19]

విపత్తు నిర్వహణ, పునర్నిర్మాణం

మార్చు

తమిళనాడులో వినాశకరమైన 2004 సునామీ, 2005 కాశ్మీర్ భూకంపం, [20] 2010 లడఖ్ ఆకస్మిక వరదల తరువాత పునర్నిర్మాణ పనులలో బిఆర్‌వో కీలక పాత్ర పోషించింది. [21]

విదేశీ మౌలిక సదుపాయాల అభివృద్ధి

మార్చు

విదేశీ ప్రాజెక్టులలో కొన్ని తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, భూటాన్ వంటి విదేశీ భూభాగాలలో భారత ప్రభుత్వం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తుంది. వీటిలో ఆఫ్ఘనిస్తాన్‌లోని డెలారం-జారంజ్ హైవేని 2008 లో పూర్తి చేసి ఆఫ్ఘన్ ప్రభుత్వానికి అప్పగించింది.[22] తజికిస్తాన్‌లోని ఫర్ఖోర్,[23] అయిని[24] వైమానిక స్థావరాలను పునరుద్ధరించింది.

సరిహద్దు మౌలిక సదుపాయాల అభివృద్ధి

మార్చు

పాకిస్తాన్ నుండి ఎప్పటినుంచో ఉన్న భద్రతా ముప్పు, పెరిగిన చొరబాట్లు, చైనా వైపున వేగంగా జరుగుతున్న సరిహద్దు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రతిస్పందనగా, భారతదేశం కూడా సరిహద్దు మౌలిక సదుపాయాల అభివృద్ధిని చేపడుతోంది.

సరిహద్దు రోడ్లు

మార్చు

భారత ప్రభుత్వం లోక్‌సభకు 2017 జూలైలో సమర్పించిన నివేదిక ప్రకారం, భారత చైనా సరిహద్దులో 73 పూర్తయిన వ్యూహాత్మక రహదారుల నిర్మాణం 2005లో ప్రారంభమైంది. వీటిలో 43 రక్షణ మంత్రిత్వ శాఖకు, 27 హోం మంత్రిత్వ శాఖకూ చెందినవి. వీటిలో 2017 మార్చి నాటికి 21 రోడ్లు, 2017 జూలై నాటికి 30 రోడ్లు పూర్తి కాగా, మిగిలినవి నిర్మాణంలో ఉన్నాయి. వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ ఆమోదం, తిరుగుబాట్లకు సంబంధించిన భద్రతా అడ్డంకులు, రాష్ట్రాల్లో భూసేకరణలో జరిగిన జాప్యం, నిర్మాణ స్థలాలను చేరుకోవడం ఎదురయ్యే ఇబ్బందులు, ప్రతికూల వాతావరణం మొదలైన వాటి కారణంగా పురోగతి మందగించింది.

ఈ 73 రోడ్లలో 63 రోడ్లను బిఆర్‌వో నిర్మిస్తోంది. ఒక్కొక్క కిలోమీటరు రోడ్డు నిర్మాణానికి బిఆర్‌వో 1.5 కోట్ల నుండి 3 కోట్ల వరకు వ్యయం చేస్తూండగా, ప్రైవేటు సంస్థలకు ఇది 6 నుండి 7 కోట్ల వరకు అవుతోంది.[25][26] 2015–16, 2016–17 రెండేళ్ళలో కేంద్ర ప్రభుత్వం సరిహద్దు రోడ్ల అభివృద్ధి కోసం రూ 37,000 కోట్లకు పైగా కేటాయించింది. ఇందులో 1,360 కిలోమీటర్లు (850 మై.) నిడివి గల భారతదేశం-మయన్మార్-థాయ్‌లాండ్ త్రైపాక్షిక రహదారి కూడా ఉంది. ఇది మణిపూర్‌లోని మోరే నుండి తమూ, మయన్మార్ మీదుగా థాయిలాండ్‌లోని మే సోట్ వరకు వెళ్తుంది.[27]

2020 జూలైలో, తూర్పు భూటాన్ నుండి పశ్చిమ తవాంగ్ ప్రాంతానికి అనుసంధానించడానికి, సక్‌టెంగ్ వన్యప్రాణుల అభయారణ్యం ద్వారా లుమ్లా - ట్రాషిగాంగ్ రహదారి వంటి కొత్త రోడ్లను నిర్మించే బాధ్యతణూ కూడా బిఆర్‌వోకి అప్పగించారు.[28]

రోడ్డు వంతెనలు

మార్చు

బలగాల కోసం ప్రత్యామ్నాయ రహదారుల సౌకర్యాలు కల్పించడం కోసం బిఆర్‌వో, చైనాతో సరిహద్దుగా ఉన్న 3,440 కి.మీ. (2,140 మై.) పొడవైన మెక్‌మహాన్ రేఖ వెంబడి 410 రెండు వరిఉసల వంతనలను నిర్మిస్తోంది. ట్యాంకులతో సహా భారీ వాహనాలు వెళ్ళేందుకు అనువుగా వీటిని నిర్మిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌లో 144, జమ్మూ కాశ్మీర్‌లో 100 నిర్మాణంలో ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లో 55, సిక్కింలో 40, హిమాచల్ ప్రదేశ్‌లో 25 నిర్మాణంలో ఉన్నాయి. [29] ఏడాదికి 3 కి.మీ. పొడవైన వంతెనలను నిర్మిస్తోంది.[29] 2020 అక్టోబరు 12 న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 44 కొత్త వంతెనలను ప్రారంభించాడు.[30]

సరిహద్దు సొరంగాలు

మార్చు

2017 నవంబరులో బిఆర్‌వో మొత్తం 100 కి.మీ. (62 మై.) పొడవుతో 17 రోడ్డు, రైలు సొరంగాలను నిర్మించే ప్రణాళికను ప్రకటించింది. చైనా-భారత సరిహద్దులోని 73 వ్యూహాత్మక రహదారులలో కొన్నింటిపై సంవత్సరం పొడవునా సకల వాతావరణ రైలు, రోడ్డు ఉపరితల రవాణా సౌకర్యం కల్పించడానికి వీటిని ఉద్దేడించారు. హిమపాతం, వర్షం కారణంగా ప్రతి సంవత్సరం ఆరు నెలల పాటు చైనా-భారత సరిహద్దులోని ఎత్తైన పోస్ట్‌లకు ఉపరితల రవాణాను మూసివేస్తారు. సరఫరాలు విమానాల ద్వారా మాత్రమే జరుగుతాయి. ఈ 17 సొరంగాల్లో కొన్ని ఇప్పటికే నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో జమ్మూ కాశ్మీరు లోని శ్రీనగర్-కార్గిల్-లేహ్ NH1 పై (జోజి లా పాస్ సొరంగం), లేహ్-మనాలి రహదారిపై ( లుంగలాచా లా, బారా-లాచా లా, తంగ్లాంగ్ లా, షింగో లా, రోహ్తాంగ్ సొరంగం), ఉత్తర సిక్కింలోని చుంగ్తాంగ్, తుంగ్‌ల మధ్య NH310Aపై 578 మీటర్ల థెంగ్ పాస్ సొరంగం, నెచిపు పాస్ (బోమ్డిలా సమీపంలో), సెలా పాస్ సొరంగాలు ఉన్నాయి. వీటి వలన ప్రయాణ సమయం, నిర్వహణ ఖర్చులను తగ్గడమే కాకుండా, హిమపాతం కొండచరియల నుండి ముప్పును తొలగిస్తుంది.[31][32]

పతకాలు

మార్చు

1960 - 2020 జనవరి 31 మధ్య బిఆర్‌వో సిబ్బంది సాధించిన పురస్కారాలు:[33]

  • 23 × కీర్తి చక్ర
  • 218 × శౌర్య చక్ర
  • శౌర్య చక్రానికి 2 × బార్
  • 2 × పద్మశ్రీ
  • 16 × పరమ విశిష్ట సేవా పతకాలు
  • 43 × అతి విశిష్ట సేవా పతకాలు
  • 110 × విశిష్ట సేవా పతకాలు
  • 25 × సేనా పతకాలు
  • 3 × సర్వోత్తమ జీవన్ రక్షా పదక్
  • 17 × ఉత్తమ్ జీవన్ రక్షా పదక్
  • 69 × జీవన్ రక్షా పదక్

గుర్తింపు

మార్చు

నవంబరు 2021లో, బిఆర్‌వో ఉమ్లింగ్ లా వద్ద నిర్మాణాన్ని అనుసరించి "అత్యున్నత రహదారి" కోసం గిన్నిస్ ప్రపంచ రికార్డును అందుకుంది. [34] [8]

గ్యాలరీ

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు
  • ఇండియన్ ఆర్మీ కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్
  • ట్రాన్స్-అరుణాచల్ హైవే
  • మాగో-థింగ్బు నుండి విజయనగర్ బార్డర్ రోడ్ వరకు
  • చోటా చార్ ధామ్ రైల్వే

మూలాలు

మార్చు
  1. "Budget 2021: FM allocates Rs 4.78 lakh crore to defence ministry". Business Today. 1 February 2021. Retrieved 2021-02-12.
  2. 2.0 2.1 2.2 Annual Report 2014–2015.
  3. Annual Report 2002–2003.
  4. Annual Report 2015–2016.
  5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 5.6 "5 yrs, 3,595 km new border roads". The Tribune (India) (in అమెరికన్ ఇంగ్లీష్). 10 Aug 2022. Retrieved 2022-10-05.
  6. 6.0 6.1 6.2 Bhagwati, P (6 May 1983). "Supreme Court of India: R. Viswan & Others vs Union Of India & Others on 6 May, 1983". Indian Kanoon. Retrieved 12 February 2021.
  7. "Inherent Strengths". Border Roads Organisation. Speed, Economy and quality. Archived from the original on 21 September 2010. Retrieved 25 September 2010.
  8. 8.0 8.1 "Highest altitude road". Guinness World Records (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2022-01-08.
  9. "Border Roads Organisation". GlobalSecurity.org. Alexandria, Virginia. Retrieved 25 September 2010.
  10. "DG's Message". Border Roads Organisation. Archived from the original on 26 May 2011. Retrieved 20 May 2011.
  11. "Border Roads Organisation to be brought exclusively under Defence Ministry: Parrikar". Border Roads Organisation. Border Roads Organisation. Press Trust of India. 31 December 2014. Retrieved 31 December 2014.
  12. Kulkarni, Pranav (2015-01-01). "BRO to come under sole control of Defence Ministry". The Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2021-02-12.
  13. "Organisation Chart". Border Roads Organisation. Archived from the original on 27 July 2010. Retrieved 25 September 2010.
  14. Mohan, Devendra, IFA System in Lower Formations of Border Roads Organisation, Pune, India: National Academy of Defence Financial Management, Mindistry of Defence, Government of India, archived from the original (Microsoft Word) on 19 జూన్ 2009, retrieved 25 సెప్టెంబరు 2010
  15. Panghat, Brig (4 February 2005). "GREF not Industry governed by Industrial Dispute Act". Daily Excelsior. Jammu, India. Archived from the original on 3 May 2006. Retrieved 25 September 2010.
  16. BRO finished 43 roads in Ladakh, 64 in Arunachal in last 5 years, timesofindia, Dec 17, 2022.
  17. Wangchuk, Rinchen Norbu (2018-12-05). "Jalebi, Dosa & Samosa: How 'Dantak' Is Strengthening India's Friendship with Bhutan". The Better India (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-02-12.
  18. Standing Committee on Defence (February 2019) Fiftieth Report: Provision of all weather road connectivity under Border Roads Organisation (BRO) and other agencies up to International borders as well as the strategic areas including approach roads- An appraisal.
  19. "BRO launches Project Yojak to boost road infrastructure in Himachal Pradesh". The Times of India. 2022-01-14. ISSN 0971-8257. Retrieved 2023-11-03.
  20. . "Work in progress to restore vital border road". Archived 2013-01-30 at Archive.today
  21. Watts, Archit (15 September 2010). "Five weeks after floods, Leh-Manali road opens". Chandigarh Tribune. Chandigarh, India: The Tribune Trust. Retrieved 25 September 2010.
  22. Pubby, Manu (23 January 2009). "India hands over Afghan road, trade can now flow via Iran". The Indian Express. New Delhi: The Indian Express Online Media. Retrieved 25 September 2010.
  23. "India to deploy MiG-29 fighters at Tajikistan base". Monsters and Critics. Indianapolis: WOTR. 20 April 2006. Archived from the original on 30 September 2008. Retrieved 25 September 2010.
  24. Bedi, Rahul (20 September 2007). "India may have to quit Tajik military 'base'". Monsters and Critics. Indianapolis: WOTR. Archived from the original on 23 September 2011. Retrieved 25 September 2010.
  25. "7 roads of operational significance being built along China border: Kiren Rijiju", The Economic Times, 18 July 2017.
  26. Sushant Singh, "China border roads hobbling, 12 years later, 21 of 73 ready", Indian Express, 11 July 2017.
  27. "China's Silk Road lends urgency to India's regional ambitions.", Economic Times, 9 August 2017.
  28. India proposes to build road in Bhutan’s ‘Yeti territory’ which China claimed recently, Economic Times, Jul 15, 2020.
  29. 29.0 29.1 India building bridges in Arunachal for LAC access, The Economic Times, 18 Dec 2017.
  30. Gupta, Shishir (2020-10-12). "54 done, BRO rushes to build 48 bridges that can shoulder T-90 main battle tanks". Hindustan Times (in ఇంగ్లీష్). Retrieved 2021-06-13.
  31. "For year-round border security, India plans tunnels on China border.", Economic Times, 6 November 2017.
  32. "Voyants bagged Independent Engineer Services in Arunachal Pradesh"
  33. BRO Scroll of Honour and Awards: 1960 to 31 January 2020.
  34. "Indian Army's BRO sets Guinness World Record for world's highest motorable road". Hindustan Times Auto News (in ఇంగ్లీష్). 2021-11-21. Archived from the original on 21 November 2021. Retrieved 2022-01-08.